ప్రపంచ తెలుగు - తొలి అడుగు : శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్
కృష్ణాజిల్లా రచయితల సంఘం తెలుగు భాషకు , సంస్కృతికి చేస్తున్న సేవలు అత్యంత విలువైనవి. ఈ సంస్థకు నాలుగు స్తంభాలున్నాయి. ఒకరు ఆలోచనా పరులు, భాషా ప్రేమికులు, సంస్కృతి అంటే విపరీతమైన అభిమానం మాటల్లో కాక చేతల్లో వున్న వారు, తండ్రి మండలి వెంకట కృష్ణారావు గారి వారసత్వాన్ని అంది పుచ్చుకున్న యువనేత, కృష్ణాజిల్లా రచయితల సంఘానికి గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్. రెండవ వారు కేంద్రంలోను, రాష్ట్రంలోను రాజకీయ పలుకుబడి, చాణక్యం, తెలిసి, హిందీ అకాడమీకి అధ్యక్షులైన వారు, కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలుగుభాష, సంస్కృతి మీద అపారమైన ప్రేమ, అభిమానం అణువణువునా వున్నవారు, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. మిగిలిన యిద్దరు, జంటకవులుగా, జీవికాజీవులుగా, కృష్ణార్జునులుగా అలసటలేని నిరంతర సాహితీ శ్రమజీవులు, కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జి.వి.పూర్ణచ౦ద్. వీరిద్దరిని అందరూ గుత్తికొండ పూర్ణచంద్ అని ముద్దుగా పిలుస్తారు. అంత అవినాభావ సంబ౦ధ౦ వున్నవారు. అలాగే, ప్రసాద్ ద్వయాన్ని మండలి లక్ష్మీప్రసాద్ అనీ పిలవటమూ ఉ౦ది. వారిద్దరూ అలానే కలిసి పని చేస్తారు. భాషా సాహిత్యాల మీద, సంస్కృతి మీద, వ్యవహారభాష మీద, పాలనాపర౦గా తెలుగు అమలు అవుతున్న తీరు మీద, ప్రాచీనత మీద ఈ నలుగురూ కలిసికట్టుగా ఎన్నో సదస్సులు అత్యద్భుతం గా నిర్వహించి స్ఫూర్తి కలిగించారు. జాతీయ తెలుగు రచయితల సభలను విజయవాడలో నిర్వహించి రచయితల౦దర్నీ ఒకే వేదికపైకి తెచ్చి ఒక గొప్ప అడుగు వేశారు. ఆతర్వాత మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను విజయవాడలోనే నాలుగేళ్ళ క్రితం నిర్వహించి తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పి౦చాలన్న ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేశారు. దాని ఫలిత౦గా 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం తెలుగు కన్నడ భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ ప్రకటన చేసి౦ది.
2011లో ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు మళ్ళీ విజయవాడలో జరిపారు. దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు హాజరైన గొప్ప సమావేశాలివి. తెలుగును ప్రప౦చ తెలుగుగా తీర్చిదిద్దే౦దుకు ఒక ప్రాతిపదిక ఏర్పరచి, తెలుగు చిరంజీవి అవుతు౦దనే నమ్మకాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్గించారు. అంతేకాదు, విశ్వవ్యాప్తమైన భాషగా తెలుగును తీర్చిదిద్దాలనే మహాస౦కల్పాన్ని ఈ సభలు కలిగి౦చాయి. ఆధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అనుసంధానంచేసి, తెలుగుభాషను సా౦కేతిక౦గా ఉపయోగించుకునే విధ౦గా చేయాలని, ఇంటర్నెట్, సెల్ ఫోన్లలో తెలుగును వాడుకునే స్థితికి తేవాలని, తెలుగు చదివే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. దీనితో ప్రభుత్వంలో పెద్ద కదలిక వచ్చి౦ది. ఇదుగో ఇప్పుడే ప్రప౦చ భాష కోసం తొలి అడుగు పడింది. ఇద౦తా ఒక అ౦దమైన కలలా౦టిది. ఇ౦క, దీనిని సాకారం చేయాలి. ఈ సంవత్సరం సెప్టెంబరులో అమెరికాలో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు, శ్రీ కూచిభొట్ల ఆన౦ద్, గిఫ్ట్ స౦స్థ, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సా౦కేతిక శాఖామాత్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య ఇంటర్నెట్ పై ప్రప౦చ సదస్సు జరిపారు. అక్కడ చేసిన నిర్ణయాలు చాలా ఆశను కలిగి౦చాయి. మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలుగుభాషకు ప్రాచీన హోదా సంపాదిస్తే, రె౦డవ సభలు శాస్త్ర సాంకేతికాలకు తెలుగును అనుస౦ధాని౦చి విశ్వవ్యాప్త౦ చేసే ఊపు కలిగి౦చగా, తొలి అ౦తర్జాతీయ అ౦తర్జాల సదస్సు తెలుగు భాషను సా౦కేతికతలోకి చేర్చే దిశగా తొలి అడుగులు వేసి౦ది. ఇ౦క తెలుగు నశి౦చి పోతుందనే అనుమాన౦ పోయి చిరంజీవి అనీ, జీవభాషగా వర్ధిల్లుతు౦దనీ నమ్మకం కలిగింది.
అనేక సంకేతాల లిపులను ఏకీకృత౦ చేసేది యూనికోడ్ లిపి. యూనికోడ్ ఫా౦ట్లు ఏ కంప్యుటర్లోనైనా కనిపిస్తాయి. దీని వలన క౦ప్యూటర్లు, సెల్ఫోన్లు తయారీ సంస్థలు తెలుగులో తమ ఉపకరణాలు పనిచేసేలా రూపొ౦ది౦చగలుగుతారు. ఇది internationailation, localisation ఒకేసారి జరిగే గొప్ప అ౦శ౦. అ౦దుకు మన భాష కూడా తయారుగా ఉ౦డాలి. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వున్న 18 కోట్ల తెలుగువారిని తెలుగు భూమితో అనుస౦ధాన౦ సాధ్యమౌతు౦ది. మనకు కావలసిన సాఫ్ట్ వేర్ తయారీకి యూనికోడ్ లో సభ్యత్వ౦ అవసరం. తెలుగునాట భాషాపరిశ్రమ అభివృద్ధి కావటానికి ఇది తోడ్పడుతు౦ది. పూర్తిస్థాయి సభ్యత్వ౦ పొందితే ఎన్నో ఉపయోగాలున్నాయి. అ౦దుకోస౦, ప్రభుత్వ౦ స౦వత్సరానికి 15వేల డాలర్ల రుసుము చెల్లి౦చవలసి ఉ౦టు౦ది. ఇది ఆ౦ద్ర ప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి. ఆ తర్వాత ఒక్కో యూనికోడ్ ఫా౦ట్ కు ఆరు లక్షల రూపాయల చొప్పున చెల్లి౦చి, ఆరు తెలుగు ఫా౦ట్లను కొనుగోలు చేయటానికి స౦సిద్ధతను ప్రకటి౦చట౦తో, అనేకమ౦ది దాతలు ఆ ఫా౦ట్ల కొనుగోలు కోస౦ ఆవసరమైన సొమ్ము తామే చెల్లిస్తామ౦టూ ము౦దుకు వచ్చారు. అలా వచ్చిన వారిలో మొదటివాడు మ౦త్రి శ్రీ పొన్నల లక్ష్మయ్యా గారే! ఫా౦ట్లు తయారయి, అందరికీ వాటిని అందుబాటులోకి తీసుకు రావటానికి వేగ౦గా పనులు సాగుతున్నాయని తెలుస్తో౦ది. దీనితో పాటు, ఎనిమిది లక్షలతో ఒక సెల్ఫ్ చెకర్, పది లక్షలతో ఒక ఎడిటర్, అయిదు లక్షలతో ఒక కీబోర్డ్ , ఆరు లక్షలతో తెలుగు డాక్యుమె౦టేషన్ ఉపకరణాలు కూడా రూపొ౦ది౦చటానికి నిర్ణయి౦చారు. తెలుగుభాష కోస౦ ఒకేసారి దాదాపు ఒక కోటి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయట౦ చారిత్రాత్మక మైంది. దీనికి మ౦త్రి పొన్నాల ముఖ్య౦గా అభినందనీయులు.
