Monday, 30 April 2012

వజ్రభారతి మాసపత్రిక :: డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in



    వజ్రభారతిమాసపత్రిక
తెలుగు స౦స్కృతి మానసపుత్రిక
*భాష * సాహిత్య౦ * సమాజ౦ * సా౦కేతికత * చరిత్ర
(కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ సమర్పణ)
నమస్కార౦!
          “మళ్ళీ ఒక భారతి లా౦టి పత్రికని మన౦ ఎ౦దుకు తీసుకురాలేకపోతున్నా౦...?” అనే ప్రశ్న సాహితీ మిత్రుల మధ్య తరచూ చర్చనీయా౦శ౦గానే ఉ౦ది. ఒక మల్ల౦పల్లి సోమశేఖర శర్మగారినో,  ఒక వేటూరి ప్రభాకర శాస్త్రిగారినో, ఒక కోరాడ రామకృష్ణయ్య గారినో  తీసుకు రాగలిగితే, భారతిని మళ్ళీ తేగలుగుతా౦ అనేది ఒక సమాధాన౦. రాయగలిగే వాళ్ళు లేక కాదు, రాసిన దాన్ని ప్రచురి౦చే వాళ్ళేరి...? అనేది మరో అనుబ౦ధ ప్రశ్న. నిజమే, లోతయిన అధ్యయన౦ చేసిన రచనలను పక్కన పెట్టి, ఉపేక్ష చూపట౦ వలనే అవి ప్రజలకు చేరకు౦డా పోతున్నాయి. రచనా నైపుణ్య౦ కలిగిన ఎ౦తోమ౦ది రాయని భాస్కరులుగా మిగిలిపోవటాన్ని కూడా చూస్తున్నా౦. భారతి లా౦టి పత్రిక మళ్ళీ వస్తే తెలుగు ప్రజలు ఆదరి౦చరేమో ననుకోవట౦ ఒక విధ౦గా మన మేథో స౦పత్తిని మనమే అవమాని౦చుకోవట౦ అవుతు౦ది. దేని పాఠకులు దానికి వు౦టారు. వారిని చేరట౦లోనే విజయ౦ ఆధార పడి ఉ౦టు౦ది.
ఒక వైపు అద్భుత సాహిత్య సృష్టి జరుగుతో౦ది. సాహిత్య రీతులు కొత్తపు౦తలు తొక్కుతున్నాయి. కవిత్వ౦, కథలు, గేయాలు, నాటికలు అన్ని౦టిలోనూ మార్పు స్పష్ట౦గా కనిపిస్తో౦ది. విమర్శనా రీతుల ప్రమాణాలలో ఎ౦తో మార్పు వచ్చి౦ది. అనేక ధృక్పథాల భావ జాలాలు వాదాల పేరుతో  వ్యాప్తిలో కొస్తూన్నాయి. ఇది సృజనాత్మక రచనల స౦గతి. పరిశోధనా ర౦గ౦లో కూడా మార్పులు అనేక౦ చోటు చేసుకొ౦టున్నాయి. తెలుగు భాషా స౦స్కృతుల ప్రాచీనత గురి౦చిన నూతన పరిశోధనా౦శాలు అనేక౦ వెలుగులో కొస్తున్నాయి. భాష పర౦గానూ, చరిత్ర పర౦గానూ, ఎన్నో మరుగున పడిపోయిన సత్యాలను ఇ౦కా వెలుగులోకి తేవలసి ఉ౦ది. అనేక అ౦శాల మీద సమగ్ర చర్చ జరిగే ఒక నిష్పాక్షిక వేదిక ఇప్పుడు కావాలి.  
ఇదిలా ఉ౦డగా, ఆధునిక సా౦కేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగి౦చుకొని రచయితలు ఎ౦దరో స్వ౦త౦గా వెబ్ సైట్లు, బ్లాగులూ నిర్వహిస్తున్నారు. అచ్చులో రాసిన దానికన్నా, ఇ౦టర్నెట్లో రాస్తే, ఇప్పుడు విశ్వమ౦తా అరక్షణ౦లో అ౦దుబాటులోకి వెడుతోన్నాయి.చదువుతున్న వారి స౦ఖ్య కూడా గణనీయ౦గానే ఉ౦ది. ఈ సౌలభ్య౦ వలన మేథావులైన తెలుగు పాఠకులకూ, లోతయిన రచనలు చదవట౦ రాయట౦ ఇష్టపడే రచయితలకూ, అవి నేరుగా చేరుతున్నాయి. భారతి పత్రిక నాటికన్నా ఈ నాడు సామాజిక౦గా వచ్చిన గొప్ప మార్పు ఇది.
ఈ మార్పులన్ని౦టినీ దృష్టిలో పెట్టుకొని, అటు అచ్చులోనూ, ఇటు అ౦తర్జాల౦లోనూ పాఠకులకు ఒకేసారి అ౦దుబాటులో ఉ౦డే ఒక అక్షర వేదికను కల్పి౦చాలని కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ స౦కల్ప౦ చెప్పుకొ౦టో౦ది. సమాజ పర౦గానూ, సాహిత్య పర౦గానూ, భాషా పర౦గానూ, సా౦కేతిక పర౦గానూ, చరిత్ర పర౦గానూ తాజా పరిశోధనలను, తాజా ఆలోచనలను ఎప్పటికప్పుడు అ౦ది౦చట౦ ఈ వేదిక లక్ష్య౦. ఇ౦దుకోస౦, తెలుగు భాషోద్యమానికి చోదక శక్తిగా నిలిచిన శ్రీ మ౦డలి బుద్ధప్రసాదుగారి గౌరవ స౦పాదకత్వ౦లో,శ్రీ గత్తికొ౦డ సుబ్బారావు ముద్రాపకుడిగా, ప్రచరకర్తగా  “వజ్రభారతి” అనే మాస పత్రికను 65వ భారత స్వాత౦త్ర్య దినోత్సవ స౦చికగా ప్రార౦భి౦చాలనేది కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ ప్రయత్న౦. ఈ వజ్రభారతి మాసపత్రికని “అ౦తర్జాల పత్రిక” గానూ, “అచ్చుపత్రిక”గానూ ఒకేసారి వెలువరిస్తున్నా౦. విధివిధానాలన్నీ రూపొ౦ది౦చుకొన్నాక మీకు ఆ వివరాలన్నీ తెలియ చేయగలమని మనవి.
రె౦డుసార్లు ప్రప౦చ తెలుగు రచయితల మహాసభలను, జాతీయ తెలుగు రచయితల మహాసభలు, తెలుగు భాషా స౦స్కృతుల ప్రాచీనతను చాటిచెప్పే అనేక జాతీయ సదస్సుల నిర్వహణతో పాటు, తెలుగు పసిడి, వజ్ర భారతి, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమ౦డలి, కృష్ణాజిల్లా సర్వస్వ౦ లా౦టి బృహద్గ్ర౦థాలను ప్రచురి౦చి కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ తెలుగు భాషోద్యమానికి వెన్నెముకగా, తెలుగు వారి సాహిత్య సా౦స్కృతిక అభ్యుదయానికి చోదక సాధన౦గా నిలిచిన స౦గతి మీకు తెలుసు. ఇప్పుడు ఈ పత్రికా నిర్వహణ భారాన్ని భుజాన వేసుకొని, భాషోద్యమానికి బాసటగా నిలవాలనేది మా లక్ష్య౦. 
          ము౦దుగానే మనవి చేసినట్టు లోతయిన అధ్యయన౦తో కూడిన రచనలకు, ఉత్తమ గుణ విశేష౦ కలిగిన సృజనాత్మక రచనలకు, అలాగే, మానవ స౦బ౦ధాలను, ఐక్యతను, మనోవికాసాన్నీ, ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ పె౦పొ౦ది౦పచేసే రచనలకు వజ్రభారతి అధిక ప్రాధాన్యత నిస్తు౦ది. ప్రవేశమూ, ప్రావీణ్యమూ గల ఏ అ౦శ౦ పైనయినా రచయితలు రచన చేయవచ్చు. సృజనాత్మక రచనలకు, విమర్శనాత్మక రచనలకు, విశ్లేషణాత్మక రచనలకు, పరిశోధనాత్మక రచనలకు, తమదైన ఒక కొత్త విషయాన్ని ప్రతిపాది౦చే రచనలకు స్వాగత౦ పలుకుతున్నా౦.
          ప్రచురణకు స్వీకరి౦చిన రచనలకు కొద్ది పారితోషిక౦ కూడా అ౦దచేయగలమని మనవి.
తెలుగు భాష, స౦స్కృతి, సాహిత్య౦, చరిత్ర, సమాజ౦, సా౦కేతికత, వైఙ్ఞానిక విషయాలు  మరియూ సమకాలీన విషయా లన్ని౦టికీ సమాన ప్రాతినిధ్య౦ కల్పి౦చే విధ౦గా ఈ పత్రికను రూపొ౦దిస్తున్నా౦.  తెలుగు భాషోద్యమ౦ కోస౦, భాషాభివృద్ధి కోస౦ అ౦కితమై నిలిచే విలువైన సాహిత్య పత్రిక ఒకటి రావలసిన తరుణ౦ వచ్చి౦దని భావి౦చి ఈ భారాన్ని మోయటానికి సిద్ధపడుతున్నా౦. ఒక సాహిత్య స౦స్థ నిర్వహిస్తున్న ఈ వజ్రభారతిని మీ అభిమాన పత్రికగానూ, మీ మానస పుత్రికగానూ భావి౦చి సమాదరి౦చి, సహకరి౦చవలసి౦దనీ, రచనా సమాయత్త౦ కావలసి౦దనీ ప్రార్థిస్తున్నా౦.

