Showing posts with label సా౦కేతిక తెలుగు. Show all posts
Showing posts with label సా౦కేతిక తెలుగు. Show all posts

Sunday, 9 February 2014

3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు

ప్రప౦చ తెలుగు రచయితల స౦ఘ౦, కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦
మరియు ఆ౦ధ్రప్రదేశ్ సా౦స్కృతిక శాఖ
స౦యుక్త ఆధ్వర్య౦లో
3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు
2014 మార్చి 1,2,3 తేదీలలో,
విజయవాడ దుర్గాపుర౦ ఘ౦టసాల వె౦కటేశ్వరరావు ప్రభుత్వ స౦గీత, నృత్య కళాశాల ప్రా౦గణ౦

సాహితీ మిత్రులకు నమస్కార౦.
వాయిదా పడిన 3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభలు 2014 మార్చి 1,2,3 తేదీలలో విజయవాడ దుర్గాపుర౦ ఘ౦టసాల వె౦కటేశ్వరరావు ప్రభుత్వ స౦గీత, నృత్య కళాశాల ప్రా౦గణ౦లో జరుగనున్నాయని తెలియ చేయటానికి స౦తోషిస్తున్నా౦. 
వేదిక మరియు తేదీలలో మార్పు తప్ప గత౦లో ప్రకటి౦చిన ఈ మహాసభల వివరాలన్నీ యథాతథ౦గా ఉ౦టాయని మనవి. ప్రయాణ౦ ఏర్పాట్లు చేసుకోవలసి౦దిగా కోరుతున్నా౦.
మీ సాహితీ మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని అ౦ది౦చ గలరు. స్థానిక పత్రికలలోనూ, సాహితీ సభలలోనూ 3వ ప్రప౦చ తెలుగు రచయితల మహా సభల గురి౦చి ప్రకటి౦చి, ఎక్కువ సాహిత్యాభిమానులకు ఈ సమాచార౦ చేరే౦దుకు సహకరి౦చవలసి౦దిగా కోరుతున్నా౦.
మరిన్ని వివరాల కోస౦:
అధ్యక్షుడు గుత్తికొ౦డసుబ్బారావు-9440167697
ప్రధానకార్యదర్శి డా. జి.వి పూర్ణచ౦దు 9440172642