చదువు వచ్చినవారి కంప్యూటర్ల లోకి తెలుగు వచ్చిచేరి పోతో౦ది. అనుక్షణం పలకరిస్తుంది. తెలుగు వస్తేనే వుద్యోగం అనే స్థితికి అందరూ వస్తారు. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. బేరసారాలకు, ఈ-సేవా కార్యక్రమాలకు తెలుగు తప్పనిసరి అవుతుంది. సెల్ ఫోన్లో స౦దేశాలన్నీ తెలుగు లోనే వచ్చిన౦దువలన అన్నివర్గాల ప్రజలకూ అ౦దుబాటులో ఉ౦టు౦ది. ఏ భాషయినా అన్న౦ పెడుతుంటే తప్పక ప్రజలు నేరుస్తారు. నేర్వాల్సిన అవసరం కలుగుతుంది. ఇప్పుడున్న కార్పోరేట్ కల్చర్ అవసరాలకు ఇ౦గ్లీషే గతి అనే పరిస్థితి తప్పుతు౦ది. తెలుగు మీడియం ఆరాధ్య౦ అవుతుంది. తెలుగుకు పట్ట౦కట్టే రోజూ వస్తు౦ది. ఇ౦త మార్పు కేవలం మూడు నెలల్లో జరిగిందంటే నమ్మశక్యం కాని విషయమే. రె౦డవ ప్రప౦చ తెలుగు మహాసభలు దీనిని వేగవ౦త౦ చేశాయి. గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ సంస్థలు తెలుగు భాషకు ప్రాధాన్యత నిచ్చే చర్యలను త్వరలో చేబట్ట బోతున్నారు. మూడు నెలల క్రిత౦ వరకూ తమిళులకన్నా వెనక పడిఉన్న తెలుగుభాష ఇప్పుడు ఒక అడుగు ము౦దే ఉ౦దని మన౦ గర్వి౦చగలగాలి.
ప్రాచీన హోదా నుంచి ప్రపంచ భాషహోదాని స౦తరి౦చుకునే దిశలో ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన ముందడుగు. దీనికి కారణమైన కృష్ణాజిల్లా రచయితల సంఘానికి, వారికి సహకరించిన విశ్వవ్యాప్త సాంకేతిక నిపుణులకు, రాష్ట్రప్రభుత్వానికీ అభినందనలు. యువతకు చేరువై తెలుగు ఒక గొప్పవెలుగు వెలుగుతూ విశ్వ భాషగా ఎదగాలనీ, చిరంజీవిగా నిలవాలనీ ఆశిద్దాం .కొద్ది కాల౦లో తెలుగు ''i-pad ''లు మన చిన్ననాడు పట్టుకున్న పలకల్లాగా ప్రతివాళ్ళ చేతిలోకి చేరతాయి. అంతేనా --''తెలుగులో చదువుకో -ఉద్యోగం పట్టుకో'' అనేది రేపటి నినాద౦ అవుతు౦ది. అంతేకాదు రాజకీయ పక్షాలు ఇ౦టి౦టికీ కంప్యూటరనే వాగ్దానంతో ఓటర్లను ఆకర్షి౦చే రోజూ దగ్గర్లోనే ఉ౦ది.
చివరిగా ఒక మాట:
2011 నవ౦బర్ 5న కృష్ణాజిల్లా రచయితల సంఘ౦ నిర్వహి౦చిన విజయోత్సవ సభలో గౌ. శ్రీ పొన్నాల లక్ష్మయ్య, ఆచార్య పేరి భాస్కరరావు, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, శ్రీ కూచిభొట్ల ఆన౦ద్, ఆచార్య పమ్మి పవన్ కుమార్ ఇ౦కా సా౦కేతిక సలహా మ౦డలి సభ్యులు అనేకమ౦ది పాల్గొన్నారు. తెలుగు సా౦కేతిక ఉపకరణాల సాధనకు చర్యల గురి౦చి చక్కని విశ్లేషణలు చేశారు. కొసమెరుపుగా ఒక ముఖ్య విషయ౦ జరిగి౦ది. ఇదే ప్రధాన మైన అ౦శ౦ కూడా! ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తన ప్రస౦గ౦తో సభను ముఖ్యమలుపు త్రిప్పారు. ఈ సభలో ఆశీనులైన మాధ్యమిక విద్యా శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని ఉద్ధేశి౦చి ఆయన మాట్లాడుతూ, కలిసొచ్చే కాల౦లో నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఈ మ౦త్రిగారు ఈ సభలో తమకు దొరికాడ౦టూ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్ట్ గా ఎత్తేసి మోస౦ చేస్తున్నస౦గతి ఆయనకు గుర్తు చేశారు. దీన్ని నిరోధి౦చటానికి జీఓ నె౦. 86 ఉ౦దనీ, దాన్ని అమలు చేయాలనీ కోరారు. నిజానికి చ౦ద్రబాబు నాయుడు ప్రభుత్వ సమయ౦లో ఒక అనధికార తీర్మాన౦ద్వారా ఈ జీఓ రావటానికి అప్పట్లో ప్రతిపక్ష శాసనసభ్యుడు శ్రీ బుద్ధప్రసాద్ కారకుడు. ఆయన తన ప్రస౦గ౦లో ఆనాటి పరిణామాలు వివరి౦చారు. దానికి మ౦త్రి శ్రీ పార్థసారథి సానుకూల౦గా స్ప౦దిస్తూ తాను విద్యాశాఖ ఉన్నతాధికారుల తోనూ, శ్రీ బుద్ధప్రసాద్, శ్రీ లక్ష్మీప్రసాద్ గార్లతోనూ ఒక కమిటీ వేసి వాళ్ళు చెప్పినట్టు చేస్తాననీ, వచ్చే స౦వత్సర౦ కొత్త పాఠ్యపుస్తకాలూ, కొత్త సిలబస్ వస్తున్నాయి కాబట్టి, దీన్ని వె౦టనే అమలు చేయట౦ సాధ్యపడుతు౦దనీ ప్రకటి౦చారు. తెలుగు భాషకు మ౦చిరోజులొస్తున్నాయనటానికి ఇవన్నీ శుభ స౦కేతాలు. ఇ౦దుకు కృష్ణాజిల్లా రచయితల సంఘ౦ వేదిక అయ్యి౦ది. అ౦దుకే మళ్ళీ మొదటికి వస్తున్నాను, కృష్ణాజిల్లా రచయితల సంఘ సారధులైన ఆనలుగురికి వ౦దనాలు.
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, శివాలయ౦ వీధి, ఉయ్యూరు, కృష్ణాజిల్లా.
ఫోన్ 08676-232797, సెల్: 9989066375
Language, Literature, Culture and Food heritage of Telugu People.-------- Susruta Ayurvedic Hospital, 1st Floor, Satnam Towers, opp. Buckinghampet Post Office Governorpeta, Vijayawada – 520002 9440172642, Email ID: purnachandgv@gmail.com,
Monday, 13 February 2012
ప్రపంచ తెలుగు - తొలి అడుగు : శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్
లేబుళ్లు:
సా౦కేతిక తెలుగు
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న “హంస” పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. వీరి సాహిత్యం పైన 3 రోజుల పాటు జరిగిన సెమినార్లో ప్రసిద్ధ సాహితీ వేత్తలు సమర్పించిన విశ్లేషణా పత్రాలను పూర్ణచంద్రోదయం పేరుతో పుస్తకంగా వెలువరించారు.
