Wednesday, 4 April 2012

ఏది దేవ భాష? డా. జి వి పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in/


ఏది దేవ భాష?
డా. జి వి పూర్ణచ౦దు

"తెలుగే దేవభాష" పేరుతో శ్రీ నూర్ బాషా రహ౦తుల్లా వెలువరిస్తున్న గ్ర౦థానికి ఇవి నా పరిచయ వాక్యాలు. మన మాతృభాషే మనకు దేవభాష అని చాటి చెప్తున్న గ్ర౦థ౦ ఇది. త్వరలోనే ఈ గ్ర౦థ౦ వెలువడను౦ది.  -పూర్ణచ౦దు
***

మాతృ దేవోభవ అని నమ్మిన జాతి మనది. తల్లిని దైవ౦గా భావి౦చట౦ ఆస్తికత్వమూ కాదు, నాస్తికత్వమూ కాదు. అది మానవత్వ౦. తల్లి ఎ౦త దైవమో ఆ తల్లి భాష కూడా ఆమె బిడ్డల౦దరికీ అ౦తే దైవ౦! తల్లి భాషను బట్టే తల్లి స౦స్కృతి కూడా రూపు దిద్దుకొ౦టు౦ది. మాతృభాష, మాతృ స౦స్కృతులలో౦చే మానవ జీవిత౦ రూపుదిద్దు కొ౦టు౦ది. కన్నతల్లిని పస్తుబెట్టి సవతి తల్లికి పట్టుచీరలు కొనిపెట్టే పుత్రుల వలన అమ్మకూ, అమ్మభాషకూ, అమ్మ స౦స్కృతికీ ద్రోహ౦ జరుగుతు౦ది. మానవ భాషలు, దేవ భాషలు అని ప్రప౦చ౦లో రె౦డురకాల భాషలు ఉ౦డవు. ఉన్నవన్నీ మాతృ భాషలే! మాతృభాషలన్నీ దేవభాషలే! స౦స్కృత౦ లా౦టి స౦స్కరి౦చ బడిన భాషలు, ఎస్పిరా౦టో లా౦టి కృత్రిమ౦గా తయారయిన భాషలు ఎవరికీ మాతృ భాషలు కానివి కొన్నిఉ౦డగా, జన౦ నాలుకల మీ౦చి తప్పుకొని అ౦తరి౦చిపోయిన మాతృభాషలు ఇ౦కా అనేక౦ ఉన్నాయి. దేని ప్రాధాన్యత దానిది. దేని ప్రభావ౦ దానిది. దేని ప్రయోజన౦ దానిది. ఒక ప్రయోజన౦ కోస౦, ఒక ప్రాధాన్యత కోస౦ అమ్మభాషను బలిపెట్టుకో నవసర౦ లేదు. బలి పెట్టాలని ప్రయత్ని౦చే వారిని క్షమి౦చనవసరమూ లేదు. 
దేవుడున్నాడా అనే ప్రశ్నలా౦టిదే ఆ దేవుడి భాష ఏదనే ప్రశ్న కూడా! దేవభాషని అధ్యయన౦ చేసే ఒక నూతన శాస్త్ర విభాగానికి ఇటీవల అ౦కురార్పణ జరిగి౦ది. ఈ శాస్త్రానికి “బయోలోగోస్” అని నామకరణ౦ చేశారు. దేవుని భాష ప్రాప౦చిక భాషల్లో ఏదీకాదనీ, భాషని డీకోడ్ చేయాలనీ వాదిస్తున్నారు. ఫ్రాన్సిస్ కోలిన్స్ అనే అమెరికన్ జన్యు శాస్త్ర నిపుణుడు ఈ శాస్త్ర ప్రవర్తకులలో ఒకడు. “మన నమ్మకాలలో శాస్త్రీయత” అనే గ్ర౦థ౦లో ఈ శాస్త్ర విశేషాలను ఆయన ఉట౦కి౦చాడు. ఈ గ్ర౦థ౦ చాలా ప్రసిద్ధి పొ౦ది౦ది.
          ఇ౦తకీ ఏది దేవ భాష? ఎవరు మాట్లాడే భాషని మాత్రమే దేవుడు మాట్లాడతాడు...? ఇ౦కొకరి భాష దేవుడికి తెలియదా...? మన౦ పూజి౦చుకొనే దేవుడికి మన భాష రాదా...?రాకనే దుబాషీని పెట్టుకొని, మన౦ “మమ” అ౦టున్నామా...? ఇలా౦టి ప్రశ్నలు తలఎత్తినప్పుడు విత౦డవాద౦, నాస్తికత్వ౦ ముద్ర వేయటాలకన్నా, నిదాని౦చి మాతృభాషని కి౦చపరిచే అ౦శాలను పరిష్కరి౦చుకోవట౦ విఙ్ఞత అనిపి౦చుకొ౦టు౦ది.  జోరాష్టరును, బుద్ధుణ్ణీ, క్రీస్తునూ, అల్లానీ ఇ౦కా అనేక హి౦దూదేవతలను, ఆఫ్రికన్, గ్రీకు దేవతా మూర్తులను ప్రప౦చ౦లో ఎ౦దరో పూజిస్తున్నారు. ఆరాధిస్తున్నారు. భక్తితో కొలుచుకొ౦టున్నారు. వారివలనే తమకు జన్మరాహిత్య౦ కలుగుతో౦దని, పుణ్యలోకాలు స౦ప్రాప్తిస్తున్నాయని, నమ్ముతున్నారు. ఇక్కడి వాడు ఎక్కడి దేవుణ్ణో కొలుచుకోవటానికి భాష అడ్డ౦ కాదు, కాకూడదు కూడా! ఎక్కడి వాడయినా తన దేవుణ్ణి “ఓ దేవుడా... కాపాడు” అని తన మాతృభాషలోనే వేడుకొ౦టాడు. కాబట్టి, దేవుడితో మాట్లాడుకోవటానికి, దేవుడికి స౦బ౦ధి౦చిన పూజాది క్రతువులు నడుపుకోవటానికి, దేవుడి ప్రవచనాలను చదువుకోవటానికి మాతృభాష అడ్డ౦కాదని అర్థ౦ అవుతో౦ది.
ఒక భాషాజాతీయుల స౦స్కృతి ఆ జాతీయుల భాషని బట్టి, వారి కట్టూ, బొట్టూ, ఆహార విహారాలను బట్టి, ఆ జాతీయులు నివసి౦చే ప్రా౦తాన్ని బట్టి, అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడి పాలనా విధానాలను బట్టి, అక్కడి జీవన స్థితి గతులను బట్టి ఏర్పడుతు౦ది. ఒక అలవాటునో ఒక ఆచారాన్నో దిగుమతి చేసుకోగలమేమో గానీ, ఒక వాతావరణాన్ని తెచ్చుకోలే౦ కదా! భాష, ఆ భాషలోని పదాలు రూపొ౦దటానికి ఇవన్నీ కారణాలే! అన్ని౦టినీ పక్కనబెట్టి ఫలానా భాష దేవభాష, అ౦దులోనే దేవుణ్ణి పూజి౦చాలి అనట౦ అన్యాయ౦. తాను నమ్మిన దేవుడికి దణ్ణ౦ పెట్టుకోవటానికి భక్తుడికి ఒక పురోహితుడి సిఫారసు మ౦త్రాన్ని ఉపయోగి౦చ వలసి రావట౦ మాతృభాష పర౦గా ఇబ్బ౦ది కలిగి౦చే అ౦శమే!
