మగానుభవంలో రతిమాంద్యం
డా. జి వి పూర్ణచందు
మనిషి
ఆరోగ్యం, అతని అభ్యున్నతి, అతని సాధకత అంతా అతని లైంగిక జీవితం మీదే ఆధారపడి
ఉంటుంది. కోరికను ఆరోగ్యకరమైన రీతిలో సంతృప్తి పరచుకున్నా మానసిక శక్తి
సమకూరుతుంది. లేదా దాన్ని ఆరోగ్యకరమైన రీతిలో నిగ్రహించుకున్నా మానసిక శక్తి
సిద్ధిస్తుంది. కోరిక నెరవేరక, నెరవేరినా సంతృప్తి కలగక, దాన్నీ అణచుకోలేక నిరంతర
అసంతృప్తితో జీవించేవారికి మానసిక శక్తి అందని ద్రాక్ష అవుతుంది. బ్రహ్మచర్యం
మాత్రమే గొప్పదనటాన్ని కామశాస్త్రం అంగీకరించదు. కమ్మని సంసార సంతృప్తి అంతకన్నా
గొప్పది.
సంసార సుఖాన్ని పొందటానికి వయసుతో నిమిత్తం లేదు. ఆజన్మాంతం రతిసుఖం
ఒక్కటి దక్కితే చాలు, కోట్లు ఉన్నవాడికన్నా గొప్పవాడౌతాడు, quality of life అనేది సంతృప్త
హృదయాలకు మాత్రమే సిద్ధించే ఒక గొప్ప అవకాశం.
లైంగిక
పరమైన సంతృప్తి చాలినంత లేకపోవటం నాణ్యమైన జీవితాన్ని తప్పకుండా దెబ్బతీస్తుంది.
దీనికి అనేక కారణాలున్నాయి. అసంతృప్తిని బయటకు వెళ్ళబుచ్చుకునే అవకాశం, ఇతరులతో
చెప్పుకుని సేద తీరే అవకాశం, ఇతర మార్గాలలో దాన్ని పొందే అవకాశాలు లేక పోవటం వలన
లైంగిక అసంతృప్తి జీవిత నాణ్యతని తప్పకుండా దెబ్బతీస్తుంది.
లైంగిక
అసంతృప్తిని sexual dysfunction
అంటారు. లైంగిక మాంద్యం అని దీన్ని
పిలుద్దాం. ఆర్థిక మాంద్యం లాంటిదే ఈ లైంగిక మాంద్యం! ఇది స్త్రీ పురుషులిద్దరికీ సమానంగానే ఏర్పడవచ్చు
కూడా! తాను సంతృప్తి పొందలేకపోయానని స్త్రీ భావించుకుంటే, తాను సంతృప్తి
పరచలేకపోయానని పురుషుడు అసంతృప్తి చెందుతారు. ఇది లోక సహజమైన విషయం. అసంతృప్తికి
కారణం ఏదైనా కానీయండి, అది జీవితంలో నాణ్యతా మాంద్యాన్ని తెచ్చేదాకా వెళ్ళనివ్వ కూడదు.
ఎవరికివారు ప్రయత్నపూర్వకంగా సరిదిద్దుకునే విషయం
లైంగికమాంద్యానికి శారీరక, మానసిక, సామాజిక కారణాలనేకం
ఉన్నాయి. మానసిక సామాజిక కారణాలను ధృఢచిత్తంతో ఎదుర్కో గలగవచ్చు. అక్కడ మగవారు
మనోబలంతో సాధించుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుంది. కానీ, శారీరక కారణాల గురించి
చర్చించవలసింది చాలా ఉంది. హార్మోన్లు, నాడీ వ్యవస్థ ఈ రెండింటి సమన్వయం వలనే
సెక్సు కోరిక కలుగుతోంది. జననాంగానికి సంబంధించిన
రక్త నాళాలు, నరాలు, మాంసకండరాలు రతి సమయానికి అనుకూలంగా స్పందించక పోయినా లైంగిక
మాంద్యం ఏర్పడుతుంది. సెక్సు కార్యానికి సంబంధించిన కండరాలు, నరాల సమన్వయం సరిగా
లేకపోయినా, భావప్రాప్తి గానీ, వీర్యస్ఖలనం గానీ సకాలంలో జరగకుండా పోతాయి. స్ఖలనం వెంటనే జరిగినా, బాగా ఆలస్యంగా జరిగినా సంతృప్తికరమైన
రతికార్యం జరగనట్టే అవుతుంది. అది మగవారిలో అసంతృప్తిని తెచ్చిపెడుతుంది. మగవారిలో
అసంతృప్తి సాధారణంగా స్త్రీ గురించి ఉండదు. తనగురించే ఉంటుంది. తన వైఫల్యాన్నే
ఎక్కువగా భావిస్తాడు. అది తనను తాను తక్కువ చేసుకునే ఆత్మన్యూనతా భావానికి దారితీసి,
వ్యక్తిగత సమర్థతల్ని దెబ్బతీసేదిగా మారుతుంది.