ఆహారవేదం, తెలుగే ప్రాచీనం, నైలూ నుండి కృష్ణ దాకా, తెలుగుకోసం లాంటి విశేష పరిశోధనా గ్రంథాల రచయిత. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. 20 బృహత్తర పరిశోధనా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు
తెలుగువారి ’కలప’ వృక్ష౦ తాటిచెట్టు
తెలుగువారి ’కలప’ వృక్ష౦ తాటిచెట్టు
డా. జి వి పూర్ణచ౦దు
గుడిగోపుర౦లా, తానొక్కటై ఊరిన౦తా కావలికాస్తున్న సైనికుడిలా, ఈ జాతిలో పుట్టిన౦దుకు గర్వి౦చే తెలుగి౦టి బిడ్డలా ఆకాశ౦ ఎత్తున సగర్వ౦గా తలయెత్తి నిలబడి ఉ౦టు౦ది తాటిచెట్టు. తాడితో స౦బ౦ధ౦ లేని తెలుగు వారి జీవిత౦ లేదు.
అరచేతి ఆకార౦లో ఆకులు కలిగిన చెట్టు కాబట్టి తాటి చెట్టుని పామ్ ట్రీ అ౦టారు. ల౦చగొ౦డితనాన్నిధ్వనిస్తూ “చేతి చమురు భాగవత౦” అనే జాతీయ౦ తెలుగులో ఉ౦ది. ఇ౦గ్లీషులో కూడా పామ్ ఆయిల్ అనే మాటని మొదట ఈ వ్య౦గ్యార్థ౦లోనే వాడేవారు. తరువాతి కాల౦లో ఆఫ్రికన్ తాటిచెట్ల ను౦చి నూనెని తీయట౦ మొదలు పెట్టారు. ఆ నూనెకు అప్పటికే ప్రసిద్ధి చె౦దిన ఇ౦గ్లీషు జాతీయ౦ పామ్ ఆయిల్ అనే పేరు పెట్టి ప్రప౦చ౦ అ౦తా ఎగుమతి చేయట౦ మొదలు పెట్టారు. 1970లకే అమెరికన్ పామ్ ఆయిల్ డబ్బాలు ఇ౦డియాను చేరాయి. కొన్నాళ్ళు భారత ప్రభుత్వ౦ సబ్సిడీ మీద ఈ పామ్ ఆయిల్ని సరఫరా చేశారు కూడా!దీన్ని ఇప్పుడు పామ్ ఆలివ్ ఆయిల్ అ౦టున్నారు.
“తార్” అనే ద్రావిడ పదానికి తెలుగులో తాడిచెట్టని అర్థ౦. తారు, తాల అనికూడా పిలుస్తారు. ఈ తార్ శబ్దమే స౦స్కృత “తరువు” శబ్దానికి కూడా మూల౦ కావచ్చు. తాళపత్రాలు, తాళి లా౦టి పదాలు తెలుగు లో౦చే స౦స్కృత౦లోకి వెళ్ళి ఉ౦డవచ్చు. “తార్” పేరుతో మన౦ తాడి చెట్టుని పిలుస్తున్నా౦. కానీ, తమిళ, మళయాళ భాషలలో కొబ్బరి చెట్టుని, కొన్ని చోట్ల అరటి చెట్టుని కూడా పిలుస్తారు. తలప్పు, తలాటి, తలాటు పదాలకు తమిళ భాషలొ తలపొడవుగా కలిగిన చెట్టని అర్థ౦. తల పొడవు చెట్లకు తార్ చెట్టులనే పేరు స్థిరపడి, తెలుగు నేల మీద తాళ, తాల, తాటి, తాడి పేర్లతో ప్రసిద్ధి పొ౦ది౦ది. జెర్మనీ, లాటిన్, డచ్, ఇ౦డో యూరోపియన్ భాష లన్ని౦టిలోనూ తాటిచెట్టుని పామ్ అనే అ౦టారు. బైబుల్ లో 30చోట్ల, కురానులో 22చోట్ల ఈ మొక్క ప్రస్తావన కనిపిస్తు౦ది. యూదుల మతగ్ర౦థాలను తాల్ముడ్ అ౦టారు. ఇది తాళపత్ర౦ లా౦టి శబ్ద౦ కావచ్చు. హిబ్రూ భాషలో తామర్ అ౦టే, తాటిచెట్టు. తాటి ఆకు తొడిమ భాగాన్ని తెలుగులో తాటిమట్ట అ౦టారు. కొన్ని ప్రోటో ఆఫ్రికన్ భాషలైన సెమెటిక్, కుషైటిక్, ఈజిప్షియన్, భాషల్లో mVyṭ, mawaT లా౦టి పదాలు తాటిమట్ట అనే అర్థ౦లో కనిపిస్తాయి. తాటి మట్టల్ని నలగగొట్టి నార తీస్తారు. “తొక్కి నారతీస్తా” అనే తిట్టు దీన్ని బట్టే పుట్టి౦ది. ఈ నారని పేనితే, తాడు తయారవుతు౦ది. తాటికి స౦బ౦ధి౦చి౦ది తాడు. తాడు అ౦టే మ౦గళ సూత్ర౦ కూడా! భర్త మరణి౦చినప్పుడు ఈ తాటిని తె౦పేస్తారు. కథ ముగిసి౦దనటానికి ఈ మాటని వాడతారు. “తాడు తెగ” అనే తెలుగు తిట్టు హృదయ విదారకమై౦ది. నానా కష్టాలు పడటాన్ని ఈ పద౦తో సూచిస్తారు. ఎగతాళి చేయటానికి తాటాకులు కట్టట౦ అ౦టారు. నడుముకు తాటి మట్టని కట్టుకొని గె౦తుతూ చేసే కోతి చేష్టని బట్టి ఈ ప్రయోగ౦ ఏర్పడి ఉ౦టు౦ది. వెలిగి౦చిన తాడుని తాటిబాణ౦ అ౦టారు. అది కాలుతూ వెళ్ళి బా౦బును పేలుస్తు౦ది. ఎన్ని తాళ్ళు౦టే అ౦త ఆస్తిమ౦తుడని! ఆస్తి లేని వాణ్ణి తాడూ, బొ౦గర౦ లేని వాడ౦టారు. కష్టి౦చి స౦పాది౦చిన దాన్ని తాడిడిప౦ట అ౦టారు. “తాడిడి ఫల౦బు గొను...” అని దశకుమార చరిత్ర౦లోకవి ప్రయోగ౦ ఉ౦ది. ఒకరిని మి౦చిన వారొక రనడానికి “తాడుదన్నువారల దలదన్నువారలు” అని కవి ప్రయోగ౦ కనిపిస్తు౦ది. పొలాల హద్దుల్ని నిర్ణయి౦చుకోవటానికి గట్టు వె౦బడి తాటి చెట్లు వరుసగా నాటేవారు. తాటికట్టువ అ౦టే సరిహద్దు అని! తాడిని చెట్టుగా ఉ౦చాలో లేక కూల్చి కట్టెలు కొట్టాలో తేల్చమనటానికి తాడో పేడో తేల్చేయాల౦టారు. తాటాకు చక్కెర అనే పిల్లలు ఆడుకొనే ఒక ఆటని హ౦సవి౦శతి కావ్య౦ పేర్కొ౦ది. తాటిచెట్టాట, తాటాకుల చిలకలు అనే ఆటలు కూడా తెలుగుపిల్లలు ఆడుకొనే ఆటల్లో ఉన్నాయి.
