Thursday, 29 January 2015

3rd world Telugu Writers Conference-vijayawada- latest information

ఆహ్వానం
కృష్ణాజిల్లా రచయితల సంఘం
ప్రపంచ తెలుగు రచయితల సంఘం
ఆధ్వర్యంలో

3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

2015 ఫిబ్రవరి, 21, 22 శని, ఆది వారాలలో
శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, యన్టీఆర్ సర్కిల్, పటమట
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సభాప్రాంగణంలో

శ్రీ మండలి బుద్ధప్రసాద్
గౌరవాధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
కార్యనిర్వాహక అధ్యక్షులు
సభ్యులు, కేంద్ర హిందీ సంఘం, భారత ప్రభుత్వం

శ్రీ గుత్తికొండ సుబ్బారావు
అధ్యక్షులు
guttikondasubbarao@gmail.com
9440167697

డా. జి వి పూర్ణచందు
ప్రధాన కార్యదర్శి
purnachandgv@gmail.com
9440172642

రానున్న కాలంలో తెలుగుభాష మనుగడపై దృష్టి సారిస్తూ...
ప్రపంచ తెలుగు రచయితల 3 మహాసభలు
తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సాంకేతిక రంగాలలో రేపటి అవసరాలు, రేపటి మనుగడ, రేపటి స్థితిగతులు దృష్టిలో పెట్టుకుని, ప్రాంతాల కతీతంగా తెలుగు రచయిత లందరినీ సమావేశపరిచే లక్ష్యంతో ఒక వేదికపైకి చేర్చే లక్ష్యంతో 2015 ఫిబ్రవరి 21, 22 తేదీలలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, యన్టీఆర్ సర్కిల్, పటమట, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సభాప్రాంగణంలో ప్రపంచ తెలుగు రచయితల 3 మహాసభలు జరుగుతున్నాయి.
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 2007లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలుగు ప్రజలలో భాషాచైతన్యాన్ని కలిగించటానికి తోడ్పడగా, 2011లో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు సమాచార సాంకేతిక రంగంలో తెలుగు వినియోగానికి ప్రభుత్వ పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవటానికి తోడ్పడ్డాయి. దేశ, విదేశాల నుండి ఎందరో ప్రముఖులు మహాసభలలో పాల్గొన్నారు.
2013 సెప్టెంబరులో జరపతలపెట్టిన 3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఆనాడు నెలకొన్న రాష్ట్ర విభజన పరిస్థితుల రీత్యా వాయిదాపడిన సంగతి తమకు తెలుసు. మహాసభలను తిరిగి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని, 2015 ఫిబ్రవరి, 21, 22 తేదీలలో నిర్వహించాలని సంకల్పించాం.
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా వేలాదిమంది రచయితలు మహాసభల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో మహాసభల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని సాహితీ ప్రముఖులు, పాత్రికేయ ప్రముఖులు ఎందరో మహాసభలు ఒక తక్షణావసరంగా భావిస్తున్నారు. నిజానికి, సభానిర్వహణ, వనరుల సమీకరణ అనుకూలంగా లేనప్పటికీ, కార్యక్రమ నిర్వహణలకు శక్తికి మించి నడుం బిగుస్తున్నామని సవినయంగా మనవి చేస్తున్నాం. అందరినీ సహకరించ వలసిందిగా విఙ్ఞప్తి చేస్తున్నాం.
నవ్యాంధ్రప్రదేశ్లో జరుగుతున్న తొలి భారీ సాహిత్య కార్యక్రమం ఇది. ప్రాంతాల కతీతంగా ప్రపంచంలో ఎల్లెడలా విస్తరించి, ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న తెలుగు భాషాభిమానులకూ, సాహితీమూర్తులందరికీ స్వాగతం పలుకుతున్నాం. అనుకూలంగా స్పందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
మహాసభలలో...
తొలి భాషాప్రయుక్త రాష్ట్ర విభజన జరిగిన దరిమిలా తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించేలా నూతన విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి...
అనేక రాష్ట్రాలలో అధికారభాషగా ఉన్న హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలనే తెలుగుభాష విషయంలోనూ అనుసరింప చేయటానికి అవకాశాల గురించి...
తమిళనాడు, ఒడీసా, కర్ణాటక, బెంగాల్ తదితర రాష్ట్రాల్లోనూ, బ్రిటిష్లైబ్రరీ మరియూ ఇతర విదేశీ గ్రంథాలయాల్లోనూ
ఉన్న తెలుగు ప్రాచీన గ్రంథాల నకళ్ళను తెచ్చుకునే విషయమై ప్రభుత్వాల పరంగా చేపట్టవలసిన చర్యల గురించి....
ప్రముఖ తెలుగు రచయితల అద్భుత సాహిత్యాన్నీ, వారి జీవిత చరిత్రల్నీ జాతీయ భాషల్లోకి, మరియూ ఇంగ్లీషులోకీ అనువదింప చేయటం ద్వారా దేశ విదేశాల్లోని తెలుగు ప్రముఖుల కృషికి గుర్తింపు తీసుకు రావటం గురించి...