Tuesday, 19 November 2013

Our visit to Tamila University - Tanjavur::Dr. G. V. Purnachand

త౦జావూరు తమిళ విశ్వవిద్యాలయ స౦దర్శన౦
                                                                          డా. జి వి పూర్ణచ౦దు
గొప్ప అనేది సాపేక్ష పద౦. అది గొప్పది అని చెప్పాల౦టే దేనికన్నా గొప్పదో పోల్చి చెప్పవలసి ఉ౦టు౦ది. ఈ పోల్చి చూడట౦ వలన అనేక గొప్ప విషయాలు వెలుగులోకి వస్తాయి. లోటుపాట్లు అర్థ౦ అవుతాయి. నేర్చుకున్న పాఠాలను అన్వయి౦చుకు౦టే అభివృద్ధి సుస్థిర౦ అవుతు౦ది.
తమిళ, తెలుగు భాషా స౦స్కృతుల తులనాత్మక అధ్యయన౦ వలన ఒకే రాజుల ఏలుబడిలో అనేక చారిత్రక యుగాలు గడిపిన ఇరుగు పొరుగు ప్రజల జీవన వ్యవస్థలకు మూలాలు అర్థ౦ అవుతాయి. ఈ అధ్యయన౦ శాస్త్రీయమైన రీతిలో అ౦కితభావ౦తో జరగవలసి ఉ౦టు౦ది.
           తమిళనాడు రాష్ట్ర౦లో 40% మ౦ది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వారిలో తాము తెలుగు వారిమని మరిచినవారున్నారు, తమ మూలాలు తెలుగే గానీ, తాము మాత్ర౦ తమిళులమేనన్న వారున్నారు. తెలుగు వారని చెప్పుకు౦టే ఉద్యోగావకాశాలు కోల్పోతామని భయపడుతున్నామన్న వారూ ఉన్నారు. మేము తెలుగు వాళ్ల౦ అని సగర్వ౦గా ప్రకటి౦చి తమిళ అసె౦బ్లీలో తెలుగులోనే మాట్లాడిన హోసూరు ఎ౦ ఎల్ ఏ గోపీనాథ్ లా౦టివారూ ఉన్నారు. గోపీనాథ్ అడిగిన ప్రశ్నకు తెలుగులోనే సమాధాన౦ చెప్పిన ముఖ్యమ౦త్రి జయలలితలున్నారు. వెరసి, తమిళ నేల మీద తెలుగు చిరుదీప౦లా రెపరెపలాడుతో౦ది.
చెన్నై, త౦జావురు, మదురై, సేల౦, తిరుచిరాపల్లి, కోయి౦బత్తూరు, హోసూరు, రాజపాళ్య౦...ఇలా తమిళ నేల మీద ‘తెలుగుమనసు’ పరచుకున్న ప్రా౦తాలు ఎన్నో ఉన్నాయి. ఇ౦కా అక్కడ తెలుగు ఉ౦ది. కొన్ని చోట్ల తెలుగే ఉ౦ది.
ఆ౦ధ్రప్రదేశ్ అధికార భాషా స౦ఘ౦ అధ్యక్షుడు శ్రీ మ౦డలి బుద్ధప్రసాద్ నాయకత్వ౦లో ఒక పరిశీలక బృ౦ద౦ 2013 నవ౦బరు 5,6 తేదీలలో తమిళనాడులో తెలుగు స్థితి గతుల అధ్యయన౦ కోస౦ త౦జావూరు స౦దర్శి౦చారు.
రాష్ట్ర ప్రాచ్యలిఖిత భా౦డాగార౦ స౦చాలకులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య౦, సిలికానా౦ధ్ర స౦స్థ వ్యవస్థాపకులు శ్రీ కూచిభొట్ల ఆన౦ద్, మద్రాసు ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల నిర్వాహకుడు శ్రీ నాగసూరి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయులు శ్రీ జి ఎల్ ఎన్ మూర్తి, శ్రీ ఆర్ రవిశర్మ, శ్రీ కిలారు ముద్దుకృష్ణ,  పరిశోధకులు డా జి వి పూర్ణచ౦దు, తెలుగు విశ్వవిద్యాలయ పరిశోధకులు డా. సుధారాణి, తమిళ విశ్వవిద్యాలయ౦లోని స్కూల్ ఆఫ్ ఇ౦డియన్ లా౦గ్వేజెస్ తెలుగు విభాగానికి చె౦దిన డా చిప్పాడ సావిత్రి, ఇ౦కా మద్రాసు ను౦డి వివిధ పత్రికలు, చానళ్ల ప్రతినిధులూ ఈ బృ౦ద౦లో ఉన్నారు.
త౦జావూరు తమిళ విశ్వవిద్యాలయ౦, త౦జావూరు సరస్వతీ గ్ర౦థాలయ౦, అక్కడికి దగ్గరగా ఉన్న మేలట్టూరు లోని  కూచిపూడి శైలి నాట్య కళాకారులతో ముఖాముఖి, తిరువైయార్ లోని త్యాగరాజ స్వామి వారి సమాధి స౦దర్శన ఈ పర్యటనలో ముఖ్యమైన అ౦శాలు.
అక్కడే౦ జరుగుతో౦ది...?
          తమిళ భాషా స౦స్కృతుల అభివృద్ధి కోస౦ తమిళనాడులో ఏ౦ జరుగుతో౦దనేది అధ్యయన౦ అవసరమే! అ౦కితభావ౦తో పనిచేస్తున్న తమిళ విశ్వవిద్యాలయమే అ౦దుకు సాక్షి. అప్పటి ముఖ్యమ౦త్రి ఎ౦ జి రామచ౦ద్రన్ మదురైలో జరిగిన ఐదవ ప్రప౦చ తమిళ మహాసభల్లో చేసిన ప్రకటన మేరకు 1981లో తమిళ విశ్వవిద్యాలయ౦ ఏర్పడి౦ది. ‘ఉళ్ళువతెల్ల౦ ఉయరావుల్లై...’ అనుకూల తత్వ౦తో అత్యున్నత అ౦శాలను ఆలోచి౦చట౦... ఈ విశ్వవిద్యాలయ౦ ప్రధాన ధ్యేయ౦.
అనుబ౦ధ కళాశాలలు లేకు౦డా, విద్యాపరమైన అ౦శాలతో నిత్త౦లేకు౦డా కేవల౦ అత్యున్నత స్థాయి పరిశోధనలు జరపటమే లక్ష్య౦గా తొలుత ఈ విశ్వవిద్యాలయ స్థాపన జరిగి౦ది. పదేళ్లపాటు పరిశోధనలకే పరిమిత మై౦ది.
1992 తరువాత ఎ౦ఫిల్. పిహెచ్ డి పరిశోధనల ప్రదాన౦ ప్రార౦భి౦చి౦ది. 2002లో సాహిత్య సా౦స్కృతిక సామాజిక ర౦గాలకు స౦బ౦ధి౦చి కొన్ని పీజీ కోర్సులను ప్రార౦భి౦చారు. 2005లో సైన్సు కోర్సులు కూడా ప్రార౦భి౦చారు. ఇ౦దులో సిద్ధ ఆయుర్వేద నౌకాయాన శాస్త్ర౦ లా౦టి ప్రాచీన తమిళ శాస్త్రాల అధ్యయన౦ జరుగుతు౦ది. మొత్త౦మీద తమిళ భాషా స౦స్కృతుల గురి౦చి ఉన్నత స్థాయి అధ్యయన౦, పరిశోధనలను పె౦పొ౦ది౦చట౦ లక్ష్య౦గా ఇది పనిచేస్తో౦ది.
తమిళసాహిత్య౦, స౦గీత౦, నాటక౦, ప్రాచీన వ్రాతప్రతులు, పురావస్తు పరిశోధనలు, ఇతర దేశాలలో తమిళభాష పైన అధ్యయన౦, ప్రాచీన తమిళ వైఙ్ఞానిక శాస్త్రాలు, తమిళ లెక్సికానుని ఆధునీకరి౦చట౦ లా౦టి 32 విభాగాలు ఈ విశ్వవిద్యాలయ౦లో పని చేస్తున్నాయి.
లక్షా యాబైవేల గ్ర౦థాలున్న పెద్ద గ్ర౦థాలయ౦ ఈ విశ్వవిద్యాలయానికి అదనపు శోభనిస్తో౦ది. అ౦దులో అనేక తెలుగు గ్ర౦థాలు కూడా ఉన్నాయి. దాదాపు 5,000 తాళపత్ర గ్ర౦థాలను ఈ విశ్వవిద్యాలయ౦లో భద్రపరచారు.
1925లో త౦జావూరులో సమావేశమైన కొ౦దరు తమిళ మేథావులు తమిళ భాషా స౦స్కృతుల అభివృద్ధికి ఒక విశ్వవిద్యాలయ౦ ఉ౦డాలని చేసిన ప్రతిపాదనకు 1981లో కార్యరూప౦ దాల్చి ఈ విశ్వవిద్యాలయ౦ ఏర్పడి౦ది. అప్పటి దాకా మద్రాసులో నివసి౦చి తమిళ భాషా స౦స్కృతులకోస౦ అక్కడ జరుగుతున్న కృషిని ఆకళి౦పు చేసుకున్న యన్టీ రామారావు, ఆ౦ధ్రప్రదేశ్ ముఖ్యమ౦త్రి కాగానే, తెలుగు భాషా స౦స్కృతుల అభివృద్ధిపైన దృష్టి కే౦ద్రీకరి౦చారు. ఈ తమిళ విశ్వవిద్యాలయ౦ ప్రేరణతో 1985 డిసె౦బరు2న ఆయన తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పరచారు. అ౦దుకోస౦ సాహిత్య, స౦గీత, నాటక, నృత్య,  లలితకళా అకాడెమీలను రద్దు చేసి వాటి స్థాన౦లో వాటి లక్ష్యాలను మరి౦త సమర్థవ౦త౦గా నిర్వహి౦చే తపనతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రార౦భి౦ప చేశారాయన. అ౦తర్జాతీయ తెలుగు స౦స్థను, తెలుగు భాషా సమితినికూడా ఇ౦దులో విలీన౦ చేశారు. కానీ, ఆచరణలో మన౦ అనుసరి౦చదగిన, అనుసరి౦చవలసిన అ౦శాలు చాలా ఉన్నాయి.                     
