Friday 31 October 2014

అజీర్తిని జయించే ఆహారం డా. జి వి పూర్ణచందు

అజీర్తిని జయించే ఆహారం

డాజి వి పూర్ణచందు

అజీర్తి కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గటానికి ఒకటీ లేదా రెండు వెల్లుల్లి గర్భాల్ని నమలకుండా మింగేయండిఫలితం కనిపిస్తుంది.
అజీర్తి నివారణకు ఒక ఫార్ములాని చెప్తానుదీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకుని ఎప్పుడు అజీర్తి  అనిపించినా తీసుకుంటూ ఉండటం మంచిదికరక్కాయలు బాగా ఎండినవి మనకు బజార్లో దొరుకుతాయిఈ కాయని పగలగొడెతే లోపల గింజ ఉంటుందిఆ గింజను తీసేసికరక్కాయ బెరడు మాత్రమే మనకు కావాలివంద గ్రాముల కరక్కాయల్లో గింజతీసేస్తే షుమారు యాబై గ్రాముల బెరడు మిగుల్తుంది.  ఈ బెరడుకు సమానంగా పిప్పళ్ళనుసౌవర్చలవణాన్ని తీసుకుని (ఇది దొరక్కపోతే సైంధవ లవణం)మూడింటినీ మెత్తగా దంచిన పొడి అరచెంచా మోతాదులో మ్తీసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే అజీర్తి బాధలు తగ్గతయమంచ జీర్ణశక్తి కలుగతుందిదీన్ని అజీర్ణహర చూర్ణం అని పిలుస్తారు.
ఇలాంటిదే ఇంకో ఫార్ములా కూడా ఉందిసైంధవలవణం కరక్కాయ బెరడుపిప్పళ్ళువాముశొంఠి ఈ ఐదూ పచారీ షాపుల్లో దొరికేవేవీటన్నింటినీ మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండికడుపులో బాగో లేదనిపించినప్పుడుఅజీర్తికర మైనవి తిన్నప్పుడుప్రయాణాల్లో ఉన్నప్పుడూ ఈ పొడిని అరచెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి తాగండిపొట్ట బాగౌతుంది.
అజీర్తి వలన వచ్చే కడుపులో నొప్పి తగ్గటానికిఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి కాయండిబోజనం చేసిన తరువాత కడుపులో నొప్పి వస్తున్నవారికి ఈ ఉప్పు వేసిన నేతిని మొదటి ముద్దగా కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది.
అజీర్తిజీర్ణకోశానికి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా సరేవసకొమ్ముని దంచిన పొడి చిటికెడు తీసుకుని చిక్కని బ్లాక్ టీ లాగా కాచుకుని తాగితేమేలు చేస్తుందికఫం తగ్గుతుందిజ్వర తీవ్రత తగ్గుతుందివిషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుందిమొలలున్న వారికి ఉపశాంతినిస్తుందికడుపులో నులిపురుగులు పోగొడుతుందిమలబద్ధకాన్ని హరిస్తుందిఉబ్బసంలో వచ్చే దగ్గుఆయాసాలను తగ్గిస్తుందిఅతిగా తాగితే వికారం కలిగిస్తుందిస్వల్ప ప్రమాణంలో తీసుకోవాలి.
అజీర్తిని జయించే వాటిలో బిరియానీ ఆకు గొప్పదిఆకుపత్రి అంటారు దీన్ని. బిరియానీలోనో పలావులోనో కలుపు తుంటారుమషాలా ద్రవ్యాలలో ఇది నిరపాయకరమైందిఆరోగ్యాన్నిచ్చేదిఈ ఆకులు కూడా కలిపి మషాలా ద్రవ్యాలను తయారు చేసుకుంటేఅజీర్తిని జయించినట్టే!మలబద్ధతని సరి చేస్తుందికడుపులో నొప్పిని హరిస్తుందిపైత్యాన్ని పోగొడుతుందిబాలింతలకు తల్లిపాలు పెరిగేలా చేస్తుందికడుపులో వాతంగ్యాసూఉబ్బరందుర్గంధతో కూడిన అపాన వాయువులుదుర్గంధంతో కూడిన విరేచనం ఆగుతాయినోటి దుర్వాసన పోతుందిఅల్లం వెల్లుల్లి తగ్గించిఆకుపత్రినీదాల్చిన చెక్కనూ వాడుకుంటూ ఉంటే మంచిదిబియ్యపు నూకను దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పుమిరియాలపొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

