Wednesday 25 March 2020

అమ్మభాషకు అందలం కోసమే ఉగాది! డా!! జి. వి. పూర్ణచందు

ప్రపంచంలో తెలుగు భాషకు మాత్రమే దేవుడున్నాడు. ఆయన ఆంధ్రమహావిష్ణువు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో కొలువై ఉన్నాడు. “నేను తెలుగు వల్లభుణ్ణి, నాది తెలుగు నేల. నా తెలుగు తియ్యనిది. దేశభాష లన్నింటిలో కెల్లా తెలుగే గొప్పది” అని స్వయంగా ఆంధ్రమహావిష్ణువే కలలో కనిపించి తనతో చెప్పాడని, అనేక భాషల ప్రముఖులతో మాట్లాడుతుంటావు కదా...ఈ మాత్రం నీకు తెలీదా? అని అడిగాడనీ, కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద ప్రబంధ కావ్యానికి ముందు మాటల్లో వ్రాసుకున్నాడు.
ఆమ్మభాష కోసం ఒక దేవుణ్ణి ప్రతిష్టించుకుని పూజించుకునే సంస్కృతి మనది. తెలుగు తల్లికి ఉగాది సారెనీ, ఆంధ్రమహావిష్ణువుకు పంచెల చాపును పెట్టి కట్టుకుని, ఆరు రుచుల ప్రసాదాన్ని అందరికీ పంచి, మంచి భవిష్యత్తు చెప్పుకుని, కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సంకల్పించుకునే సంస్కారం ఉగాది పండుగ మనకందిస్తోంది.
తెలుగు భాషాసంస్కృతుల మీద పరదాడులు ఎన్నో జరిగినా, ప్రాచీన మూలాలు కలిగిన ఈ భాష, ఈ సంస్కృతి చెక్కు చెదర కుండా ఇన్ని యుగాలుగా నిలిచి ఉన్నాయి. కాగా, ప్రస్తుత కాలంలో ప్రజలెన్నుకున్న పాలకులే నేరుగా తెలుగు భాషా సంస్కృతుల పైన దాడికి పూనుకుంటున్న నేపథ్యంలో ఈ 2020 ఉగాది విశేష ప్రాధాన్యతసంతరించుకుంది. అమ్మభాష పరిరక్షణ కోసం ఆ తెలుగుతల్లి, ఆంధ్రమహావిష్ణువులే మనకు అండగా ఉంటారని ఈ ఉగాది భరోసా ఇస్తోంది
నిజానికి 1990 నుండీ, “లక్ష్యం (విజన్)2020” అని గత ప్రభుత్వాలు భవిష్యత్తు మీద నమ్మకం ప్రేరేపించి, మనలో ఉత్సాహం నింపుతూ రాగా, సరిగ్గా 2020 ఉగాది నాటికి భాష, సంస్కృతి రెండూ కునారిల్లే పరిస్థితి రావటం విచిత్రం.
ఒక కొత్త ఆలోచనకు, కొత్త ఆచరణకు, కొత్త లక్ష్యానికీ, కొత్త యుగానికీ ఆరంభం కాబట్టి, ఈ పండుగను సంవత్సరాది, యుగాది, ఉగాది అంటున్నాం. కొత్త ఏడాది రోజున పంచాంగానికి దణ్ణం పెట్టి ప్రసాదం తీసుకునే పద్ధతి మనది. కొత్తదేదో వస్తోందనే యావకొద్దీ పాతని వదిలేసి కొత్తదాని కోసం ఆబగా అర్రులు చాచటం పాశ్చాత్య విధానంలో జనవరి ఒకటి పండుగని జరుపుతారు. “నిన్న పండిన పంటనే నేడు వండుకుంటున్నాం” అనే స్పృహ మనది కాగా, “నిన్న మనది కాదు, రేపు మనకు రాదు, నేడే సుఖం...” ధోరణి జనవరి ఒకటి పండుగలో కనిపిస్తుంది.
