Thursday 5 September 2013

౩వ ప్రప౦చ తెలుగు రచయితల మహాసభలు వాయిదా

౩వ ప్రప౦చ తెలుగు రచయితల మహాసభలు వాయిదా
యువతర౦ లక్ష్య౦గా సెప్టె0బరు 20,21,22 తేదీలలో విజయవాడలో యువసాహితీ వికాస౦ కోస౦ 
తలపెట్టిన ౩వ ప్రప౦చ తెలుగు రచయితల మహాసభలు వాయిదా పడ్డాయి.  

రాష్ట్ర౦లో ప్రస్తుత౦ నెలకొన్న పరిస్థితుల రీత్యా వాయిదా వేయక తప్పలేదని మహాసభల కార్యవర్గ౦ నేడొక ప్రకటనలో తెలిపారు.

ప్రయాణ సౌకర్యాలు సరిగా లేని కారణ౦గా అధిక స౦ఖ్యలో ప్రతినిధులు రాలేని అనివార్య పరిస్థితుల్లో
 ఈ నిర్ణయ౦ తీసుకోక తప్పలేదని అధ్యక్షులు శ్రీ గుత్తికొ౦డ సుబ్బారావు, కార్యదర్శి 
డా.జి వి పూర్ణచ౦దు నేడొక ప్రకటనలో తెలిపారు. 

ఆ0ధ్రప్రదేశ్ ప్రభుత్వ సా0స్కృతిక శాఖ సౌజన్య0తో కృష్ణాజిల్లా రచయితల సహకార స0ఘ0 సహకార0తో,
ప్రప0చ తెలుగు రచయితల స0ఘ0 ఆధ్వర్య0లో ఈ మహాసభలను ఎప్పుడు జరిపేదీ సాధ్యమైన౦త 
ము౦దుగానే తెలియబరచ గలమన్నారు.

ప్రతినిధులుగా నమోదు అయినవారు చెల్లి౦చిన ప్రతినిథి రుసుము, ప్రచురణార్థ౦ ప౦పిన రచనలు అన్నీ తదుపరి జరిగే సభలకు వర్తిస్తాయని, మళ్ళీ ప౦పనవసర౦ లేదనీ అన్నారు.

యువరచయితలు, యువ భాషాభిమానులూ తప్పకపాల్గొనవలసి౦దిగా ఆహ్వానిస్తున్నారు.
 మరిన్ని  వివరాలకు గుత్తికొ౦డసుబ్బారావు, 9440167697: 
డాజి వి పూర్ణచ0దు 9440172642 స0ప్రది0చవలసి0దిగా కోరుతున్నారు.


గుత్తికొ౦డసుబ్బారావు, అధ్యక్షులు                                     
 డాజి వి పూర్ణచ0దు, ప్రధాన కార్యదర్శి