జీర్ణశక్తి మందంగా ఉన్నవాళ్ళు దంపుడు బియ్యాన్నో లేక పట్టు తక్కువ బియ్యాన్నో తినటం వలన జీర్ణాశయవ్యవస్థ మరింత దెబ్బతింటుందిగోధుమలూ రాగులూసజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండుకుంటాంవీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూతవుడూ వగైరా తీసేయటం ఉండదుకాబట్టిదంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూరాగులూ సజ్జలూ  వగైరా తృణ ధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిదిజీర్ణాశయం బలగా లేదనుకున్నప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను వండుకుని తింటే పేగులు చెడకుండా ఉంటాయి.
బార్లీ జావసగ్గుబియ్యం జావపేలాలుమరమరాలు(బొరుగులుఇలాంటివి జీర్ణశక్తిని కాపాడతాయిఅజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవటం మంచిదిషుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలుజొన్న అటుకులు చాలా మేలు చస్తాయి.
పెసర పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి కాచిన కట్టులో మిరప కారానికి బదులుగా మిరియాల పొడిని కలుపుకుని అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది.
లేత ముల్లంగి దుంపల జ్యూసు రోజూ ఉదయం పూట తాగుతూ ఉంటే పేగులకు ప్రశాంతత నిచ్చి జీర్ణశక్తిని పెంచుతుంది.
అజీర్తిని తగ్గించే ఒక ఆహార పదార్ధం అష్టగుణమండం: ఇంగువసైంధవలవణంధనియాలుబిరియానీ ఆకు ముక్కలుశొంఠిపిప్పళ్ళు, మిరియాలు... వీటన్నింటినీ సమభాగం తీసుకుని మెత్తగా దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండిబియ్యంలో సగం చాయపెసర పప్పు తీసుకుని నీరు ఎక్కువగా కలిపి జావలాగా కాయండిఒక మనిషికి సరిపడిన జావలో  ఈ పొడిని ఒకచెంచా లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి మరికాసేపు కాచి దింపండిదీన్నే అష్టగుణమండం అంటారుఇది అజీర్తిని తగ్గించే గొప్ప ఔషధంరోజూ తాగినా మంచిదే!
అజీర్తిని పోగొట్టటానికి సూక్ష్మంలో మోక్షంగా పనిచేసే ఇంకో ఉపాయం ఉందికొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని అందులో ఉప్పుమిరియాలపొడి తగినంత కలిపిరోజూ ప్రొద్దున పూట తాగుతూ ఉంటే అజీర్తి పటాపంచ లౌతుందిపైత్యంకడుపులో యాసిడ్పేగుపత వ్యాధుల్లో మంచిదికొత్తిమీర మిరియాలపొడి మిశ్రమాన్ని మెత్తగా నూరి తగినంత ఉప్పు కలిపి భద్రపరచుకోండి. అన్నంలో మొదటి ముద్దగా దీన్ని తింటే అజీర్తి కలగదు.
అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచటంలో ఉప్పుని మించిన ఔషధం లేదుఅయితే ఉప్పుని పరిమితంగా ఒక ఔషధంలాగే వాడుకోవాలిఎందుకంటే ఉప్పు తగ్గినందు వల్ల ఏర్పడే జబ్బుల్లాగే ఉప్పు పెరిగి నందువలన ఏర్పడే జబ్బులు కూడా ఉన్నాయికాబట్టి!  ఉప్పుని ముట్టుకో కూడదన్నట్టు చెప్పటమూ తప్పే! అదే పనిగా తినటమూ తప్పే!