దేశీయత, జాతీయతలు ఉగాది పండుగకు శోభస్కరాలు. వాటిని రద్దుచేయగలగటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే, వాటి మూలాలు అతి ప్రాచీనమైనవి కాబట్టి!
దేశదేశాల్లో సంవత్సరాదులు
క్రీస్తుపూర్వం అనేక వందల యేళ్ళకు ముందే అనేక జాతులలో సంవత్సరాదులు వాడకంలో ఉన్నాయి. జనవరి 1 అనేది అన్నింటి కన్నా ఆఖర్న వచ్చిన పండుగ. వెనకొచ్చిన కొమ్ములు వాడికదా!
జనుస్ అనే రోమన్ దేవత పేరున జనవరి నెల ఏర్పడింది, రోమన్ చక్రవర్తి జులియస్ సీజర్ క్రీ. శ. 45లో తన పేరున జులియన్ క్యాలెండర్ ఏర్పరచి, జనవరి 1ని రోమన్లకు నూతన సంవత్సరంగా ప్రకటించాడు. సృష్టి ప్రారంభకుడు, జనకుడుగా జనుస్ దేవత (god of gateways and beginnings) రోమన్లకు ఆరాధనీయుడు. ద్వారమే ఒక దేవత వారికి. కాన్‘స్టన్‘టైన్ చక్రవర్తి రోములో క్రైస్తవాన్ని ప్రవేశపెట్టిన తరువాత, జనవరి ఒకటిని క్రైస్తవులంతా గుర్తించి ఆచరించటం ప్రారంభించారు. అంతకు పూర్వం రోమన్లు మార్చి 1 నూతన సంవత్సరంగా జరుపుకునేవారు.
భారతీయులతో పాటు, జ్యోతిష, ఖగోళ పరిఙ్ఞానం ఉన్న ప్రాచీన గ్రీకులు, చైనీయులు, ఈజిప్షియన్లు, ఫినీషియన్లు, పర్షియన్లు వీళ్లందరికీ తమతమ క్యాలెండర్ల ప్రకారం తలా ఒక తేదీన సంవత్సరాదు లుండేవి. ప్రాచీన మెసపొటేమియన్లు (ప్రస్తుత ఇరాక్ ప్రాంతం) క్రీ.పూ. 2000 నాటికే సంవత్సరాది జరుపుకునే వాళ్లు. ప్రాచీన బాబిలోనియన్లకి మార్చి చివరిలో పౌర్ణమినాడు కొత్త సంవత్సరం. మనకి చైత్ర శుద్ధ పాడ్యమి (మార్చి28), ప్రాచీన అస్సీరియన్లకు ఖాబ్‘నిసాన్(ఏప్రియల్ 1), ప్రాచీన ఇరానీయులకు నౌరోజ్(మార్చి 20), ప్రాచీన థాయ్ దేశీయులకు సంగ్’క్రాన్ (ఏప్రియల్ 13), ఇజ్రాయేలీయులకు రోష్ హషనా (సెప్టెంబర్-అక్టోబర్) జరుపుతారు. జెర్మన్లు spring rites of fertility అంటే పంటల పండుగని మార్చి 25న జరుపు తారు. కొరియన్ల సంవత్సరాది Seollal, బలి దీవుల వారికి Nyepi సింహళీయులకు Aluth Avurudda ఇలా ప్రాచీన జాతుల వారందరికీ ఎవరి ఉగాదులు వారికున్నాయి.
సౌదీ అరేబియాలో జనవరి 1 కి బదులు అట్టహాసంగా, సాంప్రదాయబద్ధంగా మార్చి 21న తమ స్వంత క్యాలెండరు ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారట. తమ భాషా సంస్కృతులను గౌరవించుకోవాలనే భావన ప్రజలలో కలిగించగలిగితే మనకూ అది సాధ్యమే!