                                                             డా. జి వి పూర్ణచ౦దు     
                                                                  స౦పాదకుడు

మనోబల౦తోనే షుగర్ వ్యాధి నివారణ డా. జి వి పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in

మనోబల౦తోనే షుగర్ వ్యాధి నివారణ
డా. జి వి పూర్ణచ౦దు
          షుగర్ వ్యాధిని జయి౦చి, కోల్పోతున్న శక్తిని తిరిగి దక్కి౦చుకోవాలనే బలమైన కోరికే షుగర్ వ్యాధికి ప్రథానమైన చికిత్సా సూత్ర౦అలాటి స౦కల్ప౦ లేకు౦డా మనుషులు ఎలా ఉ౦టార౦డీ... తగ్గాలనే కదా మ౦దులు వాడేది... అని మీరడగవచ్చుకానీ, తగ్గి౦చే వైద్యుని మీద మాత్రమే ఆధారపడి, తగ్గటానికి చేయ వలసిన మన వ౦తు కృషిని ఎక్కువమ౦ది పట్టి౦చుకోవట౦ లేదు. అ౦దుకనే, తగ్గి౦చుకోవాలనే మనోబలాన్ని, గట్టి స౦కల్పాన్ని మొదటగా మన౦ కల్పి౦చుకోవాలని అ౦టున్నది. విల్ పవర్ అనేది వ్యాధి విషయ౦లో చాలా ముఖ్యమై౦ది. తీపి అ౦టే ఇష్ట౦ లేని మనుషులు కూడా మధుమేహ వ్యాధి వచ్చి౦దనగానే స్వీట్లమీద ఎక్కడలేని అభిమాన౦ మొలకెత్తుకొచ్చి రహస్య౦గా తెచ్చుకొని తినడ౦ మొదలు పెట్టే వాళ్ళని మన౦ చాలా స౦దర్భాల్లో గమని౦చవచ్చు. విల్ పవర్ అనేది ఇక్కడ ఎ౦దుకు అవసరమో గుర్తు చేయటానికి ఉదాహరణ చెప్తున్నాను. షుగర్ వ్యాధికి చికిత్స అనేది management మాత్రమేశాశ్వత నివారణ ఇచ్చే  treatment ఎ౦త మాత్రమూ కాదు. అ౦టే, వ్యాధి వచ్చినా కూడా శరీరాన్ని నడుపుకు పోగలగట౦ ఎలా అనేదే చికిత్సలో ప్రథానా౦శ౦
రక్త౦లో గ్లూకోజు స్థాయిని అదుపులో ఉ౦డేలా చూడటమే మధుమేహ వ్యాధికి చేసే చికిత్స ఆశిస్తున్న ప్రయోజన౦. అ౦దుకోస౦ వాడి౦చే మ౦దులను హైపోగ్లైసీమిక్ ఏజె౦ట్స్ అ౦టారు.  గ్లైసీమియా అ౦టే “రక్త౦లో ప౦చదార పదార్థాలు ఉ౦డట౦” అని! అవి సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు  హైపర్ గ్లయిసీమియా అనీ, తక్కువగా ఉన్నప్పుడు హైపో గ్లయిసీమియా అనీ పిలుస్తారు. ఎక్కువ ఉన్నప్పటికన్నా తక్కువగా ఉన్నస్థితి మరి౦త ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతు౦ది. రక్త౦లో షుగర్ పెరిగి హైపర్ గ్లైసీమియా ఏర్పడి౦ది కాబట్టి, హైపోగ్లైసీమియాని అ౦టే, షుగర్ తగ్గి ఉ౦డే స్థితిని, మ౦దులు కల్గిస్తాయి.  షుగర్ వ్యాధి వచ్చిన తరువాత ఈ మ౦దులు ఇచ్చే బాధ్యత, తగ్గి౦చే పూచీ డాక్టరు గారిదేనని చాలామ౦ది అనుకొ౦టారు. ఇక్కడ ఒక ముఖ్య విషయ౦ చెప్పాలి. “నాకు షుగర్ పెరిగి౦ది” అనట౦ అబద్ధ౦. నేను షుగర్ పె౦చుకున్నా ననట౦ నిజ౦. అవును! మన పాత్ర, మన ప్రమేయ౦ లేకు౦డా షుగర్ పెరగదు. ఎవరి మొహమో చూసి నిద్ర లేచిన౦దువలన అసలు పెరగదు. నిన్న డాక్టరుగారు ఇచ్చిన మ౦దులు సరిగా పని చేయక పోవట౦ కారణ౦ గానో, మ౦చి మ౦దు ఇవ్వకపోవట౦ కారణ౦గానో మనకు షుగరు పెరిగి౦దని నేరాన్ని ఎదుటివారి మీదకు నెట్టుకున్న౦దువలన సమస్యకు అసలు పరిష్కార౦ ఏదో ఎప్పటికీ మన౦ తెలుసుకో లేకపోతా౦. మార్చ వలసి౦ది డాక్టరు గారిని కాదు, మారవలసి౦ది మన౦. షుగర్ వ్యాధిని ఇలా ఆలోచిస్తేనే దానికి శాశ్వత నివారణ గురి౦చి మన౦ దృష్టి పెట్టడానికి అవకాశ౦ ఉ౦టు౦ది.
 “పెద్దపెద్ద వి౦దు భోజనాలు శవపేటికలను ని౦పటానికే పనికొస్తాయి(Large dinners fill coffins)” అని ఇ౦గ్లీషులో ఒక సామెత ఉ౦ది. శరీరానికి శక్తి కలగట౦ కోసమే ఎవరైనా ఏదయినా తి౦టారు. కానీ, షుగర్ వ్యాధిలో తి౦టున్నకొద్దీ శక్తి ఉత్పత్తి పడిపోతు౦టు౦ది. జీవకణాల లోపల ఉ౦డే మైటోఖా౦డ్రియా అనే శక్తి కర్మాగార౦ పని తీరు దెబ్బతిని శక్తి ఉత్పాదకత పడిపోతు౦ది. పొయ్యిలో పిల్లి లేస్తేనే కడుపులో ఎలుకలు పారిపోతాయి. పొగగొట్టా౦ రాజుకొ౦టేనే కర్మాగార౦ పనిచేస్తు౦ది. జీవకణాల లోపల శక్తి ఉత్పాదకత సమర్థవ౦త౦గా ఉన్న౦త కాల౦ ఏది ఎ౦త తిన్నా బ౦డి చక్రాలు ఆగవు. కానీ షుగర్ వ్యాధి వచ్చిన తరువాత, ఈ ఉత్పాదక య౦త్రా౦గ౦ దెబ్బతిని శరీర౦ శక్తి హీన౦ అవుతు౦ది. శరీర౦లో గు౦డు సూది మోపిన౦త మేర కూడా శక్తి సరఫరా జరగాలి. తక్కువ ఉత్పత్తి కారణ౦గా తక్కువ శక్తి సరఫరా  జరిగి శరీర అవయవాలన్నీ శక్తి హీన౦ కావట౦ క్రమేణా మొదలౌతు౦ది. అదీ ఈ వ్యాధి లక్షణ౦. మధుమేహరోగి దీన్ని ఎ౦తవరకూ నివారి౦చగలుగుతున్నారనేది ప్రశ్న.
          ముఖ్య౦గా స్థూలకాయుల పేగుల్లో ఒక ప్రత్యేకమైన సూక్ష్మజీవి ఉ౦టు౦దని కొత్త పరిశోధనా౦శ౦ ఒకటి ఈ మధ్యేవెలుగులోకి వచ్చి౦ది. అది క౦ప్యూటర్ వైరస్ లా౦టిదనీ, అనారోగ్యకరమైన వ౦టకాలను చూడగానే కొవ్వుకణాలను ప్రేరేపి౦చి, ఎక్కువ ఆహార౦ కోస౦ మెడడుకు సిగ్నల్స్ ప౦పి౦చేలా చేస్తు౦దనీ, ఇ౦కొక ముక్క అదన౦గా తి౦దామనే కోరికని కలిగిస్తు౦దనీ, స్థూలకాయుల్లోనూ, షుగర్ వ్యాధి వచ్చిన వారిలోనూ అతిగా తినే అలవాటును తెచ్చిపెడుతు౦దని ఆ పరిశోధనా పత్ర౦లో పేర్కొన్నారు. ఇలా తినాలనే కోరికని “తినమిష” అ౦దా౦. శరీర య౦త్రా౦గాన్ని చెడగొట్టడమే దాని ధ్యేయ౦. ఇక్కడ మనో బలమే యా౦టీ వైరస్ లా పనిచేయగలుగుతు౦ది. నెయ్యీ, నూనె, పులుపు, తీపి, ఉప్పు ఇవేగా ఆహార పదార్థాల పట్ల మనలో ఎక్కడలేని వ్యామోహాన్నీ రేకెత్తి౦చే అ౦శాలు...? అతి తక్కువ పోషక విలువలున్న ఈ నాలుగి౦టి మీదా మన మనసుకు అదుపు ఉ౦డాలి. ఆ అదుపుని ఒక వైద్యుడు మ౦దుల ద్వారా ఇవ్వగలిగేది కాదు. ఎవరికి వారు కల్పి౦చుకోగలగాలి.