అన్నం తినబుద్ధి కాకపోతున్నప్పుడు బిరియానీ ఆకుని మెత్తగా దంచి మిరియాల పొడి ఉప్పు తగినంత కలిపి  కారప్పొడి చేసుకుని తింటే అన్నహితవు కలుగుతుందిఅన్నహితవు కలగటానికి ప్రతిరోజూ అల్లాన్ని తగినంత ఉప్పు వేసి దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే భోజనంలో ఉండే దోషాలన్నీ పోతాయిఅన్నం తినాలనే కోరిక కలుగుతుందిఅల్లం ఉప్పు కలిపి మెత్తగా నూరి  అన్నంలో ఒక చెంచా మోతాదులో కలుపుకుని నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే అజీర్తి తగ్గుతుందిఅన్నహితవు కలుగుతుందిభోజనం చేసిన తరువాత భుక్తాయాసం కలగకుండా ఉంటుంది.సిరిక్జాయ తొక్కుడు పచ్చడి(నల్లపచ్చడి)  అల్లం మిశ్రమం కలిపి నెయ్యి వేసుకుని ఒకటీ లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా తినటాన్ని అలవాటు చేసుకోవాలిఅజీర్తి లేని వాళ్ళు కూడా ఇది తింటూ ఉంటే జీర్ణ శక్తి పదిలంగా ఉంటుంది.
ఆవపిండి చిటికెడంత కలిపిన వంటకాలను తరచూ తింటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది
ఆహార సమయంలో నీటిని మధ్యమధ్య తాగుతూ ఉంటే అజీర్తి తగ్గిజీర్ణశక్తి పదిలంగా ఉంటూందిఅతిగా నీరు తాగితే జీర్ణశక్తి మందగిస్తుంది.
ఎండిన కిస్మిస్ పళ్ళూ పంచదారతేనె ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచామోతాదులో రెండు పూటలా రోజూ తీసుకుంటే  కడుపులో బాధలు తగ్గి జీర్ణకోశ వ్యవస్థ ఎంతో పదిలంగా ఉంటుంది.
పిప్పళ్లను దోరగా వేయించి మెత్తగా దంచండి పిప్పళ్ళు మీకు పచారీ కొట్లలో దొరుకుతాయిలేదా మూలికలమ్మే వారి దగ్గర దొరుకుతాయితేలికగా దొరికేవేఈ పిప్పలీ చూర్ణానికి ఆరురెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరచుకోండిజీర్ణ వ్యవస్థ బలంగా లేనివారు దీన్ని ఉదయం రాత్రి ఒక్కక్క మాత్ర చొప్పున తీసుకుంటూ ఉంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుందిశరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.
పెరట్లో బొప్పాయి చెట్టు ఉన్నవారు చేసుకోగలిగిన ఫార్ములా ఇదిబొప్పాయి చెట్టుకు గాటు పెడితే పాలు వస్తాయికొద్దిసేపు కష్టపడితే ఒక చెంచా లేదా రెండు చెంచాల పాలు సేకరించవచ్చుఈ బొప్పాయి పాలుంచిన గ్లాసుని వేడి ఇసుకమీద గానీ, సన్న సెగ మీద గానీ ఉంచితే, ఆ వేడికి బొప్పాయి పాలు గడ్డకట్టి పొడిగా అవుతాయిఈ పొడిని చిటికెడంత తీసుకుని గ్లాసు పాలలో గానీమజ్జిగలో గానీ కలుపుకుని తాగితే ఆకలి పరిగెత్తు కొస్తుంది. ‘పెపైన్ అనే ఎంజైమును ప్రకృతి సిద్ధంగా పొందేందుకు ఇది మంచి ఉపాయం.
 పైత్యంఅజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడు,  పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది.