స్కాటిష్ ఆచారం ప్రకారం, కొత్త సంవత్సరం రోజున ఆకస్మికంగా ఇంటికి వచ్చిన అతిథి తమ ఇంట్లో వేసే తొలి అడుగుని ఒక పవిత్రోత్సవంగా జరుపుకుని ఆ అతిథిని కానుకలతో గౌరవించుకుంటారు. స్కాటిష్ పదం Hogmanay అంటే, ‘ఏడాదిలో చివరి రోజుకు వీడ్కోలు, మొదటి రోజుకు స్వాగతం’ అని!
స్కాటీషియన్ల ద్వారా పాశ్చాత్యులందరికీ ఈ అలవాటు వ్యాపించి ఇప్పుడు అర్థరాత్రి 12 గంటల హడావిడి చేసే కార్యక్రమాలన్నీ భారతదేశానిక్కూడా పాకాయి. డిసెంబరు 31 అర్థరాత్రి స్కాట్లాండ్ ప్రజలు బంధుమిత్రులకు, పెద్దలకు కానుకలిచ్చి, పాదపూజచేసి గౌరవిస్తారు. అదే సమయంలో మనవాళ్లు మద్యపాన ఉన్మత్తతతో రోడ్లమీద నానాయాగీ చేస్తున్నారు.
భారత దేశంలో సంవత్సరాదులు
భారతదేశంలోనూ వివిధ క్యాలెండర్లు అమలులో ఉన్నాయి. ఎవరి పంచాంగాలు వాళ్ళవే! ఎవరి ఆచారాలు వాళ్లవే! కానీ, భారతదేశంలో ఏ రాష్ట్రం వారు సంవత్సరాది జరుపుకున్నా తమ భాషా సంస్కృతుల పరిరక్షణతో పాటు మానవ సంబంధాల కోసం అర్రులు చాచే పవిత్రోత్సవంగా జరగటం గమనార్హం.
ఉగాది: తెలుగువారు, కన్నడిగులు, మహారాష్ట్రులు కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు కొత్త యుగానికి ఆరంభంగా చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమిన ఉగాది (యుగాది) పండుగ జరుపుతారు. బ్రహ్మ దేవుని పూజిస్తారు. తెలుగు వారికి ఇది షడ్రుచుల పండుగ. ఆరు రుచులతో ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకుంటారు. ఉగాది నుండి శ్రీరామనవమి వరకూ రోజూ ఈ ఉగాది పచ్చడి తింటే రానున్న వేసవికి శరీరం తట్టుకో గలుగుతుందని ఆరు రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా మన పూర్వులు ఎంచుకున్నారు. ఆరు రుచులూ ఇందులో తగు పాళ్లలో ఉంటాయి కాబట్టి వాత, పిత్త కఫ దోషాలను ఇది సమస్థితికి తెస్తుంది. ప్రతీరోజూ ఇలా షడ్రసోపేతంగా ఆహారం ఉండాలనేది ఉగాది అంతస్సూత్రం
హోలీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచలప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంవత్సరాది పండుగను హోలీ అంటారు. ఇది వాళ్ళకు రంగుల పండుగ. పంటల పండుగ. సమభావం, సోదరబావాలతో కుల, మత, వర్గాల తేడా లేకుండా అందరూ వసంతం చిమ్ముకుంటూ, రంగులు చల్లుకుంటూ ధాన్యసంపద నిచ్చాడని, దేవుడికి ‘హోలా (ధన్యవాదాలు) చెప్పుకునే పండుగ!
గూఢీ పాడవా: మహరాష్ట్రీయులు సంవత్సరాదిని ‘గూఢీపడవా’ పండుగగా జరుపుకుంటారు. పొడవైన కర్రకు జరీ అంచు ఆకుపచ్చ లేదా పసుపు పచ్చని కొత్తచీర వ్రేలాడగట్టి, పైన చిన్న కలశాన్ని బోర్లిస్తారు. దాని మెడలో హారంలా వేపాకులు, మామిడాకులు, పంచదార చిలకల దండలు వేస్తారు. ఇది బ్రహ్మదేవుడి జెండా! ఇంటి సింహద్వారానికి కుడి వైపున ఆవరణలో దీన్ని నిలిపి, పూజిస్తారు. శాలివాహనులు శకుల్ని జయించినప్పుడు పైఠాన్లో ప్రజలు ఇళ్ళముందు దీన్ని నిలిపి స్వాగతం చెప్పారట. ఇది కూడా మన ఉగాది రోజునే వస్తుంది.