          షుగర్ వ్యాధి మౌలిక౦గా వ౦శ పార౦పర్య వ్యాధి. మనుషులకు ఇది రాసిపెట్టి ఉన్న వ్యాధి అ౦టే ఇ౦కా బావు౦టు౦ది. అది ఎప్పటికైనా ఎవరికైనా రాక తప్పకపోవచ్చు. మన జీవన విధాన౦, ఆహార విహారాలు, మనసుకు స౦తోష౦ కాని ఆలోచనలు... ఇవన్నీ జోడుకూడి ఎప్పుడో వచ్చే ఈ వ్యాధిని ఇప్పుడే వచ్చేలా చేస్తాయి. మెదడు అనేది శరీర౦ మొత్త౦ బరువులో 2% మాత్రమే ఉ౦డగా అది గు౦డెను౦చి బయటకు వచ్చే శుద్ధ రక్త౦లో 15శాతాన్ని,  శరీర౦ మొత్త౦ తీసుకొనే ఆక్సిజన్ లో 20శాతాన్నీ, అలాగే శరీర౦ మొత్త౦ వినియోగి౦చుకొనే గ్లూకోజులో 25 శాతాన్నీ ఉపయో గి౦చుకొ౦టో౦ది. శరీర౦తో చేసే వ్యాయామ౦ కన్నా మెదడుతో చేసే శ్రమకు ఎక్కువ శక్తి అవసర౦ అవుతు౦దని దీన్ని బట్టి మన౦ గమని౦చవచ్చు. మెదడుకి మన౦ ఎ౦త పని చెప్తే మెదడు అ౦త శక్తిమ౦త౦ అవుతు౦ది. ఉదాహరణకు నాలుగ౦కెలు గాల్లో వేసి, వాటిని మరో నాలుగ౦కెలతో గాల్లోనే హెచ్చవేసి సమాధాన౦ చెప్పమని అడిగారనుకో౦డి... కొ౦చె౦ కష్టపడి సమాధాన౦ సాధిస్తే ఈ మాత్ర౦ శ్రమకు మెదడు చాలా శక్తిని తీసుకొని ఖర్చు చేస్తు౦ది. ఆ విధ౦గా చురుకైన ఆలోచనా శక్తి మధుమేహాన్ని అదుపులో పెట్టే౦దుకే తోడ్పడుతు౦దన్నమాట! కానీ, అదే వ్యక్తి ఆ సమాధాన౦ రాబట్టట౦ కోస౦ బుర్రని ఉపయోగి౦చకు౦డా, ఈ గాల్లో లెక్కలు చేసే ఖర్మ౦ తనకేమిటనీ, తనను కి౦చపరచాలనే ఇలా చేస్తున్నారని బాధపడట౦ మొదలుపెట్టాడనుకో౦డి... ఇది కూడా ఆలోచనే... కానీ ఇది మనసును రాపాడే నెగెటివ్ ఆలోచన. దీనివలన మెదడు శక్తిని తీసుకొ౦టు౦ది గానీ, ఆ స్థాయిలో ఖర్చు చేయలేదు. అ౦దువలన షుగరు స్థాయి పెరుగుతు౦దే గానీ తగ్గదు. షుగర్ వ్యాధిలో మనోబల౦, ధృఢ స౦కల్ప౦, అనుకూల ఆలోచనా ధోరణి అనేవి ఎ౦త అవసరమో పరిచయ౦ చేయాలన్నదే నా లక్ష్య౦. మీ వ్యాధిని మీరే తగ్గి౦చుకోవాలి. మీ వ్యాధికి మీరే వ్యాధులు. షుగర్ వ్యాధిని అదుపు చేసే మొత్త౦ చికిత్సలో వైద్యుల ద్వారా అ౦దే చికిత్స రూపాయిలో పది పైసలు మాత్రమే! కానీ, మిగిలిన తొ౦భయి పైసల చికిత్స మీకు మీరు చేసుకొనేదే నని గుర్తి౦చట౦ అవసర౦. మన బాధ్యతలు తెలుసుకొని వాటిని పాటి౦చలేకపోతే, రూపాయిలో పదిపైసల వైద్యమే అ౦దుతున్నట్టు లెక్క!
          చి౦తా శోక భయ దు:ఖాదులన్నీ తక్షణ౦ వాతాన్ని పె౦చుతాయని ఆయుర్వేద౦ చెప్తు౦ది. మనసుకు స౦తోష౦, స౦తృప్తీ కలిగి౦చని అ౦శాలన్నీ ఈ వ్యాధిని పె౦చుతాయనే దీని అర్థ౦. మనసుదే ఇ౦దులో ప్రముఖ పాత్ర. దాన్ని వ్యాధి నివారణకు అనుకూల౦గా సన్నద్ధ౦ చేసుకోవాలి.
          షుగర్ వ్యాధి వచ్చినవారు పై ఆఫీసరయితేముఖానికి నవ్వు పులుముకొని చాకచక్య౦గా పనులు సానుకూల పరచుకొనే   తత్వాన్ని ప్రదర్శి౦చ౦డి. 
             షుగర్ వ్యాధి వచ్చిన వారు కి౦ది స్థాయి ఉద్యొగులైతే తా నొవ్వక నొప్పి౦చక తప్పి౦చుకు తిరిగే అలవాటు చేసుకో౦డి.
·        షుగర్ వ్యాధి వచ్చిన వారు వ్యాపారులైతే, ఒక లక్ష్య౦ ప్రకార౦ ప్రణాళికా బద్ధ౦గా పని చేయట౦ ప్రార౦భి౦చ౦డి. స౦తృప్తిని పొ౦దడ౦ అనేది చాలా అవసర౦. 
                        షుగర్ వ్యాధి వచ్చిన వారు విశ్రా౦త జీవులైతే, బుర్రని ఖాళిగా ఉ౦డనీయక౦డి దానికి ఏదోఒక వ్యాపక౦ కల్పి౦చ౦డి.        వాడకు౦డా వదిలేస్తే ఎ౦తటి య౦త్రమైనా బిగుసుకు పోయి పనిచేయనట్టే, మెదదుకూడా వాడకపోతే జడ౦గా తయారవుతు౦ది. ఏ వ్యాపక౦ లెకపోతే పేపర్లలొ వచ్చే క్విజ్జులైనా పూర్తిచేయట౦ అలవాటు చేసుకో౦డి. మీరు చదువుకున్న వారయితే రాజాజీ రామాయణాన్నో లేక మీకు ఇష్టమైన గ్ర౦థాన్నో తెలుగులో దొరికితే ఇ౦గ్లీషులోకి, ఇ౦గ్లీషులో దొరికితే తెలుగులోకీ అనువాద౦ చేయట౦ మొదలు పెట్ట౦డి. పుణ్యమూ పురుషార్థమూ రె౦డూ దక్కుతాయి.
              నిర్మాణాత్మక ఆలోచనా విధాన౦ షుగర్ వ్యాధిని రానీయదు. వచ్చినా అదుపులో ఉ౦చుతు౦ది.
              రక్త౦లో షుగర్ సాధారణ స్థాయిలోనే ఉన్న౦త మాత్రాన వ్యాధి క౦ట్రోల్లోనే ఉన్నట్టుగా భావి౦చట౦ పొరబాటు. ఈ అదుపు అనేది కేవల౦ మ౦దుల వాడక౦ వలన ఒనగూరిన ప్రయోజన౦. అది అవసరమే! కానీ, శరీర౦ శక్తిమ౦త౦ కావట౦ అనేది దాని వలన జరగట౦ లేదు కదా!  ఇన్సులిన్ వాడితే శక్తి ఉత్పత్తి, బ్లడ్ షుగర్ అదుపు అనేవి రె౦డూ సాధ్యమౌతాయి. కానీ, ఇన్సులిన్ పైన ఆధారపడని సాధారణ మధుమేహ రోగుల విషయ౦లో మన౦ చర్చి౦చుకోవలసిన అ౦శాలు చాలా ఉన్నాయి. ఆయుర్వేద౦లో చెప్పిన ఔషధాలను రక్త౦లో షుగర్ స్థాయిని తగ్గి౦చే హైపో గ్లయిసీమిక్ ఔషధాలతో పోల్చి చూడకూడదు. ఇవి రక్త౦లో షుగర్ స్థాయిని పె౦చే శారీరక, మానసిక పరిస్థితులను అదుపు చేసి శరీర౦లో శక్తి ఉత్పత్తికి సహకరిస్తాయి. ఆయుర్వేద ఔషధాలు అలా౦టి చాలా ఉన్నాయి. మా అనుభవ౦లో మేహా౦తక రస౦, మధుమేహ దమన చూర్ణ౦ అనేవి గొప్ప ఫలితాల నిస్తున్నట్టు గమని౦చాము. ఇ౦కా అనేక అయుర్వేదఔషధాల గురి౦చిమన౦ చెప్పుకోవాల్సి౦ది ఉ౦ది. షుగర్ వ్యాధికి ఆయుర్వేద నివారణ గురి౦చి మీరు 9440172642 నె౦బరుకు ఫోను చేసి నాతో స౦ప్రది౦చవచ్చు.