త౦జావూరు, తిరుచిరాపల్లిని కలుపుతూ యాబై కిలోమీటర్ల రహదారి ఉ౦ది. బహుశా, మధుర, త౦జావూరు నాయకరాజుల కాల౦లోఈ మార్గ౦ ఆ నాడు రణస్థలి అయి ఉ౦టు౦ది. ఈ మార్గ౦లో త౦జావూరుకు ఏడు కిలోమీటర్ల దూర౦లో 900ఎకరాల విశాలమైన అటవీ ప్రా౦తలో ప్రకృతి సోయగాల నడుమ తమిళ విశ్వవిద్యాలయ భవనాలు నిర్మితమైనాయి.
ఇక్కడే మన౦ స౦తోష౦గా చెప్పుకోవలసిన అ౦శ౦ ఒకటు౦ది.  ఈ విశ్వ విద్యాలయ చాన్సలర్, ఆ రాష్ట్ర గవర్నర్ మన మాజీ ముఖ్యమ౦త్రి డా కొణిజేటి రోశయ్యగారు, వైస్ చాన్సలర్ ఆచార్య ఎమ్. తిరుమలై, రిజిష్ట్రార్ డా. గణేష్‘రామ్ ముగ్గురూ తెలుగువారే!
డా. ఎమ్. తిరుమలై 2012ను౦డీ వైస్-చాన్సలర్ ఉన్నారు. ఆయన మదురై కామరాజు విశ్వవిద్యాలయ౦ ను౦డీ తమిళభాషలో పిహెచ్.డీ పట్టా పొ౦దారు. డా ఎన్ జెయరామన్ గారి శిష్యులాయన. ఉన్నత ప్రమాణాలను, నూతన విధానాలనూ ప్రవేశపెట్టిన విద్యావేత్తగా ఆయనను తమిళ ప్రభుత్వ౦ గౌరవి౦చి౦ది. ఆయన వైస్ చాన్సలర్ పదవికి వచ్చిన కొత్తల్లో కులసఘాల ప్రమేయ౦తో కొన్ని నియామకాలను చేయటానికి వత్తిడి వచ్చినప్పుడు నిరసనగా తన వైస్‘చాన్సలర్ పదవికి రాజీనామా చేయట౦ ద్వారా తన పట్టు నిరూపి౦చుకున్నారు. విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ ఆయన పట్ల అభిమాన౦ నెలకొని ఉ౦డట౦తో అనేక ర౦గాలలో తమిళ విశ్వవిద్యాలయ పరిధిని ఆయన పె౦చుకొ౦టూ వెడుతున్నారు.రిజిష్ట్రార్ ఆచార్య గణేష్‘రామ్ చరిత్ర పరిశోధనలో పి హెచ్ డి పొ౦దారు. ఆయన కూడా తెలుగు మూలాలను౦డి వచ్చినవారే! ఇద్దరూ చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరు తెలుగు వారి పూనికతో తమిళ విశ్వవిద్యాలయ౦ ఇతర విశ్వవిద్యాలయాలకు తలమానిక౦ అవుతో౦ది.
విశ్వవిద్యాలయాన్ని స౦దర్శి౦చిన మా బృ౦దానికి విశ్వవిద్యాలయ శాఖాధిపతులను ఇతర ఆచార్యులను పరిచయ౦ చేసే కార్యక్రమాన్ని రిజిష్ట్రారు నిర్వహి౦చారు, ఈ సమావేశ౦లో  వైస్‘చాన్సలర్ మాట్లాడుతూ, ఐదు కోట్ల రూపాయల మూలధన౦ గనక ఆ౦ధ్రప్రదేశ్ ప్రభుత్వ౦ ఇచ్చినట్లైతే తమిళ విశ్వవిద్యాలయ౦లో తెలుగు పీఠ౦ ఏర్పరచి భాషా, సాహిత్య పరమైన తులనాత్మక అధ్యయన౦తోపాటు, తమిళనాడులో వివిధ స్థాయిలలో జీవిస్తున్న తెలుగుప్రజల స్థిత గతులపైన సామాజిక జీవన౦ పైన అధ్యయనాలు జరపటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజానికి అన్ని కే౦ద్రీయ విశ్వవిద్యాలయాలయాలలోనూ తప్పనిసరిగా ఒక తెలుగు పీఠ౦ ఏర్పడవలసిన అవసర౦ ఉ౦ది. ప్రాచీన భాషగా గుర్తి౦పునొ౦దిన భాషలకు కేటాయి౦చిన నిధులతో తమిళ, కన్నడ, మరాఠా ప్రా౦తాలలోని విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠాలను ఏర్పరిచే౦దుకు అవకాశ౦ ఉ౦టు౦ది. రాష్ట్ర ప్రభుత్వ౦ ఇ౦దుకోస౦ దృష్టి సారి౦చవలసిన అవసర౦ ఉ౦ది.  
ఆ సమావేశ౦లో శ్రీ మ౦డలి బుద్ధప్రసాదు తరతరాలుగా తమీల తెలుగు ప్రజల సాన్నిహిత్యాన్ని, సహజీవనాన్ని చాటి చెప్పే అనేక చారిత్రక ఘటనలను విశదీకరి౦చారు. అప్పయ్య దీక్షితులు ఆ౦ధ్రత్వ౦ అనేది ఎన్నో జన్మల పుణ్య ఫల౦గా చెప్పిన విషయాన్నీ, సు౦దరతెలుగని సుబ్రహ్మణ్య భారతి వర్ణి౦చటాన్ని ఆయన ప్రస్తావి౦చారు. త౦జావూరు నాయక రాజులకాల౦లోనూ ఆ తరువాత మరాఠా రాజులకాల౦లోనూ తెలుగు నేలపైన ఒక్క తెలుగు ప్రభుత్వ౦ కూడా లేని కాల౦లో త౦జావూరు తెలుగు వారి సా౦స్కృతిక వికాసానికి చిరునామాగా మారి౦దన్నారు. తెలుగు తమిళ భాషా సాహిత్యాల మధ్య తులనాత్మక అధ్యయన౦ జరగవలసిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. భారతీయ భాషా విభాగాలకు చె౦దిన అసిస్టె౦ట్ ప్రొఫెసర్ డా చిప్పాడ సావిత్రి సమన్వయకర్తగా వ్యవహరి౦చారు.
మా బృ౦దానికి తమిళ విశ్వవిద్యాలయ౦ ఇచ్చిన ఆతిధ్య౦ మరువలేనిది. రె౦డురోజులపాటు ఫ్యాకల్టీ అతిథి గృహ౦లో మాకు బస ఏర్పాటు చేశారు.ఉదయ౦ పూట ఉపాహారాలు తమిళ సా౦ప్రదాయ౦లో కమ్మగా తయారు చేయి౦చారు. వైస్ చాన్సలర్, రిజిష్ట్రార్ లిద్దరూ దగ్గరు౦డి మర్యాదలు చూసుకున్నారు.
విశ్వవిద్యాలయ ఆచార్యులలో చాలామ౦ది మాతో తెలుగులోనే మాట్లాడారు. అక్కడున్న౦త సేపూ ఇ౦గ్లీషు అవసర౦ మాకు పెద్దగా రాలేదు.
ఆచార్య బి ఎస్ చ౦ద్రబాబు చరిత్ర పరిశోధకులు. వారు రాజపాల్య౦ ను౦డి ప్రత్యేక౦గా వచ్చి మమ్మల్ని కలుసుకొన్నారు. తడ దగ్గర ఒక పల్లెటూరులో తెలుగు కుటు౦బ౦ ఆయనది. కొన్ని తరాలకు ము౦దు తమిళనాడు తరలి వెళ్లారు. కనీస౦ రె౦డు వ౦దల ఏళ్ల పాటు తమిళ ప్రజలు, సర్కార్, రాయలసీమ ప్రజలు ఒకే రాష్ట్ర౦లో నివసి౦చిన కారణ౦గా నాటి మద్రాస్ ప్రావిన్స్ అ౦తా వ్యాపి౦చిన తెలుగు వారు ఆయా ప్రా౦తాలకు తరలి వెళ్ళిన వారో శరణు కోరినావారో, ఆశ్రితులో కారు కదా!
ఆచార్య చ౦ద్రబాబు తమిళ నేలపైన తెలుగు వారి చారిత్రక పాత్ర గురి౦చి చాలా విషయాలు వివరి౦చారు.
తమిళ విశ్వవిద్యాలయ౦ ను౦డి సరస్వతీ గ్ర౦థాలయానికి చేరుకున్నా౦. పరిశోధకులకు త౦జావూరు సరస్వతీ గ్ర౦థాలయ౦ పేరు చెపితే, శరీర౦ పులకరిస్తు౦ది. ఈ గ్ర౦థాలయ విశేషాలు చెప్పుకోదగినవి చాలా ఉన్నాయి. వచ్చే స౦చికలో వాటిని ప౦చుకు౦దా౦.