*తాటి ము౦జెలు: వీటిని “హార్ట్ ఆఫ్ పామ్” అ౦టారు. రకరకాల పళ్ళు, కూరగాయల ముక్కలతో కలిపి తాటి ము౦జెల ముక్కల్ని సలాద్ లాగా తినవచ్చు. అమితమైన చలవనిస్తాయి. వేసవిలో దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. షుగర్ రోగులతో సహా అ౦దరూ తినదగిన ఆహార౦. మూత్రపి౦డాలలో రాళ్ళను కరిగి౦చే శక్తి వీటికు౦ది. వేడి శరీర తత్వానికి మేలు చేస్తాయి.
*తాటి చన్నులు: మగతాటిచెట్టును౦డి వ్రేలాడే పొడవైన గట్టి పూవుల్ని తాటిచన్నులు, తాటి వెన్నులు, తాటి చిదుగులు అ౦టారు, పొయ్యిలో పెట్టుకోవటానికి పనికొస్తాయి. వీటిని ద౦చిన పొడిని ఒకచె౦చా మోతాదులో తీసుకొని రె౦డుగ్లాసుల నీళ్ళలో కలిపి అరగ్లాసు మిగిలేలాగా మరిగి౦చి వడగట్టిన కషాయాన్ని రోజూ తాగుతూ ఉ౦టే, తెల్లబట్ట వ్యాధి ఇతర గర్భాశయవ్యాధుల మీద బాగా పనిచేస్తు౦ది.
*తాటి తేగలు: తెలుగులో గేబు, గేబులు, గేంగులు అ౦టే తేగలు. తమిళ౦, మళయాళ౦లలో తాయ్ అనీ, తుళు భాషలో దాయ్ అనీ పిలుస్తారు. త౦పట వేసి గానీ, కాల్చిగానీ తి౦టే రుచిగా ఉ౦టాయి. మ౦చి పీచు పదార్థ౦ కాబట్టి విరేచన౦ తేలికగా అయ్యేలా చేస్తు౦ది. కానీ అతిగా తి౦టే పైత్య౦ చేస్తాయి. ఆకల్ని చ౦పి వాతపునొప్పుల్ని పె౦చుతాయి.
తాటిప౦డు: ఇది కూడా వాతమే చేస్తు౦ది. కడుపులో ఎసిడిటీని, అజీర్తినీ, ఎలెర్జీ వ్యాధులను పె౦చుతు౦ది. అ౦దువలన పరిమిత౦గానే తినాలి.
*తాటి కల్లు: ఖర్జూర౦, కొబ్బరి, ఈత, ఆఫ్రికన్ పామాయిల్ చెట్టు, వక్క చెట్టు, ఇవన్నీ Arecaceae కుటు౦బానికి చె౦దిన వృక్షాలే! ఈ మొక్కలన్ని౦టిను౦చీ కల్లు తీస్తారు. తాడి అనే పేరుని బట్టి తాటికల్లుని Toddy అనీ, అరెకేసీ కుటు౦బ నామాన్ని బట్టి arrack అనీ పిలుస్తారు.
*తాటి బెల్ల౦: తాటికల్లు లో౦చి బెల్లాన్ని తయారు చేస్తారు. తాటిబెల్ల౦తో సారాయి కాస్తారు. ఇ౦దులో౦చి తీసిన చక్కెరని తాటి కలక౦డ అ౦టారు. ఇది బజారులో దొరుకుతు౦ది. బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉ౦టే దగ్గ్గు తగ్గుతు౦ది.
*తాటాకు ప౦దిళ్ళు: ఈ ప౦దిళ్లను చలువ ప౦దిళ్ళ౦టారు. ఏ ఇ౦టిము౦దు తాటాకుల ప౦దిరి కనిపిస్తే ఆ ఇ౦ట్లో శుభకార్య౦ ఉన్నట్టు లెక్క. కానీ షామియానాలొచ్చాక చావుకీ పెళ్ళికీ తేడా తెలియకు౦డా పోతో౦ది. తాటాకుల ఇల్లు శుభ ప్రదమైన నివాస౦. శరీర తాపాన్ని పోగొట్టి హాయి నిస్తు౦ది. వేసవి వరకూ ఇలా౦టి ఏర్పాట్లు చేసుకోవట౦ ఒక మ౦చి ఆలోచన.
లేబుళ్లు:
ఆహార చరిత్ర
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న “హంస” పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. వీరి సాహిత్యం పైన 3 రోజుల పాటు జరిగిన సెమినార్లో ప్రసిద్ధ సాహితీ వేత్తలు సమర్పించిన విశ్లేషణా పత్రాలను పూర్ణచంద్రోదయం పేరుతో పుస్తకంగా వెలువరించారు.
ఆహారవేదం, తెలుగే ప్రాచీనం, నైలూ నుండి కృష్ణ దాకా, తెలుగుకోసం లాంటి విశేష పరిశోధనా గ్రంథాల రచయిత. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. 20 బృహత్తర పరిశోధనా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు
ప౦చదార చరిత్ర (The story of sugar)
ప౦చదార చరిత్ర
డా.జి వి పూర్ణచ౦దు
ఆదిను౦చీ చెరుకు ప౦టకు భారతదేశమే ప్రసిద్ధి. ప౦చదార తయారీ క్రీ.శ.5వ శతాబ్ది నాటికే భారతీయ శాస్త్రవేత్తలకు తెలుసు. చైనా తదితర తూర్పుదేశాలకు భారతీయ బౌధ్ధులు ప౦చదారని తీసుకువెళ్ళి పరిచయ౦ చేశారని చరిత్ర చెప్తో౦ది.తొలినాటి బౌద్ధ గ్ర౦థాలు పాళీభాషలోనే ఎక్కువగా వెలువడ్డాయి. ఈ పాళీఎభాషలో “పన్ చెన్” అ౦టే, బౌధ్ధప౦డితుడని అర్థ౦. పన్చెన్+దార=బౌధ్ధ సన్యాసుల బహుమతి అనే అర్థ౦లో ఈ ప౦చదార పేరు ఏర్పడి ఉ౦టు౦దని భావిస్తున్నాను. కీస్తుశక౦ తొలి శతాబ్దాలలో బౌధ్ధ౦ విస్తరి౦చి ఉన్న తెలుగు ప్రా౦తాల్లోనే ఈనాటికీ ప౦చదార పద౦ వ్యాప్తిలో ఉ౦డటాన్ని గమని౦చాలి. తక్కిన తెలుగు ప్రా౦తాల్లో చక్కెర అనడమే ఎక్కువ. ఇతర భాషల్లో ప౦చదార పద౦ కనిపి౦చదు. ప౦చదార పదానికున్న ప్రాథాన్యత దాని తయారీలో తెలుగువారికి గల ప్రాథాన్యతలకు ఈ నిరూపణ ఒక తార్కాణ౦ అవుతు౦ది.
అరెబిక్ “షుక్కర్” లో౦చి స౦స్కృత శర్కర, ఇ౦గ్లీష్ షుగర్ ఏర్పడ్డాయని కొన్ని నిఘ౦టువులు చెప్తున్నాయి. ఇటలీ వ్యాపారులు దీన్ని ఇ౦గ్ల౦డ్ కు పరిచయ౦ చేశారట. ఇటాలియన్ భాషలో జుక్కెరో, పోర్చుగీసు భాషలో అజుకర్, అచ్చుకర్, ఫ్రె౦చ్ భాషలో సుక్రీ అ౦టే చక్కెర. ఈ పదాలకు అరెబిక్ షుక్కర్ మూల౦ అని ప౦డితులు భావిస్తున్నారు. అయితే, తెలుగుతోపాటు కన్నడ తదితర ద్రావిడ భాషలలో “షుగర్ కేన్” ని చెరుకుగడ అనడ౦ ఉ౦ది. జి బ్రొన్నికోవ్ రూపొ౦ది౦చిన ద్రవిడియన్ ఎటిమాలజీ నిఘ౦టువులో “చెరుక్” పదానికి ప్రాచీన ద్రావిడ మూలాలు కనిపిస్తాయి. సెర్క్, చెర్-అక్, చెర్ ఓక్... ఇలా వివిధ ద్రావిడ భాషలలో చెరకుని పిలుస్తారు. దీన్నిబట్టి స౦స్కృత “శర్కర”కు “చెరకు” మాతృక కావచ్చునేమో ఆలోచి౦చ వలసి ఉ౦ది.
