Sunday 20 December 2015

స్త్రీవాదంలో మరోకోణం::ఫెమెనిజం డా. జి వి పూర్ణచందు


స్త్రీవాదంలో మరోకోణం::ఫెమెనిజం
డా. జి వి పూర్ణచందు
మనది సెక్సిస్ట్ సమాజం! సెక్సిస్ట్ సమాజంలో స్త్రీ ఒక శారీరక వికలాంగి. Female is passive, అనీ, తనకు తానుగా ఏదీ చేయగలిగేది కాదని లోకం భావిస్తుంది. మానవ సంబంధాల పరిధిలో కాకుండా సెక్సుదృష్టితో స్త్రీ పురుష సంబంధాలను పితృస్వామ్య భావజాలం లెక్క కడుతుంది. తరతరాల సంస్కృతిలో భాగంగా సంక్రమిస్తూ వచ్చిన వారసత్వం ఇది మనకి!
స్త్రీకి ‘శరీర స్పృహ’ కలిగిన క్షణానే, తన శరీరాన్ని మగాడు స్వార్ధానికి దుర్వినియోగం చేస్తున్నాడనే ఎరుక కలిగింది. పురుష వ్యతిరేకత, పితృస్వామిక సంస్కృతీ ధిక్కారాలతో కూడిన సాహిత్యానికి అలా బీజాలు పడ్డాయి. స్త్రీవాద సాహిత్యం సమాజ జాగృతిని సాధించ గలిగింది. అది చాప కింద నీరులా కాదు, ఒక వెల్లువెత్తిన సముద్రంలా పురుషాధిక్యత పైన విరుచుకు పడింది. ఉద్యమ స్థాయిలో వ్యాప్తి కావటాన ‘స్త్రీవాద ఉద్యమం’ బలంగా వ్రేళ్ళునుకుని, మహావృక్షమై ఎదిగింది. ఫలాలు మహిళ లందరికీ దక్కాయి. అన్ని రంగాల్లోనూ స్త్రీలు ఆధిక్యత నిలుపుకో గలుగుతున్నారు. స్త్రీ పురుష వివాదాల్లో మగాడి పక్షాన, చట్టమూ, న్యాయమూ, ధర్మం కూడా నిలబడటం లేదు. ఇది గణనీయమైన మార్పు. తెలుగులో ఎన్నో సాహితీ విప్లవాలొచ్చాయి. కానీ, మహిళావాద సాహిత్యం తెచ్చిన మార్పుని తక్కిన సాహితీ విప్లవ రూపాలు తేలేక పోయాయి!
లైంగిక సమర్థతని పెంచే ఔషధాలను వాజీకరాలని(aphrodisiacs) పిలుస్తారు. ‘గుర్రంతో సమానమైన లైంగిక సమర్ధతని ఇచ్చేవి’ అని దీని అర్ధం. అన్నింటికన్నా ఎక్కువ ఉత్తమ ‘వాజీకరం’ ఏది? అని ఒక ప్రశ్న. మన శాస్త్రాలు ‘స్త్రీ’ అని ఠక్కున చెప్తున్నాయి. ‘ఆడది అంటే లైంగిక కార్యానికి ఉపకరణం...’ అనేది దీనిభావం. మగవాణ్ణి రెచ్చగొట్టేందుకూ, సంతృప్తి పరచేందుకు ‘ఆమె’ ఉపయోగ పడుతుంది. పుట్టిన నాటి నుండీ మగాడికి ఇదే చెప్తుంటారు... ఆడదంటే ‘అందుకే’ నని!
స్త్రీ వాదం పాశ్చాత్య ప్రభావం లోంచి తెచ్చిన అరువు భావజాలం కాదు. ఆడవాళ్ల కడుపు మంటల్లోంచి పుట్టింది. గదిలో బంధించి హింసిస్తే తిరగ బడేందుకు పిల్లికి పాశ్చాత్య అవగాహన అక్కర లేదు. స్త్రీవాదం అనేది మగదాష్టీకం పైన స్త్రీత్వం విసిరిన ఒక నిరసనాస్త్రం. అది సూటిగా ‘గురి’ని తగిలింది. కానీ, ఎంత సూటిగా తగిలినా, బలిసిన పురుషాహంకారం పైన అది చిన్నగోటి గీతే! పురుష ప్రపంచంలో ఆధిపత్య భావజాలాన్ని స్త్రీవాదం పూర్తిగా తగ్గించ లేకపోయినప్పటికీ, మగాడు వదిలేస్తే నుయ్యో గొయ్యో చూసుకునే రోజులకు కాలం చెల్లింది కదా...! అది స్త్రీవాద విజయమే! స్త్రీవాద రచయిత్రులకే ఈ విజయం అంకితం కావాలి! ఇందులో పురుష రచయితలు తలదూర్చి ఆ ఘనతలో వాటాదారులు కాకూడదు.
