ప్రజల పక్షం
డా. జి వి
పూర్ణచందు
"ధనము లపహరించి తనతోడఁ జెనకెడు
నాతతాయి జనుల నని వధించి
బంధు మరణ దుఃఖ భరమున ధర్మజుఁ
డెట్లు రాజ్యలక్ష్మి +నిచ్చగించె?"
పోతనగారి
భాగవతంలో ధర్మరాజు పట్టాభిషేక దృశ్యం నడుస్తోంది. సూతుడు చెప్తున్నాడు. వింటున్న
శౌనకుడికి ఓ సందేహం వచ్చింది. తమ ధన మాన ప్రాణాలను హరించిన వాళ్లందరినీ యుద్ధంలో
ఓడించాడు. వాళ్లంతా బంధువులే కదా! బంధువులందరినీ చంపిన దుఃఖభారంలో ఉండికూడా
ధర్మరాజు రాజ్యలక్ష్మిని ఎలా చేపట్టాడయ్యా...? అని!
ధర్మరాజు
బంధువుల్లో ఆతతాయిలు చాలామంది ఉన్నారు. ఆతతాయిలంటే రకరకాల కుయుక్తులతో ప్రాణాలు
తీసేవాళ్లు. వీళ్లు ఆరు రకాలుగా ఉంటారు. ఇంటికి నిప్పు పెట్టి చంపేవాడు, విషం పెట్టి చంపేవాడు, నరికి చంపేవాడు, డబ్బు
దోచుకునేవాడు,
భూ కబ్జా చేసేవాడు, పరాయి స్త్రీని
చెరపట్టేవాడు... వీళ్లు ఆతతాయిలంటే! తమ సిరిసంపదలన్నీ అపహరించి తమను ఏదో ఒక విధంగా మట్టు బెట్టాలని
ప్రయత్నించి కుదరక, చివరికి ఒక మహాసంగ్రామాన్నే సృష్టించిన ఈ ఆతతాయిల కూటమిని
సమూలంగా తుడిచి పారేశారు పాండవులు.
చంపేటప్పుడు వీళ్లంతా బంధువులనే
బాధ అర్జునుడికి కలిగినట్టు భారతం చెప్తోంది. కానీ, ధర్మరాజు సహా మిగతా నలుగురు
సోదరులకూ అలాంటి మనోవ్యథ ఏదీ ఉన్నట్టు కనిపించదు. వాళ్లకు లేని బాధ, ఆ కథ వింటున్న
శౌనకుడికి దేనికి కలిగింది..?. “అయ్యో! బంధువులందరినీ చంపి, పట్టాభిషేకం ఎలా
చేసుకుంటున్నాడు ధర్మరాజు...?” అనడిగాడు అమాయకంగా!
నిజానికి కురుక్షేత్ర
మహా సంగ్రామంలో బంధువులైన వాళ్లు మరణించింది కొద్ది మందే! ఇద్దరు అన్నదమ్ముల
పిల్లలు, వాళ్ల కుటుంబీకుల మధ్య వారసత్వం పోరు కురుక్షేత్ర సంగ్రామం. కానీ, ఏ
బంధుత్వమూ లేని లక్షలాదిమంది సైనికులు
రెండు పక్షాల వైపూ మరణించారు. వాళ్ల అకారణ అకాల అన్యాయ మరణం గురించి శౌనకుడికి ఏ
బాధా కలగకపోవటమే ఆశ్చర్యం.
ఒక రచన చేసేప్పుడు కవి
ఎవరి పక్షాన ఉండి రచన చేస్తున్నాడన్నది ముఖ్యం. వ్యాసుడు పాండవుల పక్షాన నిలబడి
మహాభారత రచన చేశాడు.
వివిధ పత్రికలూ,
వార్తా చానళ్లూ తమకు ఇష్టమైన పక్షం వైపే ఉండి ఎన్నికల మహా సంగ్రామాన్ని నడిపించటాన్ని
మనం కళ్లతో చూశాం. ఎవ్వరూ ప్రజల పక్షాన లేకపోవటమే ఇందులో వింత. తాము పక్షం వహించిన
వారు గెలిచినా, ఓడినా ఆ వార్తని ఆ పక్షానికి అనుకూలంగానే వ్రాస్తారు. వ్యాసులవారే ఈనాడు
అందుకు పరమ సాక్షి! తమ పక్షం వాళ్లు
ఇద్దరిని హత్య చేస్తే ఆ వార్తని అవతలి పక్షానికి తగిన గుణపాఠంగా వ్రాయటం, తమ పక్షంలో
ఇద్దరు హత్యకు గురైతే, ధీరోదాత్తంగా వీరోచితంగా పోరాడారనటం ఇదీ కలియుగ వార్తా
సంవిధానం.