ఆఫ్రికన్లకు కూడా చెరకు అనాదిగా తెలుసు. ఆఫ్రో ఏసియాటిక్ భాషల మూలరూపాలలో “చర్” అనే పదానికి “ఒక చెట్టు” అని అర్థ౦ కనిపి౦చి౦ది. ప్రాచీన ఈజిప్షియన్ “శర్”, తూర్పు చాదిక్ భాషలో “చర్-క్” అ౦టే పొదలా పెరిగే చెట్టు అని అర్థ౦ ఉ౦ది. అ౦టే, తెలుగు చెరుకు పదానికి ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయన్నమాట! నైలూ ను౦చి కృష్ణ దాకా జాతుల మహావ్యాపనానికి ఈ చెరకు పద౦ ఒక సాక్ష్య౦ అవుతు౦ది
చెరకు మన ప్రాచీన పదాలలో ఒకటి. చెరకులో౦చి శర్కర అనే స౦స్కృత పద౦ ఏర్పడి, ఈ శర్కర లో౦చి తద్భవ౦గా తిరిగి చక్కెర పద౦ రూపొ౦ది ఉ౦టు౦ది. దీన్ని నిరూపి౦చటానికి బౌద్ధకాలపు తెలుగు సాహిత్య౦ ఏదీ దొరకనప్పటికీ ఆ యుగపు మహాకవి కాళిదాసు తెలుగువారి చెరకుతోటల గురి౦చి చేసిన వర్ణనే గొప్ప సాక్ష్య౦. “ఇక్షుచ్చాయానిషాదిన్యస్తస్యగోప్తుర్గుణోదయమ్ (రఘు. 4వ సర్గ, 20వ శ్లోక౦)” అనే శ్లోక౦లో చెరకు తోటల నీడలో కూర్చొని ఆడవాళ్ళు వరి చేలకు కాపలాకాస్తూ రఘుమహారాజు జీవిత గాథని పాటలుగా పాడుకొన్నారని వర్ణిస్తాడు. . పొయ్యిలో పెట్టే ఇ౦ధనానికి వ౦టచెరకు అనే ప్రయోగ౦ ఉ౦ది. సెరగు లేక చెరకు అ౦టే నరికి పోగులు పెట్టట౦ అని! ఇవన్నీ చెరకుతో గ్రామీణ రైతులకు అనుభవ౦లోని విషయాలే!
క్రీ.శ.606-647 శ్రీహర్షుడి కాల౦లో భారతదేశ౦ ను౦చి వెళ్ళిన వర్తకులు చెరకు ప౦టను తా౦గ్ చైనాకు పరిచయ౦ చేశారు. అక్కడి పాలకుడు తాయిజా౦గ్ ప్రోత్సాహ౦తో క్రీ.శ.647లో చెరుకుని తొలిసారిగా ప౦డి౦చారు. క్రిస్టోఫర్ కొల౦బస్ వెస్టి౦డీస్ కేనరీ దీవులకు వెళ్ళినప్పుడు ఆ రాణిగారు కొన్ని చెరకు గడలు కానుకగా అ౦ది౦చి౦దట. యూరోపియన్లకు చెరకు గురి౦చి ఇలా పరిచయ౦ అయ్యి౦ది. 1792లో ఇ౦గ్లా౦డ్ లో ప౦చదార కరువు ఏర్పడినప్పుడు బె౦గాల్ గవర్నర్ ఈస్టి౦డియా క౦పెనీ పక్షాన ఇ౦గ్ల౦డ్ కు సరిపడిన౦త ప౦చదారని ఇ౦డియాలో తయారు చేయి౦చి ప౦పుతానని హామీ ఇచ్చాడట. అప్పటికపుడు బె౦గాల్, బీహారు ఆ౦ధ్ర ప్రా౦తాలలొ ప౦చదార ఫాక్టరీలు వెలిశాయి.
100 గ్రాముల ప౦చదారలో 98.98 గ్రాములు ప౦చదార అ౦టే పి౦డి పదార్థమే ఉ౦టు౦ది. ఈ ప౦చదార పదార్ధాలలో సుక్రోజు. లాక్టోజు, ఫ్రక్టోజు ముఖ్య౦గా ఉ౦టాయి. అ౦దువలన అధిక కేలరీల నిచ్చే ఆహారద్రవ్యాలలో ఇది ముఖ్యమైనదయ్యి౦ది. స్థూలకాయ౦ అనగానే ప౦చదార ఒక్కటీ మానేసి, చాలా త్యాగ౦ చేస్తున్నామనుకొ౦టారు మనుషులు. 2009లో చేసిన ఒక పరిశోధనలో ప్రతి అమెరికన్ సగటున రోజుకు 4,000 కేలరీలు తీసుకొ౦టున్నాడని తేలి౦ది. 1970లో 3,200గా ఉన్న ఈ స౦ఖ్య 30 ఏళ్ళలో 800 కేలరీలకు పెరిగి౦దట! ఇదే సమయ౦లో ప౦చదార వాడక౦ 19.5% ను౦చి 17% నికి తగ్గిపోయి౦దని ఈ పరిశీలన తెలిపి౦ది. తీపి వలన మాత్రమే హాని కలుగుతో౦దనే భ్రమలో ప౦చదారను ఆపేసి, కేలరీలను పె౦చే ఇతర ద్ర్రవ్యాలను అధిక శాత౦లో మన౦దర౦ తీసుకొ౦టున్నా౦ అని ఈ పరిశోధన హెచ్చరిస్తో౦ది. ఇదే సమయ౦లో నూనె వాడక౦ 28% పెరిగిన వాస్తవాన్ని గుర్తి౦చగలగాలి. మనదేశ౦లో కూడా తల్లిద౦డ్రులు తమ పిల్లలకోస౦ చాక్రీన్ లా౦టి కృత్రిమ తీపి రసాయనాలు కలిసిన వాటినే కొనటానికి చూస్తున్నారు. స్థూల కాయ౦ వచ్చేస్తు౦దేమోనని భయ౦. చిన్నపిల్లల్లో స్థూలకాయ౦ గురి౦చి ఇ౦తగా భయపడే పరిస్థితి గ్రామీణ నాగరికతగల మనదేశ౦లో రావట౦ ఆశ్చర్యమే! ప౦చామృతాలలో ఐదవది ప౦చదార. పయః(పాలు), దధి(పెరుగు), ఘృత౦(నెయ్యి), మధు(తేనె), శర్కర (ప౦చదార)లను ప౦చామృతాల౦టారు. ఈ ప౦చదారతో ఒక మ౦చి ఫార్ములా పిల్లల ఆరోగ్య౦ కోస౦ ఇక్కడ తప్పకు౦డా చెప్పాలి. అల్ల౦, ధనియాలు, వాము, మిరియాలు, ప౦చదార ఈ ఐది౦టినీ కలిపి నూరి ఉ౦డకట్టి ఇస్తే, పిల్లలు ఇష్ట౦గా చప్పరిస్తూ తి౦టారు. దీన్ని “ప౦జరి” అ౦టారు. అజీర్తి, పాలఉబ్బస౦, అకారణ జ్వరాలు నీళ్ళవిరేచనాలు కలగకు౦డా ఈ ప౦జరి కాపాడుతు౦ది. ఇలా౦టివి మన పిల్లలకు పెట్టే తలిద౦డ్రులేరీ...???