రేపటి అవసరాల ప్రాతిపదికగా తెలుగు భాషాబోధన, తెలుగు మాధ్యమంలో పాఠ్యాంశాల రూపకల్పన, సమాచార సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, యూనికోడ్, పదకోశాల అభివృద్ధి, తెలుగు చదువుకునే విద్యార్థులు, అధ్యాపకుల పట్ల వివక్ష పూరిత విధానాలు, ఎన్నాళ్ళనుండో పదేపదే కోరుతున్నా ఆచరణకు నోచుకోని అనేక అంశాలపై కేంద్రం మరియూ మన రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళ వలసిన అంశాల గురించి...
తెలుగు భాషకు క్లాసికల్ ప్రతిపత్తి లభించిన దరిమిలా పరిణామాలను పరిశీలించి, తెలుగు భాషా పరిశోధనల కోసం చేపట్ట వలసిన చర్యల గురించి...
తమిళనాడు, ఒడీసా, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటంలో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలుగు నేర్చుకోవటానికి కావలసిన పుస్తకాలు ఇతర ఉపకరణాల అందజేత, భాషాపరంగా అక్కడి సమస్యల గురించి...ఇంకా ఇతర సాహిత్యపరమైన అంశాల గురించి చర్చలు జరుగుతాయి. భాషోద్యమ స్ఫూర్తితో పాల్గొనవలసిందిగా అందరికీ ఆహ్వానం
కార్యక్రమం
1. జాతీయ తెలుగు ప్రముఖులు, వివిథ భాషల్లో ఙ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, ప్రసిద్ధ సాహితీవేత్తలు, పాత్రికేయ ప్రముఖులు,    సినీరంగ ముఖ్యులు ఇంకా అనేక మందిని మహాసభలకు ఆహ్వానిస్తున్నాము.
2. భువనవిజయం, ఆశుకవితా విన్యాసం, కవిసమ్మేళనాలు, అవధానం, ఇతర సాహిత్య కార్యక్రమాలు ఉంటాయి.
3. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలసందర్భంగా ‘3 తెలుగు భారతిప్రత్యేక పరిశోధనా గ్రంథం మరియుతెలుగు యువతమహాసభల ప్రత్యేక సంచిక విడుదల అవుతాయి.
4. సభావేదిక పైన వీలైన సమయంలో రచయితలు తమ రచనలను ఆవిష్కరింప చేసుకునే అవకాశం ఉంటుంది.
5. పూర్తి కార్యక్రమ వివరాలు సభాస్థలి వద్ద రిజిస్ట్రేషన్ సమయంలో అందజేయబడతాయి.
ప్రతినిథులకు సూచనలు
‘3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకోసం రూ. ౩౦౦/- చొప్పున చెల్లించి ఇప్పటికే షుమారు 1500 మంది ప్రతినిథులుగా నమోదయ్యారు. ఇది మహాసభల పట్ల దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులకూ, సాహితీపరులకూ గల అభిమానాన్ని చాటుతోంది.
మహాసభలు వాయిదా పడటానికి ముందే నమోదైన ప్రతినిధులు ఇప్పుడు ఎలాంటి రుసుమూ చెల్లించ నవసరం లేదు. ప్రతినిధులు ముందుగా వచ్చి రసీదు, గుర్తింపు కార్డులను చూపించి ఉపాహారాలు, భోజనాలు, మహాసభల ఙ్ఞాపిక, మహాసభలలో పాల్గొన్నట్టు ధృవీకరణ పత్రమూ మరియూ తెలుగు యువత ప్రత్యేక సంచిక కోసం కూపన్లను తీసుకో వలసిందిగా కోర్తున్నాం!
వసతి ఏర్పాట్లు ఎవరికి వారే చేసుకోవలసి ఉంటుంది. విజయవాడలో సభాస్థలికి దగ్గరగా ఉన్న హోటళ్ల టెలిఫోన్ నెంబర్ల పట్టికను జతచేస్తున్నాం. విజయవాడ బస్స్టేషన్, మరియు రైల్వేస్టేషన్నుండి సిటీబస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. బందరు రోడ్డు మీదుగా వెళ్ళే బస్సులు ఎక్కవచ్చు
గత అనుభవాల రీత్యా అప్పటికప్పుడు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని, ఙ్ఞాపికలు కావాలనీ, ఇతర సౌకర్యాలు
కావాలని నిర్వాహకులపైన వత్తిడి చేయవద్దని ప్రార్థిస్తున్నాము.
మరిన్ని వివరాలకోసం:
గుత్తికొండ సుబ్బారావు : 9440167697,
డా. జి వి పూర్ణచందు: 9440172642
శ్రీ గోళ్ళనారాయణరావు; 9246476677
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సుందరి: 9440174797
శ్రీ టి శోభనాద్రి: 9440524305
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ 9989066315
శ్రీ చింతపల్లి వెంకటనారాయణ 9441091692
డా. గుమ్మా సాంబశివరావు: 9849265025
డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్: 9440346287
డా. వెన్నా వల్లభరావు: 9490337978
శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి: 9885628572
శ్రీ తూములూరి రాజేంద్రప్రసాద్: 9490332323
శ్రీ గాజుల సత్యనారాయణ: 9848687652
శ్రీ చలపాక ప్రకాశ్: 9247475975
కరెడ్ల సుశీల 9440330500
శ్రీ కె. వి ఎల్ ఎన్ శర్మ: 9963668247
డా. గుడిసేవ విష్ణుప్రసాద్ 9441149608
శ్రీ విడియాల చక్రవర్తి: 9440139025
శ్రీ శిఖా ఆకాశ్ 9298901571
శ్రీ రఘునందన్ 9440848924
శ్రీమతి పి నాగలక్ష్మి 9849454660
శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి 9395379582
డా. ఘంటా విజయకుమార్ 9948460199
శ్రీ మహమ్మద్ శిలార్: 9985564946
శ్రీ జి. వి రాములు: 9848622521
శ్రీ ఎస్ వి రత్నారావు 9441305468
శ్రీ జె వి సాయిరాం ప్రసాద్: 9490742807
శ్రీమతి కోకా విమలకుమారి: 9885676531
డా. రెజీనా 0866-2470522

శ్రీమతి కావూరి సత్యవతి. 9912340962