లేత అరటికాయల కూరని మిరియాలపొడితో గానీకాల్చి పెరుగుపచ్చడిగా గానీ చేసుకుని తింటే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.

భోజన మర్యాదలు డా. జి వి పూర్ణచందు

భోజన మర్యాదలు
డా. జి వి పూర్ణచందు


           `అతిథి దేవో భవ’ అనే సంస్కృతి మనది. అతిథికి వడ్డించి, తినటం పూర్తయ్యాకే గృహస్థు భోజనం 

చేయటంలో ఒక  భక్తి భావం ఉంది. ఇందుకు విరుద్ధంగా ఇంగ్లండులో మొదట గృహస్థు ఆహారాన్ని నోట్లో

పెట్టుకున్నాకే అతిథి  తింటాడు. అది అక్కడి మర్యాద. ఈ మర్యాదలో ఆక్షేపించవలసింది కూడా ఏమీ లేదు. అది 

శబరి భక్తి లాంటిది.  తాను కొరికి తియ్యగా ఉన్న పండునే రాముడికి పెట్టింది. ఇదికూడా ‘అతిథి దేవో భవ’ లాంటి

మర్యాదే!

            ముందు తీపి భక్ష్యాలు, గారెలు వడలాంటి కారపు భక్ష్యాల్ని, తరువాత పరిమితంగా పప్పు, కూర పచ్చడి 

వగైరాల్నీ,  పులుసు లేదా చారునీ, పెరుగునీ కొద్దిగా వడ్డిస్తారు. వడ్డించిన ఈ విస్తరి మెనూకార్డు లాంటిది. ఏవి ఏ

రుచుల్లో  ఉన్నాయో, తెలుసుకుని, కావలసినవి అడిగి వడ్డించుకునేందుకు అతిథికి అవకాశం ఉంటుంది.


             తినేప్పుడు ముందు పప్పు లాంటి కఠిన పదార్థాలు, తరువాత కూర పచ్చడి లాంటి మృదు పదార్థాలు, ఆ

తరువాత పులుసు చారు లాంటి ద్రవ పదార్థాలు, ఆ పైన పెరుగు లేదా మజ్జిగ తిని, బోజనాంతంలో స్వీట్లు తినటం

మన ఆహార సంస్కృతి. ఇప్పుడు మనం స్వీటుతో మొదలు పెట్టి, ఐసుక్రీముతో ముగిస్తున్నాం. పెరుగన్నం తిన్నాక

పాలతో తయారైన ఐసుక్రీము ఎలా తీంటారు? విరుద్ధ పదార్థాలు కావా?


             బంతిభోజనాల్లో వడ్దనంతా పూర్తయ్యాకగృహస్థు వచ్చి కలుపుకోవాలని కోరటం, భగవన్నామ స్మరణ 

చేసిపెద్దలువృద్ధులూ తినటం మొదలు పెట్టాక అప్పుడు విస్తరిని ముట్టుకోవటం మన ఆహార  సంస్కృతి! 

వడ్డించింది వడ్డించినట్టు తినటం నేటి నాగరికత! మనం ఎప్పుడు లేస్తామా అని చూస్తూ, మన వెనకే రెండో బంతి 

అతిథులు నిలబడి ఉంటారుఅందువల మనమీద ఆహార వత్తిడి పెరుగుతుందిఅలా నిలబడటం మర్యాద కాదు!


             వెనకాల పోలీసులు తరుముతున్నా రన్నట్టు జల్దీభోజనం చేస్తుంటారు కొందరు. బంతిలో మిగతా వాళ్ళు

 కూరలో ఉండగానే ఈ జల్దీ భోజనరాయుళ్ళు సాంబార్‘ని పిలుస్తుంటారు. వడ్డనలో ముందే సాంబారు వచ్చేస్తే, 

ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. హడావిడిగా గుటుకూగుటుకూ మని తినటం వలన భొజనాన్ని ఆస్వాదించే 

అవకాశం కూడా ఉండదు. అలా ఆదరా బాదరాగా తినవద్దంటుంది శాస్త్రం. అలాగని మరీ నిదానంగానూ తినకూడదు.