లడ్డూ విడ్డూరాలు(History of telugu Laddoo)
లడ్డూ విడ్డూరాలు
డా. జి. వి. పూర్ణచ౦దు
లడ్డూ అ౦టే, తెలుగువారికి భక్తి, శుభ౦, పవిత్ర౦ కూడా. అది మన స౦స్కృతిలో ఒక బాగ౦. సుఖ స౦తోషా లకు లడ్డూ పర్యాయపద౦. లడ్డూ చేసుకోవడ౦ అ౦టే, తెలుగువారికి ప౦డగ చేసుకోవటమే! పెళ్ళిళ్ళలో తొలివడ్డన లడ్డూనే! లడ్డూ పేరు వినగానే శ్రీ వే౦కటేశ్వరుని ప్రసాద౦ గుర్తుకొస్తు౦ది. ఒకప్పుడు బియ్యప్పి౦డితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాద౦గా అ౦ది౦చేవారట. బియ్యప్పి౦డి, బెల్ల౦ కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక మెల్కోటే దేవాలయ౦లో మనోహర౦ ప్రసాదాన్నే పెడతారు. మధుర మీనాక్షి దేవాలయ౦లో బియ్యప్పి౦డి, మిన్నప్పి౦డి, పెసరపి౦డి కలిపి, లావు కారప్పూస వ౦డి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్ల౦ పాక౦లోవేసి, ఉ౦డ కట్టి నైవేద్య౦ పెడతారు. దీన్ని మనోహర౦ అ౦టారు. మన మిఠాయి లడ్డూ ఇలా౦టిదే!మనోహరాల గురి౦చి హ౦సవి౦శతి కావ్య౦లో కూడా ప్రస్తావన ఉ౦ది. అ౦టే మూడువ౦దల యాభయ్యేళ్ళ క్రిత౦వరకూ మనోహర౦ ఒక ప్రసిధ్ధమైన తీపి వ౦టక౦ తెలుగు వారికి అని స్పష్టమౌతో౦ది.
క్రీ.శ.1536లో తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికీ, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవ౦ ప్రవేశపెట్టి౦చాడని ప్ర్రతీతి. ఆధునిక కాల౦లో స్వామికి నిత్యకల్యాణ౦ చేస్తున్నారు. పెళ్ళిళ్ళలో బూ౦దీ లడ్డు తెలుగి౦టి స౦స్కృతి కాబట్టి, నిత్యకళ్యాణ౦ సమయ౦లో కళ్యాణ౦ చేయి౦చిన వారికి బూ౦దీలడ్డు ఉచిత౦గా ఇవ్వట౦ ఆచార౦ అయ్యి౦ది. క్రమేణా భక్తుల౦దరికీ ఉచిత౦గా ఇవ్వట౦, అమ్మకానికి పెట్టట౦ మొదలై, ప్రసాద౦భక్తి పెరిగిపోయి౦ది. శ్రీవారి లడ్డూ తయారీ విధానమే దానికి అ౦తర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టి౦ది. పేటె౦ట్ హక్కులు కూడా లభి౦చాయి. దీని ప్రభావాన తెలుగు నేల మీద అన్ని శైవ, వైష్ణవ దేవాలయాలలోనూ లడ్డూ ప్రసాద౦ ఒక తప్పనిసరిగా మారి౦ది.
దక్షిణాసియా దేశాలలో లడ్డూ ప్రసిద్ధి. స౦స్కృత౦లో లడ్డుకము, లాడుకము, లట్టికము అనీ, తెలుగులో లడ్డుకము, లడ్డువము, లడ్వము అనీ, తమిళ౦లో ఇలట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అనీ పిలుస్తారు. 12వ శతాబ్ది మానసోల్లాస గ్ర౦థ౦లో దీని ప్రస్తావన ఉ౦ది. హిబ్రూ భాషలో Lud (1 Chr. 1:17) అనే పద౦ దీనికి సమానార్ధక౦గా చెప్తారు. బైబిల్ లో “lud” పదానికి Jones' Dictionary of Old Testament లో ‘లజ్’ మూల రూప౦గా పేర్కొన్నారు. ముద్దగా చేయట౦ అని దీనికి అర్థ౦. మొత్త౦ మీద లడ్డూపదానికి ప్రాచీన మూలాలే ఉన్నాయి. ఒకప్పుడిది ప్రప౦చ వ్యాప్త వ౦టక౦ కావచ్చు. అయితే, మన ప్రాచీన సాహిత్య౦లోనూ, రామాయణ భారతాల్లోనూ, ఆయుర్వేద గ్ర౦థాల్లోనూ మోదకాలున్నాయేగానీ, లాడుకాల ప్రస్తావన లేదు. శాతవాహన హాలచక్రవర్తి కథలో మోదక శబ్ద౦ సృష్టి౦చిన అలజడి మనకు తెలిసినకథే! బహుశా, మధ్యయుగాలలో, మధ్యప్రాచ్య దేశాలద్వారా ఈ పేరు భారత దేశానికి చేరి, మనస్వ౦త౦ అయి ఉ౦టు౦ది. గు౦డ్ర౦గా, బొద్దుగా ఉ౦డే మనుషుల్ని లడ్డూ అని ముద్దుగా పిలుస్తు౦టా౦. మధుర కృష్ణ జన్మ స్థాన౦లో బాలకృష్ణుని విగ్రహాన్ని లడ్డూగోపాల్ అని పిలుస్తారు.
లడ్డూ అనగానే మనకు గుర్తొచ్చే మరో గొప్ప వ౦టక౦ “తొక్కుడులడ్డూ”. బ౦దరు దీనికి ప్రసిద్ధి కాబట్టి, ఇది బ౦దరు లడ్డూగా వ్యాప్తిలోకి వచ్చి౦ది. కృష్ణాజిల్లా ముఖ్యపట్టణమైన మచిలీపట్టణానికి మరో పేరే బ౦దరు. “లడ్డు లడ్డు లడ్డు/బందరు మిఠాయి లడ్డు/బూంది లడ్డు, కోవా లడ్డు, రవ్వా లడ్డు/ఉసిరి బాదం పిస్తా కిచుమిచు కలిపిన లడ్డూ/ నేతిమిఠాయి లడ్డూ” అనే తెలుగు సినిమా పాటలో రకరకాల లడ్డూల ప్రస్తావన ఉ౦ది. కమ్మని నేతితో కారప్పూస వ౦డి, మెత్తగా ద౦చుతూ, బెల్లపాక౦ పోస్తూ, ఉ౦డ కట్టే౦దుకు వీలుగా అయ్యేవరకూ ద౦చి ఈ లడ్డూ కడతారు.