రొంగాలిబిహూ: ఇది అస్సామీ సంవత్సరాది! మాఘమాసంలో వస్తుందని ‘మాఘబిహూ’ అని కూడా అంటారు. ఏప్రిల్14-15 తేదీల్లో వచే ఈ పండుగ రోజున పశువుల్ని అలంకరిస్తారు. ‘పీఠా కేకు’ తయారు చేసి, అందరికీ్ పంచుకుంటారు.
పుత్థాండు (పుత్తాంటు): తమిళనాడు, అస్సాం, బెంగాల్, ఒరిస్సా, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల్లో సౌరమానం ప్రకారం మేష సంక్రాంతి మొదటి రోజు (ఏప్రియల్ 14)న ఒక దీపాన్ని వెలిగించటం ద్వారా సంవత్సరాదిని జరుపుకుంటారు.
విషు (బిసు): మళయాళీలు ‘మేదం’ మాసంలో (ఏప్రిల్ రెండోవారం) సంవత్సరాది జరుపుకుంటారు. దీపావళి పండుగలా దీపాలతో అలంకరించి సంబరంగా టపాసులు కాలుస్తారు.
చైరావోబా: ఇది మణిపురి సంవత్సరాది. ఉగాది రోజునే వస్తుంది. జానపదుల పండుగ ఇది.
నవ్‘రే: కాశ్మీరీ హిందువులు భాద్రపద మాసంలో జరుపుకునే సంవత్సరాది ఇది. వసంత నవరాత్రులు కూడా జరుపుతారు. కాశ్మీరీ శైవులకు అది శివరాత్రి కూడా!
మహా బిషుబ సంక్రాంతి: ఒరియా వారి సంవత్సరాది ఇది. రకరకాల పళ్ళు, పాలు, వెలగ పండు గుజ్జు, పెరుగు, బెల్లం కలిపిన ‘పానా’ పానీయంతో శివుడికి అభిషేకం చేస్తారు. హనమజ్జయంతి జరుపుతారు పశు పక్ష్యాదులకు, ఆత్మలకు దాహార్తి తీరటానికి వీధుల్లో నీళ్ళతొట్టెలు అమరుస్తారు. దీన్ని పానసంక్రాంతి, జలసంక్రాంతి అంటారందుకే!
బేస్తు‘వారాస్: విక్రమాదిత్య మానం ప్రకారం ఆషాఢ పూర్ణిమ నాడు గుజరాతీయులు జరుపుకునే సంవత్సరాది ఇది.
థప్న: రాజస్థానీ మార్వాడిల సంవత్సరాది ఇది. ఆ రోజున యఙ్ఞాలు, హోమాలు ఎక్కువగా జరుపుకుంటారు.
చేతి చాంద్: సింధ్రీల ఉగాది పండుగ ఇది. చేత్ అంటే చైత్రమాసంలో రెండవరోజు అంటే చంద్రుడు వచ్చే మొదటి రోజున ఈ ‘చేతీ చాంద్’ పండుగ జరుపుతారు. మన ఉగాది మర్నాడు సింద్రీల సంవత్సరాది వస్తుంది.
చైత్తి: హిమాచల్ ప్రదేశ్ సంవత్సరాదిని చైత్తి అంటారు. ఉగాది రోజునే చైత్ర శుద్ధ పాడ్యమిని వాళ్ళు కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుతారు.