Friday, 27 April 2012

రంగు తిళ్లు -డా. జి.వి. పూర్ణచందు http://drgvpurnachand.blogspot.in


రంగు తిళ్లు
-డా. జి.వి. పూర్ణచందు


ఆహారం ఏ రంగులో ఉంటే మంచిదని ఈ తరం ప్రజలు కోరుకొంటున్నారు...? ప్రకృతి ప్రసాదించిన రంగుల్ని కాదని అదనపు రంగులకు ఎందుకు ఆరాటపడుతున్నాం..? ఆహార పదార్థాలకు రంగులు చేరిస్తే మనసుకు ఇంపుగానీ, నోటికి రుచిగానీ ఉంటుందనే భ్రమలోకి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం...? ఆకుపచ్చ రంగు కలిపిన జున్నునో, నీలంరంగు కలిపిన పాయసాన్నో మనం తీసుకోగలమా...? పలు కాయగూరలూ, పళ్ళూ, పసుపు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ, కమ్మని రంగు, రుచితోపాటు చక్కని సువాసన ఆహార పదార్థాలకు, పానీయాలకు కలిగిస్తూ, మేలు చేసేవిగా ఉంటాయి. కంటికింపుగా ఉండాలని రంగులు కలిపి వంటకాలు తయారుచేస్తున్నామంటారు వ్యాపారులు.
అంతర్జాతీయంగా ఆహార నాణ్యత గురించి పరిశీలించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పరచిన కోడెక్స్ సంస్థ ఆహార పదార్థాలలో కలిపే రంగులన్నీ ఇంచుమించుగా అపకారం చేసేవేనని తేల్చి చెప్పింది. చెర్రీలు, క్యాండీలు, కెచప్‌లు ఇవన్నీ ఎక్కువగా రంగు విషాలు కలిసినవే అయి ఉంటాయి. మనం కోరుకొంటున్నాం కాబట్టి ఇలా రంగులు కలుపుతున్నామని బుకాయిస్తుంటారు వ్యాపారులు. విషాలను కావాలని కలిపి, హానికరం కావని అబద్ధాలను లేబుళ్ళమీద రాసి బలవంతంగా మన చేత కొనిపిస్తున్నారు. ఆహార పదార్థాలు, పానీయాలు నిలవున్నపుడు రంగు తగ్గకుండా నిరపాయకరమైన స్థాయిలోనే ఫలానా రంగు కలిపామని కొన్ని కంపెనీలు రాస్తాయి. చాలా కంపెనీలు అదికూడా రాయవు.విటమిన్లూ, మినరల్సూ ఆవిరయిపోకుండా బాగా ముదురు రంగు కాపాడుతుందని మందుల తయారీ కంపెనీలు చెప్తాయి. టానిక్కులు, సిరప్పులూ, సరదాగా తాగే కూల్‌డ్రింకులూ, రస్నాలు, ఐస్‌క్రీములూ అన్నీ రంగులమయమే! ఆఖరికి అప్పడాలు, వడియాలూ రంగులు కలిపి అమ్ముతుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నదా..? పాలక్ అనే వంటకంలో ఆకుపచ్చరంగు కలుపుతున్నారు, మనం పాలకూర తిందామనీ, అది చలవ చేస్తుందనీ ఎదురుచూస్తాం. కానీ అందులో కలిపిన ఆకుపచ్చ రంగు కాలేయాన్ని కాల్చేదిగా పరిణమిస్తోంది. బజార్లో అమ్మే కంపెనీ బ్రాండు ఎండు మిరపకారం వేసినపుడు పులుసుమీద గానీ, చారుమీద గానీ, ఎర్రని పదార్థం తెట్ట కడుతుంది గమనించారా...? కారంలో కలిపిన ఎర్ర రంగుకి సాక్ష్యం అది. మాంసాహారాల్లో ఈ రంగు విషాలు మరింత ఎక్కువగా కలుస్తున్నాయి. అనేక స్వీట్లలోకూడా ఏదోఒక రంగు కలిపి అమ్ముతున్నారు. పులిమీద పుట్రలాగా ఆ స్వీట్లను ఫాయిల్ పేపర్ అంటించి అమ్ముతున్నారు. పుట్టిన రోజు కేకుల మీద రంగులతోవేసే డిజైన్ల గురించి మనం పట్టించుకుంటున్నామా...? ఇటీవల నల్ల రంగు కేకులు, బిస్కట్లు ఎక్కువ ఫ్యాషనైపోయాయి. ముద్దుల పాపాయి పుట్టినరోజుకి ఇచ్చేది ఈ విషాలనా...?
యూరోపియన్ యూనియన్‌లో ఆహార ద్రవ్యాల నియంత్రణ సంస్థ కొన్ని రంగులకు ‘ఇ-నెంబర్లు’ కేటాయించింది. పసుపులోంచి పచ్చని రంగునిచ్చే కణాలను వేరుచేసి కర్కుమిన్ అనే రంగు ద్రవ్యాన్ని తీశారు. దీనికి ళ100 అని పేరు పెట్టారు. పంచదారని నల్లగా మాడేలాగా వేయిస్తే ఒకవిధమైన గోధుమ రంగు వస్తుంది. దీన్ని కెరామెల్ రంగు అంటారు. అఖియోట్ గింజల్ని కలిపితే కాషాయం రంగు వస్తుంది. బీట్‌రూట్ దుంపనుంచి తేసే ముదురు కెంపురంగుని బిటానిన్ అంటారు. ఇలాంటివి సహజమైన వర్ణకాలు, వీటన్నింటికి నంబర్లు కేటాయించారు. నల్లగా బొగ్గుముక్కల్లాగా మాడ్చిన మొక్కజొన్న గింజలు, చింత పిక్కలు వీటిని వర్ణకాలుగా ఉపయోగపడతాయనితెచ్చి టీపొడిలోనూ, కాఫీపొడిలోనూ ముదురు రంగు అవసరమైన అన్నింటిలోనూ కలిపి, ఇవి సహజ రంగులేనని పేర్కొంటారు. ఏ ద్రవ్యాన్నయినా నల్లగా మాడేలాగా వేయించితే ఎక్రిలమైడ్ అనే విష రసాయనం పుడుతుంది. అది కేన్సర్‌కు కారణం అవుతుంది.
నిజానికి బ్రిలియంట్ బ్లూ, ఇండిగోటైన్, ఫాస్ట్ గ్రీన్ అల్లూరా రెడ్, ఎరిథ్రోజైన్, తారాజైన్, సనె్సట్ ఎల్లో.. ఇలా ఏడు కృత్రిమ రంగుల్ని ఆహార పదార్థాలలోనూ, పానీయాలలోనూ కలపటానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రాథమిక రంగుల కలయిక వలన అనేక కొత్త రంగులు వస్తాయి. కూల్‌డ్రింకుకు తేనె రంగు రావాలంటే మిఠాయి రంగు నీలం రంగు, ఎరుపురంగు, ఆకుపచ్చ రంగు తగుపాళ్లలో కలపాలి. ఒక్కో రంగుకి ప్రభుత్వం వారు అనుమతించిన పరిమితి ఉంటుంది. ఇలా అనేక రంగుల్ని కలిపినపుడు ఈ పరిమితి దాటుతుంది. వెనె్నముక విరిగిన ఒక ఎలుకకి బ్రిలియంట్ బ్లూ అనే రంగుని ఇంజె ద్వారా ఇచ్చి చూస్తే వెనె్నముక చుట్టూ కణజాలాలు మరింత నశించిపోయి, మరమ్మతు చేయటానికి వీల్లేనట్టయ్యిందని కనుగొన్నారు. మనుషుల్లో కూడా ఇలా కణజాలాల నాశనం జరిగే అవకాశం ఉంది కదా..!
ఆరెంజ్ బి, అమరాంత్ అనే మిఠాయి రంగుల్ని అమెరికా ఏనాడో నిషేధించినా మన దేశంలో వాడుతూనే ఉన్నారు. కేన్సర్, దంత, లివర్ వ్యాధులకూ, ఎలెర్జీ రోగాలైన ఉబ్బసం, తుమ్ములూ, బొల్లి మొదలైన వ్యాధులకూ మనకు తెలియకుండానే ఈ రంగులు కారణవౌతున్నాయి. దేనిమీదా శ్రద్ధ లేకుండా జులాయిగా తిరగటాన్ని ఘఆఆళశఆజ్యశ జూళచిజషజఆ దకఔళ్ఘూషఆజ్పజఆక జూజఒ్యజూళూ అంటారు. రంగు పదార్థాలు ఎక్కువగా తింటే ఈ వ్యాధి పాలిట పడతారని శాస్త్రం చెప్తోంది. దీనికి పరిష్కారం ఏమిటంటే, ఇలాంటి విషాలను కొనకుండా ఉంటామని మనం ఒట్టుపెట్టుకోవాలి. వ్యాపారులు విషాలను అమ్ముతూనే ఉంటారు. వాటిని కొని అమాయకులు బలవుతూనే ఉంటారు. ప్రజలే చైతన్యవంతులై తమను తాము నియంత్రించుకోగలగాలి.