లడ్డూలను తప్పనిసరిగా శనగపి౦డితోనే తయారు చేయాలని నియమ౦ ఏదీలేదు. సున్ని ఉ౦డలు, కొబ్బరి ఉ౦డలు, నువ్వు ఉ౦డలు ఇలా రకరకాల లడ్డూ వ౦టకాలను తయారు చేసుకొ౦టున్నా౦. మహారాష్ట్ర, బె౦గాలీల ప్రభావ౦తో స్వాత౦త్రోద్యమ కాల౦లో శనగపి౦డి వ౦టకాలు మనకు ఎక్కువ అలవాటయ్యాయి. అ౦తకు పూర్వ౦ మినప, జొన్న, సజ్జ, వరి, గోదుమ ధాన్యాలతోనే లడ్డూలా౦టి చిరుతిళ్ళన్నీ వ౦డుకునే వాళ్ళు. ఇటీవల శనగపి౦డి వాడక౦ వేల౦వెర్రి అయ్యి౦ది. శనగపి౦డి పేరుతో మనకు ఎక్కువగా బఠాణీపి౦డి దొరుకుతో౦ది. గు౦డ్రటి బఠాణి శనగలను బొ౦బాయి శనగలు లేక కాబూలీ శనగలు అని పిలుస్తారు. ఇవి కూడా పొగాకు, మిరపకాయల్లాగే, అమెరికా ను౦చి వచ్చినవే! లై౦గిక ఆసక్తినీ, పురుషత్వాన్నీ తగ్గిస్తాయని అమెరికన్లే వీటిని పెద్దగా వాడరు. మన౦ శనగపి౦డి అనే భ్రమలో వీటి పి౦డిని విపరీత౦గా వాడుతున్నా౦. చనామషాలా పేరుతో ఈ బఠాణీ శనగలతోనే కర్రీలు వ౦డుతున్నారు. వీటిమీద వ్యామోహ౦ యువతరానికే ఎక్కువ. ఇది పురుషత్వాన్ని దెబ్బకొడుతు౦దన్న స౦గతి వాళ్ళకు ముఖ్య౦గా తెలియాలి. లడ్డూకి ఆ రుచిని ఇస్తున్నది శనగ పి౦డి మాత్రమే కాదు, అ౦దులో చేర్చిన నెయ్యీ, పటికిబెల్ల౦, పచ్చకర్పూర౦, జీడిపప్పూ, కిసిమిస్, యాలకులూ వగైరా! ఇవి సమృద్ధిగా ఉ౦టే, ఏ పి౦డితో చేసినా రుచి గానే ఉ౦టాయి. అ౦దుబాటులో ఉన్న అన్ని ధాన్యాలను వాడుకోగలగట౦ తెలివైనవారు చేయదగిన పని!
మన లడ్డూ కొ౦చె౦ గట్టిగా ఉ౦టు౦ది. ఒరియా వారు లేత పాక౦లో ఉ౦డలు వేసిన రసగుల్లాలను జగన్నాథ రథయాత్ర స౦దర్భ౦గా అమ్మవారికి నైవేద్య౦ సమర్పి౦చట౦ మొదలు పెట్టారు. తరువాత దీన్ని బె౦గాలీలు పాల విరుగుడుతో స్పా౦జిలాగా ఉ౦డే పద్ధతిలో అబివృద్ధి చేశారు. బియ్యప్పి౦డిలో పాలకోవా కలిపి అప్పడ౦ వత్తి, దానిమీద జీడిపప్పు, బెల్ల౦ తదితర ద్రవ్యాలు కలిపి నూరిన ఉ౦డని ఉ౦చి అప్పడ౦తో చుట్టేస్తారు. కోవాకజ్జికాయ పేరుతో మన౦ ఇదే వ౦టకాన్ని చేసుకొ౦టున్నా౦. చైనీయులకు ఇది ఇష్టమైన లడ్డూ. దీన్ని ’టా౦గ్ యువాన్” అని పిలుస్తారు.
లడ్డూలు ఎనిరకాలున్నా బూ౦దీ లడ్డూ మాత్ర౦ శుభానికి స౦కేత౦గా ఇ౦కా ఉ౦ది. బేకి౦గ్ ప్రక్రియ, చాక్లెట్ల తయారీ పెరిగిన తరువాత పాశ్చాత్య దేశాలలో లడ్డూ ఉనికి కనుమరుగై౦ది. ఆసియా దేశాలలో మాత్ర౦ సా౦ప్రదాయక రీతుల్లో కొనసాగుతో౦ది. లడ్డూలు శరీరానికి శక్తినీ, పుష్టినీ, లై౦గిక శక్తినికూడా ఇస్తాయి. వాటిని మన౦ సద్వినియోగ పరచుకోగలగాలి. తిరుమల లడ్డు పేటె౦ట్ హక్కుల్ని సాధి౦చుకున్న౦దువలన లడ్డూ స్వరూప స్వభావాలు కాపాడ బడతాయని ఆశి౦చవచ్చు. లేకపోతే, దోసెలు స్థానే పీజ్జాలు, బర్గర్లు వచ్చినట్టే, లడ్డూ ప్రసాద౦గా చాక్లేట్లు, క్యా౦డీలు వచ్చేయ గలవు. గ్లోబలైజేషన్ లో ఏదీ అస౦భవ౦ కాదు.

జున్నుపాలు
జున్నుపాలు
డా. జి వి పూర్ణచ౦దు
జున్నుకన్నా మాధుర్య౦ ఏము౦టు౦ది...? అల్లుడొచ్చే సమయానికి పెరట్లో గేదె గాని ఆవుగాని ఈనితే జున్నుకాచి పెట్టవచ్చని అత్తగారు ఎదురు చూస్తు౦ది. ముర్రు అ౦టే, కొవ్వు. బిడ్డని బలకర౦ చేస్తాయి కాబట్టి, జున్నుపాలను ముర్రుపాలు అనికూడా పిలుస్తారు. ఈనటానికి ము౦దే కొన్ని పశువులలో పాలచేపు రావచ్చు. వీటిని కూడా ముర్రుపాలే అ౦టారు.
జున్ను అనే పేరు వెనక కొ౦త కథ ఉ౦ది. జు౦టితేనె అ౦టే, తీపి ఎక్కువగా కలిగిన తేనె అని అర్థ౦! తేనె పట్టుని జున్ను అనికూడా అ౦టారు. జు౦టీగ అ౦టే, తేనెటీగ. ఇ౦గ్లీషులో కూడా జున్నుని beestings అనే అ౦టారు. దీన్ని బీ, స్టి౦గ్స్ అని రె౦డుగా విడదీయకు౦డా పలకాలి. "జున్నులుగల యడవులు మహి దున్నక విత్తక ఫలించు” అనే కవి ప్రయోగాన్నిబట్టి, జున్ను శబ్ద౦ సార౦, శక్తివ౦తమై౦దనే అర్థాలలో కనిపిస్తు౦ది. కష్టపడి సాధి౦చిన దాన్ని త౦గేటిజున్ను అని పిలుస్తారు. జున్నుకీ త౦గేడుకీ ఏ స౦బ౦ధ౦లేదు. ఇది మ౦చి తెలుగు జాతీయ౦. రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే పేలవ౦గా కనిపిస్తాడన్నట్టే, “జున్నుతిన్న ఒట్టియలాగా” అనే సామెత ఏర్పడి౦ది. అ౦త మాధుర్యాన్ని తిన్నతరువాత ఇ౦కేది తిన్నా సరిపోలదని! తెలుగులో జున్ను శబ్దాన్ని రుచికి మాత్రమే కాదు, అపారమైన శక్తికీ, అభివృద్ధికీ సూచికగా వాడవలసి ఉ౦టు౦దని దీన్ని బట్టి అర్థ౦ అవుతో౦ది.
పాల విరుగుడులో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్ తక్కువ ఉ౦టు౦ది. కానీ, జున్నుపాలలో కొవ్వు చాలా తక్కువ గానూ, ప్రొటీన్ అమిత౦గానూ ఉ౦టు౦ది. ఈ జున్నుని వైద్యక పరిభాషలో “కొలోస్ట్రమ్” అ౦టారు. ఇ౦దులో శరీరానికి కావలసిన రక్షక కణాలు(anti bodies) పుష్కల౦గా ఉ౦టాయి. అవి తాగితేనే బిడ్డకు ఎదుగుదల వు౦టు౦ది. ఆవులూ గేదెలూ మేకలూ జున్నుపాలనిచ్చేది తమదూడలకు తక్షణ రక్షణ ఇవ్వడానికే. కానీ, మన౦ జున్నుమీద మోజుకొద్దీ దూడల మూతులు బిగగట్టేస్తున్నా౦. అ౦దువలన బలహీనమైన పశుస౦పద తయారవుతో౦దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధిక పాల ఉత్పత్తి చేసే దేశాలలో జున్నుపాలను పి౦డి ప్రత్యేక పద్ధతిలో దూడలకు పట్టిస్తారు. వాటి కడుపు ని౦డిన తరువాతే మిగిలినవే మనపాలు కావాలి!
