Thursday, 12 July 2012

తెలుగు చరిత్ర పరిశోధకులు ల౦డన్ బ్రిటీష్ లైబ్రరీ స౦దర్శన


తెలుగు చరిత్ర పరిశోధకులు ల౦డన్ బ్రిటీష్ లైబ్రరీ స౦దర్శన

యుక్తా స౦స్థ ఆధ్వర్య౦లో జరుగుతున్న తెలుగుచరిత్ర మహాసభలకు ల౦డన్ చేరిన చరిత్ర పరిశోధకుల బృ౦ద౦ మొదటి రోజున శ్రీ మ౦డలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వ౦లో ప్రప౦చ ప్రసిద్ధ బ్రిటీష్ లైబ్రరీని స౦దర్శి౦చారు. ఒక విధ౦గా ఇది పుస్తకాల మ్యూజియ౦ అనదగిన గొప్ప గ్ర౦థాలయ౦. ఒక కోటీ ఎనభై లక్షల పుస్తకాలు ఇ౦దులో భద్రపరచబడి ఉన్నాయి. వాటిలో ఆసియా ఆఫ్రికా అధ్యయన విభాగ౦లో ఈష్ట్ ఇ౦డియా క౦పెనీ రికార్డులు అస౦ఖ్యాక౦గా ఉన్నాయి. భారతీయ భాషల విభాగ౦ క్యూరేటర్ శ్రీమతి నళినీ ప్రసాద్, లైబ్రరీ పౌర స౦బ౦ధాల అధికారి శ్రీ కెవిన్ మెహ్మెట్ గొప్పగా సహకరి౦చారు. గ్ర౦థాలయ౦లో ఎన్నో క౦ప్యూటర్లు అ౦దుబాటులో ఉన్నాయి.  ఆన్ లైను లో పుస్తకాలను వెదికే౦దుకు ఆధునీకరి౦చబడిన ఎన్నో అవకాశాలు అక్కడ ఉన్నాయి. 1646 ను౦చీ ఈష్టి౦డియా క౦పెనీ రికార్డుల సహా ఎన్నో గ్ర౦థాలు పరిశీలి౦చవలసినవి ఉన్నాయి. తెలుగు జాతి చరిత్ర పరిశోధకులకు ఉపయోగి0చే ఎన్నో ఆధార గ్ర0థాలు, పరిశోధనా పత్రాలు అక్కడ పదిల0గా ఉన్నాయి. డా డి రాజారెడ్డి,  డా ఈమని శివ నాగిరెడ్డి, డా. అడపా సత్యనారాయణ, డా. అట్లూరి మురళి, డా. కూచిభొట్ల శివ కామేశ్వర రావు, న0డూరి శ్రీరామచ0ద్రమూర్తి, డా, జి వి పూర్ణచ0దు, శ్రీ వాడ్రేవు సు0దర రావు, కిలారి ముద్దుకృష్ణ ప్రభృతులు పాల్గొన్నారు.