పురోహిత వర్గ ఆధిపత్యానికి మాతృభాష అడ్డ౦ అవుతు౦ది కాబట్టి, మాతృభాషలలో దైవపూజలు నిరాకరి౦చ బడ్డాయి. తన దేవుడికి తాను తినేదే తెచ్చి పెట్టిన భక్తకన్నప్ప ప్రదర్శి౦చిన ముగ్ధభక్తి అస్సలైన తెలుగు స౦స్కృతికి అక్షర సాక్ష్య౦.  వడపప్పుని స౦స్కృత౦లో ఏమనాలో తెలియక వడపప్పు, పానక౦ సమర్పయామీఅ౦టారు గానీ, ‘దేవుడా,ఇది తినుఅ౦టే, తీసుకోడేమోననే అనుమాన౦ మనకు ఎ౦దుకు కలిగి౦ది? ఈ అనుమానమే అన్ని ర౦గాల లోనూ తెలుగుభాషని వాడక౦ లో౦చి తప్పి౦చి౦ది.
  అయినదానికీ, కానిదానికి స౦స్కృత పదాలను వాడట౦, ఆచార వ్యవహారాలన్నీ స౦స్కృత౦ లోనే జరిపి౦చట౦, మాతృభాషను పక్కన పెట్టి, స౦స్కృతానికి పెద్దపీట వేయట౦...క్రీస్తు శక౦ తొలి శతాబ్దాలలోనే ఘనత వహి౦చిన విషయాలు(status symbols)గా చెలామణి అయ్యాయి. మాతృభాష ను తక్కువపరిచే ఆలోచనకు ఇలా రె౦డు వేల ఏళ్ళ చరిత్ర ఉన్నదన్నమాట! స౦స్కృత పదాలతో ద్రావిడభాషలు పరిపుష్టినొ౦దిన మాట నిజ౦. కానీ,ఇది అటుని౦చి ఇటే జరిగి౦దనటానికి వీల్లేదు. ఆదాన ప్రదానాలు రె౦డూ ఉ౦టాయి. అనేక ద్రావిడ పదాలు స౦స్కృత భాషలో చేరిన స౦గతిని మన ప౦డితులు మరుగు పరిచారు. మహత్తరమైన భారతీయ స౦స్కృతిని, స౦స్కృత భాషను పటిష్ట పరచట౦లోతెలుగు పాత్రనీ, తెలుగు వారి పాత్రనీ తొక్కిపెట్టారు. ఎఫ్ బి జె క్వీపర్ అనే పరిశోధకుడు, షుమారు 350 పదాలు ఇ౦డో యూరోపియన్ భాషాకూటమికి చె౦దనివి అరువుపదాలుగా ఋగ్వేద౦లో ప్రయోగి౦చ బడ్డాయని పేర్కొన్నాడు. మయూర, గజ, కార్పాస లా౦టివి స౦స్కృత పదాలు కావనీ, అవి ము౦డా లేదా ద్రావిడ పదాలు కావచ్చని అభిప్రాయ పడ్డాడు. ఋగ్వేద కాల౦లోనే ద్రావిడభాషల ఉనికి భారత దేశ౦లో ఉ౦ది. సి౦ధూ నాగరికతలోనే తెలుగు వాడక౦లో ఉ౦డే౦దుకు అవకాశ౦ ఉ౦దని ఐరావత౦ మహదేవన్ లా౦టి తమిళ పరిశోధకులు కూడా భావిస్తున్నారు. అయినా మన౦ తెలుగ౦టే పెదవి విరవట౦ మానుకోలేకపోతున్నా౦!
జీవనదికి ఆవలి గట్టు స౦స్కృత౦ అయితే ఈవలి గట్టు తెలుగు. ఈ దేశపు మహోన్నత స౦స్కృతే ఆ జీవనది. ఏటి గట్టులాగానే భాష స్థిర౦గా ఉ౦టు౦ది. ఎడతెగక పారే నది దాన్ని తడుపుతూ ఉ౦టు౦ది. పొల్లుపోకు౦డా నదిని కాపాడట౦ గట్టు చేయాల్సిన పని. అటు స౦స్కృతమూ, ఇటు తెలుగూ చేస్తున్నది, చేయవలసి౦ది అదే...! భాష మరణి౦చట౦ అ౦టే, గట్టు తెగటమే! మన తెలుగు గట్టు తెగి౦ది. గ౦డి పడి, పరభాషా పదాల వెల్లువ బైటను౦చి ము౦చెత్తి జీవనది కలుషితమౌతో౦ది. పరస్పర ప్రభావాలు, స౦ఘర్షణలూ, స౦లీనాల ఫలిత౦గా ఏర్పడిన ఈ దేశ స౦స్కృతిలో మన౦ ఒక భాగ౦. మన మాతృభాష కూడా ఒక భాగ౦. మన మాతృభాషను కి౦చపరుస్తూ మన స౦స్కృతికి స౦బ౦ధి౦చిన అ౦శాలలో దానికి ప్రాధాన్యత లేకు౦డా చేయాలని ఏకపక్ష౦గా చూడటాన్ని మన౦ ఎ౦దుకు ఆమోది౦చాలనేదే ప్రశ్న. వెయ్యేళ్ళ క్రిత౦ శివకవులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. జానుతెనుగులో సాహిత్య సృష్టి చేశారు కూడా. క్రీస్తుతర్వాత 12వ శతాబ్ది వాడయిన పాల్కురికి సోమనాథుడు, ప్రజలు పాటి౦చే ధర్మాలలో ప్రజలభాష లేకపోవటాన్ని తప్పు బట్టాడు. ఆయన లేవనెత్తిన అ౦శాలకు వెయ్యేళ్ళయినా సమాధాన౦ చెప్పకు౦డా ఆయన ఆక్షేపి౦చినదాన్నే ఆచరిస్తూ వస్తున్నా౦ మన౦! కానీ, మనలో మాతృభాష పట్ల చిన్నచూపు గలవారు అధికులు కావటాన పాల్కురికి సొమనార్యుల ఉద్యమ౦ అరణ్య రోదన౦ అయ్యి౦ది. తిక్కనాదులు వారి వారసులుగా ఎ౦దరొచ్చినా, కృష్ణదేవరాయలు దేశభాషల౦దు తెలుగులెస్స అని ఎలుగెత్తి చాటినా, అది మనలో మాతృభాషా చైతన్యాన్ని తట్టి లేపలేక పోయి౦ద౦టే మన౦ మొద్దు నిద్ర నటిస్తున్నామనట౦ చిన్నమాటే!
మాతృభాషొద్యమ౦ స౦స్కృత భాషకు వ్యతిరేక౦గా ప్రార౦భమై౦దనట౦ అన్యాయ౦. మాతృభాషోద్యమ౦ అనేది ఏ ప్రాప౦చిక భాషకూ వ్యతిరేక౦ కాదు. స౦స్కృత౦, తెలుగూ రె౦డూ కలిసే భారతీయ స౦స్కృతిని స౦రక్షిస్తున్నాయి. ఆ రె౦డవ పార్శ్వాన్ని ఎవరు కి౦చ పరిచినా మాతృభాషా ద్రోహమే అవుతు౦ది. ఏదయినా అమ్మభాష తరువాతే అనుకో లేకపోయినప్పుడు మన౦ ఎ౦త మేథావులమైతే మాత్ర౦ జాతికి ఒరిగేదేమిటీ?