 జీర్ణశక్తి మందగిస్తుంది.


              చైనీయులు వడ్డనలో ఆఖర్న వేడి టీ కషాయాన్ని గ్లాసుల్లో తెచ్చి ఇస్తారు. తినటానికి ఉపయోగించే

పుల్లల్ని ( చోప్ స్టిక్స్) ఊపుతూ, కిందా పైనా పడేస్తూ ఆడుకోకూడదు. రెండు పుల్లల్నీ వేర్వేరు చేతుల్తో పుచ్చుకో

కూడదు. పళ్ళెం పైకి వంగి ఆహారాన్ని తినాలేగానీ, నోటి దగ్గరకు పళ్ళేం తీసుకెళ్ళకూడదు. వాళ్లవి  నూడుల్స్ తరహా

వంటకాలు కాబట్టి, పుల్లల్తో తినటానికి అనువుగా ఉంటాయి. మన పప్పన్నం అలా తినటం కుదరదు.


               ఫోర్కుని ఎడం చేత్తోనూ, కత్తిని కుడిచేత్తోనూ పుచ్చుకుని మాంసాన్ని కోసి తినటం ఇంగ్లీషువాడి మర్యాద.

ఫోర్కుతో ఆహారాన్ని నోట్లో పెట్టుకోవటాన్ని థాయిల్యాండ్ వాళ్ళు తప్పుపడతారు. ఆహారాన్ని చెంచాతో 

అందుకోవాలి. చెంచాను నోట్లోకి తోసి, నాకి తినటాన్ని యూరోపియన్లు అమర్యాదగా భావిస్తారు. స్టారు హోటలుకెళ్ళి

ఇడ్లీ, అట్టుల్ని కూడా ఫోర్కుతో తినే వాళ్లని చూస్తే, నవ్వొస్తుంది. గోరుతో పోయేదానికి గొడ్డలి వాడటం ఏం గొప్పా?


                ఆహారాన్ని కుడిచేత్తో తుంచుకుని లేదా కలుపుకుని తినటమే మన మర్యాద. అలాగే ఆహార పదార్థాలను 

రెండు చేతులూ ఉపయోగించి తినటాన్ని అన్ని దేశాలవారూ అసహ్యంగానే భావిస్తారు. మనదేశంలోనే ఎడం చేత్తో 

రోటీని మడిచి పుచ్చుకుని కుడిచేత్తో తుంచుకుని తినే అలవాటున్న వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా ఇది భోజన 

సభ్యత కాదనే చెప్పాలి.

          
               చాలా హోటళ్ళలో భోజనబల్ల పైన  పచ్చళ్ళు పొడులూ, చారూ, సాంబారు లాంటి ద్రవ్యాలను ఎవరికి వారే

వడ్డించు కునేలా ఉంచుతారు. వాటిని కొందరు వడ్డించుకునే తీరు పరమ అసహ్యంగా ఉంటుంది. తినే చేత్తోనే గరిటను

 పుచ్చుకోవటం, కంచానికి ఆన్చి వడ్డించుకోవటం చేస్తుంటారు. నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. బంతి

భోజనాలలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా  వడ్డించుకోవటం తినటం అనేవి కనీస మర్యాద. దాన్ని తెలియ

చెప్పటం కూడా అవసరమే! ఇంట్లో తినేప్పుడు కూడా అలాంటి మర్యాదల్నే అలవాటు చేసుకుంటే బయట కూడా

పాటించ గలుగుతారు. సుతారంగా వ్రేళ్ళతో అన్నాన్ని కలుపుకు తినటంలో నాజూకు తనం ఉంది. గోదుమ పిండిని

పిసికినట్టు అన్నాన్ని పిసుక్కొని తినటం చూసే వాళ్లకి ఇబ్బందే! అన్నాన్ని పిసికి కాదు, నమిలి తినమని శాస్త్రం

చెప్తోంది. అలాగే, ఆహారాన్ని నమిలేప్పుడు  పెదాలు మూత పడి ఉండాలి. లేకపోతే చప్పరింత శబ్దం

భోజనమర్యాదల్ని దెబ్బతీస్తుంది. పందికి చప్పరం అనే పేరుంది. అది చప్పుడు చేస్తూ తింటుంది కాబట్టి! మన

భోజనతీరు అది కాదు కదా!