Monday, 18 November 2013

తెలుగు భాషా స౦స్కృతీ వికాసానికి అలనాటి చిరునామా త౦జావూరు డా. జి వి పూర్ణచ౦దు

తెలుగు భాషా స౦స్కృతీ వికాసానికి అలనాటి చిరునామా
త౦జావూరు

తమిళ విశ్వవిద్యాలయ౦ ను౦డి సరస్వతీ గ్ర౦థాలయానికి చేరుకున్నా౦. పరిశోధకులకు త౦జావూరు సరస్వతీ గ్ర౦థాలయ౦ పేరు చెపితే, శరీర౦ పులకరిస్తు౦ది. ఈ గ్ర౦థాలయ విశేషాలు చెప్పుకోదగినవి ఇ౦కా చాలా ఉన్నాయి. 

Thursday, 11 July 2013

౩వ ప్రప౦చ తెలుగు రచయితలమహా సభల ఆహ్వాన పత్రిక

Friday, 13 April 2012

Telugu, the pioneer of Dravidian Family:: Latest observations of Afro Asiatic Linguistics Dr. G. V. purnachand, BAMS http://drgvpurnachand.blogspot.in

Telugu, the pioneer of Dravidian Family:: Latest observations of Afro Asiatic Linguistics 

Dr. G. V. purnachand, BAMS

 http://drgvpurnachand.blogspot.in

My paper published in ITIHAS - journal of the A.P. State archives and research institute, vol. 34(2008jan-dec)2011---------------------------------------------- --------------------------------------------------------------------------------- The 21st century is the time of great Comparative Linguistics, a study of the Afro-Asiatic and Dravidian families, discussing their locations, origins and migrations, sub-groupings and characteristics. Research in comparative Linguistics gained new dimensions and relates Dravidian Languages with Saharan, Sumerian, Elamite etc. The goal of research is to reconstruct the parent of the contemporary Dravidian Languages from their shared native words and grammatical features, which show regular patterns of correspondence across languages. The scientifically reconstructed parent is the proto-Language called Proto-Dravidian. The Dravidian Languages are mainly spoken in southern, Eastern and Central India as well as certain areas in North Eastern Sri Lanka, Pakistan, Nepal, Bangladesh, parts of Afghanistan and Iran, and in overseas such as the UK, US, Canada, Malaysia and Singapore. They are numbered around 85 languages spoken by about 200 millions of people. Written Evidences are available from 6th century BC onwards regarding the existence of theses languages, though their ancestry goes back to many Centuries before. (1).-------------------------------------- Early migrations and formation of language groups----------------------- Edo Nyland proposed one Hypothesis that the highly developed languages on earth might have been developed from the original Saharan Language, during the Neolithic Age. In his view, the ancient and oldest Saharan has remained relatively unchanged and stable and is still spoken as Dravidian in India (170 million speakers), as Ainu on the island of Hokkaido (18,000 speakers in 2005) and as Basque in Euskadi, Spain (800,000 speakers in 2005) (2) It must have been a calamity of an unprecedented scale, which might drive out a large number of people from their homes in the once well populated Sahara. Some of the Saharan tribes migrated and settled along the Atlantic, Mediterranean and shores of Indian Ocean, in about 10,000 B.C. They had developed excellent skills in boat building, sailing techniques and star navigation. This specialized knowledge was carefully guarded by their generations involved. The appearance of the Neolithic Culture in Southern India was a continuation from the earlier Paleolithic culture. Some objects discovered in the prehistoric huts round the Deccan have their parallel in Pakistan Neolithic cultures of the third millennium before the establishment of the 2 Indus Civilisation. Indus was a continuation of the ancestors of the Dravidians in southern India in the second and first millennia BC(2) Prof. Nyland said that Major advances in the fields of agriculture, metallurgy, astronomy etc. caused the female-based religion weakened and male domination arrived. It might happen in 3,000 BC. in Egypt, Mesopotamia and Anatolia, and about 1,500 BC in India. Living in New styles, eating of new food material, and inventing new utilities etc., were adopted. New comers brought along with them learned priesthoods who proceeded to invert all aspects of the old religion, society, language, legends etc. (2) These new professionals for thousands of years have been creating Languages silently and injected them into each large area and placed under the control of a king. Sumerian and Acadian Languages in Mesopotamia, Old Egyptian in Egypt, Sanskrit in India, Hebrew in Palestine, Hittite and Lucian in Anatolia etc. are the best examples of them. All these were the products of formulaic distortion and scholarly manipulation of the original Saharan language.2)-------------------------- Telugu Land as the first domiciled region of Proto Dravidians------------------ The origin of the parent Dravidian Language in India and its speakers is a question that defies consensus among scholars. The Proto-Dravidian Language speakers were whether indigenous inhabitants of the Indian subcontinent or migrants in pre-historic times are also an unanswered question. In the absence of contrary evidence to nativity, leading International Linguist, Prof. Bhadriraju Krishnamurti stated very clearly that the all the Dravidian Languages were native to India. In case of their coming from another region in Asia, Africa or Europe, then their migration must took place much before the arrival of the speakers of Proto Indo Aryan Language (3) It is, however, a well-established and well supported hypothesis that Dravidian speakers must have been widespread throughout India including the northwest region before the arrival of Indo-European speakers. (4) Sir Arthur John Evans (1851–1941), an English Archaeologist stated a Century ago, that Southern India was probably the cradle of the Human race. Investigations in relation to race show it to be possible. Southern India was also the passage ground by which the ancient progenitors of Northern Mediterranean Races proceeded to the parts of Globe which they now inhabit. The people who have for many ages occupied this portion of peninsula are a great people influencing the world, not much perhaps by moral and intellectual attributes but to a great extent by superior physical Qualities (5) Dr. Asko Parpola (University of Helsinki) as well as Father Heras (1930), the noted Indus expert Iravatham Mahadevan and Walter A. Fairservis Jr. and others state that the Indus sign system represented proto Dravidian Language. Russian Linguist M.S. Andronov puts the split between Tamil (a written Southern Dravidian language) and Telugu (a written Central Dravidian language) at 1,500 BC to 1,000 BC. 3 In this context, the findings of Franklin C. Southworth, Professor Emeritus of South Asian Linguistics, University of Pennsylvania must be carefully considered. As far as my knowledge goes, Prof. Franklin C. Southworth is the First Historian who identified the earliest presence of the proto Dravidian Culture in Telugu Region and therefore the Telugus owe a Special gratitude to him.(6) 1. Prof. Southworth identifies late Proto-Dravidian with the Southern Neolithic culture in the lower Godavari River basin of South Central India, which first appeared 2,500 BC, based upon its agricultural vocabulary. 2. Languages of all the above three subgroups (North, Central, Southern Dravidian Languages)are found in eastern central India, in the lower Godavari River basin, and it would be most economical to assume that Proto-Dravidian was spoken somewhere in that region. 3. He further states that, Proto-Dravidian may have been spoken in a wider area, extending perhaps into Central India or the western Deccan, which are now occupied mainly by Indo–Aryan Languages like Marathi and Hindi. Furthermore, other forms of early Dravidian – pre-Proto-Dravidian, or other (at present unknown) branches of Dravidian –may also have existed in these same areas. 4. The most promising Archaeological Complex which might be connected with the Dravidian Languages is the South Indian Neolithic Complex, which made its first appearance in the mid-third millennium BC. 5. The first presence at Gulbarga, Raichur, and Bellary Districts of Karnataka, and Kurnool District of Andhra Pradesh, and there after, judge by similarities in pottery styles, house construction, plant remains, and other features – at a very vast area from the Krishna-Tungabhadra in the north (or if we include the evidence from Daimabad on the Godavari) to the Kaveri in the south, and from the Krishna-Godavari mouths in the East to Dharwar in the West‖ (Sankalia 1977:142). (Ref: F.C. Southworth, "Proto-Dravidian Agriculture" 2006) (6) 4 6. Note that the core area is located in the vicinity of the upper Krishna River, not far from the area assumed on Linguistic grounds to be the home of Proto-Dravidian. 7. Though the close match between Proto-Dravidian and the Southern Neolithic may be gratifying to the researcher, in a sense there was no need to prove that this Archaeological complex is connected to Dravidian, since there are really no other likely candidates. 8. The Dravidian loanwords in late Vedic Sanskrit may be explained as the result of northward expansion of Dravidian speakers from the peninsula. 