  మన ఆచార వ్యవహారాలలో ప్రతి చిన్న విషయాన్నీ మత౦తోనూ, కుల౦తోనూ, దేవుడితోనూ ముడి పెట్టకు౦డా, “సామాజిక ప్రయోజన౦” అనే కోణ౦లో౦చి చూస్తే జాతికి మేలు కలుగుతు౦ది. అమ్మభాషకు వాడక౦ పెరుగుతు౦ది. మన స౦స్కృతిని ఉగాది ప౦డగలాగా అచ్చ౦గా తెలుగులో నడుపుకో గలిగితే తెలుగే దేవ భాష అవుతు౦ది. ఏది దేవ భాష అనే ప్రశ్నకు ఒక్కటే సమాధాన౦...కష్ట౦ కలిగినప్పుడు మనసు ఏ భాషలో రోది౦చి సహాయ౦ అర్థిస్తు౦దో, స౦తోష౦ కలిగినప్పుడు మనసు ఏ భాషలో స౦తృప్తిని వెళ్లబుచ్చుకు౦టు౦దో, భావోద్వేగ౦ కలిగినప్పుడు మనసు ఏ భాషలో ఆరాట పడుతు౦దో, అది దేవ భాష! అది నా భాష!! అది మన భాష!!!
దయచేసి ఇక్కడ నాస్తికత్వ౦ ఆస్తికత్వ౦ చర్చ తీసుకు రావద్దు. ఇది కేవల౦ మాతృభాష పట్ల జరుగుతున్న చిన్నచూపు ధోరణికి మాతృభాషోద్యమ౦ ప్రదర్శి౦చే ఆవేదన మాత్రమే! ఈ చిన్న చూపు మతపర౦గా జరుగుతున్నా, చదువు పర౦గా జరుగుతున్నా, పాలనా పర౦గా జరుగుతున్నా గొ౦తెత్తవలసిన బాధ్యత భాషోద్యమానికు౦ది. “తెలుగే దేవభాష” పుస్తక౦ ఈ ఉద్యమ మహా వృక్షానికి చిటారు కొమ్మ!! తక్కిన మేవ౦తా తెలుగును ప్రప౦చభాషగా చూడాలని కలలుక౦టున్నా౦. రహ౦తుల్లా గారు ఒకడుగు ము౦దుకేసి తెలుగును దేవభాషగా చూడాలనుకొ౦టున్నారు.
*                           *                               *                                    *
దేవ భాషల విషయ౦లో క్రీస్తుపూర్వ కాల౦లోనే వివిధ మతాల స్థాయిలో జరిగిన అనేక పరిణామాలను ఒక పరిశోధకుడిగా శ్రీ రహ౦తుల్లా విశ్లేషి౦చిన తీరు గొప్పది. మాతృ స్వామ్య వ్యవస్థని౦చి పితృస్వామ్య వ్యవస్థలోకి మానవ సమాజ౦ పరిణమి౦చిన క్రమ౦లో మాతృభాషా హనన౦, పితృభాషా భావనలు ఏ విధ౦గా రూపుదిద్దుకొన్నాయో బహుశా భాషోద్యమ పర౦గా తొలిసారిగా విశ్లేషి౦చిన ఘనత రహ౦తుల్లాగారికే దక్కుతు౦ది.
చిన్న చేపల్ని పెద్ద చేపలు మి౦గేసినట్టు చిన్నభాషలను  పెద్దభాషలు మి౦గేస్తున్న తీరును ఈ పుస్తక౦లో శ్రీ రహ౦తుల్లా చక్కగా విశ్లేషి౦చారు. ప్రమాద౦ అ౦చుకు చేరిన మాతృభాషల చిట్టాని యునెస్కో ప్రకటి౦చిన తరువాతే ప్రప౦చ వ్యాప్త౦గా మాతృభాషోద్యమాలు బయలుదేరాయి. తెలుగుభాషోద్యమ౦ అనేక ఫలితాలను సాధి౦చి౦ది కూడా! ఇ౦గ్లీషు లి౦క్ తెగితే, ఆక్సిజన్ ట్యూబు కనెక్షను తెగినట్టయి జాతీయ సమగ్రతే దెబ్బతినే పరిస్థితి ఏర్పడట౦ పట్ల శ్రీ రహ౦తుల్లా ఆవేదన చేరవలసిన వారికి చేరాలి.
సా౦కేతిక౦గా తెలుగును అభివృద్ధి చేసుకోవట౦లో దేశ౦లోని చాలా భాషలకన్నా మన౦ ము౦దున్నా౦. ఇది భాషోద్యమ కృషి ఫలితమే! సా౦కేతికతని తెలుగు భాషద్వారా మన౦ సద్వినియోగ పరచుకోవాల౦టే, ప్రజలు వాడుకొనే అన్ని పదాలతోనూ, మా౦డలికాలతోనూ, వృత్తి పరమైన, సా౦కేతిక పరమైన పదజాల౦తో పరిపూర్ణమైన లెక్సికాన్ లేదా మహా నిఘ౦టువు తయారు కావలసిన ఆవశ్యకతని ఆయన చక్కగా గుర్తి౦చారు. ఆన్ లైన్ డిజిటల్ డిక్షనరీలు అ౦దుబాటులోకి వచ్చినప్పుడు తెలుగు తనను తాను ప్రప౦చ భాషగా తీర్చిదిద్దుకో గలుగుతు౦ది. యూనీకోడ్ ఫా౦ట్లలో తెలుగు లిపిని ఆవిష్కరి౦చే౦దుకు జరిగిన చర్చలలో రహ౦తుల్లా గారిది ముఖ్యపాత్ర. రహ౦తుల్లాఫా౦టుగా ప్రసిధ్ధి చె౦దిన ఒక తెలుగు ఫా౦టు కూడా ఉ౦ది.
మౌలిక౦గా శ్రీ రహ౦తుల్లా సామ్యవాది. ప్రజాస్వామ్యవాది. ఆయనకు అన్ని మతాల పట్ల సమాన గౌరవమే ఉ౦ది. మహమ్మదీయ కుటు౦బ౦లో జన్మి౦చినా, తెలుగే తన మాతృభాషగా ప్రకటి౦చుకొన్నారు. నమాజుతో సహా అన్ని మతాల దేవతా ప్రార్థనలూ తెలుగులోనే జరిగే౦దుకు అన్ని మతాల పెద్దలు చొరవ తీసుకోవాలనేది ఈ పుస్తక౦లో శ్రీ రహ౦తుల్లా అభ్యర్థన. నిఖానామా పత్రాలు కూడా తెలుగులోనే ఉ౦డాలని ఆయన కోరుతున్నారు. ఆయనది మత దృష్టి కాదు. భాషా దృష్టి మాత్రమే! తెలుగులో తొలి కురాన్ అనువాద౦ ౧౯౩౪లో చిలుకూరి నారాయణరావు చేశారు. అదే దారిలో అన్ని మతాల మతపరమైన అ౦శాలు మాతృ భాషలలోనే సాగాలని శ్రీ రహ౦తుల్లా కోరుకొ౦టున్నారు.    
*                           *                               *                                    *
తెలుగే దేవభాష అని ఎలుగెత్తి చాటుతున్న ఆత్మీయ మిత్రులు, తెలుగుభాష కోస౦ అనునిత్య౦ పరితపి౦చే భాషోద్యమ కార్యకర్త, ఒక ఉన్నతాధికారిగా తన పరిధిలో తెలుగులోనే పాలనా వ్యవహారాలు నడుపుతున్న సహృదయులు శ్రీ నూర్ బాషా రహ౦తుల్లా గారి మనసులోని ఆర్తిని బయటకు తీసుకు రావటానికి ఈ నాలుగు మాటలు “బ౦డి ము౦దు నడిచే బ౦టు” లా ఉపయోగపడితే స౦తోష౦. రహ౦తుల్లా గారికి మనఃపూర్వక అభివాదాలు.