          భోజనం చేశాక ఒక్క మెతుక్కూడా పళ్ళెంలో మిగలకుండా తినటం అనేది అన్నానికి మనం ఇచ్చే గౌరవం. 

జపాను వాళ్ళు పళ్ళెంలో అలా పూర్తిగా తింటే కడుపు నిండలేదేమో అనుకుంటారట. కడుపునిండిందని ప్రకటించ

టానికి చైనా వాళ్ళు గ్లాసు బోర్లించి, ఫోర్కులూ చెంచాల్నీ పళ్ళెంలో పడుకోబెడ్తారట. వంట రుచి ఎలా ఉందో

దాన్ని తిన్న తీరు చెప్తుందని ఆంగ్ల సామెత. ఎక్కువ విస్తళ్లలో ఏది ఎక్కువగా వదిలేయబడి కనిపిస్తుందో అది 

రుచిగా లేదని అర్థం. తిన్న విస్తళ్ళు క్లీనుగా ఉంటే వంట బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క!


             ఆతిథ్యం ఇచ్చిన వారినుద్దేశించి అన్నదాతా సుఖీభవ...అంటాం మనం. కెనడాలో వంట చేసిన వారిని 

సుఖీభవ అని దీవిస్తారు. ‘అన్నదాత’, ‘అన్నకర్త’ లిద్దరినీ సుఖీభవ అనటం ఒక మంచి అలవాటు. వంటలు 

బాగున్నాయని చెప్పటం మర్యాద. రాయవాచకం’ గ్రంథంలో రాయల కాలంనాటి రాచభోజన పద్దతుల 

వర్ణనలున్నాయి. అవి పాశ్చాత్య తరహాలో ఉండవు. విదేశాల్లో రాచమర్యాదలే నాగరికతగా భావించబడుతున్నాయి. 

‘భోజనాల బల్లమీద వేసే బట్ట కనీసం 15 అంగుళాలు దిగి ఉండటం, రాత్రిభోజనాలకు కొవ్వొత్తి వెలిగించటం ఇవి 

యూరోపియన్ సాంప్రదాయాలు. మనవాళ్ళు వెన్నెల రాత్రిని శృంగారానికే గానీ భొజనాలకు ఉపయోగించుకున్నట్టు 

కనిపించదు. వెన్నెట్లో భోజనం కూడా ఒక రసఙ్ఞతే!


              భోజన సమయంలో సెల్ ఫోన్లను నిశ్శబ్ద స్థితిలో ఉంచటం, భోజనాల గదిలో ఎంతమంది ఉన్నా ఎవ్వరూ 

లేనంత నిశ్శబ్దాన్ని పాటించటం, హడావిడి సమాచారం ఉంటే మౌనంగా బయటకు వెళ్ళి మాట్లాడటం, 

మాంసాహారాన్ని తినేప్పుడు నోట్లో వేళ్ళుపెట్టి ఎముక ముక్కల్ని బయటకు తీయటం, నోట్లో మిగిలిన వ్యర్థాన్ని 

పళ్ళెంలోకి ఉమ్ములు వేయటం ఇవన్నీ బంతి భోజనాలలో తప్పనిసరిగా మానుకోవాల్సిన అలవాట్లు. భోజనాన్ని

 మనం మనకోసమే చేస్తున్నా మర్యాదల్ని ఇతరులకోసం పాటించాలి. అది పౌరబాద్యతల్లో ఒకటి. నా ఇష్టం 

అనుకోవటానికి కాదు గదా స్వాతంత్ర్యం వచ్చింది.