‘శరీర స్పృహ’ పెంచుకో గలిగిన స్త్రీ ‘తన దేహంపై తన హక్కు’ల గురించి ప్రారంభించిన పోరాటం ఇది. ఒక పునరుత్పత్తి కేంద్రంగా కాకుండా, అభివృద్ధికి నిలయంగా తనను తాను నిలుపు కోవాలనే చైతన్యాన్ని నేటి స్త్రీ గుండె నిండా నింపుకుంది. పురుషుణ్ణి ఆర్థిక వస్తువు గానూ, మాన ప్రాణ రక్షణకు కాచుకునే బాడీగార్డు గానూ, తాను అతని ఆధీనంలో జీవించే బానిస గానూ ఆధారపడి బతకాల్సిన అవసరం లేదని స్త్రీ గ్రహించింది. కలిసి రావాలో లేక అహంకరించి వేరై పోవాలో తేల్చుకో వలసిన స్థితిలో ఇప్పుడు మగాడు పడ్డాడు. ఈ సామాజిక వాస్తవాన్ని గ్రహించ గలిగిన వాడే నిజమైన మగాడు. కానివాడు కాకుండా పోతున్నాడు. మగ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటమే గగనంగా ఉందని ఇప్పటికే తల్లితండ్రులు గోలపెడుతున్నారు. భవిష్యత్తులో భార్య వదిలేసిన వాళ్లకూ, భార్యని వదిలేసిన వాళ్లకూ పెళ్ళిళ్ళు కావటం అంత తేలికైన విషయం ఏమీ కాదు. దాష్టీకం ఎల్లకాలం చెల్లదని ఋజువయ్యింది. సీతను వదిలేశాక రాముడు శ్రీరాముడని అనిపించుకునే నైతిక హక్కు కోల్పోయాడు. గృహస్థు బిరుదాలు వదులుకున్నాడు. రాముడి పరిస్థితే అలా అయితే, ఇంక మామూలు మనిషి బికారులూ బేవార్సుల సంఘంలో చేరటం తప్ప వేరే ఉండదు కదా!
రామాయణాన్ని సీత కోణంలోంచి ‘సీతాయణం’గా వ్రాస్తే, అందులో రాముణ్ణి కాపాడుకోవటానికి సీత చేసే సాహసాలు ప్రధానంగా ఉంటాయి. అంటే, స్త్రీ స్వామ్య వ్యవస్థని తిరిగి తేవటం కాదు, స్త్రీ పురుష సమాన వ్యవస్థకు శ్రీకారం చుట్టటం! మన సంస్కృతిని కాపాడుకోవటం అంటే స్త్రీ అణచివేతని కొనసాగించటంగా మతతత్వ వాదులు భావిస్తే అది తాలిబానిజం అవుతుంది. స్త్రీ వాదం ఒక మతానికి పరిమితమైన అంశం కాదు. స్త్రీకి స్వాతంత్ర్యం, పూజనీయ స్థానం ఇవ్వాలన్న ధర్మశాస్త్రాలే ఎక్కువ! అయితే, ‘పతికి మారాడక-పలుమరు లేడ్వక...’లాంటి నీతి పద్యాలతో సమాజ అభ్యున్నతి సాధ్యం కాదు.
ఆశ్చర్య రామాయణంలో జనకుడు సన్యాసం తీసుకుంటా నన్నప్పుడు “అతిథి దేవోభవ అనే అదృష్ట౦ కోల్పోతావు. పితృ దేవోభవ అని పితృ దేవతలకు తర్పణాలు విడిచి పుణ్యలోకాలు కల్పించే అవకాశాన్నీ, దేవతల్ని, మహర్షుల్ని అర్చి౦చే భాగ్యాలన్నింటినీ కోల్పోతావు. చివరికి నీ బతుకు కుక్కబతుకు అవుతుంది. సోమరి ఏనుగుని చీమలూ,ఈగలూ పురుగులే తినేస్తాయి. పురుషార్థాలేవీ లేని నిన్ను కూడా అంతే! అవే తినేస్తాయి” అని అతడి భార్య తిట్లదండకం ఎత్తుకుంటుంది. స్త్రీవాద సాహిత్యంలో ఈ మాత్రం పురుష నింద అవసరం, తిట్టి చెప్తేగానీ బుర్ర కెక్కించుకో లేని స్థితిలో మగాళ్ళు ఉన్నారు కాబట్టి.
“ఆడవాళ్ళు మంచిగా బట్టలు కట్టుకుంటే మగాళ్ళు రేప్ లెందుకు చేస్తారు?” అని ఒక స్వామీజీ కొలెస్టరాలెక్కువై ప్రకటిస్తే, ఒక కేంద్రమంత్రి దానికి వంతపాడితే తిట్టటం చాలదనీ, కొట్టి చెప్తేగానీ బుర్రలోకి వెళ్ళదనిపిస్తుంది. స్త్రీ వస్త్ర ధారణ పురురుషుల్ని ఆకర్షించటానికేనా? గుండు గీయించుకుని తెల్ల ముసుగు వేసుకుని కూర్చున్న స్త్రీ ఆకర్షణీయురాలు కాదా? ఆమెను ‘మగాడిదలు’ రేప్ చేయరా? స్త్రీని సెక్సు దృష్టితో తప్ప మరో దృష్టితో చూడలేని తనం మగవాళ్ళదే! మగదాష్టీకాలలో (male-centric notions) ఇదికూడా ఒకటి!
