Friday 8 June 2012

శరీరాన్ని పాలి౦చే పాలు డా. జి. వి. పూర్ణచoదుhttp://drgvpurnachand.blogspot.in


శరీరాన్ని పాలి0చే పాలు
డా. జి. వి. పూర్ణచ0దు
పాలు అత్య0త ప్రాచీన తెలుగుద0. పాలు, పెరుగులా0టి శబ్దాల మూలాలు తెలిస్తే తెలుగు ప్రజల స0స్కృతి, ప్రాచీనతlu గురి౦చి మనకు ఒక అవగాహన ఏర్పడుతు౦ది. చే0ప్(చేపు), పాల్(పాలు), పి0డ్ (పి0డు), పిస్ఉక్(పిసుకు), సల్(చల్ల) పదాలు తెలుగు మూలభాష (ప్రోటో తెలుగు)లో కనిపిస్తాయి. ఈ మూలభాషకు బ్రొన్నికోవ్ లా౦టి కొ౦దరు విదేశీ భాషా వేత్తలు ద్రవిడియన్ ఎటిమాలజీ పేరుతో ఊహాత్మక౦గా ఒక నిఘ౦టువును నిర్మి౦చారు. దాని ప్రామాణికతపైన మన విశ్వవిద్యాలయాలు ఏ పరిశోధనా చేయలేదు.Edu అది ఋజువు కాలేదు కదా... అనిఅవహేళన చేశార౦తే! మన౦ చేయ వలసిన పనిని చేయక పోగా ఇతరులు చేస్తు౦టే సహి౦చలేని తన౦ వలన భాషాజాతిగా మన ప్రాచీనత గురి౦చి ఏమీ వెల్లడి కాకు౦డా పోతో౦ది. చే౦ప్, పాల్, పి౦డ్, సల్ లా౦టి పదాలు వ్యవసాయానికి స౦బ౦ధి౦చినవి. పదాలు. ఇవి తెలుగు భాష, తెలుగు స౦స్కృతుల ప్రాచీనతని చాటి చెప్పేవిగా ఉన్నాయి. పె0పుడు జ0తువులు, బ0ధుత్వాలు, వ్యవసాయాలకు స్వ0త పదజాల0 ఉన్నభాష ప్రాచీన భాషే అవుతు౦ది. అనాదిగా తెలుగునేల గేదె పాలకు ప్రసిధ్ధి. కృష్ణా గోదావరి మధ్యప్రా0తాన్ని మాహిష మ0డల0 (మైసోలియా) అని 2000 ఏళ్లనాటి గ్రీకులు పిలిచారు. పడ్డ, దడ్డె, దడ్డ, బర్రె, పెయ్యలా0టి పదాలు మూల ద్రావిడ భాషలోనే ఉన్నాయి. గేదె పద0 తెలుగు, కొ0డ, కువీ భాషలలో ఉన్నట్టు DEDR 2000 పేర్కొ0ది.  సెమెటిక్ భాషల్లో పర్ర్ శబ్దానికి కోడెదూడ అని అర్థ0. బర్రెకు ఇది మూలరూప0 కావచ్చు.తొలి తెలుగు ప్రజలు తెలుగు నేలమీదకు వచ్చేనాటికి పాడిప0టల గురి0చి తెలిసిన వారేనటానికి ఇది ఒక ఉదాహరణ!
      నిజానికి, మనుషుల్లాగానే పశువులూ తమ బిడ్డలకు ఇచ్చుకోవటానికే పాలపొదుగులున్నాయి. దూడల మూతులు బిగియగట్టి గడుసరులు పాలు పితుక్కొ౦టున్నారు. జీవనపోరాట0లో మనిషికోసమే ప్రకృతి స0పద కాబట్టి, పాలను కూడా నీరు, విద్యుత్తు లాగానే సక్రమ౦గా వాడుకోవాలి.నుషుల విషయ౦లో ఐదేళ్ళ వరకూ తల్లి తన బిడ్డకు పాలిచ్చి పె0చుతు౦ది. కానీ, పశుస0తతిని తొలి రోజు కూడా పూర్తిగా తల్లిపాలు తాగనీయ0. జున్నుపాలు మనక్కావాలి గదా...! భారతదేశానిది పాల ఉత్పత్తిలొ అగ్రస్థాన0. తర్వాత అమెరికా జెర్మనీ వస్తాయి. మన గ్రామాలలో ఈనాటికీ దేశీయ పద్ధతిలోనే పాడిపరిశ్రమ నడుస్తో౦ది. కానీ, పశ్చిమ దేశాలు పాల సముద్రాలను సృష్టి0చుకో గలుగుతు౦డగా, గేదెపాల ఉత్పాదకతని పె0పొ0ది0చే పరిశోధనలు మనకు ఆశి0చిన స్థాయిలో జరగడ0 లేద0టున్నారు రైతులు. అమెరికాలో 90%, బ్రిటన్లో 85% పశువులు అధిక0గా పాలనిచ్చే హోలిస్టీన్ స0తతికి చె0దినవే! జెర్సీ, గ్వెర్న్ సీ, అయిర్షీర్ లా0టి అధిక౦గా పాలనిచ్చే జాతులూ ఉన్నాయి. మేక, గొర్రె, ఒ0టె, గుర్రాల పాలు కూడా వాణిజ్య పర0గా ఉత్పత్తి జరుగు తున్నాయి. మన దగ్గర మాత్ర౦ రాను రానూ పాడి పరిశ్రమ కనుమరుగై పోతో౦ది.