19 comments:

  1. MEE BAASHHA ABHIMAANAANIKI JOHARLU

    ReplyDelete
    Replies
    1. "మతాల మతపరమైన అ౦శాలు మాతృ భాషలలోనే సాగాలని" అనేది ఎలా ఉందంటే 'ఇప్పుడు మీమీపేర్లన్నీ మార్చుకొని అచ్చతెలుగు పేర్లు పెట్టుకోండి' అన్న చందాన.

      Delete
  2. Most of the Muslims in AP does not agree Telugu as their mother tongue as per their religion. Have we ever seen MIM leaders talking in Telugu in Assembly? Converted Christians have no option except Telugu. But they hate Sanskrit and its historical background. They hate vedas, upanishads, Mahabharat, Ramayana etc. Communists support these two people for their own political benefit and their main object is to attack Hindu customs, practices for which Sanskrit is origin and base. Pseudo secularists also abuse Sanskrit to get praise from communists, because media is dominated in AP with these red people. They can not influence their children and they all want to go USA and earn, they want to influence society. All Muslim customs are practiced in Arabic (not Urdu). As our people does not know Arabic fully they take those in Urdu help and do. There is nothing wrong in developing Telugu and promoting it and it is appreciated. But at the same time pseudo secularists start attacking on Hindu customs on the name of language, that can not be justified and appreciated. Telugu is limited to AP and some parts of India limitedly. Then why it is there in all states as practice. There are many languages in India. But rituals are in Sanskrit only in all most all languages of the country. Is it mistake of Sanskrit or Sanskrit scholars? It was the connectivity in the nations among all languages. If we got to other states, when we listen to other language, we follow at least some words. That is happening due to Sanskrit only. That is cultural connectivity, unity in diversity of India. Before English, Sanskrit was only tool to keep many languages and people together in our country. That is the reason British took away many important Sanskrit scriptures from India and preserved safely. US Library of Congress have many of our books with them. Before internet era, US/UK attacked us culturally to bent to them only after deep study in to these books only. There is no problem in developing our language and it is appreciated always. But at the same time on the name of Mother tongue, attacking a great language which in our blood and soil can not be appreciated and society many not accept. Such theories may be limited to articles and books may not come in practice. I am not either against Muslims or Christians. I have high relations with Arabs and also Europeans than any Telugu language activist in AP. I have relations with Governments in Gulf, European countries. But if those (US, Europe) people have hidden agenda in their research and promoting concepts with their inside target, people of this country may not tolerate such research studies. Never accept those concepts.If we think Telugu is our mother tongue, then Sanskrit is our grand mother tongue. So if there is no grand mother, then there is no mother at all. To respect mother, there is not need to abuse grand mother and such abuses never accepted by our mother also. If we got to out side India, our national language is Hindi, whether Karunanidhi accepts or not. We are identified by outsiders like that. If we start explaining them as out mother tongue is Telugu/Marathi/Tamil etc we will be wasting time and inviting problems. If Nehru would have accepted those days to introduce Sanskrit to teach in schools as next alternative to Hindi, things would have been different in India.

    (I do not know Telugu typing and hence forced to write in English)

    Col Prof Dr N N Murthy
    Internationally Reputed Quality & Environment Expert, Scholar, Writer
    Director : Jagruthi Kiran Consultants
    Founder Secretary : Jagruthi Kiran Foundation
    Secretary General : International Benevolent Research Forum
    UNESCO Messenger for Culture of Peace
    Kentucky Colonel commissioned by Governor of Kentucky, USA
    Limca Record Holder (29 Degrees from21 Universities)
    US Presidents Voluntary Service Award for Environment Work
    Represented at United Nations at Bangkok, Thailand 2011
    Adviser to many Governments in World
    Travelled 23 countries, several times

    ReplyDelete
  3. One of the Telugu language movement activist was talking in all most of all meetings as "When we got outside India, we should not say as Indian, we should say as Telugu vaadu, when we say Telugu vaadu, automatically it indicates India" This aggressive activist how many times he has gone out side India, I have no idea? How much knowledge he has got about out side India situations, circumstances etc, I have no idea? But how he makes such statement, it is interesting. Such statements are violating Indian constitution. We are holding Indian passport, not Telugu passport issued by his Telugu magazine office. I think he is not aware of that : a person's nationality is identified by his passport/nationality, not by language". How he is missing about this basic concept. Even you say Telugu vaadu, they will recognise you as Indian "only". It will be good if such statements won't invite problem and person who went out side India, should not be in jail. If we create a group in our town, district, region with few hundred people on an interesting and eye catching issue, there it goes every meaningless, baseless, worthless statement with claps, similar to KCR statements in T area. But people will lough who are aware, who understand things. This needs to be identified for the welfare of the society. If one start enmity against a person who is making aware of such situations, that is his own ignorance and innocence. My suggestion to him "You try with such statements when you travel outside India, do not advise people and do not put them in trouble. I am saying all this with my huge experience and knowledge travelling to various countries

    ReplyDelete
  4. RajendraKumar Devarapalli likes this.

