Tuesday 16 September 2014

నా ఆహారవేదం గ్రంథానికి జాతీయ పురస్కారం

నా ఆహారవేదం గ్రంథానికి జాతీయ పురస్కారం

శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ వారు చెన్నై మ్యూజిక్ అకాడెమీ హాలులో 14-09-2014న తమ 16వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం జరిపారు. ఈ సభలో వివిధ రంగాలకు చెందిన ఎనిమిది మంది ప్రముఖులకు పురస్కారాలు అందించారు. ఇందులో ఆహార పరిశోధనారంగంలో నాకు ఈ జాతీయ పురస్కారం లభించింది. ఇంకా శ్రీ తనికెళ్ళ భరణి, డా. శాయికృష్న యాచేంద్ర, శ్రీ విఙ్ఞాన్ రత్తయ్య, శ్రీ కర్నాటి లక్ష్మీ నరసయ్య, డా.గుమ్మడి గోపాలకృష్ణ, శ్రీ ఏస్వర్, శ్రీ దూపాటి విజయకుమార్ ప్రభృతులున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, తెలుగు భాషోద్యమ నాయకులు శ్రీ మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సాంస్కృతిక, సాంకేతిక శాఖామాత్యులు శ్రీ పల్లె రఘునాథ రెడ్డి, ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాదత్తు , శ్రీ భువనచంద్ర అతిథులుగా పాల్గొన్నారు. మద్రాస్ సాక్షి పత్రికలోని ఈవార్త చదవగలరు. నాకొచ్చిన ఈ జాతీయ పురస్కారం తెలుగు భాషోద్యమంలో భాగంగా మన భాషా సంస్కృతుల ప్రాచీనతను వెలుగులోకి తీసుకు రావాలని పదేళ్ళ క్రితం శ్రీ బుద్ధప్రసాద్ గారిచ్చిన పిలుపు మేరకు చేసిన కృషిలో భాగంగా నా “ఆహారవేదం” గ్రంథం వెలువడిందనీ, ఈ పుస్తకానికే ఈ జాతీయ పురస్కారం లభీంచిందనీ, ఈ పురస్కారాన్ని తెలుగు భాషోద్యమానికి అంకితం చేసుకుంటున్నాననీ ప్రకటించాను.
 — atMusic Academy.