హంసవింశతిలో “వాని ఇల్లాలు దొమ్మరివాని డోలు” అంటాడు. డోలుని రెండువైపులా ఎడాపెడా వాయిస్తారు ఒక వైపు ఎలపట, ఇంకొకవైపు దాపట. ఒకవైపు ఇంట్లో పతి, ఇంకోవైపు బయట ఉపపతి... తన భార్య శీలవతిగా ఇంట్లో పడి ఉండగా, పరాయి వాడి భార్య వచ్చి తనను రకరకాల చేష్టలతో ఉర్రూగించి వెళ్ళాలనే మగాడి కోరికలకు ఇది ఒక మచ్చుతునక.
‘లేచిపోయింది’, ‘వాడితో వెళ్ళింది’, ‘కొంగు పరిచింది’ ఇలా అసభ్యంగా మాట్లాడుతూ జార, వేశ్య, సాని, తిరుగుబోతు అంటూ స్త్రీనింద చేసే మగాళ్ళని కొరత వేసే చట్టం రావాల్సిందే. అనేకమంది స్త్రీలతో సంబంధాలున్నవాణ్ణి రసిక రాజు, రతిరాజ శేఖరుడు అని కీర్తించటాన్ని కూడా ఈ కొరత వేసే నేరంలో చేర్చాలి. విజయరాఘవ నాయకుడు తన రాణులందరినీ ఒకే సారి అనుభవిస్తుంటే ఆయన కూతుళ్ళూ, మనవళ్ళు, మనవరాళ్ళు కూడా వచ్చి గ్యాలరీలో కూర్చుని సినిమా చూసినట్టు ఆ ఛండాలం అంతా చూశారని వెర్రి మొర్రిగా రాసిన రంగాజమ్మని మహాకవయిత్రి అనే వాళ్ళ సంస్కారాన్ని ప్రశ్నించటం అవసరం కూడా! ఏ కావ్యం చూసినా ఏమున్నది గర్వకారణం...? ఉన్నదంతా ఇదే! స్త్రీల గురించి మాట్లాడటం అంటే స్త్రీ సంభోగం గురించి మాట్లాడటం తప్ప ఇంకొకటి లేదా?
సెక్సు పరమైన ఆరోగ్యము, శరీరపరమైన ఆరోగ్యమూ రెండూ ఒకదాని వలన ఒకటి బలసంపన్నమౌతుంటాయి. ఒకటి బాగుండి రెండోది బాగోక పోవటం అనేది ఉండదు. కేవలం బాగుండటానికే (pleasure only) అయితే, సెక్సుకి ఇంత ప్రాధాన్యత అక్కర లేదు. కోరుకున్న ఒక వస్తువుని పొందటానికీ, కోరుకున్న ఒక వ్యక్తిని పొందటానికీ మధ్య తేడా ఉన్నట్టే నిగ్రహానికీ, దాంపత్యానికీ మధ్య తేడా ఉంది. స్త్రీల విషయంలో బలవంతపు నిగ్రహం కొనసాగుతూనే ఉంది. ఆమె వచ్చి తన ఒళ్ళో వాలాలని కోరుకునే యాసిడ్ ప్రేమికుడు కూడా, ఆమె తనతో మాత్రమే అలా వ్యవహరించాలనీ, ఇతరుల విషయంలో పరమ పతివ్రతగా ఉండాలనీ వాదిస్తాడు. ఇది మగ గుణం. పాశ్చాత్య సంస్కృతిలో ఇది మనకన్నాఎక్కువ. ఇది నూరు శాతం సెక్సు వివక్షతే! ఇలా అనగానే స్త్రీలకు వ్యభిచార హక్కు ఇవ్వాలంటారా...? అని కొందరు వ్యంగ్యం ఆడవచ్చు. పురుషుడికి ఇచ్చారు కదా మరి? ఇస్తే ఇద్దరికీ సమానంగానే ఇవ్వాలి. లేదా సమానంగానే నిరాకరించాలి.
దాంపత్యంలో అన్యోన్యత స్త్రీ పాతివ్రత్యం మీద మాత్రమే ఆధారపడి లేదు. అది పురుషుడి జోరు ఎంత తగ్గితే అంత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అన్యోన్య దాంపత్యాన్ని ‘పాజిటివ్ సెక్సు’ అంటారు. వివక్షత లేని లైంగిక వ్యవస్థ వలన సంసారం బలపడుతుంది. స్త్రీలు తమ లైంగికతని తమ అంగీకారం తోనూ, తమ సంతృప్తి కొద్దీ, తమ ఆరోగ్య భద్రత కొద్దీ పొందే హక్కు ఇది. స్త్రీ పురుషు లిద్దరూ పరస్పర అంగీకారంతో సుఖప్రదంగానూ, ఆరోగ్యదాయకంగానూ ఉండే లైంగిక కార్యానికి తలపడటాన్ని ‘పాజిటివ్ సెక్సు’ అని నిర్వచించుకోవచ్చు. మహిళావాదంలో కొన్ని కొత్త అడుగులు ఈ దిశలో నడుస్తున్నాయి.