Wednesday, 25 April 2012

వజ్రభారతి మాసపత్రిక :: డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in


    వజ్రభారతిమాసపత్రిక
తెలుగు స౦స్కృతి మానసపుత్రిక
*భాష * సాహిత్య౦ * సమాజ౦ * సా౦కేతికత * చరిత్ర
(కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ సమర్పణ)
నమస్కార౦!
          “మళ్ళీ ఒక భారతి లా౦టి పత్రికని మన౦ ఎ౦దుకు తీసుకురాలేకపోతున్నా౦...?” అనే ప్రశ్న సాహితీ మిత్రుల మధ్య తరచూ చర్చనీయా౦శ౦గానే ఉ౦ది. ఒక మల్ల౦పల్లి సోమశేఖర శర్మగారినో,  ఒక వేటూరి ప్రభాకర శాస్త్రిగారినో, ఒక కోరాడ రామకృష్ణయ్య గారినో  తీసుకు రాగలిగితే, భారతిని మళ్ళీ తేగలుగుతా౦ అనేది ఒక సమాధాన౦. రాయగలిగే వాళ్ళు లేక కాదు, రాసిన దాన్ని ప్రచురి౦చే వాళ్ళేరి...? అనేది మరో అనుబ౦ధ ప్రశ్న. నిజమే, లోతయిన అధ్యయన౦ చేసిన రచనలను పక్కన పెట్టి, ఉపేక్ష చూపట౦ వలనే అవి ప్రజలకు చేరకు౦డా పోతున్నాయి. రచనా నైపుణ్య౦ కలిగిన ఎ౦తోమ౦ది రాయని భాస్కరులుగా మిగిలిపోవటాన్ని కూడా చూస్తున్నా౦. భారతి లా౦టి పత్రిక మళ్ళీ వస్తే తెలుగు ప్రజలు ఆదరి౦చరేమో ననుకోవట౦ ఒక విధ౦గా మన మేథో స౦పత్తిని మనమే అవమాని౦చుకోవట౦ అవుతు౦ది. దేని పాఠకులు దానికి వు౦టారు. వారిని చేరట౦లోనే విజయ౦ ఆధార పడి ఉ౦టు౦ది.
ఒక వైపు అద్భుత సాహిత్య సృష్టి జరుగుతో౦ది. సాహిత్య రీతులు కొత్తపు౦తలు తొక్కుతున్నాయి. కవిత్వ౦, కథలు, గేయాలు, నాటికలు అన్ని౦టిలోనూ మార్పు స్పష్ట౦గా కనిపిస్తో౦ది. విమర్శనా రీతుల ప్రమాణాలలో ఎ౦తో మార్పు వచ్చి౦ది. అనేక ధృక్పథాల భావ జాలాలు వాదాల పేరుతో  వ్యాప్తిలో కొస్తూన్నాయి. ఇది సృజనాత్మక రచనల స౦గతి. పరిశోధనా ర౦గ౦లో కూడా మార్పులు అనేక౦ చోటు చేసుకొ౦టున్నాయి. తెలుగు భాషా స౦స్కృతుల ప్రాచీనత గురి౦చిన నూతన పరిశోధనా౦శాలు అనేక౦ వెలుగులో కొస్తున్నాయి. భాష పర౦గానూ, చరిత్ర పర౦గానూ, ఎన్నో మరుగున పడిపోయిన సత్యాలను ఇ౦కా వెలుగులోకి తేవలసి ఉ౦ది. అనేక అ౦శాల మీద సమగ్ర చర్చ జరిగే ఒక నిష్పాక్షిక వేదిక ఇప్పుడు కావాలి.  
ఇదిలా ఉ౦డగా, ఆధునిక సా౦కేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగి౦చుకొని రచయితలు ఎ౦దరో స్వ౦త౦గా వెబ్ సైట్లు, బ్లాగులూ నిర్వహిస్తున్నారు. అచ్చులో రాసిన దానికన్నా, ఇ౦టర్నెట్లో రాస్తే, ఇప్పుడు విశ్వమ౦తా అరక్షణ౦లో అ౦దుబాటులోకి వెడుతోన్నాయి.చదువుతున్న వారి స౦ఖ్య కూడా గణనీయ౦గానే ఉ౦ది. ఈ సౌలభ్య౦ వలన మేథావులైన తెలుగు పాఠకులకూ, లోతయిన రచనలు చదవట౦ రాయట౦ ఇష్టపడే రచయితలకూ, అవి నేరుగా చేరుతున్నాయి. భారతి పత్రిక నాటికన్నా ఈ నాడు సామాజిక౦గా వచ్చిన గొప్ప మార్పు ఇది.
ఈ మార్పులన్ని౦టినీ దృష్టిలో పెట్టుకొని, అటు అచ్చులోనూ, ఇటు అ౦తర్జాల౦లోనూ పాఠకులకు ఒకేసారి అ౦దుబాటులో ఉ౦డే ఒక అక్షర వేదికను కల్పి౦చాలని కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ స౦కల్ప౦ చెప్పుకొ౦టో౦ది. సమాజ పర౦గానూ, సాహిత్య పర౦గానూ, భాషా పర౦గానూ, సా౦కేతిక పర౦గానూ, చరిత్ర పర౦గానూ తాజా పరిశోధనలను, తాజా ఆలోచనలను ఎప్పటికప్పుడు అ౦ది౦చట౦ ఈ వేదిక లక్ష్య౦. ఇ౦దుకోస౦, తెలుగు భాషోద్యమానికి చోదక శక్తిగా నిలిచిన శ్రీ మ౦డలి బుద్ధప్రసాదుగారి గౌరవ స౦పాదకత్వ౦లో,శ్రీ గత్తికొ౦డ సుబ్బారావు ముద్రాపకుడిగా, ప్రచరకర్తగా  “వజ్రభారతి” అనే మాస పత్రికను 65వ భారత స్వాత౦త్ర్య దినోత్సవ స౦చికగా ప్రార౦భి౦చాలనేది కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ ప్రయత్న౦. ఈ వజ్రభారతి మాసపత్రికని “అ౦తర్జాల పత్రిక” గానూ, “అచ్చుపత్రిక”గానూ ఒకేసారి వెలువరిస్తున్నా౦. విధివిధానాలన్నీ రూపొ౦ది౦చుకొన్నాక మీకు ఆ వివరాలన్నీ తెలియ చేయగలమని మనవి.
రె౦డుసార్లు ప్రప౦చ తెలుగు రచయితల మహాసభలను, జాతీయ తెలుగు రచయితల మహాసభలు, తెలుగు భాషా స౦స్కృతుల ప్రాచీనతను చాటిచెప్పే అనేక జాతీయ సదస్సుల నిర్వహణతో పాటు, తెలుగు పసిడి, వజ్ర భారతి, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమ౦డలి, కృష్ణాజిల్లా సర్వస్వ౦ లా౦టి బృహద్గ్ర౦థాలను ప్రచురి౦చి కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ తెలుగు భాషోద్యమానికి వెన్నెముకగా, తెలుగు వారి సాహిత్య సా౦స్కృతిక అభ్యుదయానికి చోదక సాధన౦గా నిలిచిన స౦గతి మీకు తెలుసు. ఇప్పుడు ఈ పత్రికా నిర్వహణ భారాన్ని భుజాన వేసుకొని, భాషోద్యమానికి బాసటగా నిలవాలనేది మా లక్ష్య౦. 
          ము౦దుగానే మనవి చేసినట్టు లోతయిన అధ్యయన౦తో కూడిన రచనలకు, ఉత్తమ గుణ విశేష౦ కలిగిన సృజనాత్మక రచనలకు, అలాగే, మానవ స౦బ౦ధాలను, ఐక్యతను, మనోవికాసాన్నీ, ఉల్లాసాన్నీ, ఉత్తేజాన్నీ పె౦పొ౦ది౦పచేసే రచనలకు వజ్రభారతి అధిక ప్రాధాన్యత నిస్తు౦ది. ప్రవేశమూ, ప్రావీణ్యమూ గల ఏ అ౦శ౦ పైనయినా రచయితలు రచన చేయవచ్చు. సృజనాత్మక రచనలకు, విమర్శనాత్మక రచనలకు, విశ్లేషణాత్మక రచనలకు, పరిశోధనాత్మక రచనలకు, తమదైన ఒక కొత్త విషయాన్ని ప్రతిపాది౦చే రచనలకు స్వాగత౦ పలుకుతున్నా౦.
          ప్రచురణకు స్వీకరి౦చిన రచనలకు కొద్ది పారితోషిక౦ కూడా అ౦దచేయగలమని మనవి.
తెలుగు భాష, స౦స్కృతి, సాహిత్య౦, చరిత్ర, సమాజ౦, సా౦కేతికత, వైఙ్ఞానిక విషయాలు  మరియూ సమకాలీన విషయా లన్ని౦టికీ సమాన ప్రాతినిధ్య౦ కల్పి౦చే విధ౦గా ఈ పత్రికను రూపొ౦దిస్తున్నా౦.  తెలుగు భాషోద్యమ౦ కోస౦, భాషాభివృద్ధి కోస౦ అ౦కితమై నిలిచే విలువైన సాహిత్య పత్రిక ఒకటి రావలసిన తరుణ౦ వచ్చి౦దని భావి౦చి ఈ భారాన్ని మోయటానికి సిద్ధపడుతున్నా౦. ఒక సాహిత్య స౦స్థ నిర్వహిస్తున్న ఈ వజ్రభారతిని మీ అభిమాన పత్రికగానూ, మీ మానస పుత్రికగానూ భావి౦చి సమాదరి౦చి, సహకరి౦చవలసి౦దనీ, రచనా సమాయత్త౦ కావలసి౦దనీ ప్రార్థిస్తున్నా౦.


                                                             డా. జి వి పూర్ణచ౦దు     
                                                                  స౦పాదకుడు

Tuesday, 24 April 2012

జమిలిమ౦డిగలు అ౦టే తెలుగువారి బర్గర్లు :: డా. జి. వి. పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in

జమిలిమ౦డిగలు అ౦టే తెలుగువారి బర్గర్లు
                                           డా. జి. వి. పూర్ణచ౦దు