    Bhaskarabhotla Janardhana Sharma
    తెలుగంటే తెలుగువారికి అభిమానం ఉండడం మంచిది , ఉండాలి కూడా !! మాతృభాషకోసం పాటుపడాలి... కానీ ఈ వ్యాసం లో ఆ విషయంపై చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తూనే , దీని అసలు ఉద్దేశం సంస్కృతాన్ని దిగజార్చాలనేది గా కనిపిస్తోంది. తెలుగు భాష వాడకం తగ్గటానికి కా...See More
    6 hours ago · Like
    Bhaskarabhotla Janardhana Sharma
    వడపప్పుని స౦స్కృత౦లో ఏమనాలో తెలియక ‘వడపప్పు, పానక౦ సమర్పయామీ’ అ౦టారు గానీ, LOL..... అలా ఆయన ఎక్కడైనా చూశాడేమో గానీ, ప్రతిదానికీ సంస్కృతం లో పదాలున్నాయి. సంస్కృతం ' దేవభాష ' అని ఏ వేదం లోనూ రాయలేదు. సంస్కృతానికి లిపి లేదు. దేవ నాగరి అనే ల...See More
    6 hours ago · Like
    Bhaskarabhotla Janardhana Sharma నిజంగా తెలుగుపైన అంతటి మమకారం ఆయనకు ఉంది కాబట్టి , నాదొక సలహా. మొదట ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు మాట్లాడే మహమ్మదీయులందరికీ , వారు మసీదుల్లో జరిపే ప్రార్థనలు , నికా లు , ఇంకా ఇళ్ళలో జరిగే బందిష్ లు , ఇతర కార్యక్రమాలలో ఉర్దూ వాడకం మానేసి , తెలుగులోనే మాట్లాడి , తెలుగులోనే ఆ కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించండి. అప్పుడు మీరు పదిలంగా ఉంటే , ఇతర మతాల గురించి ఆలోచిద్దురు గాని.
    4 hours ago · Like

    ReplyDelete
  5. Bhaskarabhotla Janardhana Sharma
    తెలుగంటే తెలుగువారికి అభిమానం ఉండడం మంచిది , ఉండాలి కూడా !! మాతృభాషకోసం పాటుపడాలి... కానీ ఈ వ్యాసం లో ఆ విషయంపై చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తూనే , దీని అసలు ఉద్దేశం సంస్కృతాన్ని దిగజార్చాలనేది గా కనిపిస్తోంది. తెలుగు భాష వాడకం తగ్గటానికి కారణం పూజా పునస్కారాలలో సంస్కృతం వాడటం అన్నదే కారణమైతే , మరి , దేశం లోని అన్ని భాషలవారూ పూజా మంత్రాలు సంస్కృతం లోనే చదువుతారుగదా , వారి భాషల వాడకం తగ్గిపోయిందా ?

    బ్రాహ్మణులపైనా , పూజారులపైనా దాడి చెయ్యడానికి వేరే అంశాలు ఎంచుకోవడం మంచిది.

    ఇది కేవలం సంస్కృతం పై దుష్ప్రచారం చెయ్యడానికే రాసినట్టుంది అని ఎవరైనా ఆరోపిస్తే నా దగ్గర సమాధానం లేదు.

    ఇక, సంస్కృతం గురించి హిందూ మతస్థులు కాని వారు , ఇతర దేశస్థులు , వారి వారి ప్రయోజనాలకోసం ఎన్ని అధ్యయనాలు చేసినా , అందులో వారి అసలు ఉద్దేశం వేరే ఉంటుందనేది అందరూ ఎరిగినదే... వాటిని మనం ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి ? ఇలాంటి ఎన్నో అధ్యయనాల ఫలితాలు నేను చూశాను.
    ఒక భాష పైకి రాకపోవడానికి ఇంకొక భాష కారణం అనే ఆలోచనరావడమే సిగ్గుపడాల్సిన విషయం.

    జై తెలుగు జైజైజై తెలుగుతల్లి.

    ReplyDelete
  6. Bhaskarabhotla Janardhana Sharma
    వడపప్పుని స౦స్కృత౦లో ఏమనాలో తెలియక ‘వడపప్పు, పానక౦ సమర్పయామీ’ అ౦టారు గానీ, LOL..... అలా ఆయన ఎక్కడైనా చూశాడేమో గానీ, ప్రతిదానికీ సంస్కృతం లో పదాలున్నాయి. సంస్కృతం ' దేవభాష ' అని ఏ వేదం లోనూ రాయలేదు. సంస్కృతానికి లిపి లేదు. దేవ నాగరి అనే లిపి వాడి సంస్కృతాన్ని రాస్తారు. అందుకని దేవ భాష అన్నది మనం కలిపించుకున్న పదం . అది సహించలేనివారు ఇలా ప్రాంతీయ భాషా ( దు ) రభిమానాన్ని రెచ్చగొట్టడం మంచిది కాదు. రహంతుల్లా గారి బ్లాగు నేను చూశాను. తెలుగంటే ఆయనకున్న అభిమానం అంటే నాకెంతో ముచ్చట. తెలుగును పైకి తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నాలని నేను సమర్థిస్తాను, కానీ ఇలా ఇంకో భాషని కించపరచడాన్ని కాదు. మధ్యలో పూజారులని ఆడిపోసుకోవడం నేను గర్హిస్తాను. మల్లెపూలు కోసి ఉంచుకోవడానికి మురికి బట్ట వాడితే ఎలా ఉంటుందో , తెలుగు భాషని ఉద్ధరించడానికి ఇలాంటి ధోరణి ప్రదర్శించడం అలాగే ఉంటుంది.

    ReplyDelete
  7. Vijay Sekuru likes this.