పాజిటివ్ సెక్సు సిద్ధాంతంలో పురుష వ్యతిరేకత కన్నా, పురుషాధిక్య వ్యతిరేకతకు ప్రాధాన్యత కనిపిస్తుంది. ఉద్యమ కారణంగా పురుష వ్యతిరేక పదజాలం కొంత కనిపించి నప్పటికీ ‘పాజిటివ్ సెక్సు’ అనేది ‘మేల్ నెగెటివ్’ కాదు. అది జెండర్ సోషలైజేషన్‘ను కోరుకుంటుంది. ‘లైంగిక సానుకూలతా స్త్రీవాదం(పాజిటి సెక్సు ఫెమినిజం)’ ఈ దిశలో మరో ముందడుగు.
పాజిటివ్ సెక్సు అనేమాట సెక్సుని పొందటానికి మాత్రమే కాదు, సెక్సుని అతిగా నిగ్రహించు కోవటం గురించి కూడా ఆలోచిస్తుంది. సెక్సుని పొందటంలో ఆనందంతో పాటు, ప్రమాదాలు, ప్రాణాపాయాలు అనేకం పొంచి ఉన్నట్టే, నిగ్రహం పాటించే విషయంలోనూ ఉన్నాయి. సాధారణ స్థితిలో నిగ్రహించిన ఒక కోరిక మానసిక శక్తిగా “సబ్లిమేట్” అవుతుందంటాడు ఫ్రాయిడ్. కానీ, వివక్ష కారణంగా బలవంతపు నిగ్రహానికి గురికావటం వలన నిగ్రహించుకున్న ఆ కోరిక సబ్లిమేట్ కాకుడా మనోవ్యాధిగా మారుతుంది. హిష్టీరియా లాంటి మానసిక వ్యాధులకు కారణం అతి నిగ్రహమే! యోగశ్చిత్తవృత్తి నిరోధకః అన్నారు. బ్రహ్మచర్యం అనేది మనోబల సంపన్నతతో జరిగితే ‘యోగ’దాయకం! లేకపోతే ‘అయోగ్యం’ అయి మానసిక బలహీనతకు కారణమౌతుంది.
ముఖ్యంగా సెక్సు విషయంలో బలవంతపు నిగ్రహాలే నరాల బలహీనతకు కారణా లౌతున్నాయి.
సెక్సుని తుఛ్ఛమైన లౌకిక వ్యవస్థగా భావించి మనుషు లందరూ సెక్సు హీనులుగా మారాలని టీవీల్లో హోరెత్తించే ప్రవచనకారులే మానసిక బలహీనతకు మొదటి కారకులు. యుద్ధ సైనికుడికి ఆయుధా ఆయుధ ప్రయోగ విద్యలూ ఇస్తే చాలదు, తగినంత మనోబలం కూడా ఇచ్చి పంపాలి. స్త్రీలలో ఇలాంటి మనోబలాన్ని పెంపొందించాలని పాజిటివ్ సెక్సు సిద్ధాంతం కోరుతోంది.
దాంపత్య అసమానతను ప్రశ్నించటం ఈ యుగం లక్షణం. ద్వంద్వ విలువల్ని నిరసించాల్సిందే! ఆడది అణగిమణగి ఉండటం కాదు, ఆడా, మగా ఇద్దరూ సంసారానికి సమానంగా బద్ధులుగా ఉండే సామాజిక వ్యవస్థ కావాలి! సెక్సు అనేది ప్రకృతి ధర్మం కాబట్టి, దాన్ని స్త్రీ పురుషుల మధ్య సమానంగా పంపకం చేయాల్సిన ధర్మ శాస్త్రకారుడు పురుష పక్షపాతిగా వ్యవహరించటం వలన ఈ అసమానతలు వచ్చాయి. సుప్రీం కోర్టు తీర్పుక్కూడా అప్పీలు ఉంటుంది. కానీ, ఇక్కడ పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు.
ఆకలి వేయటం, దాహం వేయటం లాంటి నేచర్ కాల్స్ లాగానే లైంగికోత్తేజం (orgasm) కూడా! దానికి అంత ప్రాధాన్యత ఎందుకనేది సెక్స్ రాడికల్ ఫెమినిష్టుల ప్రశ్న. అసహజ సెక్సు (oral, anal sex) బారిన పడకుండా స్త్రీని కాపాడాలనేది సెక్సు పాజిటివ్ ఫెమినిష్టుల వాదన.
‘లెస్బియాన్లు’ ‘గే’ లు ఇంకా ఇలాంటి మనో వికారులు ఇదంతా మానవ సహజ ప్రవృత్తి అంటూ తమ అలవాట్లని అడ్దగించరాదని, తమ లైంగిక స్వేఛ్ఛను హరించ కూడదనీ పాశ్చాత్య లోకాలలో గట్టిగానే అడుగుతున్నారు. ఈ ధోరణిని బారతదేశంలో కూడా అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం.