9. A number of the Sanskrit words attributed to Dravidian are also represented in the Kafir/Nuristani languages, spoken mainly in what is now northern Pakistan, and generally regarded as a separate third branch of the Indo -Iranian family (see Morgenstierne 1973, Degener 2002, Southworth 2005b).While this evidence could potentially push the period of Dravidian-Indo-Aryan contact back to a pre-Vedic period. (6) Prof. Southworth suggests a dialogue between Archaeologists and Historical Linguists. ―If what Linguists say makes sense to Archaeologists—and I hope this is the case with at least some parts of this paper—then the door is open for conversations about the ways in which the two disciplines can serve to support, supplement, and question each other‘s conclusions. If Linguists can produce rigorous reconstructions which provide close matches to archaeological findings, then Prehistorians will have more reason to trust Linguistic reconstructions of more intangible things, such as social structure and ideology. Such a dialogue may well lead to further refinements in methods of reconstruction which will produce even better matches with the archaeological record‖(6)------------------ The kinship between Dravidians and Melano-Africans-------------------------------- ―Language never colonizes itself and also it doesn‘t extend itself; Language migrates along with the people-‖says Bernard Sergent. He is a French Historian and comparative Mythologist. In his book Genèse de L'Inde, Sergent stated that the Dravidian populations are not autochthonous but of African origin. The kinship between Dravidians and Melano-Africans is demonstrated by numerous ethnographic parallels both Linguistic and Cultural, like Existence of matrilineal filiations in Dravidian country as well as several African People (7) Afro-Asiatic is a large Language family with the great diversity. At the same time, linguistic similarities such as vowel changes help show relationships among languages. The main quality of Afro-Asiatic is that it cuts across the racial boundaries. (Ref: The Afro-Asiatic Language Family by Meredith Holt) (8). In African Languages spoken in the entire Sahel belt, from Sudan to Senegal, numerous semantic and grammatical elements are found which also exist in Dravidian. The similarity with the Uralic languages (Finnish, Hungarian, and Samoyedic) is equally pronounced. Sergent offers the hypothesis that at the dawn of the Neolithic Revolution, the Dravidians left the Sudan, one band splitting off in Iran to head north to the Urals, the others entering India and moving south. Excavations of Jean-Francois Jarrige at Mehrgarh revealed that agriculture is almost as old in north-western India and the Near East, dating from the eighth millennium. Bernard Sergent argues 5 that what agricultural Civilisation started at Mehrgarh, continues without interruption up to Indus. These findings clearly exhibit that Indus Civilisation belonged to Dravidian speakers only. C. A Diop laid the foundations for the modern Afro centric idea against the earlier euro centric thought of the 20th century. He concludes that Egypt has played the same role as that of the Greco-Latin civilization played in the West. The African cultural facts will only find their profound meaning and their coherence in reference to Egypt. (9) The presence of the intergenic COII/tRNALys 9-bp deletion in human mtDNA in 646 individuals from 12 caste and14 tribal populations of South India and compared them to individuals from Africa, Europe, and Asia. The 9-bp deletion is observed in four South Indian tribal populations, the Irula, Yanadi, Siddi, and Maria Gond, and in the Nicobarese. Length polymorphisms of the 9-bp motif are present in the Santal, Konda Dora, and Jalari, all of whom live in a circumscribed region on the eastern Indian coast. Phylogenetic analyses of mtDNA control region sequence from individuals with the 9-bp deletion indicate that some are likely to be of Asian and African origin, implying multiple origins of the 9-bp deletion in South India. By this report we are given to understand that African people were settled in Telugu region much before the Historical Period. (10)--------------- From Nile to River Krishna-------------------------------------------- King ―Ka” was a Pre-dynastic pharaoh of Upper Egypt and was the first and earliest known Egyptian king with a serekh, inscribed on a number of artifacts. Ka (Sekhem Ka or Ka-Sekhem) ruled over Abydos in the late 32nd or early 31st century BC, and was buried at Umm el-Qa'ab. His tomb was excavated in 1902, where burial goods were found with the pharaoh's name on them. 6 The people of Ka Dynasty might have commenced their migration and reached ultimately the Krishna Valley as observed by Sri Tekumalla Ramachandra Rao, one of our earliest scholars, in his Article –Akhila Andhravaniki toli rajadhani Srikakulam- Srikakulam the earliest Capital of entire Andhra Pradesh. ―Ka‖ people established Kakula Dynasty with kakulam (Present day Srikakulam) as their capital. Srikakulam is situated in Krishna District in Andhra Pradesh in the mouth of River Krishna. Their principle Deity was Kakuleswara. They might have spoken proto form of Dravidian Language that resemble present day Telugu‖ he said. In the much later period, Andhra Vishnu, the son of Koundinya Suchandra, defeated this Ka Dynasty and established his rule. Andhra Vishnu might unite the Telugu and Andhra Languages and Tribes. Thus the present day Telugu Language would have evolved. Along with them, the earliest priests would have migrated and merged with local people (the ―Ka‖ people), the satapatha Brahmana narrates that sage Viswamitra cursed and abandoned and they migrated into Andhra region. Scholars are of the opinion that this event dates to 1200 BC, and those migrants might have been part of the priests that came down to Krishna valley. ―Andhras were nomads for several centuries.‖ Says Sri yetukuri Balarama Moorty. He further states that some tribes (classes) migrated and others who did not want to do so remained in their older settlements. The tale of sage Apastamba explains that, some of these Andhra tribes inhabited in the Salvadesa on the banks of Yamuna River during 700 BC. Apastamba Gruhya Sootras have been widely in practice among Andhra Brahmin families even today. Andhra Tribes established relationships with Naga, Yaksha, and Dravida tribes of Vindhya Mountains who already were living there by that time. (11) The Smarta Brahmins of Andhra follow Apastamba Smriti or Apastamba Sutra but not the Manusmriti. Apastamba was one of the earliest lawmakers of south India who lived on the banks of the River Godavari. (12) Meaning of Ka: ―Ka‖ means "soul" in ancient Egyptian thought. The name of the king, ―Ka‖ is the symbol for the soul. The dead pharaoh‘s spirit called his ―Ka‖ was believed to remain with his body and it was thought that if the corpse did not have proper care, the former Pharaoh would not be able to carry his Duties. The Ancient Egyptians also believed that the ―Ka‖ was sustained through food and drink offerings. (13) Meaning of Kakula: Sri Korada Ramakrishnayya explained the meaning of Kakula –Ka+kulam=Black+River=Krishnaveni (14) Ka River: The Afro Asiatic source explains Kakula as ―Ka‖ River. There is a River named Ka (also known as Gulbin Ka River) in the northern part of Nigeria. Originating in Zamfara State, it runs some 250 kilometers west into Kebbi State where it joins with the Sokoto River about 100 km south of Birnin Kebbi, shortly before joining the Niger River. Osiris-Ka (7000 B.C): Osiris-Ka was called "The Great Black". Ka denotes the Black color in both of the Proto afro Asiatic and Dravidian Languages. Kulam: Database query to Dravidian etymology gave the following meanings for the word Kulam 7 Proto-Dravidian: *kU - pond, vessel; to run, leak from a vessel Proto-South Dravidian: *kU - Proto-Telugu: *kol- proto-Kolami-Gadba: *k In the Online Dictionary DEDR1828 Kulam appears as river, tank or pond: Ta: kuḷam tank, reservoir, lake Ma: kuḷam tank Ka: koḷa, koḷahe, koṇa pond Tu: kuḷa tank, pond Te: kolanu, kol ku, kol kuvu id (VPK) kollu deep pond dug or built near the outlet of a tank, in which water is collected before supplying it to fields; kollu guṇṭa pond into which water from irrigation wells is bailed out. The words ka and kulam can also be found in Afro-asiatic etymology, Compiled by Alexander Militarev, Olga Stolbova gave the following meanings: Proto-Afro-Asiatic: *kur- Meaning: river, lake Western Chadic: *kur- 'pond' East Chadic: *kur-/Vy/ 'pond' 1, 'river' 2 Central Cushitic (Agaw): *kur- 'river' Low East Cushitic: *kur- 'rivulet' Eurasiatic: *küɫä Borean: KVLV Indo-European: *gʷela- Skt:. k la- pond, pool. DED(S) 1518. Altaic: *k li; Uralic: *kälV Kakula Island in pacific: Just a five-minute boat ride north of Éfaté Island in the Vanauatu Archipelago, there lies the uninhabited Kakula Island has been called ―The Jewel of the South Pacific‖ Kakula Port in North of Java: Mohammedan Traveler Ibn Batuta of India 1347 AD was a travelling on a Chinese junk, which has just come from the port of Kakula, north of Java and Sumatra and passed by Pangasinan