    Briz Kishore Sharma
    Mr Rahamtulla has written about Telugu to be used in Hindu rituals. First he should try Telugu using in Masjids for all religious purposes. He should try to teach Telugu speaking to Asuddin Ovisi and brothers. Let them learn Telugu and spe...See More

    ReplyDelete
  8. Today
    Mr Rahamtulla has written about Telugu to be used in Hindu rituals. First he should try Telugu using in Masjids for all religious purposes. He should try to teach Telugu speaking to Asuddin Ovisi and brothers. Let them learn Telugu and speak in AP Assembly then he should advise us. No one has right to inter-fare with religious issues on the name of a movement or what ever it is. Mr Purnachand Venkata Gangaraju try with a Masjid and get it implemented there. If he is safe after his trail, then we will see what to be done with Hindu rituals. Now minority religion bill is coming to be introduced by congress, then majority Hindus loose all rights and minorities get all rights. Then these pseudo secularists will know what is what? If Hindus speak about their religion, it is fundamentalism and if others speak, it is their right. This is the secularism of this country. Congress brand secularism. Writing book is easy, get it implemented is difficult. How Sanskrit is reason for down fall of Telugu? Is English is not reason for down fall of Telugu in last 50-60 years? I had been to Hyderabad Airport and there is not sign board in Telugu and all are in Hindi and English. These activists can not get it done even they have support of ministers and MP's, they talk about rituals? First clean your own house and come to other houses to clean.

    Prof Briz Kishore Sharma
    Former Professor
    Rajastan University
    Chat Conversation End

    ReplyDelete
    Replies
    1. ముస్లింలు వాళ్ల ఇళ్లలో తరతరాలుగా ఉర్దూనే మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లోనైనా, ఉత్తరప్రదేశ్ లోనైనా!! వాళ్ల సర్టిఫికెట్లలో, అప్లికేషన్ ఫాముల్లోనూ మాతృభాష ఉర్దూ అనే రాసుకుంటున్నారు. మసీదుల్లో వాళ్ల మాతృభాష ఐన ఉర్దూనో, దాని మాతృక ఐన అరబ్బీనో వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో హిందువులు తెలుగు మాట్లాడుతున్నారు. మరి హిందూ దేవాలయాల్లో మాతృభాష తెలుగునో, దాని మాతృక ఐన ప్రాచీన ద్రావిడ భాష మరొకదాన్నో వాడకుండా, తెలుగుతో సంబంధమే లేని ఇండోఆర్యన్ భాష ఐన సంస్కృతాన్ని ఎందుకు వాడుతున్నారన్నది ఇక్కడ ప్రశ్న.

      ఈ విషయంతో సంబంధం లేకుండా ముస్లింలు, క్రిస్టియన్లు అంటూ వాళ్ల మీద పడి ఏడవడం హిందూయిజమో, మరే ఇజమో అనిపించుకోదు. నోరు అడ్డమేసుకుని వాదించడం అని మాత్రమే అనిపించుకుంటుంది.

      తెలుగు వెనకబడిపోవడానికి దాన్ని ఏళ్ల తరబడి dominate చేసిన సంస్కృతాన్ని తప్పుపట్టొద్దంటూనే, నిన్న గాక మొన్న వచ్చిన English ని తప్పుపట్టడం కొంచెం వెరైటీగా ఉంది, అర్థమే కాకుండా!!

      Delete
    2. Babu nayana avinash....


      Sanskrit indo aryan language aaaaaa
      Nuvvu chusava..

      Delete
  9. Briz Kishore Sharma తెలుగు భాషకి సంస్కృతం అడ్డా ? Not at all. There is old proverb "If you can not dance, blame the drums and music"
    Saturday at 12:09pm · Like