లైంగిక స్వేఛ్ఛని ఇలాంటి అసహజ విధానాలకు వర్తింప చేయటం సబబేనా? ఇద్దరు ఆడవాళ్ళో లేక ఇద్దరు మగాళ్ళో సెక్సుని అసహజ పద్ధతిలో అనుభవించటం సహజ ప్రవృత్తి అనీ, చికిత్స అవసరం లేని ఒక మనస్తత్వం అనీ భావించి వదిలే యాలని ఒక మానసిక వైద్యుడు వ్యాఖ్యానిస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మనోవికారాలన్నీ ఒక పరిధి వరకూ మనుషు లందరికీ సహజ ప్రవృత్తులే! కానీ, ఆ వికారాల్లో జీవించటమే వ్యాధి. ‘గే’ అయినా, లెస్బియాన్ అయినా ఇందుకు మినహాయింపు కాదు. ఇలా మినహాయించి మన్నించేట్లయితే, హింసించి ఆనందించే ‘మగ’త్వం, యాసిడ్ పోసి లోగదీసుకోవా లనుకునే మృగత్వం, అసహజ రీతిలో సెక్సుని పొందాలనుకునే అమానుషత్వం ఇవన్నీ కూడా సహజ ప్రవృత్తుల ముసుగులో చెలామణిలోకొచ్చే ప్రమాదం ఉంటుంది. లోకం పోకడను గమనిస్తూ, ఇలాంటి అంశాలపైన స్త్రీవాదం ఇప్పుడు దృష్టిని సారించాల్సి ఉంది.
పిల్లల్లో యాసిడ్ సంస్కృతి, అసహజ లైంగిక ధోరణులు, సెక్సువెర్రి మితిమీరటానికి సినిమాలనూ టీవీలను తిట్టి ఊరుకుంటే ఉపయోగం లేదు. పిల్లలు బలమైన కుటుంబ వ్యవస్థలో పెరిగితేనే వారి మనో ప్రవృత్తుల్లోని వికారాల్ని అధిగమించ వచ్చని ‘నియో ఫ్రాయిడియన్లు’ చెఫ్పే విషయాల పైన కూడా అధ్యయనం జరగాలి.
Sex-positive feminism, pro-sex feminism, sex-radical feminism, sexually liberal feminism ఇలా స్త్రీవాదం చిలవలు పలవలుగా సాగుతోంది. అన్నీ మన సామాజిక పరిస్థితులకు వర్తించక పోవచ్చు. దేశీయ పరిస్థితులకు అవసరమైన, అనుగుణమైన రీతిలో స్త్రీవాదం తన రెండో దశని ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే కొందరు రచయిత్రుల రచనల్లో ఆ ధోరణి కనిపిస్తోంది కూడా! స్త్రీ పురుషుల సమానత్వం పిల్లల బాగోగులను కాపాడేదిగా ఉండాలి. ఫెమినిజం అంటే దాంపత్య వ్యతిరేకం కాదు. సంసారాల ధ్వంసరచన దాని లక్ష్యం అంతకన్నాకాదు.
స్త్రీ పురుష సమానత ద్వారా బలమైన కుటుంబ వ్యవస్థ ఏర్పడాలని కోరుతో, ఫెమెన్ (FEMEN) ఉద్యమం ఒకటి పనిచేస్తోంది. స్త్రీ (Female) పురుష (men)సమన్వయంగా బలమైన కుటుంబ వ్యవస్థను ఫెమెనిజం కోరుతోంది.
మగాడు ఇంక తన రంగు తుడుచుకుని నిజమైన అర్ధాంగి భావనని పెంచుకోవాలి. పెళ్ళాన్నిహింసిస్తూ పార్వతిని కొలిస్తే భక్తి ఫలించక పోగా రక్తి కూడా కోల్పోతాడు. మదగజంలా ‘మగిజం’తో అహంకరిస్తే, నష్టపోయేది తనే! అంకుశాలు,ముకుతాళ్ళూ ఈ మగిజాన్ని కట్టేయటానికి చాలవు. స్త్రీవాద ఉద్యమం గడ్డిపరకల్ని పేని గట్టి మోకులు తయారు చేయాలి! ఇంటి ఆరోగ్యం చక్కన కానప్పుడు ఇంట్లో పెరిగే సంతతి ఆరోగ్య వంతులు కాలేరని, బుద్ధిగా ఒదిగి ఉండి సంసారం చేసుకోవాలని మగాళ్ల బుర్రలో నాటగలిగే సాహిత్యం నేటి అవసరం. ఇది కూడా స్త్రీవాద రచయిత్రుల వలనే సాధ్యపడుతుంది. పురుషులు ఎంత రాసినా పొడిపొడిగానే ఉంటుంది. ఆనదు!
రేఫటి భారత దేశం పూర్తిగా యువతరంతో నిండిపోతుందని అంటున్నారు. ఆ యువత మనో బల సంపన్నులుగా మనో వికార రహితులుగా, సమాజ హితులుగా ఉన్నప్పుడు దేశం బాగు పడుతుంది. ఇందుకు తల్లిదండ్రు లిద్దరూ సమాన బాధ్యత వహించేలా చూడాలని ఫెమెనిజం కోరుతోంది. ‘ఫెమినిజం’ లోంచి ‘ఫెమెనిజం’ లోకి ప్రయాణం సాగాలి!