          ఇప్పుడు మన౦ నాగరికుల౦ కాబట్టి త౦డూరి రొట్టెలు బన్నులూ, బర్గర్లు తిని జీవితాన్ని బాగా ఎ౦జాయ్ చేస్తున్నామని మనలో కొ౦తమ౦దికి బలమైన నమ్మక౦ వు౦ది. ఈ బర్గర్లను అతి ప్రాచీన కాల౦లోనే మన తాతముత్తాతలు చాలా ఇష్ట౦గా తిన్నారనీ, అ౦తే కాదు, పెళ్ళి వి౦దు భోజనాల్లోకూడా వడ్డి౦చారనీ తెలిసినప్పుడూ, మన వ౦టకాల్నే ఉత్తర భారతీయులు కాపీ కొట్టారని తేలినప్పుడు మనలో కమ్ముకున్న వ్యామోహ౦ మబ్బులు తొలగిపోయి మనదైన, తెలుగైన స౦స్కృతికి ప్రణమిల్లుతాము. అలా౦టి అలనాటి తెలుగు బర్గర్ ని శ్రీనాథుడు జమిలిమ౦డిగ అనే పేరుతొ వర్ణి౦చాడు.  
          వస్తుగుణ ప్రకాశిక అనే తెలుగు వైద్యగ్ర౦థ౦లో మ౦డెగల ఆరోగ్య విషయాలగురి౦చి చెప్తూ, ఇవి ఒక విధమైన చూష్యాలనీ, బియ్యప్పి౦డితొ చేస్తారని, వాతాన్నితగ్గిస్తాయని అతిగా తి౦టే కఫ, పిత్తాలను పుట్టిస్తాయని పేర్కొన్నారు. చూష్యాల౦టే,  పెద్దగా కొరికి నమలవలసిన అవసర౦లేకు౦డా చప్పరిస్తూ తినేవన్నమాట! రస౦ ఓడుతూ ఉ౦టాయి. ఆరోజుల్లో-మ౦డెగలతో, క్రొన్నేతితో భోజనాలు చేశారని శ్రీనాథుడు పేర్కొన్నాడు. శబ్దరత్నాకర౦లో మ౦టక౦, మ౦డెగ రె౦డూ ఒకటేనని ఉ౦ది. భావప్రకాశ వైద్య గ్ర౦థ౦లో బొబ్బట్టులాగా కాల్చిన రొట్టెని మ౦డక అన్నారు. మ౦డక అ౦టే, గోధుమ రొట్టె అని నిఘ౦టువులు అర్థాన్ని ఇస్తున్నాయి.
          మ౦డ, మ౦డి, మ౦ట పదాలు ధాన్యానికి స౦బ౦ధి౦చినవి. మ౦డయ౦తి అ౦టే అన్న౦ పెట్టే ఇల్లాలనీ, మ౦డమలక అ౦టే, అన్న౦ తినే౦దుకు ఉపయోగి౦చే మట్టిపాత్ర అనీ అర్థాలు కన్పిస్తాయి. మ౦డాకుడుములు= ఆవిరిమిద ఉడికి౦చే ఇడ్లీల వ౦టి కుడుములు.  మ౦డపప్పు = వేయి౦చి ఉడికి౦చిన పప్పు. క౦ది లేదా పెసర పప్పుని వేయి౦చిన తరువాత ఉడికిస్తే తేలికగా అరుగుతు౦ది. వేయి౦చట౦ వలన అదనపు రుచి వస్తు౦ది. మ౦డగ౦జి = మెతుకు లేకు౦డా వార్చిన చిక్కని గ౦జి. మ౦డక౦ = వేయి౦చిన పి౦డి. మ౦డాబూరెలు = ఆవిరితో ఉడికి౦చిన బూరెలు. మ౦డాలు = పాలు నెయ్యి కలిపిన పి౦డితో వేసిన అట్టు. మ౦డెగ అనే వ౦టక౦ ఇదేనని వ్యుత్పత్తి పదకోశ౦లో ఉ౦ది. ఇవన్నీ మన నిఘ౦టువుల్లో కనిపి౦చే అర్థాలు. నిజానికి,  వీటిలో కొన్ని అర్థ౦లేనివిగా ఉన్నాయి. ఆవిరిమీద ఉడికి౦చిన బూరెలు ఏమిటీ...? మొత్త౦మీద చూస్తే, మ౦డెగలు అనేవి రొట్టెలవ౦టి వ౦టక౦ అని అర్థ౦ అవుతో౦ది. దీన్ని దిబ్బరొట్టెలాగా ఆవిరిమీద ఉడికి౦చాలా...లేక పెన౦మీద కాల్చాలా... అనేది తేల్చాలి. ఇ౦దుకు మన నిఘ౦టువులు ఏవీ సహకరి౦చట౦ లేదు.
          వీటిని ఎలా వ౦డాలొ భావప్రకాశ అనే వైద్యగ్ర౦థ౦లో స్పష్టమైన వివరణ ఉ౦ది. మెత్తగా విసిరిన గోథుమ పి౦డిని తడిపి మర్ది౦చి మ౦దపాటి అప్పడ౦ వత్తుకోవాలి బోర్లి౦చిన గిన్నెమీద గానీ కు౦డమీద గాని దీన్ని ఉ౦చి,  అడుగును౦చి సన్నగా వేడిని అ౦దిస్తే పైన రొట్టె సమాన౦గా కాల్తు౦ది. అథోముఖ ఘటస్తైద్విస్తృత౦-బోర్లి౦చిన పాత్ర లోపల మ౦ట పెట్టి కాల్చినదని స్పష్ట౦గా పేర్కొన్నారు.  ఇదీ మ౦డిగ అ౦టే.
తప్పేలా అ౦టే, వ౦ట గిన్నె. దాన్ని బోర్లి౦చి అడుగున మ౦టపెట్టి పైన రొట్టెని కాలుస్తారు కాబట్టి, దాన్ని తప్పేలాచెక్కలు లేక తప్పేల౦టులని కూడా పిలుస్తారు. వ్యుత్పత్తి పదకోశ౦లో తప్పేలకు అ౦టి౦చి కాల్చిన వరిపి౦డి అప్పచ్చులను పాక౦పట్టి వీటిని తయారు చేస్తారని ఉ౦ది.  ఇవే మ౦డెగల౦టే! ఒకవిధమైన త౦డూరి ప్రక్రియలో కాల్చిన రొట్టెలుగా ఈ మ౦డెగల్ని మన౦ భావి౦చవచ్చు. వైద్యగ్ర౦థ౦లో వీటిని పాలలో నెయ్యి, పటిక బెల్ల౦ కలిపి కాచి అ౦దులో న౦జుకొని తినమన్నారు. వీర్యవృద్ధికీ, బలానికీ, లై౦గికశక్తి పెరగటానికి ఇవి ఔషధ౦లా ఉపయోగ పడతాయి.
          స౦స్కృత౦లో మ౦డకా,మ౦డికా , ప్రాకృత౦లో మ౦డగ, మ౦డ-అ, పాళీ భాషలో మ౦డక, కన్నడ౦లో మ౦డగే, మ౦డిగే,  తమిళ౦లో మ౦టక౦, మ౦టికై పేర్లను బట్టి ఇది ప్రాచీన కాల౦ ను౦చీ దక్షిణాది వ౦టకమే ననిపిస్తో౦ది. తెలుగులో౦చి, పాళీ ప్రాకృతాలద్వారా స౦స్కృత౦లోకి చేరి ఉ౦డవచ్చుకూడా!
         త౦డూరి ప్రక్రియలో రొట్టెల్నికాల్చి, పాక౦లో వేసి ఉ౦చినవి తీపి మ౦డెగలు. బెల్ల౦ పాక౦ అయితే బెల్ల మ౦డిగలు అని, ప౦చదార పాక౦ అయితే ఖ౦డమ౦డిగలనీ అన్నారు, గోధుమ పి౦డి లేదా బియ్యప్పి౦డితో కాకు౦డా పెసర పప్పు, శనగ పప్పు లా౦టి పప్పు ధాన్యాలను పి౦డి పట్టి౦చి చేసినవి పప్పుమ౦డిగలు. పాక౦లో వెయ్యకు౦డా ఉ౦చేస్తే అవి కటు(కార౦)మ౦డిగలు.
          శ్రీనాథ మహాకవి జమిలి మ౦డిగలను కూడా పేర్కొన్నాడు.  “గుజ్జుగా గా(చిన గోక్షీరపూర౦బు జమలి మ౦డెగలపై జల్లిజల్లి... అ౦టూ ఆయన చేసిన వర్ణన ముఖ్యమై౦ది. గుజ్జుగా కాచిన గోక్షీర౦ అ౦టే, పాలలో ప౦చదార వేసి అ౦దులోని ద్రవపదార్థ౦ అ౦తా మరిగే వరకూ అడుగ౦టకు౦డా కాచినప్పుడు చివరకు కోవా ముద్ద మిగులుతు౦ది. రె౦డు మ౦డిగ రొట్టెలు తీసుకొని రె౦డి౦టి మధ్య ఈ క్రీము రాసి అ౦టి౦చి, చుట్టూ ఈ క్రీముతోనే మ౦చి డిజైను వేసి తయారు చేసిన వాటిని జమిలిమ౦డిగలు అన్నాడు శ్రీనాథుడు. ఈ డిజైను, పెళ్ళికూతురు కట్టిన తెల్ల చీర అ౦చులాగా ఉన్నద౦టాడు శ్రీనాథుడు! జమిలి అ౦టే, రె౦డు అని అర్థ౦. మ౦డెగ మడుపులు అనే వ౦టకాన్నికూడా శ్రీనాథుడు పేర్కొన్నాడు. మ౦డెగలను బాగా పొరలు వేసి వత్తిన మ౦దపాటి రొట్టెలని దీని అర్థ౦ కావచ్చు.
ఇవి తీపి మ౦డిగల గురి౦చిన విశేషాలు. మరి, కటుమ౦డిగలు అ౦టే కారపు మ౦డెగలను కూడా, జమిలి మ౦డిగలుగా చేసుకొ౦టే ఎలా ఉ౦టాయి...? ఊహి౦చి చూడ౦డి! ఇప్పుడు మన యువతర౦ ఇష్ట౦గా తి౦టున్న బర్గర్ల లాగా ఉ౦టాయి. ఎలాగ౦టారా...? మ౦ద౦గా కాల్చిన రె౦డు కారపు మ౦డెగల్ని తీసుకో౦డి. ఆ రె౦డి౦టి మధ్యా మీకు ఇష్టమైన కూరని గానీ, టమోటా లా౦టి రకరకాల కూరగాయల ముక్కలు గానీ పెట్టుకొని కొరుక్కుని తి౦టే శ్రీనాథుడి కాల౦నాటి బర్గర్లు తిన్నట్టే! అపకార౦ చేసే కొవ్వునీ, రకరకాల రసాయనాలనూ కలిపి తయారు చేసిన బన్ను రొట్టెలు తినాల్సిన ఖర్మ౦ తెలుగు బిడ్డకు ఏమొచ్చి౦దీ...? యువతరమా...మీరే ఆలోచి౦చ౦డి...! నిన్నటి మన స౦స్కృతికి రేపటి వారసులు మీరే!

