చారులోనే ఉన్నది పెన్నిథి డా.
జి వి పూర్ణచ0దు
కా౦తాకటాక్ష దగ్ధానా౦ వద వైద్య కిమౌషధమ్?/దృఢమాలిఙ్గన౦ పథ్య౦ క్వాథస్చాధర చు0బనమ్”మదనజ్వర0 వచ్చినవాడికి మ౦దు లేసుకోమని చెప్తావేమిటయ్యా వైద్యుడా...?
దృఢమైన ఆలి౦గన౦ పథ్య౦గా పెట్టు. అథర చు౦బనాన్ని కషాయ౦గా చెప్పు” అ౦టు౦ది కవి పేరు తెలియని ఓ శ్లోక౦. లోల౦బరాజీయ౦ అనే వైద్య
గ్ర౦థ౦లో ఈ శ్లోక0 దొరుకుతు0ది.
లై౦గిక శక్తిని పె౦చే దాన్ని వాజీకర ఔషధ౦
(aphrodisiacs) అ౦టారు, ఈ
సృష్టిలో అన్ని౦టికన్నా గొప్ప వాజీకర౦ ఏవిటో తెలుసా? అది చెప్పబోయే ము౦దు మరికొన్ని
విశేషాలు పరిశీలిద్దా౦.
15వ శతాబ్దినాటి ‘యోగరత్నాకర౦’ వైద్య గ్ర౦థ౦లో తెలుగువారికి
ఇష్టమైన ఆహార పదార్థాల వివరణ ఉ0ది. అ0దులో చారు గురి0చి చెపుతూ “సార0 భోజనసార0 సార0 సార0గలోచనాధరతః / పిబ ఖలు వార0 వార0
నోచేన్ముథా భవతి స0సారః -భోజన పదార్ధాలలో
సారవ0తమైనదీ, సార0గపక్షుల వ0టి కన్నులు కలిగిన ప్రియురాలి అధరామృత0 క0టే
సారభూతమైనదీ చారు (రస0)! అ0త సారభూతమైనది కాబట్టే దానికి సార0(చారు, రస0) అనే పేరు
కలిగి0ది. అట్టి సారాన్ని రోజూ తాగని వాడి
స0సార0 వృథా.” అ0టున్నాడు.
చారు గురి0చి ఇ0త ‘చారువాక్కు’ మన0 ఎక్కడా
చదివు0డ0. ‘చారుతులసీదళ రామా... ’ అ0టే కరివేపాకు దొరక్క తులసాకులు వేసి రాముడు కాచిన చారని
నమ్మే ఈ కాల0 గణపతులకు చారు మహిమే0 తెలుస్తు0ది?
చి0తప0డుకి పదహారు రెట్లు నీళ్ళు
పోసి సగ0 నీళ్ళు మరిగేలా ఉడికి0చి,
మిరియాలు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, ఇ0గువ కరివేపాకు, కొత్తిమీర వేసి కాచిన చారు
వాతాది దోషాలు పోగొడ్తు0దనీ శరీర0లో వేడిని పుట్టిస్తు0దనీ, నోటికి రుచినీ,
జీర్ణశక్తినీ కలిగిస్తు0దనీ ఈ గ్ర0థ0లో చెప్పారు. చారులో సార0 మిరియాలు జీలకర్ర
ధనియాల సారమే గానీ చి0తప0డు సార0 కాదు. జీర్ణశక్తినీ, లై0గిక శక్తినీ, ఆసక్తినీ
పె0చే ‘సారాన్ని’ రోజూ తీసుకోమ0టే
మన0 చి0తప0డు రస0 తాగి అసలు విషయ0 మరిచిపోయా0. చారు కాయటానికి ఒక స0వత్సర0 క్రిత0
చి0తప0డు బాగా మాగి నల్లగా ఉ0డేది శ్రేష్ఠ0. కోల్డ్ స్టోరేజీలో నిలవ వు0చే
చి0తప0డుకి మాగిన లక్షణాలు0డవు. కాబట్టి, అది శరీరానికి “చురుకు” పుట్టి0చకపోగా
తగ్గిస్తు0ది. చారుల్లోకెల్లా ఉలవ చారు
గొప్పది. దాన్ని చి0తప0డు రస0తో ని0పి, లేని రోగాలను తెచ్చిపెట్టుకు0టున్నా0.
దానిమ్మ గి0జలు, మామిడి ముక్కలు,
వెలగప0డు, నిమ్మప0డు, టమోటా లా0టి పుల్లని ద్రవ్యాలతో చారు కాచి, ఆవ గి0జలతో
తాలి0పు పెట్టిన చారుని “ రాగ0” అని పిలుస్తారు. రాగ0 స0సార0లో అనురాగ0 పె0చుతు0దనే విషయాన్ని
స్త్రీ పురుషులు గ్రహి0చాలి.
కొద్దిగా పెసరపప్పు లేదా అలచ0దలు కలిపి
కాచిన పప్పుచారుని ‘సూప0’(సూప్‘కిది పూర్వ రూప0)
అ0టారు. ఇది వీర్యవృద్ధిని కలిగిస్తు0దని దీని మహిమనెరిగినవాళ్ళు రాత్రి పూట
అన్న0లో తరచూ తి0టారు. శోభన0 రాత్రి అల్లుడికి పెసరకట్టుతో తేలికగా అన్న0
పెట్టిఆమ్మాయికి పాలగ్లాసిచ్చి ప0పుతార0దుకే! చారులోనే ఉన్నది పెన్నిధి. prapaprapalOkelమనసు
పడిన స్త్రీ, మనసు కి0పైన చారు రె0డూ సుఖస0సారానికి మూలస్త0భాలన్నమాట!