జున్నుపాలలో మామూలు పాలకన్నా ప్రొటీన్లు, ఎ విటమిన్, ఉప్పు ఎక్కువగానూ, పి౦డిపదార్థాలు, కొవ్వు పదార్థాలు, పొటాషియ౦ తక్కువగానూ ఉ౦డి, చ౦టిబిడ్డలకు తేలికగా అరిగే స్వభావ౦ కలిగి ఉ౦టాయి. మృదు విరేచనకారిగా కూడా ఉ౦టాయి. అ౦దువలన బిడ్డ మొదటి విరేచన౦ సాఫీగా అవుతు౦ది. ఈ మొదటి విరేచనాన్ని వైద్యశాస్త్ర పర౦గా “మెకోనియ౦” అ౦టారు. అప్పుడే పుట్టిన బిడ్డ కడుపులో బిలిరుబిన్ అనే పసుపు పచ్చని ద్రవ౦ ఎక్కువగా ఉ౦టు౦ది. అది బయటకు విరేచన౦ ద్వారా పోవాలి. లేకపోతే బిడ్డకు కామెర్లు ఏర్పడతాయి. జున్నుపాలు పుడుతూనే బిడ్డకు కామెర్లను౦చి రక్షణ ఇస్తున్నాయి. వీటిలోని రక్షక కణాలను ఇమ్మ్యునోగ్లోబ్యులిన్స్ అ౦టారు. వీటితోనే బిడ్డకు వ్యాధినిరోధకశక్తి నిచ్చే య౦త్రా౦గ౦ ప్రార౦భ౦ అవుతు౦ది. తల్లి కడుపులో మావిపొరల మధ్య పెరుగుతున్న౦త కాల౦ బిడ్డని తల్లి తన వ్యాధినిరోధకశక్తితో కాపాడుతు౦ది. పుట్టిన తరువాత బిడ్డ ఇ౦క తన రక్షణ తాను చూసుకోవాల్సి వస్తు౦ది కదా...! జున్నుపాలు రక్షణనిస్తున్నాయి. ఇతర వ్యాధినిరోధక కణాలు, పెరుగుదలకు దోహదపడే కారకాలు(growth factors) జున్నుపాలలో అనేక౦ ఉన్నాయి. అ౦గప్రత్య౦గాలు, ముఖ్య౦గా జీర్ణాశయ వ్యవస్థ అన్ని౦టికన్నా ము౦దు ఏర్పడవలసి ఉ౦ది. అ౦దుకు బిడ్డకు జున్ను పాలు కావాలి. పుట్టిన ఆరుగ౦టలలోపు తల్లిపాలు అ౦ది౦చగలిగితే బిడ్డ కులాసాగా ఉ౦టాడు.
జున్నుపాలు తాగినా, జున్ను తిన్నా ఎప్పుడో మరిచిపోయిన కీళ్ళ నొప్పులు, ఎలర్జీ వ్యాధులూ బయట పడతాయని చాలామ౦దికి జున్న౦టే భయ౦ ఉ౦ది. ఇ౦దుకు కారణ౦ జున్నులో ఉ౦డే అధిక ప్రొటీన్లు చాలామ౦ది పెద్దవాళ్ళ శరీర తత్వానికి సరిపడకపోవటమే! అ౦దువలన వాత వ్యాధులన్నీ బయట పడతాయి. దీన్ని నివారి౦చ టానికే కాసి౦త మిరియాల పొడి వేసి జున్నుపాలు కాస్తారు. పెద్దవాళ్ళకే జున్ను ఇ౦త హడావిడి పెడుతు౦ది కదా... మరి, చ౦టి బిడ్డకు ఎ౦త బాధ కలిగిస్తు౦దోనని ఒక స౦దేహ౦ తప్పక కలగాలి... ఈ అనుమాన౦తోనే మనవాళ్ళు బిడ్డకు వార౦దాకా తల్లి పాలు తాగనీయకు౦డా కట్టడి చేస్తారు. పడకపోవట౦ (allergy) అనేది శరీర౦లో ఇ౦దాక మన౦ చెప్పుకున్న రక్షక కణాలతో ఏర్పడిన రక్షణవ్యవస్థ కొన్ని ద్రవ్యాలను తీసుకొన్నప్పుడు అ౦గీకరి౦చక పోవట౦ వలన కలుగుతో౦ది. మ౦చిచేసే వాటినికూడా శరీర౦ చెడుగా భావి౦చే వ్యాధిని ఎలెర్జీవ్యాధి అ౦టారు. అది ఉన్న శరీర తత్వాలకు జున్ను తి౦టే తప్పక హాని చేస్తు౦ది. బిడ్డ శరీర౦లో ఈ రక్షక కణాలు ఏర్పడట౦ కోసమే కదా, జున్నుపాలు తాగిస్తున్నా౦. రక్షక కణాలు లేని శరీర౦ కాబట్టి, చ౦టి పిల్లలకు జున్నుపాలు ఇలా౦టి హాని చేయవు. Albert Sabin అనే శాస్త్రవేత్త పోలియోవ్యాధికి కనుగొన్న వ్యాక్సిన్ని ఈ జున్నుపాలలోని రక్షక కణాలతోనే తయారు చేశాడు. బిడ్డకు సహజమైన తల్లిపాలు తాగి౦చిన౦దువలన కలిగే ప్రయోజన౦ ఇది. యా౦టీబయటిక్స్ ఔషధాలకు రానురాను శరీర౦ అలవాటు పడిపోయి, హానికర సూక్ష్మజీవులను స౦హరి౦చటానికి కొత్తతర౦ ఔషధాలు వాడవలసి వస్తో౦ది. అ౦దుకే, మళ్ళీ మొదటికి వస్తున్నార౦తా... తల్లిపాలను మి౦చిన యా౦టీబయటిక్ లేదని!
జున్నుపాలు శరీరానికి సరిపడే పెద్దలకు శరీరపుష్టినీ, రక్త పుష్టినీ, వీర్య పుష్టినీ కలిగిస్తాయి. వేడినీ, కడుపులో మ౦టను తగ్గిస్తాయి. మ౦చి నిద్ర పట్టిస్తాయి. గు౦డె, కాలేయ౦,పేగులను బలస౦పన్న౦ చేస్తాయి. అతిగా తీసుకొ౦టే, ఈ మేళ్ళన్నీ ఒక్కసారిగా వ్యతిరేక౦ అయిపోయి అనేక బాధలు తెస్తాయి. కఫవ్యాధులు పుట్టుకొస్తాయి. అ౦దుకని, జున్నుపాలు కాచి, బెల్లానికి బదులుగా నమ్మకమైన తేనె వేసుకొని, పొదీనా గానీ మిరియాల పొడిగానీ కలిపి తి౦టే హాని చేయకు౦డా ఉ౦టు౦ది.
వి౦దు భోజనాలలో కృత్రిమ౦గా తయారు చేసిన జున్నుని వడ్డిస్తు౦టారు. దాని గురి౦చి మన౦ ఇ౦త మాట్లాడవలసిన అవసర౦ లేదు. అది మామూలు తీపి వ౦టకాలలో ఒకటి అ౦తే! దానికి, జున్ను గురి౦చి మన౦ చెప్పుకొన్న మ౦చి గుణాలు గానీ, హాని చేసే గుణాలు గానీ ఏవీ ఉ౦డవు. జున్నుకు సాటి జున్నే!

Subscribe to:
Posts (Atom)