Monday 7 December 2015

ప్రాచీన వైఙ్ఞానిక ప్రగతి: డా. జి వి పూర్ణచందు


Sunday 6 December 2015

Dr. G. V. Purnachand, B.A.M.S.,:

Dr. G. V. Purnachand, B.A.M.S.,:


Thursday 3 December 2015

అధికార మదం :: డా. జి వి పూర్ణచందు

అధికార మదం
డా. జి వి పూర్ణచందు

అభ్రమండలి మోచునందాక నూరక/పెరిగినట్లౌ మేను నరవరేణ్య
యవధి భూధర సానువందాక నూరక/పరచినట్లౌ మేను పార్థివేంద్ర
యబ్జ భూభువనంబునందాక నూరక యెగసినట్లౌ మేను జగధీశ
యహిలోకతల మంటు నందాక నూరక/పడినయట్లౌ మేను ప్రభువతంస
యఖిల జగములు మ్రింగునంతాకలియును
నబ్దులేడును జెడగ్రోలు నంత తృషయు
నచల చాలన చణమైన యదట గలిగె
నసురభావంబు నను జెందు నవసరమున”

ఆల్కాహాల్ సేవించిన వాడిలో కలిగే లక్షణాన్ని ‘మదం’ అంటారు. మదం వలన చెలరేగి ప్రవర్తించటాన్ని ‘మదాత్యయం’ అంటారు. అప్పటిదాకా `ఏవండీ అన్నవాడు కాస్తా, రెండు చుక్కలు పడగానే ‘ఏరా’లోకి దిగిపోతాడు. “మదం ఎక్కిందా?’’ అని మందలించడం తెనాలి రామకృష్ణుడు “కల్లు జవి గొన్నావా? లం…” అని తిట్టిన తిట్టు లాంటి దన్నమాట.

 మందుకొట్టాక, మదం ఎక్కగానే కొన్ని లక్షణాలు పేట్రేగుతాయి. ఆకాశం దాకా పెరిగిపోయి దాన్ని ఆక్రమించా నను కుంటాడు. భూమికి ఆ అంచునుంచీ ఈ అంచుదాకా అంతా తనదే పొమ్మంటాడు. కింద పాతాళం కూడా తన ఆధీనం లోదే నంటాడు. అన్ని లోకాల్నీ కబళించేయాలన్నంత ఆకలి, సప్త సముద్రాలనూ తాగేయాలన్నంత దాహమూ కలిగి, అది తీరక  మళ్ళీమళ్ళీ మదిర సేవిస్తుంటాడు.
ఇలా లోకాల్ని కబళించే కలలు తియ్యగా కనటాన్ని పామర భాషలో ‘కిక్కు’ అనీ, పండిత భాషలో ‘మదం’ అనీ అంటారు. తను తలుచుకుంటే ఈ కొండని ఒక్క తన్ను తన్ని సినిమాలో లాగా అవతలికి విసిరి కొట్ట గలననుకునే వింత తత్వమే మదం. చివరికి ఏ మురుక్కాలువ పక్కనో పడున్నాడని తెచ్చి తెలిసినవాళ్ళు అప్పచెప్తుంటారు. మదం తెచ్చి పెట్టే ప్రమోదమూ, ప్రమాదమూ ఇలా ఉంటాయి.

‘మదం’ మందు కొట్టటం వలన మాత్రమే కలగాలని లేదు, ‘అధికార మదం’ అంతకన్నా ఎక్కువ కిక్కు ఇస్తుంది. పదవిలోకి వచ్చీరావటమే ‘ఐ. వీ. ఇంజెక్షను’లా వెంటనే అధికారమదం తలకెక్కిపోతుంది. చిటికెలో కిక్కెక్కే గుణాన్ని ‘యోగవాహి’ అంటారు. అంతటి శక్తి ఒక్క ‘అధికార పదవి’కి మాత్రమే ఉంది. పదవి రాగానే పైన ఆకాశం దాకా, కింద పాతాళం దాకా, చుట్టూ ఆకొన నుండి ఈ కొన దాకా మొత్తం తన కబ్జా లోనే ఉండా లంటాడు. లోకాలన్నింటినీ కబళించేస్తాననీ, సప్త సముద్రాల్ని తాగేస్తాననీ అంటాడు.