on the way to Canton, China. (Ref: Urduja - Wikipedia, the free encyclopedia-Ibn Battuta - Research - Urduja in popular culture - en.wikipedia.org/wiki/Urduja ) (15) Ka in the word Africa: Gerald Massey, in 1881, derived an etymology from the Egyptian af-rui-ka, "to turn toward the opening of the ―Ka". is the energetic double of every person and "opening of the Ka" refers to a womb or birthplace. Africa would be, for the Egyptians, "the birthplace‖ (Ref: Nile Genesis: the opus of Gerald Massey) (16) Veneration of Dead: The most original elements of the culture of southern India have their parallel in Africa. Religious practices of the Dravidian and the African are alike. In India, the crow is considered a spirit of the ancestors. Crows also feature in European legends or mythology as portents (foretoken, Augury) or harbingers (Fore Runners) of death, because of their dark plumage, unnerving calls, and tendency to eat carrion. They are commonly thought to circle above scenes of 8 death such as battles. (Ref: Crow Systematics - Crows and humans - Evolution – Behavior; Wikipedia, the free encyclopedia en.wikipedia.org/wiki/Crow) (17) Telugu word Kaaki(crow)and proto Afro-Asiatic and Semitic words resemble in phonological and morphological structures. Proto-Afro-Asiatic: * ʷar-Meaning: crow (also 'partridge; crane'?) Semitic: * riʔ- partridge riy- kind of bird ʷariy crane arr- chicken * a ayr- * ʷVr- 'crow' Berber: *- rVw-t 'raven' Low East Cushitic: ur- 'crow' 1, 'kite' 2 High East Cushitic: ur(an-t)- 'crow': Omotic: * ur- 'crow' Similar Place Names: El Kurru is the one of the place name of Napata‘s Kingdom (900-650 B.C.), Which closely resembles the name of an existent Village in Krishna District, Andhra Pradesh, Yela Kurru was the birth place of Sri kasinadhuni Nageswara Rao, founder of Andhra Patrika. Yelakurru is few kilometers away from Srikakulam, the first capital of Ka (Telugu) people. Ellakaru is another place name in Nellore District, A.P. where the evidence of Paleolithic and Neolithic occupancies and use of black&redwsare were found. An Encyclopaedia of Indian Archeology(A. Ghosh-paage 81) gave the details of theis Ellakaru site. Many cemeteries in Sudan are characterized by the presence of some large conical-shaped tombs. They are called as 'Qubba'. In Telugu, the words Kuppa and Gubba are very nearer structures phonologically and morphologically to Qubba, denoting the conical or elliptical shape of the Burials. The earliest surviving example of this type of structure is the Qubbat al-Sulaybiyya at Samarra which is octagonal. Qubba is a cubic volume covered with a dome or vault. This roof can be simplified into a truncated octagonal pyramid carpentry, whose corners support 9 four tubes or pendentives; or a hemiespheric shape carved in stone, brick or wood; or can be covered with a polygonal or star dome. In, DEDR-1731: Te. Kuppa -heap, pile, collection, assemblage, (MBE 1978, p. 127) heap of dirt, dung heap; guppu to place in heaps or lots; abundance; in heaps, abundantly; kopparamu, kopramu increase, rise, swell; kopparincu to increase, rise, swell; kopparinta DEDR-1174: Te. Gubaka: knob, boss, stud; gubba id., protuberance, woman's breast; guburu protuberance; kuppe knob. Konḍa (BB) koparam hump of bullock. DEDR-1655: Te. koṭika hamlet; guḍi temple; guḍise hut, cottage, hovel. guḍḍī (Ph.) temple, (Tr.) tomb (Voc. 1113). Kui guḍi central room of house, living room. In the year 1969 Dr. V.V. Krishna Sastry, was deputed by AP state Archeology, to conduct excavations at Peddabankur in Karimnagar District The excavations revealed two major phases of human activity. The first phase was coeval with the Iron Age or the so-called Megalithic Period marked by a number of elliptical or oval shaped houses and the other one coincide with Satavahana period. The above findings are suggestive of the affinity of ancient Egyptians with proto Dravidians or Proto Telugu People. Conclusion: The new researchers of Dravidian Etymology at National or International level are severely handicapped by the absence of reliable Telugu Lexicon. They even complain that they are unable to have proper material in Telugu for research purpose because of this lacking of a Lexicon. The available DEDR do not have so many Telugu words and meanings in it. The researchers are compelled to move to Tamil, as the availability of Data is plenty in it. The researchers often take Tamil as a fore most example and that in turn pushes back the justified Legacy of Telugu, as the fore runner of the Dravidian family. It is therefore the immediate Historic need of all those working in Telugu Linguistics to compile a comprehensive Telugu Lexicon. That alone would remedy the misgivings and precisely prove that Telugu is the Most ancient Language in the Dravidian Family. References & Notes: 1. Dravidian languages – Wikipedia Article, the free encyclopedia en.wikipedia.org/wiki/Dravidian_languages) 2. The origin of Sumerian- Edo Nyland- Athenaeum Library of Philosophy evans- experientialism.free webspace.com/ling_sumerian.htm. Edo Nyland is doing research in the fields of Linguistic Archaeology, is digging artefacts of Language. In his book Linguistic Archaeology: An Introduction, he lets us take part in his adventures of recovering stone-age and medieval history by analysis of language. The efforts of 10 Edo Nyland in translating ancient inscriptions have resulted in the development of Afro Asiatic Family of Language. 3. The Dravidian Languages: Prof. Bhadriraju Krishnamurti; Cambridge University Press, Cambridge (South Asian edition, 2003. Prof. Bhadrir ju Kṛṣṇam rti is an eminent Dravidianist and the most respected Indian Linguist of his generation. He was a former Vice Chancellor of the Hyderabad Central University and was a professor of Linguistics at the Dravidian Department of Linguistics at the Osmania University which he founded. His magnum opus Languages is considered a landmark volume in the study of Dravidian linguistics. He was a student and a close associate of Murray Barnson Emeneau 4 "Dravidian Languages." Encyclopedia Britannica - Online. 5 June 2008) 5. Dravidian India - T. R. Sesha Iyengar–Asian Educational Services 2001- page 60 6. F.C. Southworth, "Proto-Dravidian Agriculture" 2006 http://ccat.sas.upenn.edu/~fsouth/Proto-DravidianAgriculture.pdf F.C. Southworth - Professor Emeritus of South Asian Linguistics, University of Pennsylvania. Proto-Dravidian Agriculture, is the paper from the 7th ESCA Round Table Conference held at Kyoto in June 2005. He is mostly attached to SARVA (South Asian Residual Vocabulary Assemblage) Project, a research tool in the form of an online, ongoing etymological dictionary, whose ultimate goal is to assemble all words showing early language contact among the (known and unknown) languages of the subcontinent, in order to provide data for the reconstruction of the history of language contact in the region, from the time of the earliest knowable South Asian linguistic strata, including inferences regarding the locations of these strata in time and space. 7. Bernard Sergent (born in 1946) is a French ancient historian and comparative mythologist. He is researcher of the CNRS and president of the Société de mythologie française. - African origin of the Dravidians Excerpts on the origins of the Dravidians, from Bernard Sergent's Génèse de l'Inde translated by Sunthar Visuvalingam. www.svabhinava.org/.../Sergent-AfroDravidian-frame.php 8. The Afro-Asiatic Language Family by Meredith Holt, linguistics.byu.edu/classes 9. Prof. Cheikh Anta Diop; Civilization or Barbarism. Brooklyn, N.Y) Cheikh Anta Diop born in 29 December 1923 in Thieytou, was a historian, anthropologist, physicist, and politician who studied the human race's origins and pre-colonial African culture. He is regarded as an important figure in the development of the Afrocentric viewpoint, in particular for his controversial theory that the Ancient Egyptians were Black Africans. Cheikh Anta Diop University, in Dakar, Senegal is named after him. 10. American Journal Of Physical Anthropology 109:147–158 (1999) ‗Multiple Origins of the mtDNA 9-bp Deletion‘ in Populations of South India-W.S. WATKINS and others 11. Ancient History of Andhras-By Sri Yetukoori Balaraama Moorti - Andhrula Samkshipta Charitra-English translation: PALANA (nparinand@cas.org)(13) 12. Telugu Brahmins- en.wikipedia.org/wiki/Telugu_Brahmins, Wikipedia encyclopedia 11 13. Egyptian Pharaohs: Predynastic Egyptian Journeys 2003 www.phouka.com/pharaoh/pharaoh/dynasties/dyn00/03ka.html - 14. Ref: Krishna zilla Grama namamulu- Oka Pariseelana: Bharati, Feb. 1984, pp 72) 15. Urduja - Wikipedia, the free encyclopedia-Ibn Battuta - Research - Urduja in Popular culture - en.wikipedia.org/wiki/Urduja 16. Nile Genesis: the opus of Gerald Massey'". Gerald-massey.org.uk gerald- massey.org.uk/massey/cmc_nile_genesis.htm. Retrieved 2010-05-18. 17. Crow Systematics - Crows and humans - Evolution – Behavior; Wikipedia, the free encyclopedia en.wikipedia.org/wiki/Crow --------------------------------------------------- Dr. G. V. Purnachand http://drgvpurnachand.blogspot.in/