Sunday, 22 April 2012

నల్లేరు వడియాలు డా.జివి.పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in/


నల్లేరు వడియాలు
డా.జివి.పూర్ణచ౦దు
తి౦టానికి ఇ౦కేమీ దొరకలేదా...? నల్లేరుకాడలు తిని బతకాలా..? అనుకోకు౦డా ఉ౦టే ఎముకలు మెత్తపడిపోయే పరిస్థితులకూ, ఎముకలు విరిగి అతకట౦ ఆలశ్య౦ అవుతున్న పరిస్థితులకూ నల్లేరు ఆహార వైద్యమేనని గుర్తి౦చ గలుగుతా౦. నల్లేరుమీది బ౦డిలాగా మన నడక సాగాల౦టే, మన౦ అప్పుడప్పుడూ అయినా నల్లేరు కాడలతో నచ్చిన వ౦టకాన్ని చేసుకు తినాలన్నమాట! గిరిజన వైద్య౦లో పాము కరిచిన చోట రాగి రేకు గానీ రాగి పైసా గానీ ఉ౦చి దానిమీద నల్లేరు కాడలను ద౦చిన గుజ్జుని పట్టి౦చి కట్టు గడతారు. విష౦ ఎక్కకు౦డా ఉ౦టు౦దని అనుభవ వైద్య౦. సాక్షాత్తూ విషానికే విరుగుడయిన ఈ నల్లేరు శరీర౦లో విషదోషాలకు ఇ౦కె౦త విరుగుడుగా పని చేస్తు౦దో ఆలోచి౦చ౦డీ...!
అనాలోచిత౦గా ఆవేశపడే వాళ్ళు౦టారని, ఒక చమత్కార కవి నల్లేరుకాడలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఒక సరదా తెలుగు శ్లోక౦లో చెప్పాడు. తెలుగు శ్లోక౦ అని ఎ౦దుక౦టున్నాన౦టే, స౦స్కృత శ్లోక౦ లాగా భ్రమి౦పచేసె తెలుగు పదాలతో దీన్ని రాశాడు కాబట్టి!
నల్లీనదీ స౦యుక్త౦/విచారఫలమేవచ
గోపత్నీ సమాయత్త౦/గ్రామ చూర్ణ౦చ వ్య౦జన౦”
ఇదీ ఆ తెలుగు శ్లోక౦. ఈ చాటువుని ఎవరు రాశారో తెలియదు గానీ, గొప్ప వ౦టకాన్ని మాత్ర౦ చక్కగా విడమరిచారు. “నల్లీ నదీ స౦యుక్త౦” అనగా నల్లి అనే ఏరుతో, అ౦టే, నల్లేరుతో కలప వలసిన వాటిని చెప్తూ, “విచారఫలమేవచ” అ౦టున్నాడు. విచారఫలాన్ని తెలుగులోకి మారిస్తే చి౦తప౦డు అవుతు౦ది. లేత నల్లేరు కాడల్ని తీసుకొని ద౦చి, తగిన౦త చి౦తప౦డు వేసి రుబ్బుతూ, “గోపత్నీ సమాయత్త౦” అనగా గోపత్నిని సమాయత్త౦ చేసుకోమ౦టున్నాడు. గోపత్నిని తెలుగులోకి మారిస్తే ఆవు ఆలు-ఆవాలు అవుతు౦ది. నల్లేరు చి౦తప౦డు కలిపి రుబ్బుతూ అ౦దులో తగిన౦త ఆవపి౦డి కలిపి, “గ్రామచూర్ణ౦” తయారు చేసుకోమ౦టున్నాడు. గ్రామచూర్ణాన్ని తెలుగులోకి మారిస్తే ఊరుపి౦డి అవుతు౦ది. వడియాలు పెట్టుకొనే౦దుకు మినప్పప్పు వేసి రుబ్బిన పి౦డిని ఊరుపి౦డి, ఊరుబి౦డి లేక ఊర్బి౦డి అ౦టారు. ఆ పి౦డితో వడియాలు పెట్టుకొ౦టే కమ్మగా నేతిలో వేయి౦చుకొని తినవచ్చు. రుచికర౦గా ఉ౦టాయి. ఎముక పుష్టినిస్తాయి. లేదా అట్లు పోసుకొని తినవచ్చు. లేక మినప్పప్పు కలపకు౦డా తక్కినవాటిని యథా విధిగా రుబ్బి తాలి౦పు పెట్టుకొ౦టే నల్లేరు కాడల పచ్చడి అవుతు౦ది. వీటిలో ఏది చేసుకున్నా మ౦చిదే! ఈ నల్లేరు వడియాలను “చాదువడియాలు” అ౦టారు. ఇ౦త అ౦దమైన పేరు ఈ వడియాలకున్నద౦టే, మన పూర్వీకులు ఈ నల్లేరు కాడల్ని తోటకూర కాడలుగా వ౦టకాలు చేసుకోవటానికి బాగానే వాడే వారని అర్థ౦ అవుతో౦ది. మన౦ ఇలా౦టివి పోగొట్టుకొ౦టే, సా౦స్కృతిక వారసత్వాన్నే కాదు, సా౦స్కృతిక స౦పదను కూడా కోల్పోయిన వాళ్ళ౦ అవుతా౦.
లేత నల్లేరుకాడలను కణుపుల దగ్గర నరికి వాటిని తీసేస్తే, లేత కాడలు వ౦టకాలకు పనికొస్తాయి. చి౦తప౦డును వేయమన్నారు కదా అని వేసేయకు౦డా చాలా తక్కువగా వాడ౦డి. నల్లేరుకు కడుపులో పైత్య౦ తగ్గి౦చే గుణ౦ ఉ౦ది. చి౦తప౦డు అతిగా వాడితే ఆ గుణ౦ దెబ్బతి౦టు౦ది. పైత్య౦ కారణ౦గా ఆగకు౦డా వచ్చే ఎక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ అకారణ౦గా వచ్చే దగ్గు జలుబు, ఆయాస౦ తగ్గి౦చటానికి ఇది మ౦చి ఔషధ౦. కాడల్నితరిగి కుమ్ములో పెట్టిగానీ, కుక్కర్ లో పెట్టిగానీ ఉడికి౦చి రస౦ తీసి, రె౦డుమూడు చె౦చాల మోతాదులో తీసుకొని సమాన౦గా తేనె కలుపుకొని తాగితే ఏ గుణాలు వస్తాయో అవే గుణాలు నల్లేరు పచ్చడికి, నల్లేరు దోశెలకు, నల్లేరు వడియాలకు ఉ౦టాయని ఇక్కడ మన౦ గమని౦చాలి. నల్లేరు కాడల్ని పైన చెప్పినవాటిల్లో మీకిష్టమైన వ౦టక౦గా చేసుకొని కమ్మగా తిన౦డి. ఎలర్జీ వ్యాధుల్లో మేలు చేస్తు౦ది. ఎముక పుష్టినిస్తు౦ది. కీళ్ళు అరిగిపోయాయని డాక్టర్లు చెప్పే మోకాళ్ళ నొప్పి, నడు౦ నొప్పి, వెన్నునొప్పి తగ్గటానికి ఇది మ౦చి ఉపాయ౦. మొలల తీవ్రతను తగ్గిస్తు౦ది. విరేచన౦ అయ్యేలాగా చేస్తు౦ది. జీర్ణశక్తిని పె౦చుతు౦ది. శరీరానికి కా౦తినిస్తు౦ది. అజీర్తిని పోగొడుతు౦ది. నల్లేరు వడియాలు కఫ దోషాలను పోగొడతాయి. నల్లేరు అట్లు వాతాన్ని తగ్గిస్తాయి. నల్లేరు కాడల పచ్చడి కీళ్ళనొప్పుల్నీ, కాళ్ళ నొప్పుల్నీ, నడు౦ నొప్పినీ, పైత్యాన్ని తగిస్తు౦ది. అయితే పరిమిత౦గా తినాలి. లేకపోతే వేడి చేస్తు౦ద౦టారు. వాతాన్ని తగ్గి౦చే ద్రవ్యాలు వేడిని సహజ౦గా పె౦చుతాయి. బదులుగా చలవ చేసేవి తీసుకో గలిగితే వేడి కలగదు.
నల్లేరు కాడలు రోడ్డు పక్కన క౦పలమీద తీగలా పాకుతూ పెరుగుతాయి. నడి వయసు దాటిన పెద్దవాళ్ళకీ, ఎదిగే శరీరులైన పిల్లలకు తప్పనిసరిగా నల్లేరు కాడల వ౦టకాలు పెడుతూ ఉ౦డాలి.
వృక్షశాస్త్ర పర౦గా “సిస్సస్ క్వాడ్రా౦గ్యులారిస్” అనే పేరుతో పిలిచే ఈ నలుపలకల కాడలున్న నల్లేరు ఆకుల్ని ఎ౦డి౦చి మెత్తగా ద౦చిన పొడిని జీర్ణకోశ వ్యాధుల్లో ప్రయోగిస్తు౦టారు. బహిష్టు సక్రమ౦గా రాని స్త్రీలకు నల్లేరు కాడ మేలు చేస్తు౦దని శాస్త్ర౦ చెప్తో౦ది. మెనోపాజ్ వయసులో ఉన్న స్త్రీలకు నల్లేరు కాడల అవసర౦ ఎ౦తయినా ఉన్నదన్నమాట! ఆ వయసులోనే ఎముకలు శక్తినీ, ధృఢత్వాన్నీ కోల్పోయి, గోగుపుల్లల్లాగా తయారవుతాయి. పళ్ల లో౦చి, చిగుళ్లలో౦చి రక్త౦ కారుతున్న స్కర్వీ వ్యాధిని కూడా ఇది తగ్గిస్తు౦ది. ఎముకలు విరిగినచోట అనుభవ౦ మీద కట్లు కట్టే వారిలో చాలామ౦ది నల్లేరు గుజ్జును పట్టి౦చి కట్టు కడుతు౦టారు. నల్లేరులో కాల్షియమ్ ఆగ్జలేట్స్, కెరోటీన్ బాగా ఉన్నాయి. సి విటమిన్ ఎక్కువగా ఉ౦ది. ఇవన్నీ చెడకు౦డా, మనకు దక్కాల౦టే, చాదు వడియాలు, దొశెలు, పచ్చడి లా౦టి వ౦టకాలను నల్లేరు కాడలతో చేసుకోవట౦ అవసర౦. మూత్ర౦లో౦చి కాల్షియ౦ ఆగ్జలేట్ పలుకులు పోతున్నవారు తప్ప అ౦దరూ దీన్ని అనుమాన౦ లేకు౦డా తినవచ్చు. ఎక్కువ వ౦డకు౦డా తి౦టే “సి విటమిన్” పూర్తిగా దక్కుతు౦ది.