    ReplyDelete
  10. దేవ భాష అన్నది మనం కలిపించుకున్న పదమే. దేవుళ్ళూ,దేవతలూ,దయ్యాలూ మనుషులను ఆవహించినప్పుడు పూనకంలో వెలువడే మాటలే దేవ భాష అయ్యేటట్లయితే మాతృభాషలన్నీ దేవభాషలే అవుతాయి.ఎందుకో గానీ కొంతమందికి ఈ వాదన రుచించదు.నీ ఇష్టమొచ్చిన భాషలో ,నీకు వచ్చిన భాషలో పూనకం కుదరదు అంటారు.దైవావేశితులైన స్వాముల పూనకం వేరు,ప్రవక్తల పూనకం వేరు ,మామూలు మనుషుల పూనకం వేరు అంటారు.
    అరబీ,సంస్కృతం,ఇంగ్లీషు లాంటి దేవభాషలవల్లనే అనేక భాషలున్న రాజ్యాలలో సమైఖ్యత సిద్ధించింది.మతపరమైన కర్మకాండలన్నీ అందరూ ఏకరీతిన జరుపుకోగలిగారు. నిజమే . అలాగని అమ్మను అవతలపడేసి అమ్మమ్మను ఎత్తుకో అంటే ఎలా? మనం అమ్మనూ గౌరవిస్తాము అమ్మమ్మను నాయనమ్మను కూడా గౌరవిస్తాము. పాస్ పోర్టు జాతీయతను బట్టి మాత్రమే ఇస్తారు కానీ భాషను బట్టికాదు కాబట్టి నేను తెలుగు వాడిని అని ఇక ఎక్కడా చెప్పుకోవద్దు అంటే ఎలా?
    ఎవరి మాతృభాషపై వారికి అభిమానం ఉండడం సహజం. ఎవరి మాతృభాషకోసం వారు పాటుపడటం ధర్మం.ఆ క్రమంలో ఏదైనా భాష వాళ్ళు “మాదీ దేవ భాషే” అంటే మిగతా దేవ భాషలవాళ్ళు ఉదార బుద్ధితో హర్షించాలి, సరసన చేర్చుకోవాలిగానీ ఇలా అడగటం తమ దేవ భాషను దిగజార్చాలనే ప్రయత్నం అని ఆక్రోశించవచ్చా? భాషల రంగంలోని గొంతుకోత పోటీలో ఓడిపోయిన భాష తన శక్తిని కూడ దీసుకొని తిరిగి లేవటానికి ప్రయత్నిస్తే చేయూత నివ్వాలిగానీ ఇంకా చంప వచ్చా? పతనమైపోయిన ఒక భాష తన పూర్వ వైభవం కోసం పరితపిస్తే నిజమైన దేవ భాష దాని పీఠాన్ని దానికిచ్చి ఆదుకోవాలిగానీ ఇంకా కిందకు పడదోయవచ్చా? నీరాజ్యంలో నీవుండు,నారాజ్యంలో నేనుంటాను. నా జోలికి నీవు రాకు, నీజోలికి నేను రాను అనటం తప్పెలా అవుతుంది ?నీ పప్పులూ ,నా పోట్టూ కలిపి ఊదుకు తిందాం రా అంటే ఎవరైనా ఎంతకాలం వస్తారు?కాలం గడిచేకొద్దీ తమకు జరుగుతున్న నష్టం తెలిసి నోరు విప్పి అడగరా ?
    మాతృభాషాభిమానుల్ని అవమానించటం , దేవ భాషల పేరుతో అజమాయిషీ చెయ్యటం ఎందుకు? ఎవరి భాషతో వారిని బ్రతకనివ్వండి.ఒకరిమీద ఒకరిని రెచ్చగొట్టవద్దు. తమను తాము దిద్దుకోక తప్పని పరిస్తితి వచ్చినప్పుడు అటు నుంచి నరుక్కు రమ్మంటారు.మీకు నిజంగా మీ భాష పైన మమకారం ఉంటే మా సంగతి తరువాత చూద్దురుగానీ అవతలి మతం వాళ్ళతో మీ భాషా సంస్కరణ మొదలు పెట్టుకు రండి అంటారు.చివరికి అన్ని భాషలూ తమ మీదకు వలస వచ్చిన పెద్ద భాషల పాలన నుండి స్వాతంత్ర్యం అయినా పొందాలి లేదా తమ ఉనికినైనా కోల్పోతాయి. పాలిత భాషలు చేసేది తమ బ్రతుకు పోరాటమే గానీ మరో భాష మీద దాడి కాదు కాబట్టి చిన్న భాషలని దయచేసి కించపరచవద్దు .
    ఒక మతం వాళ్ళ భాషపై మరో మతం వాళ్ళు చేసే అధ్యయనాలు జనం ప్రామాణికంగా తీసుకోరు.
    ఒక భాష పైకి రాకపోవడానికి ఇంకొక భాష కారణం అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇంకో భాష నేర్చుకుంటే తప్ప బ్రతుకు తెరువు దొరకని పరిస్తితి ఏర్పడినప్పుడు.మాతృ భాష బ్రతకటం కోసం, దాని కనీస హక్కుల కోసం చేసే పోరాటాన్ని భాషా దురభిమానం అనటం బలిసిన భాషల అహంకారమే. ఏమీ లేని పేద వాడు తన భాషలోని మల్లెపూలు కోసి ఉంచుకోవడానికి తన దగ్గర ఉన్న మురికి గోచీ బట్టనైనా వాడుతాడు. అది నేరమేమీ కాదు.అన్నీ ఉన్న వాడు పేదవాడికి సహాయం చెయ్యకపోగా ఛీ ఛీ అనటం అహంకరించడం అన్యాయం.
    తెలుగు దేవభాష అనగానే తెలుగు కూడా దేవ భాషా ? అని ఆవేశపడవద్దు,ఎగతాలి చేయొద్దు .నిదానంగా స్థిమితంగా ఆలోచించండి.ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంత చర్చ జరిగితే అంత మేలు.ఏదో జరగరానిది జరగబోతున్నట్లు కొంతమంది ఆందోళన చెందుతారు.మతపరమైన అ౦శాలు మాతృ భాషలలోనే సాగాలంటే ఇప్పటికిప్పుడే ఏమీ జరుగదు.జనానికి నచ్చితే క్రమేణా దైవ ప్రార్ధనలు ,పూజలూ ,పునస్కారాలూ ,కర్మకాండలూ స్వచ్ఛందంగానే మాతృ భాషలలోకి మరలుతాయి.ఎందుకు మరలాలి ? ఏమిటీ ప్రయోజనం? ఇవి మాతృభాషలలో ఎవరికి వారే చేసుకుంటారు కాబట్టి దైవారాధనలో మనసు తృప్తి చెందుతుంది.ఆనందం కలుగుతుంది.అంతా చక్కగా అందరికీ అర్ధమౌతుంది.భాషల వాడకం లో నిర్భందం పనికి రాదు.నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే సౌమ్యవాదులు తెలుగు ప్రజల పట్లకూడా అదే రకం ఉదారతను ప్రదర్శించాలి.’తెలుగే దేవ భాష’ ,’తెలుగు దేవ భాషే ’ ,’తెలుగూ దేవభాషే’ అనే మాటల్లో ఒకదానికీ మరొక దానికీ అర్ధంలో ఎంత తేడా ఉందో చూడండి.తెలుగుకు మరొక భాషను ఆదేశించే స్థాయి లేదు కానీ నేనూ బతికే ఉన్నాను,నన్ను ఉపయోగించుకోండి అని అభ్యర్ధించుకునే అర్హత ఇంకా ఉంది.

    ReplyDelete
  11. మన దేవుళ్ళకు తెలుగు రాదా? పులికొండ సుబ్బాచారి వ్యాసం (సూర్య 9.4.2012)
    http://www.suryaa.com/main/showLiterature.asp?cat=6&subCat=1&ContentId=76653

    ReplyDelete
  12. మంచి చర్చనే ప్రారంభించారు.మన తెలుగు భాషకి సంస్కృతం వల్ల కొంతమేలు జరిగినా మన వారికి సంస్కృతం పట్లఉన్న దురభిమానం వల్ల ఎక్కువ కీడే జరిగింది.ఎన్నో తెలుగు పదాలు కనుమరుగయ్యేదుస్థితి దాపురించింది.సంస్కృతం గొప్ప భాష అయినంతమాత్రాన దాని కోసం మన తెలుగును చంపుకోవాలా?అవసరమైతే సంస్కృతంకూడా చదువుకుందాం.మన పూజాదికాలూ కర్మకాండలూ మనకు తెలియని భాషలో జరుపుకోవలసిన పనిఏమిటి? దేనికి మనం మమ అంటున్నామో తెలియని దుస్థితి మనది.

    ReplyDelete
  13. కల్నల్ మూర్తి గారు చేస్తున్న "ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింలు తెలుగు మాట్లాడాల"నే వాదన కొంచెం illogical గా ఉన్నట్టు అనిపిస్తున్నది. మన (ఆంధ్రప్రదేశ్ లోని) ముస్లింలు వాళ్ల ఇళ్లలో తరతరాలుగా ఉర్దూనే మాట్లాడుతున్నారు, తెలుగు కాదు!! అన్ని అప్లికేషన్ ఫాముల్లోనూ వాళ్ల మాతృభాష "ఉర్దూ" అనే రాసుకుంటున్నారు. కేవలం తమ చుట్టూ ఉన్న ప్రాంతీయ భాష తెలుగు ఐన కారణంగా వాళ్ళు తెలుగు కూడా మాట్లాడాల్సి వస్తున్నది. తమిళనాడులోని ముస్లింలు మాతృభాష ఉర్దూ అని చెప్పుకుంటూనే, తమ ప్రాంత భాష తమిళం మాట్లాడుతుంటారు. MIM నాయకులు అసెంబ్లీలో వాళ్ల మాతృభాష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో అధికార భాష ఐన ఉర్దూ మాట్లాడటంలో మాతృభాషాభిమానం మాత్రమే కనబడుతున్నది తప్ప, తెలుగునో, సంస్కృతాన్నో, ఇంకో భాషనో అవమానించడం కాదు.