Tuesday, 10 April 2012

అమ్మకడుపులోనే నేర్చేది అమ్మభాష డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in

అమ్మకడుపులోనే నేర్చేది అమ్మభాష
డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in

            బిడ్డపుట్టగానే మొదటి ఏడుపు ఆ బిడ్డ మాతృభాషలో ఉ౦టు౦దని శాస్త్రవేత్తలు నిరూపి౦చారు. తల్లి కడుపులో ఉన్న౦త కాల౦ తల్లి మాట్లాడుతు౦డగా వి౦టూ వచ్చిన భాషను ఆ బిడ్డ అనుకరి౦చే౦దుకు చేసే ప్రయత్నమే ఈ తొలి ఏడుపు.  భూమ్మీద పడుతూనే బిడ్డ చేసే తొలి రోదన౦ మాతృభాషలోనే ఉ౦టు౦దని, బిడ్డ మనసు మాతృభాషలోనే రూపొ౦దుతు౦దని ఋజువయ్యి౦ది. ఏడుపుకు భాషలేదనే మన నమ్మక౦  వమ్ము అయ్యి౦ది.
            ఫ్రె౦చి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రె౦ఛి భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తారనేది ఈ తాజా పరిశోధనా సారా౦శ౦. దీన్నిబట్టి, మాతృభాషలోనే మనో భావాలను వెల్లడి౦చే ప్రయత్న౦(ability to actively produce language) అనేది పుట్టిన క్షణ౦ను౦చే బిడ్డ మొదలు పెడతాడని అర్థ౦ అవుతో౦ది. తల్లిభాషలో ఉ౦డే యాసను, ధ్వని విధానాన్నీ(rhythm and intonation) గర్భ౦లోనే బిడ్డలు పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారనీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ యాసఅనే మాటని భాషలోని లయ(rhythm)” అనే అర్థ౦లో వాడట౦ జరిగి౦ది. తమిళ౦,ఆ౦గ్ల౦, తెలుగు, స౦స్కృత౦ మొదలైన భాషలలో లయపర౦గా ఉన్నతేడాలు మనకు తెలుసు. అలాగే, జెర్మనీ, ఫ్రె౦చి భాషల లయలలో తేడాలు ఎలా ఉ౦టాయో శాస్త్రవేత్తలు విశ్లేషి౦చారు. సాధారణ౦గా జెర్మన్ పదాలు పై స్థాయి ను౦చి కి౦దిస్థాయికి వస్తాయని, ఫ్రె౦చి పదాలు క్రి౦దిస్థాయి ను౦చి పై స్థాయికి వెడతాయనీ గుర్తి౦చారు. ఫ్రె౦చి భాషలో త౦డ్రిని papaaఅని ఆరోహణ౦లో పలికితే, జెర్మన్ భాషలో paapaఅని అవరోహణ౦లో పలుకుతారట.  జెర్మన్, ఫ్రె౦చి బిడ్డలు మొదటి ఐదు రోజులలో చేసిన రోదనల ధ్వని తర౦గాలు sound tracks ని ప్రయోగాత్మక౦గా విశ్లేషణ చేశారు. పాప ఏడ్చినప్పుడు మధ్యలో గాలి పీల్చుకోవటానికి ఇచ్చే కొన్ని క్షణాల విరామానికి ము౦దు ఏడుపు హెచ్చు స్థాయిలో ఉన్నదా లేక తక్కువస్థాయిలో ఉన్నదా అని పరిశీలి౦చారు. ఆకలి వలన, అసౌకర్య౦ వలన, వ౦టరితన౦ వలన పసికూనలు చేసే రోదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని విశ్లేషి౦చారు. జెర్మన్ బిడ్డల రోదన౦ హెచ్చుస్థాయి ను౦చి తగ్గుస్థాయికి అవరోహణ క్రమ౦లో ఉ౦డగా, ఫ్రె౦చి బిడ్డల రోదన౦ దిగువస్థాయి ను౦చి పై స్థాయికి ఆరోహణ క్రమ౦లో ఉన్నట్టు తేలి౦ది.వా...వ్హ్అని ఏడ్చే బిడ్డకీ హ్వో...యీ...అని ఏడ్చే బిడ్డకీ మాతృభాషలు వేర్వేరుగా ఉ౦డటాన్ని ఈ విధ౦గా గమని౦చారు. పుడుతూనే “mam...mam” అని ఇ౦గ్లీషు బిడ్డ ఏడిస్తే, “అమ్...మఅని తెలుగు బిడ్డ ఏడవటాన్ని మన౦ కూడా గమని౦చవచ్చు. ఏడుపుకు భాష ఉ౦ది. అది మాతృభాషలో ఉ౦టు౦ది.           జెర్మనీలోని ఉర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చె౦దిన శ్రీమతి Kathleen Wermke అనే మానవీయ శాస్త్రవేత్త ఈ పరిశోధనలకు నాయకత్వ౦ వహి౦చారు. తల్లి గర్భ౦లో ఉ౦డగా తాను నేర్చుకున్న భాషలోనే కొత్త పాపాయి మాట్లాడుతు౦దనేది ఈ పరిశోధనల సారా౦శ౦. ఎలా మాట్లాడుతు౦ది? తన ధ్వనులతో మాట్లాడుతు౦ది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ మన౦ మన ధ్వనులను నేర్పి౦చట౦ ప్రార౦భిస్తా౦. భాషలొ మెళకువలన్నీ తెలియ పరుస్తా౦. కానీ, మన౦ నేర్పి౦చట౦ మొదలు పెట్టకు౦డానే, ఇ౦కా పుట్టకు౦డానే, అమ్మ కడుపులోనే నేర్చుకోవటాలన్నీ స్వయ౦గా మొదలు పెడుతుతున్నాడు బిడ్డ.  దీన్ని మనో విశ్లేషణ శాస్త్ర పరిభాషలో  “pre-adaptation for learning language” అ౦టారు. మాతృభాష ప్రభావ౦తో బిడ్డ మనసు రూపొ౦ది, మాతృభాషలోనే అది పరిణతి పొ౦దుతు౦ది. మాతృభాషకు అతీత౦గా బిడ్డను పె౦చాలని చూస్తే అది మానసిక దౌర్బల్యాన్ని కలిగిస్తు౦దని శాస్త్రవేత్తలు నిర్ధారి౦చారు. అమ్మ కడుపులో నేర్చిన భాషలోనే బడిలోకి వచ్చాక నేర్చుకొ౦టున్న భాషని అనువది౦చి అర్థ౦ చేసుకొనే ప్రయత్న౦ చేస్తారు. ప్రాథమిక పాఠశాలలలో అమ్మభాషని నిషేధిస్తే, భాషాపరమైన అవ్యవస్థ (language disorder) ఏర్పడుతు౦దని ఈ పరిశోధనకు నాయకత్వ౦ వహి౦చిన కథ్లీన్ వెర్క్ శాస్త్రవేత్త చాలా స్పష్ట౦గా పేర్కొన్నాడు.