వైశాఖి: నానక్ ‘శా-‘షాహి క్యాలెండర్ ప్రకారం పంజాబీల సంవత్సరాది. ఏప్రిల్ 13-14 తేదీల్లో వస్తుంది.
పోయిలా బోయిషక్: బెంగాలీ సంవత్సరాది. ఫిబ్రవరి 13-14 తేదీల్లో వస్తుంది. “శుభోనొబోబోర్షో” అంటూ శుభకామనలు చెప్పుకుంటారు.
పహ్లీవైశాఖ్: మైథిలీ/నేపాలీ భాష మాట్లాడే ప్రజల సంవత్సరాది ఇది. నిరయన మేష సంక్రాంతి అనీ పిలుస్తారు. మిథిలా రాజ్య జెండా గుర్తుగా హనుమంత్ ధ్వజదానం జరుపుతారు. హిమవంతుడి జన్మదినంగా దీన్ని జరుపుతారు.
ఇవన్నీపరిశీలించినప్పుడు, దేశవ్యాప్తంగాజరిగేసంవత్సరాది పండుగలన్నీదేశీయతను, జాతీయతను, సంస్కృతినీ నిలబెట్టుకోవాలనే తపనతో జరుగుతున్న వైనాన్ని మనం గమనించ వచ్చు. సంస్కృతి ప్రధానం. అది మన సంస్కారానికి ప్రతీక!
తేదీ ఏదయినా సంవత్సరాది రోజు జనసందోహం ఐకమత్యంగా, భాషా సంస్కృతులపట్ల భక్తి గౌరవాలను ప్రదర్శిస్తో జరుపుకునే ఈ పండుగల్లోని స్ఫూర్తిని మనం అందుకో గలగాలి.
ముఖ్యంగా తెలుగువారి ఉగాది ఊరుమ్మడి పండుగ. ఆ రోజున అందరూ కలిసి మేథోపరమైన అంశాలు పంచుకుంటారు. కవులు కవితాగానం చేస్తారు. గాయకులు, నర్తకులు, ఐంద్రజాలికులు తమ విద్యలు ప్రదర్శిస్తారు. పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ఎండలు, వానలు, వరదల రాకపోకల గురించి, ప్రపంచ పోకడల గురించి ఆకళింపు కలిగిస్తుందని పంచాంగాన్ని పూజిస్తారు. రాశిఫలాలు తెలుసు కోవటం ద్వారా తమ బతుకు బండిని ఎలా నడుపుకోవాలో ఒక ఆలోచన చేస్తారు. భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఎండలు, వానలు, గ్రహణాలు, ద్వాదశరాశుల గమనాల గురించి ఎన్నో యేళ్లు ముందుగానే లెక్కగట్టి చెప్పగల పంచాంగ కర్తలకు మతమౌఢ్యాన్ని అంటగట్టి కొందరు గేలిచేస్తుంటారు. కానీ, ముఖ్యంగా రైతులకు వానలు, వరదలు, వాతావరణ పరిస్థితులు పంటల ధరవరల గురించి, ఏడాది కాలానికి సరిపడా ఎంతో ముందుగానే వివరించే ప్రయత్నం హేతువాదులు గానీ, శాస్త్రవేత్తలుగానీ చేయకుండా పంచాంగకర్తల్ని తూలనాడుతూ కాలక్షేపం చేస్తున్నారని ప్రజల భావన.
ఇతరుల సంవత్సరాదులకు హోలిక దహనం, రావణాసురుడి మరణం లాంటి పురాగాథలు కొంత తోడుగా కనిపిస్తాయి, కానీ, తెలుగు ఉగాది కేవలం తెలుగు భాషకు సంబంధించిన పండుగ. అనుక్షణం అమ్మభాషను కాపాడు కోవాలని ఒక నిశ్చయాన్ని మనలో కలిగించే పండుగ. ఆరోజున భాష కోసం మనం ఏ కొంచెం చేసినా గొప్ప విషయమే!
(ఈ నెల భక్తి మాసపత్రికలో ప్రచురితం)