లోకానికి హాని చెయ్యడం కోసం మనిషి లోపలికి ఓ రాక్షసుడు ప్రవేశిస్తాడు. ఆ రాక్షసుడు అతన్ని ఆక్రమించి నప్పుడు అతనిలో కలిగే ఇలాంటి లక్షణాల్నే ‘మదం’ అంటారు. ‘మందు మదం’ భ్రమను కల్పిస్తే, ‘పదవి మదం’ దాన్ని నిజం చేస్తుంది.

పైన చెప్పిన పద్యం అల్లసాని పెద్దనగారి ‘మనుచరిత్ర’ లోది. తనకు వైద్యం నేర్పటానికి బ్రహ్మదత్తుడనే ముని ఒప్పుకో లేదని, ఇందీవరాక్షుడు ఆయన వైద్య పాఠాలు రహస్యంగా విని వైద్యం నేర్చేసుకుని, తిరిగి ఆ ముని దగ్గరకే వెళ్ళి వెక్కిరిస్తాడు. ఒళ్ళు మదం ఎక్కి కొట్టుకోవటం అంటే ఇదే! దాంతో ముని అతన్ని రాక్షసుడివై పొమ్మని శపించాడు. ఆ క్షణంలో  అతన్ని ఒక రాక్షసుడెవరో ఆవహించినట్టు తాను భూమ్యాకాశ పాతాళాల దాకా పెరిగిపోయిన భావన పొందినట్టు, లోకాల్ని కబళిస్తు న్నట్టు, సముద్రాల్ని తాగేస్తున్నట్టు అన్పించిందని, ఇందీవరాక్షుడు స్వారోచిషుడికి చెప్పటం ఈ పద్యంలో కనిపిస్తుంది.

ప్రతి మనిషిలోనూ ఒక సైతాన్ ఉంటాడు. మనసులోని సత్వగుణం ఈ సైతాన్ని అణచి ఉంచాలని చూస్తుంది. సత్వం గెలిస్తే మనిషి మానవుడు అవుతాడు. సైతాన్ గెలిస్తే మనిషి పొలిటికల్ మాఫియా అవుతాడు. ఇది ఎవరో పుణ్యాత్ముడు ఇచ్చే శాపం వలనే జరగాలని లేదు. మనిషి మనసులో సాత్వికాంశ పలచ బడే కొద్దీ సైతాను తనకు తానుగా విజృంభిస్తుంటాడని ఫ్రాయిడ్ సిద్ధాంతం. “నాది దుందుడుకు స్వభావం. కోపం వస్తే కొడతాను. తప్పేంటి?” అని ఒక నేత బహిరంగంగా అన్నాడంటే, పాపాలకు శాపాలు కారణం కాదనీ, అవి భస్మాసుర వరాలేననీ అర్ధం అవుతుంది.

వెనకటికి ఒక బామ్మగారు “నీ ఇంట కోడి కాల్చా” అని శపిస్తే, శుభం అన్నాడట పక్కింటాయన రొట్టలేస్తూ! ఈ రోజుల్లో బ్రహ్మదత్తుడు వచ్చి దుర్మార్గం చేసిన వాణ్ణి ‘బ్రహ్మ రాక్షసుడివైపో’ అని శపిస్తే, వెంటనే సదరు దుర్మార్గుల వారు ముని గారికి ఆజన్మాంతం ఋణపడి ఉంటా నంటాడు. జన్మజన్మలకూ రాక్షసుడిలాగే ఉండనివ్వాలని, శాప విమోచనం వద్దనీ అంటాడు.

Drive the Devi out-నీలో సైతాన్ తరిమేయ్’ అనేది పాత పాట! “Keep the Devil in-నీలో సైతాన్ని దాచేయ్-దోచేయ్అనేది నేటి మేటి నీతి.


Tuesday 1 December 2015

Self-publications and Authorpreneurs Dr. G. V. Purnachand, B.A.M.S

Telugu Books
Self-publications and Authorpreneurs
Dr. G. V. Purnachand, B.A.M.S
Author, Critic and Researcher