దీన్ని ద్వాపర
యుగంలోనే వ్యాసుడు ఆరంభించాడు. పాండవ వీరుల వీరకృత్యాల్ని చిత్రించినంత గొప్పగా
కౌరవ వీరుల పోరాట పటిమని మహాభారతంలో చిత్రించక పోవటం పక్షపాతం కిందకే వస్తుంది.
దాన్నయితే ఇప్పుడు
పచ్చవార్త అనో, నీలివార్త అనో పిలుస్తున్నాం. వార్త ఏకపక్షంగా తమ పక్షానికి
మాత్రమే అనుకూలంగా ఉండేలా వ్రాయటం నేటికాలపు నీతి.
పాండవులవైపు ధర్మం
ఉంది కాబట్టి, అలా పాండవ పక్షంగా చెప్పారని మనం అనవచ్చు. పచ్చవార్తలు లేదా
నీలివార్తలు కూడా అలా తమ పక్షాల వైపు ధర్మం ఉన్నదనే నమ్మకంతోనే వార్తాధర్మాన్ని
పాటిస్తున్నాయి. ఇంతకీ ఏది ధర్మం? చివరికి గెలిచినవాడిదే ధర్మమా! లేక తమ పక్షం
వారిదే ధర్మమా! నిజం ఎప్పటికైనా గెలుస్తుందంటే ఒప్పుకుంటాను గానీ, గెలిచిందంతా
నిజం అంటే ఒప్పుకోనంటాడు మహాకవి.
రేపటి ఎన్నికల ఫలితాల్లో
ఏదో ఒక పక్షం గెలుస్తుందన్నది నిజం. కానీ, చివరికి నిజమే గెలిచిందని అంటే అది
అబద్ధం. ధర్మరాజు గెలిచాడు. బలం ఉన్నది కాబట్టి గెలిచాడు. ఆయన బలాలు, వారి వరాలూ
ఏవో అందరికీ తెలుసు. వాటి ఆసరాతో ఆయన గెలిచాడు. యుద్ధం చేసింది గెలవటానికే! గెలిచి
రాజ్యాధికారాన్ని చేపట్టడానికే! తాను కోల్పోయిన
రాజ్యాన్ని తాను తిరిగి పొందితే, “బంధు మరణ దుఃఖ భరమున ధర్మజుఁడెట్లు
రాజ్యలక్ష్మినిచ్చగించె?” అని
శౌనకుడు ఎలా అడుగుతాడు?
"పరీక్షిత్తును కురువంశాంకురంగా
అంటే యువరాజుగా, రాజ్యానికి రేపటి వారసుడిగా ప్రకటించి, యుధిష్టిరుణ్ణి సమస్త
సామ్రాజ్యానికి అధినేతగా నిలిపి శ్రీకృష్ణుడు సంతుష్టాంతరంగుడైనాడు” అని వ్రాశారు
పోతనగారు.
ఆ రోజుల్లో శ్రీ
కృష్ణుడున్నాడు. ఇప్పుడు ప్రజలే కృష్ణులు! ప్రజలు ఏ పక్షాన అధికంగా ఉంటే ఆ పక్షం
అధికారాని కొస్తుంది. పత్రికలు కూడా ప్రజల పక్షాన ఉంటే నిజమైన ధర్మరాజులు
అధికారంలో కొస్తారు.
అప్పుడు కృష్ణుడు అన్నాడు. “అర్జునా, నేను నీతో ఒక మాట
చెప్తాను దానిని జాగ్రత్తగా విను. ఎవడు ఉపపాండవులను సంహరించాడో వాని తల
కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించవలసిన పనిలేదు. వీడు
ఆతతాయి. కాబట్టి చంపి అవతల పడేయవచ్చు. కానీ ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదము బ్రాహ్మణుని చంపకూడదని
చెప్తోంది. ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి. బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి.
ఇప్పుడు ఏమి చేయాలో దానిని నీవు చేయవలసింది”
అన్నాడు. ఇప్పుడు
అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలివేయాలి. అందుకని ఇప్పుడు
పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు.
పూర్ణముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి
చంపాడో అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు. అప్పుడే
కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉంది. పుట్టుకచేత
అశ్వత్థామకి శిరస్సుమీద ఒక మణి ఉంది. ఆ మణికాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు
అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు
అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు.
అది సామాన్యమైన కత్తి కాదు. అది ఎంతమంది నెత్తురు త్రాగిందో. అటువంటి కత్తి
No comments:
Post a Comment