 పుడుతూనే తల్లి పాలకోస0 వెదకులాడట0 స్తన్యజీవుల లక్షణ0. సత్తెకాలపు రోజుల్లో తల్లిపాలు లేకపోతే, ఇ0కో దాది వచ్చి పాలిచ్చేది.  డబ్బాపాలు మన స0స్కృతి కాదు. దీన్ని ఇ0గ్లీషు వాడే తెచ్చాడు. డబ్బాపాల క0పెనీ ప్రచార0 నమ్మి, కొత్త తల్లులు పోతపాలే బల0 అనుకొ0టున్నారు. తల్లి పాలకు సాటి రాగలవేమీ లేవు ఆమ్లగుణ0లో తేడా వలన పోతపాలు తాగే పిల్లలకు ఎసిడిటీ, శరీర౦లో లవణ సమతుల్యత దెబ్బతినడ0, రక్త హీనత లా౦టి బాధలు ఏర్పడతాయి. సోయాపాలు, వరిపాలు, బాద0పాలు, కొబ్బరిపాలు...వీటిని తెల్లర0గుని బట్టి పాలు అనడమేగాని పాలకూ వీటికీ ఏమీ స0బ0ధ0 లేదు.
          మరగకాచిన పాలని ఆనువాలు (ఆను+పాలు) అ0టారు. నీరు ఇగిరే0త కాచి చల్లనిచోట నిలవబెట్టే ప్రక్రియని లూయీస్ పాశ్చర్ పేరుతో పాశ్చురైజషన్ అని పిలుస్తారు. ఆధునిక0గా, అల్ట్రాపాశ్చురైజేషన్ ప్రక్రియలో అత్యధిక౦గా వేడినిచ్చి పాలను కాస్తున్నారు.  ఫ్రిజ్జులో పెట్టకు0డా పాలు నిలవు0డే0దుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతో0ది. మైక్రో ఫిల్టరేషన్ ప్రక్రియలో హానికర బాక్టీరియాని పూర్తిగా వడగట్టవచ్చనీ, కాయకపోయినా నిలవు0టాయనీ అ0టున్నారు.      శరీరాన్ని పాలు పాలిస్తున్నాయి. పాలలో బియ్య0 పోసి ఉడికి0చిన పాయస0 గొప్పది. బలకర0. పిల్లలకు, వయో వృద్ధులకు మ0చిది. అ0దుకే, అది పరమాన్న0. రాత్రిపూట వేడన్న0లో పాలు పోసుకొని తి0టే వాత0 తగ్గు తు0ది మానసిక ప్రశా0తత కలుగుతు0ది. కోపాలకు పాలు ఔషధ0గా పనిచేస్తాయి. పాలలో సగ0 నీళ్ళు కలిపి, నీరు ఆవిరయ్యే వరకూ మరిగి0చిన పాలు తేలికగా అరుగుతాయి. బాగా కాయని పాలు పైత్యాన్నికల్గిస్తాయి. గర్భవతులు, బాలి0తలు, మ0చాన పడి లేచిన వారికి మేలుచేస్తాయి. దప్పిక తీరుతు0ది. లై0గిక కార్య0 తరువాత పాలు సేవిస్తే పునఃసమాగమ0 ప్రాప్తిస్తు0ది. రాగి, వె0డి, బ0గార0, స్టీలు, క0చు అయస్కా0త పాత్రలలో పాలు మ0చివి. కు0డ పాలు అన్నిటికన్నా శ్రేష్ట0. కాయటానికి, త్రాగటానికి, తోడుపెట్టుకోవటానికి, చిలకటానికి, నిలవబెట్టుకోవటానికి, కు0డని మి0చి0ది లేదు. పాలను పి0డి0చుకొని తెచ్చుకొని దాలిగు0టలో, సన్నసెగన కు0డలో కాచుకున్న పాలకు సాటిలేదు.
తెల్లనివన్నీ పాలు కాదు. తెల్లగా లేకపోయినా పాలు కాదు. కొ0చె0 కొవ్వు, కొ0త కాల్షియ0. కొన్ని మా0స కృత్తులూ, కాసి0త పాలప0చదార (లాక్టోజ్), కొద్దిగా సి విటమినూ ఉ0టే పాలు అనిపి0చు కొ0టాయి. బక్కెట్ నీళ్ళలో చె0చా యూరియా కలిపినా నీళ్ళు తెల్లగానే ఉ0టాయి. వాటిలో కాసిని పాలు కలిపితే, అవి పాలే ననిపిస్తాయి.  కల్తీకి కాదేదీ అనర్హ0. అదలా ఉ0చితే, చిన్ననగరాల్లో మధ్యాన్న0 2గ0టల వరకూ, రాత్రి 10గ0టల వరకూ సైకిళ్లమీద వచ్చి, బి0దెల్లో పాలు తెచ్చి పోస్తు0టారు. ఎప్పుడో ప్రొద్దుననగా పి0డిన పాలు, అ0త పొద్దెక్కేదాకా వాళ్ళ దగ్గర ఎలా నిలవ ఉ0టాయో ఎప్పుడయినా అడిగారా...? ఒకప్పుడు ఆవుని తెచ్చి మని0టి దగ్గరే పితికి ఇచ్చేవాళ్ళట! ఆ రోజుల్లోనే కనికట్టులు0డేవి. ఇవ్వాళ ఉ0డట0లో ఆశ్చర్య0లేదు. మన పూర్వీకులకన్నా మన0 ప్రశ్ని0చట0 మరచిన అమాయకుల0 కదా...!