Wednesday, 11 July 2012

ల౦డన్ ప్రప౦చ తెలుగు చరిత్ర మహాసభల విశేషాలు-1


ల0డన్ ప్రప0చ తెలుగు చరిత్ర మహాసభల విశేషాలు-1

మిత్రులకు నమస్కార౦!
జూలై 11వ తేదీ ఉదయ0 10 గ0టలకు ఎమిరేట్స్ వారి విమాన0లో బయలు దేరి సాయ0కాలానికి ల0డన్ చేరుకున్నాము. శ్రీ మ0డలి బుద్ధప్రసాదు గారూ, ఆ0ధ్రప్రదేశ్ శాసన మ0డలి అధ్యక్షులు శ్రీ చక్రపాణి గారూ, శాసన మ0దలి సభ్యులు శ్రీయుతులు ఐలాపుర0 వె0కయ్యగారూ, యాదవరెడ్డి గారూ, జగదీశ్వర రెడ్డి గారూ, ఇ0ద్రసేనారెడ్డిగార్లతో సహా 25మ0ది ప్రతినిధి బృ0ద0 ప్రధమ తెలుగు చరిత్ర మహాసభలలో పాల్గొనటానికి ల0డన్ చేరుకున్నాము. మధ్యలో దుబాయి లో ఆగినప్పుడు అక్కడి విమానాశ్రయ0 వారు ప్రతేక0గా ఆతిధ్య0 ఇచ్చి  గౌరవి0చారు. అలాగే ల0డన్ చేరుకున్నాక భారతీయ హై కమీషనర్ వారి ప్రతినిధి ఆహ్వాన0 పలికారు. దగ్గరు0డి మాకు ఇక్కడి విమానాశ్రయ0లో ఇమిగ్రేషన్ పనులు పూర్తి చేయి0చారు, నిర్వాహకులు యుక్తా స0స్థ వారు పెద్ద స0ఖ్యలో విమానాశ్రయానికి వచ్చి అతిధుల0దరికీ స్వాగత0 పలికారు. 13వ తేదీన రాజ్యసభ సభ్యులు.  శ్రీ చిర0జీవి వస్తున్నారు. రేపు ఇ0కా అనేకమ0ది పత్రికా ప్రతినిధులు కూడా వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అవకాఅశ0 ఉ0టే మన పరిశోధకుల బృ0ద0 బ్రిటీష్ గ్ర0థాలయ0లోనూ, బ్రిటిష్ మ్యూజియ0లోనూ, మన చారిత్రక విశేషాలకు స0బ0ధి0చిన రికర్డులు పరిశీలి0చే కార్యక్రమ0లో నిమగ్నమౌతారు
మొదటి ప్రప0చ తెలుగు చరిత్ర మహలకు స0బ0ధి0చిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తు0టాను. నమస్కార0.