భావప్రాప్తిని Orgasm
అంటారు. ఇది ఏమిటో ఇంతవరకూ కచ్చితమైన నిర్వచనం ఏదీ లేదు. అది కలగటానికీ, కలగక
పోవటానికి నిర్దిష్టమైన కారణాలు కూడా లేవు. కానీ, శరీరాంగా లన్నింటి సమన్వయం వలన
మాత్రమే భావప్రాప్తి సిద్ధిస్తుంది. స్త్రీకి భావప్రాప్తి కలగకుండానే స్ఖలనం
జరిగిపోయినప్పుడు పురుషుడు తప్పకుండా ఆందోళన చెందుతాడు. ఈ ఆందోళన ఆ వ్యక్తి లైంగిక
వ్యవస్థనే దెబ్బతీస్తుంది. కాబట్టి తక్షణ చికిత్స అవసరం అవుతుంది.
తీవ్రమైన
కోరిక(libido), జననాంగ స్తంభన (erection), సకాలంలో స్ఖలనం (ejaculation), భావప్రాప్తి (orgasm.) ఇవన్నీ సక్రమంగా ఉండేలా
చూడటమే చికిత్సా పరమార్థం. లైంగిక మాంద్యానికి చికిత్స ఈ సూత్రం మీదే ఆధారపడి ఉంటుంది.
ఇందులో ఔషధ పాత్ర ఎంత, వ్యక్తి పాత్ర ఎంత అనేది ముఖ్యం.
లసెక్సు
కోరిక బాగా తక్కువగా ఉండటం (లో లిబిడో), సెక్సు కోరిక పూర్తిగా నశించిపోవటం (లాస్
ఆఫ్ లిబిడో) అనే రెండు దశలు ఇందులో కనిపిస్తాయి.
పూర్తి లైంగిక జడత్వం (sexual inertia)
ఆవహించిన వారికీ, లిబిడో బాగా
తక్కువగా ఉన్నవారికీ కొన్ని రకాల హార్మోన్లు మెదడు పైన వ్యతిరేక ప్రభావం కలిగించటం
ఒక కారణం. ఇది వైద్యుడి ద్వారా మాత్రమే సరి చేసుకోగల అంశం. వయసు పెరిగి వృద్ధాప్యానికి చేరువౌతోన్నకొద్దీ
పురుషులలో testosterone
అనే హార్మోను ఉత్పత్తి తగ్గిపోయి, సెక్సు కోరిక మందగించవచ్చు. ఆల్కాహాలు, పుగాకు,
మాదకద్రవ్యాలూ అతిగా సేవన వలన టెస్టోస్టిరోన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు. పోషక విలువలు
లేని పీజ్జాలూ, బర్గర్లు, బఠాణీ పిండి లాంటి వాటితో తయారైన వంటకాలు, నూనె
పదార్థాలూ లైంగిక ఆసక్తినీ, శక్తినీ తగ్గించవచ్చు. బీపీ, షుగరు, థైరాయిడ్ జబ్బులూ,
ఎసుఇడిటీ లాంటి రోగాలకు వాడే మందులు, పొశ్తేట్ గ్రంథిలో వాపు లాంటివి పురుషుల్లో
లైంగికత మందగించటానికీ, లైంగిక ఆసక్తి మందగించటానికి కారణం కావచ్చు. రకరకాల మానసిక
వత్తిడులు, సామాజిక అంశాలు, కుటుంబపరిస్థితులు కూడా ఇందుకు కారణం కావచ్చు
కోరిక
బలంగా లేని పురుషుడు బలవంతంగా రతికి ప్రయత్నించినా అంగస్తంభనా మాంద్యం (erectile
dysfunction ED)
వలన రతినిష్ఫలం అవుతుంది. అంగ స్తంభన తగినంత దృఢంగా లేకపోవటానికి మనసే ప్రధాన
కారణం అందుకు జననాంగాన్ని తప్పుపట్ట నవసరం లేదు. ఒక్కోసారి రతిలో పాల్గొటున్న
స్త్రీ తన జననాంగన్ని స్పృషించటం వలన బలమైన అంగ స్తంభనం కలగవచ్చు. ఒక్కోసారి
రతిసంబంధమైన ఆలోవ్చనలు మెదడుకు బాగా ఎక్కించినందువలన కలగవచ్చు. కొందరికి
ప్రత్యక్షంగా రతిలో ఉన్నప్పటికన్నా నిద్రలో ఎక్కువ దృఢంగా, ఎక్కువ సేపు ఉండేలాగా
అంగస్తంభనం కలగవచ్చు. ఎప్పుడు కలిగితేనేం...ఎలా కలిగితేనేం...కలగటమే ముఖ్యంగా సంతృప్తి కోసం వెంపర్లాడాలి. మగాడి ఈ
అసౌకర్యాన్ని అతని స్తీ కూడా అర్థం చేసుకో గలిగితే దాంపత్యంలో చికాకులుండవు.