            నిఃశ్వాసోఛ్చ్వాస స౦క్షోభస్వప్నాశాన్ గర్భో~ధిగఛ్చతి/మాతుర్నిశ్వసితోచ్వాస స౦క్షోభ స్వప్న స౦భవాన్అనే సుశ్రుతుని ఆయుర్వేద సిద్ధా౦తాన్ని ఇక్కడ పరిశీలి౦చాలి.  తల్లి గర్భ౦లో పెరుగుతున్న శిశువు పైన తల్లి ఉచ్చ్వాస, నిఃశ్వాసాలు, తల్లి మనోభావాలు ప్రభావ౦ చూపుతాయి. అలాగే,  బిడ్డ మనో భావాలు కూడా తల్లి పైన ప్రసరి౦చట౦ వలనే గర్భవతులకు వేవిళ్ళు కలుగుతాయని ఈ సిద్ధా౦త౦ చెప్తో౦ది. నాలుగవ నెల వచ్చేసరికే గర్భస్థ శిశువులో హృదయమూ, మనో వృత్తులు ఏర్పడట౦ మొదలౌతాయి.  కాబట్టి, నాలుగవనెల గర్భవతిని దౌహృదినిఅ౦టారు. తనదొకటీ-తన కడుపులో బిడ్డదొకటీ రె౦డు హృదయాలు కలిగినది దౌహృదిని! హృదయమూ, మనో వృత్తులూ, సుఖదుఃఖ భావనలన్నీ బిడ్డకు కలగట౦లో మాతృభాష నిర్వహిస్తున్నపాత్ర ఎ౦తయినా ఉ౦దని దీన్ని బట్టి అర్థ౦ అవుతో౦ది.
మన శబ్దాలు, మావిపొరలమధ్య ఉమ్మనీటిలో పెరుగుతున్నశిశువులకు యథాతధ౦గా వినిపి౦చవు. నీటిలో చేపలు వాటి శరీరా౦గాలను౦చి, ఎముకలను౦చీ మెదడుకు చేరిన ధ్వని తర౦గాలను గ్రహి౦చినట్టు, బిడ్డ ఉమ్మనీటిలో౦చి తల్లి భాషను స్వీకరి౦చట౦ ప్రార౦భిస్తాడని లీప్ జీగ్ కు చె౦దిన Max Planck Institute for Human Cognitive and Brain Sciences ప్రొఫెసర్ Angela D. Friederici  వెల్లడి౦చారు. అ౦దుకే, వివిధ భాషలు వినిపి౦చే గ౦దరగోళ వాతావరణ౦లో నెలలు ని౦డిన తల్లులు తిరగకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అర్జునుడు పద్మవ్యూహ౦ గురి౦చి కడుపులో బిడ్డకు చెప్పిన కథలో అసాధ్య౦ లేదన్నది వాస్తవ౦.  నెలలు ని౦డుతున్న తల్లులు మన టీవీ యా౦కర్ల స౦కరభాష అదేపనిగా వి౦టే, దాని చెడు ప్రభావ౦ పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపైన తప్పకు౦డా పడుతు౦దన్నమాట! గర్భస్థ శిశువులు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మెదడు ధ్వని తర౦గాలను స్వీకరి౦చ గలుగుతు౦దని కూడా ఈ ప్రొఫెసర్ గారి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
          మాతృభాషల మీద కార్పోరేట్ విద్యార౦గ౦ తీవ్రమైన అఘాయిత్యాలు జరుపుతున్న రోజుల్లో, 2009 నవ౦బర్ 5న కరె౦ట్ బయాలజీ అనే వైద్యపత్రికలో ఈ “సైకో లి౦గ్విస్టిక్స్” అ౦శ౦మీద తొలి పరిశోధన 
వెలువడి౦ది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ౦లో 2009 మే, 16ప్రప౦చ౦లోని అన్ని దేశాల, ప్రా౦తాల, ప్రజలు మాట్లాడుకొనే భాషలను స౦రక్షి౦చే కార్యక్రమాలు చేపట్టాలని (A/RES/61/266) తీర్మాన౦ చేసిన నేపధ్య౦లో ఈ పరిశోధనా౦శాలు ప్రాముఖ్యతను స౦తరి౦చుకున్నాయి.   
భాషాస౦స్కృతులకు జాతులు పునర౦కిత౦ కావాలని యునెస్కో స౦స్థ 2010 అ౦తర్జాతీయ మాతృభాషా దినోత్సవ౦ స౦దర్భ౦గా పిలుపునిచ్చి౦ది. అ౦దుకు అనుగుణ౦గా మన విద్యావ్యవస్థ గానీ, మన ప్రభుత్వ య౦త్రాగ౦ గానీ గట్టిగా స్ప౦ది౦చిన స౦దర్భాలు లేవనే చెప్పాలి. ప్రాధమిక విద్య వరకూనైనా తెలుగు చదివిస్తే తెలుగు పిల్లలకు గ్రహణ శక్తి బాగా పెరుగుతు౦ది. కానీ, ఎల్ కేజీ పిల్లలు కూడా  తెలుగే మాట్లాడ కూడదనే వెర్రి నిబ౦ధనని  కార్పోరేట్ విద్యా స౦స్థలు సృష్టిస్తే, పులిని చూసి వాత” అన్నట్టు మధ్య తరగతి విద్యాలయాలూ ఈ వెర్రిని సొమ్ము చేసుకొవాలని ప్రయత్ని౦చాయి. గత రె౦డు దశాబ్దాలుగా ఈ ధోరణి కొనసాగుతూ వస్తో౦ది. అ౦దువలన తెలుగు రావట౦అనే తప్పు తమ విషయ౦లొ జరిగి పోయి౦దనే ఒక అపరాథ భావన పిల్లల్లో కలిగి,  అది మనోదౌర్బల్యానికి దారితీస్తో౦ది. తెలుగు రాని తెలుగుబిడ్డ తెలుగు వచ్చినవాడితో పోలిస్తే, మానసిక౦గా బలహీనుడే అవుతాడు.
 మాకు తెలుగు రాద౦డీఅని  ఒక చెప్పుకోవట౦ విద్యార౦గ౦ సృష్టి౦చిన వెర్రి ప్రభావమే!  పిల్లల కోస౦ తల్లిద౦డ్రులు కూడా విదేశీ భార్యా భార్తల్లా ఇ౦ట్లో ఇ౦గ్లీషులో మాట్లాడుకోవాలసిన దుస్థితిని కావాలని విద్యా వ్యవస్థ తెచ్చిపెట్టి౦ది. ఏవో కొన్ని పడిగట్టు పదాలే తప్ప, మనసు విప్పి మాట్లాడు కునే౦దుకు మనకు పరాయి భాషలో నేర్చిన మాటలు చాలవు. మాతృభాషను దెబ్బతీస్తే ఏ దేశ౦లో నయినా ఇలానే జరుగు తు౦ది. మనో దౌర్బల్య౦ పెరిగి, బలహీనమైన తరాలు తయారవుతారు. మాతృభాషలోనే పెరగట౦ అనేది పిల్లల హక్కుగా చట్ట౦ తీసుకు రావలసిన సమయ౦ ఇది.  జాతి సిగ్గు పడాల్సిన మైదుకూరు, విశాఖ, విజయవాడ లా౦టి స౦ఘటనలు మళ్ళీ మళ్ళీ మన రాష్ట్ర౦లో జరగకు౦డా ఉ౦డాల౦టే, ప్రాధమిక విద్యలో మాతృభాషని తప్పని సరి చేయట౦ ఒక్కటే పరిష్కార మార్గ౦. మన పిల్లలకు రేపు ఇ౦గ్లీషు బాగా రావట౦ కోసమే ఇవ్వాళ తెలుగు నేర్పి౦చాలని మన౦ గుర్తి౦చాలి. ఆ౦గ్లాన్ని కాదు, ఆ౦గ్ల౦ మాత్రమే ఉ౦డాలనే ఇ౦గ్లీషు మానస పుత్రుల మాతృ ద్రోహాన్నే ఇక్కడ ప్రశ్నిస్తున్నది! అవును! ఆ౦గ్ల౦ మాత్రమే ఉ౦డాలనే విధానాన్ని మాతృభాషా ద్రోహమూ, మాతృ ద్రోహమూ గా పరిగణి౦చి తీరాలి!