“In the Telugu country an author has generally to be his own publisher and bookseller” said Gurajada Apparao, the pioneer of Telugu vernacular writings, more than a century ago. The situation of book publishing and book selling by writers is hardly finding a difference till date.
 Self-publications and Authorpreneurs are more in Telugu Language for the reason that Book Publishers are not equipped to get them published. No Publisher is happy today due to the weak book market and is not in a position to help writers.
Writers out of their zeal and eagerness write books and usually spend money for printing and publishing them. It is sad that some are even selling properties to publish their books.
After printing a book, the ‘Author publisher’ further spends money for the book inauguration Function. Guests extend felicitations to the gratification of the writer. The writer dole out the copies free of cost to friends who never open a page of the book.
Choosing the book seller or distributor, getting back money for sold copies and taking return of the unsold copies ... all are extraordinary Tasks for author publishers. Getting Number for the book, obtaining `library purchase orders’ and finally receiving the payments… all are possible for the persons who can spare time and Money.
Disliking this awkward state of affairs, most talented Telugu writers are shutting down their pens. Every writer is facing the deficiency of out letting their writings.
Most of the Publishers are preferring subjects like personality development, popular medicine, vastu, yotisham and vedantam. Creative writings like stories, novels, criticism, social problems and people oriented books are usually rejected by the publishers.
While creative writings are discouraged or disappointed, how one can expect Jnanapeeth or Noble prize for Telugu Language. Kannada and Malayalam are mostly benefitted since high honor and encouragement extended to the writers in those states.
Lacking professionalism
There is one mistaken belief among most publishers that books of literary standard are not reader friendly. Usually, the publishers or book sellers unwillingly refuse to publish or to sell such books. Most of the literary works faces instant denial with a comment “who will purchase such useless Books”.
One must learn the fact that many Sahitya Akademi award winning Telugu Books were author published. It may not be true that all books published by publishers are commercial without standards and all books that are self-published are qualitative one. Yet, the content in self-published books retain more creative talent. If properly marketed, self-published books attract more readers. 
Book Publication is a profession for the publisher, whereas writing of books and selling of books is not profession for writers. Professional Telugu book Writers are few in Telugu. It is the reason, writing has become a non-committed hobby in turn cause low quality writings. At the same time true qualitative works generally face refusals by publishers.
Writers by and large have a fascination to publish all whatsoever they write. Few writers are approaching seniors or resource persons for editing and corrections of their writings. Most of the Telugu Publishers are also not appointing book editors before commencing publication of a book. Ultimately erroneous, invalid and inaccurate works are dumped into the book market, which leads to lack of concern among the people.
Lack of professionalism in the book publication field lead to compromise with quality in the content.
Failure in creating book markets
The quantity of Published books is in reverse proportion with the number of readers. Reduced readership is a bad symptom of social disorder.  
Publishers have become helpless in creating positive book markets. Most of the books got published are unfamiliar to the public. So many habituated readers do not know that books of their liking are published and available in the market. Selling outlets are not maintaining marketing strategy. At times Indifferent and uncaring attitudes of certain book sellers in promoting the sales are also responsible for the death of so many valuable books.
Publishers with innovative Marketable Ideas can do miracles. Had the Publisher maintain a good rapport with writer as well as reader he could win the race and produce quality. Unfortunately, there is no demand from publishers’ side for reader oriented books. The writer is compelled to publish it at his own cost. It is the depressing fact that a self-published book scarcely reach the targeted reader. The reason is obvious, he is not a trained book-seller.
 “Is my book idea what a publisher wants?” is a big question for a writer. “Is this book idea what a reader wants?” is the predicament of a publisher. Writers who possess authorpreneurship get more recognition and publicity. His books are sold as hot cakes. The credit goes to the intellectuality of that particular writer, but not the publisher.
A survey for viable, marketable books was not completed. What reader really wants is a big question. Everyone tells his own version about the readers` pulse. The book purchasing readers are also not happy with the stuff in the books dumped in the market.
A composite effort of the Associations of both the Writers and Publishers to make a survey on readers` requirements and their purchasing abilities. This may help the publishers and writers as well, to understand which idea is a breaking one for marketing.
During the earlier days, publishers used to print a minimum no. of 3,000 copies and could sell them within a year of span. Today the publisher is not daring to publish even 500 copies as there is no assurance that he can sell them within 3 years.
Most of the rupees spent on self-publications have become a national waste. It is all due to lack of understanding in the Makings of a Traditional Publishing Deal. The market analysis must indicate the potentiality for great reader interest and large sales.
The Last Decade is a decadent one as far as book publications concerned. The Governments regardless of political parties must be blamed first for their inaction in saving the Library movement. No proper funding for libraries is given, no proper fitting authority is assigned or appointed and no proper method is applied to purchase books. The fate of the Telugu Literature has become an unclaimed child.
E marketing of books
E marketing is the best way of reaching the readers globally. Amazon.com, Kinige.com and so many E-sellers are selling Telugu books and e-books also. The writer shall be familiar with the Internet and Social Media in order to make use of these sources.
Print should be the secondary focus. Face Book, Twitter, Blog and other social media helps the writer to publish his writings. More likes and more page views prove the caliber of the content of the book. Self-e book publication gets more name and money than a print book if properly placed in the Social Media. E-Book is eco-friendly also.
E book marketing is not a smaller one. E books can reach the areas where the print books can never reach. 
Here is my personal example. I asked my blogger to show my page views by clicking `now’ button in the `stats’ option. I find the following viewers from various Countries are reading my pages in my Blog by that particular Time.
Entry                                 Page views
India                                   303
United States                      145
Saudi Arabia                      9
Taiwan                               9
United Kingdom               8
Indonesia                           7
Qatar                                  5
Singapore                           5
United Arab Emirates       4
     This table proves that social media is more reader friendly. The longwinded social media help bringing instant reputation, recognition and also money to the writer. This view need not support the opinion that printing of books is a waste of time and Money. Any app. in the internet can never replace the book.
A printed book is eternal.