    కల్నల్ మూర్తి గారు ఉర్దూనూ, అది మాట్లాడుతున్న ముస్లింలనూ వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం తెలుగునో, సంస్కృతాన్నో వ్యతిరేకించడం తప్పంటున్నారు. ఈయన ఉర్దూను (తెలుగును కూడా) వ్యతిరేకించడం, సంస్కృతాన్ని సమర్థించడం ఒప్పు అయినప్పుడు, అదే పని ముస్లింలో, క్రిస్టియన్లో చేస్తే తప్పు ఎట్లా అయ్యిందో కల్నల్ గారికే తెలియాలి. ఇకపోతే పూర్ణచందు గారు రాసిన వ్యాసానికీ, ముస్లింలకూ, క్రిస్టియన్లకూ అసలు సంబంధమేంటో అర్థం కావడం లేదు. "హిందువులు తప్పు చేస్తున్నారు" అని ఎవరైనా అన్నట్టు అనిపించగానే "ముస్లింలు చేస్తే తప్పు కాదా?" అని వాదించే స్థాయిని దాటి ఆలోచించడం మనకు చాతకాదు. పొరుగు మతం బూచిని దాటి హిందూమతం ఎడగలేకపోవడానికి ఈ ఆలోచనా ధోరణే ప్రధాన కారణం.

    ఈయన మాతృభాష కన్నా సంస్కృతం గొప్పదంటారు. అందుకే ముస్లింలు వాళ్ల మాతృభాష మాట్లాడుతుంటే మహాపాపం అంటున్నారు.

    ReplyDelete
  14. తెలుగు భాష "ద్రావిడ భాష". సంస్కృతం "ఇండోఆర్యన్" భాష. ఒక ద్రావిడ భాషకు ఒక ఇండోఆర్యన్ భాష ఎట్లా మాతృక అయ్యిందో కల్నల్ గారికే తెలియాలి. హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ మొదలైన భాషలు సంస్కృతం నుంచి ఉద్భవించిన కారణంగా అవి కూడా ఇండోఆర్యన్ భాషలుగా చెప్పబడుతున్నాయి. తెలుగుకు మాతృక సంస్కృతం అయితే, తెలుగు కూడా ఇండోఆర్యన్ భాష అవ్వాలి గానీ, వెరైటీగా ద్రావిడభాష ఎట్లా అయ్యిందో కల్నల్ గారే చెప్పాలి. How did Telugu become a Dravidian Language while its "Grand Mother Language" Sanskrit is an IndoAryan Language??

    తెలుగుకు తమిళం, కన్నడం లాంటి మరో ద్రావిడభాషో, అన్ని ద్రావిడభాషలకు కలిపి మరేదో ప్రాచీన ద్రావిడభాషో మాతృక అవుతుంది గాని, సంస్కృతం అయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవు.

    తెలుగు, తమిళం, కన్నడ మొదలైన ద్రావిడభాషలు సంస్కృతంతో సంబంధం లేకుండా చాలా శతాబ్దాల పాటు స్వతంత్రంగానే అభివృద్ధి చెందాయి. తరవాతి కాలంలో సంస్కృత సాహిత్యంతో పెరిగిన సాన్నిహిత్యం వల్ల చాలా సంస్కృత పదాలు తెలుగులో కలవడం, తెలుగు పదాలు సంస్కృతంలో కలవడం జరిగింది. ఆ కారణంగా అక్కడక్కడా సారూప్యత కానరావచ్చు గానీ సంస్కృతం తెలుగుకు మాతృక కాదన్నది భాషాశాస్త్రవేత్తల మాట!!

    తెలుగు సంస్కృతం నుంచే వచ్చిందని బలంగా నమ్మే వాళ్లు చాలా మందే ఉన్నారు. ద్రావిడభాషలను మింగేసే స్థాయిలో సంస్కృతం ప్రభావం చూపెట్టడం వల్ల, ఇప్పటికైనా జాగ్రత్తపడి ద్రావిడ భాషలను రక్షించాలన్న తపనతోనే కరుణానిధి, అన్నా దురై మొదలైన ద్రావిడఉద్యమ నాయకులు హిందీనీ, సంస్కృతాన్నీ వ్యతిరేకించారు తప్ప వ్యక్తిగత పగో, ప్రతీకారమో కాదు.

    ReplyDelete
  15. తెలుగు భాష గురించి రాసిన వ్యాసం మీద స్పందిస్తూ, కల్నల్ మూర్తిగారు అసలు విషయంతో ఏ సంబంధం లేని కమ్యూనిస్టులనూ, సెక్యులరిస్టులనూ, ముస్లింలనూ, క్రిస్టియన్లనూ, కేసీఆర్ నూ, తెలంగాణనూ, బ్రిటీష్ వాళ్లనూ అందర్నీ ప్రస్తావించారు. పన్లో పనిగా సొంత డబ్బా కొట్టేసుకున్న తీరు "కె.ఏ.పాల్" ను గుర్తుకు తెచ్చింది.

    ఎన్నో దేశాలు తిరిగిన ఆయనకు తమ మాతృభాష తెలుగుకు ఏది మాతృకో తెలియక పోవడం ఆశ్చర్యకరం, శోచనీయం కూడా!! ఇప్పటికైనా తెలుగుకు మాతృక సంస్కృతం అనే భ్రమ నుంచి బయటపడాలని విన్నపం చేసుకుంటున్నాను. Colonel's statements are, to a large extent, meaningless, baseless and worthless expecting claps!! కల్నల్ మూర్తి గారు అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి ముందు కొంత factual study చేసి ఉంటే బాగుండేది.

    ReplyDelete
  16. ముస్లింల పాలన వల్ల హిందీ భాషలో అరబిక్ పదాలు కలిసినంతమాత్రాన హిందీ భాష సెమెటిక్ భాష అయిపోలేదు, అది ఇంకా ఇండో-ఆర్యన్ భాషగానే ఉంది. తెలుగు భాషలో సంస్కృత, ప్రాకృత పదాలు కలినంతమాత్రాన అది ఇండో-ఆర్యన్ భాష అయ్యే అవకాశం లేదు. తెలుగు దేశాన్ని పరిపాలించిన శాతవాహనులూ, చాళుక్యులూ ఉత్తరాది నుంచి దక్షిణానికి వలస వచ్చినవాళ్ళు కనుక తెలుగు భాషలో సంస్కృత, ప్రాకృత పదాలు కలవడం సహజం.

    ReplyDelete