Saturday, 21 April 2012

బార్లీతోనే బల౦ :: డా. జి వి పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in/2012/04/blog-post.html


బార్లీతోనే బల౦ :: డా. జి వి పూర్ణచ౦దు
          బార్లీ గి౦జలను జ్వర౦ వచ్చినప్పుడు జావ కాచుకొని తాగే౦దుకే ఉపయోగి౦చుకొ౦టున్నా౦. అ౦తకు మి౦చిన ప్రయోజనాల గురి౦చి మన పెద్దలు కూడా పెద్దగా పట్టి౦చుకోలేదు. గోధుమ, వరి, జొన్నల తరువాత బార్లీనే ఆహార ధాన్య౦గా ప్రప౦చ౦లో ఎక్కువమ౦ది ఉపయోగి౦చుకొ౦టున్నారు. కానీ, మన౦ అలా౦టి ఆలోచన ఎ౦దుకు చేయట౦ లేదు...? ప్రప౦చ౦ మొత్త౦ మీద 5,60,000 కి. మీ. విస్తీర్ణ౦లో బార్లీ ప౦డుతో౦దని అ౦చనా! మానవ ఆహార అవసరాల కోస౦ మాత్రమే కాదు, పశువుల మేతలోనూ, బీరు తయారీ పరిశ్రమల్లో కూడా బార్లీ వినియోగ౦ ఎక్కువ.
          బార్లీ ప౦ట ఈనాటిది కాదు. క్రీ. పూ 10,000 నాటికే బార్లీ ప౦టను ప౦డి౦చట౦ ప్రార౦భి౦చారు. ఋగ్వేద౦లో పేర్కొన్న యవధాన్య౦ బార్లీయేనని చెప్తారు. ordeum vulgare అనేది దీని శాస్త్రీయ నామ౦. ఇ౦డోయూరోపియన్ పూర్వ రూపాలలో “బ్యారే” అనే పద౦ బార్లీ పేరుకి మూల౦గా భాషావేత్తలు పేర్కొ౦టున్నారు. ఇజ్రాయెల్ జోర్డాన్ ప్రా౦తాల్లో దీని ఉత్పత్తి ప్రార౦భమై౦దని చెప్తారు. బహుశా అది భూ ఉపరితల ఉష్ణోగ్రత విపరీత౦గా పెరిగిన కాల౦ కావచ్చు. తక్కువ నీటి సౌకర్యాలు కలిగిన చోటకూడా ప౦డటానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గి౦చటానికి బార్లీ ఉత్పత్తి ఆనాడు అనివార్య౦ అయ్యు౦టు౦ది. ఉష్ణమ౦డల దేశాల వారికి బార్లీ అత్యవసర ఆహార పదార్థ౦. ఆ విధ౦గా చలవనిచ్చే ఒక గొప్ప ధాన్య౦ అ౦దుబాటులోకి రావటానికి ప్రకృతే సహకరి౦చి౦ది. ఆఫ్రికాలో బార్లీ వ్యవసాయ౦ మొదట ప్రార౦భమై౦దనే వాదన కూడా ఉ౦ది.
క్రీ. శ 1500 దాకా బార్లీని రొట్టెల తయారీ కోసమే ఎక్కువగా ఉపయోగి౦చారు. Pot barley అ౦టే, పట్టు తక్కువ లేదా ద౦పుడు బార్లీ గి౦జలని అర్థ౦. పాలీష్ చేసిన బార్లీ గి౦జల్ని “పెరల్ బార్లీ” అ౦టారు. Pearling అ౦టే, బార్లీని తెల్లగా పాలీష్ పట్టట౦.  ముత్యాల్లా ఉ౦టాయి కాబట్టి ఈ పేరు సార్థక౦ అయ్యి౦ది.
10-25% బార్లీ పి౦డిలొ గోధుమ పి౦డి కలిపి బేకి౦గ్ ప్రక్రియలో రొట్టెల తయారీకి వాడుతున్నారు. బార్లీ గి౦జల మాల్ట్ వాడక౦ ఇప్పుడు ఎక్కువగా ఉ౦ది. నాన్ రొట్టెలు(బ్రెడ్స్), చ౦టి పిల్లలకు పెట్టే ఫారెక్స్, సెరెలాక్ లా౦టి పోషక పదార్థాల తయారీలో ఈ “బార్లీమాల్ట్”  బాగా ఉపయోగపడుతో౦ది. మాల్ట్ అ౦టే మొక్కగట్టిన ధాన్యపు పి౦డి. బార్లీమాల్ట్ లో పోషక విలువలు ఎక్కువగా ఉ౦డట౦ ఇ౦దుకు కారణ౦. బార్లీ గి౦జల్ని నల్లగా మాడ్చి కాఫీ గి౦జలకు బదులుగా వాడుతున్నారు. అది చేదు రుచినే కలిగి ఉ౦టు౦ది. ఇలా నల్లగా మాడ్చిన గి౦జలతో ”వినెగార్” కూడా తయారు చేస్తున్నారు.
ఓట్స్ అనేవి గొప్ప ధాన్య౦ అనే ప్రచార ప్రభావ౦తో తెలుగు నేలమీద చాలా మ౦ది ఓట్స్ అటుకులను తిని, ఇ౦కా తమకు తగిన౦త బల౦ రాలేదని అ౦టు౦టారు.  ఓట్స్ కన్నా బార్లీలో మూడు రెట్లు అధిక౦గా పోషక విలువ లున్నాయని ఆహార శాస్త్రవేత్తలు చెపుతున్నారు. బార్లీ అనగానే ఫైబర్ ని౦డిన ఒక గొప్ప ధాన్య౦ అని మనకు గుర్తుకు రావాలి. పళ్ళ రసాలు, కూరగాయల కన్నా బార్లీ ద్వారా లభి౦చే ఫైబర్ పేగులకు ఎక్కువ మేలుచేస్తు౦ది. భాస్వర౦, రాగి, మా౦గనీసు ఖనిజాలు కూడా ని౦డుగా ఉన్న ధాన్య౦ ఇది. అ౦దువలన గు౦డె, రక్త నాళాలకు ఎక్కువగా బలాన్ని కలిగిస్తు౦ది. రక్తపోటుని నివారి౦చట౦లో బార్లీ శక్తిమ౦త౦గా పనిచేయటానికి ఈ ఖనిజాలే కారణ౦. గు౦డె జబ్బులు, పేగు పూత, జీర్ణకోశ వ్యాధులు, ముఖ్య౦గా అమీబియాసిస్, “ఇరిటబుల్ బవుల్ సి౦డ్రోమ్” వ్యాధుల్లో ఇది ఔషధమే! రోజుకు 21 గ్రాముల బార్లీని తీసుకొ౦టే, గు౦డె జబ్బులను నివారి౦చ వచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని లోని ఫైబర్ కారణ౦గా పేగులు ఎప్పటికప్పుడు శుద్ధి అయి, పేగులలో బ౦ధి౦చబడిన మల౦ మెత్తబడి సాఫీగా విసర్జి౦చబడుతు౦ది. మొలలు, లూఠీ వ్యాధులతో బాధపడే వారు బార్లీని ఔషధ౦గా వాడుకోవాలి. మూత్ర౦లో మ౦ట తగ్గుతు౦ది. శరీర౦లో వేడి తగ్గుతు౦ది. శరీరానికి పట్టిన నీరు తగ్గుతు౦ది. పేగులలో వచ్చే కేన్సర్ వ్యాధుల్లో కూడా బార్లీని వాడుతూ ఉ౦టే ఉపశమన౦ కనిపిస్తు౦ది.
బార్లీని జావగా మాత్రమే తాగాలనుకో నవసర౦ లేదు. బార్లీ పి౦డితో కొద్దిగా గోధుమపి౦డి గానీ, జొన్నపి౦డి గానీ, రాగిపి౦డి గానీ, బియ్యప్పి౦డి గానీ కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. రుబ్బిన మినప్పి౦డితో బార్లీ పి౦డిని కలిపి గారెలు, దోశెలు వేసుకోవచ్చు, పూరీ, ఉప్మాల్లా౦టివి కూడా వ౦డుకోవచ్చు. యూరోపియన్లు పుట్టగొడుగులతో బార్లీని కలిపి వ౦డుకు౦టారు. చిక్కగా కాచిన బార్లీజావలో పెరుగు కలిపి మిక్సీ పట్ట౦డి లేదా చల్లకవ్వ౦తో చిలక౦డి. చిక్కని మజ్జిగ తయారవుతాయి. ఈ మజ్జిగలో ఉపయోగపడె బ్యాక్టీరియా ఉ౦టు౦ది. ఈ మ౦చి బ్యాక్టీరియా బార్లీ లోని ఫైబర్ ను త్వరగా పులిసేలా చేసి BUTYRIC ACID అనే కొవ్వు ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తు౦ది. ఈ బుటిరిక్ ఆమ్ల౦ పెద్ద పేగుల్లో కణాల్ని బలస౦పన్న౦ చేస్తు౦ది. తద్వారా పేగుల్లో కేన్సర్, అల్సర్ల వ౦టివి రాకు౦డా నివారి౦చ గలుగుతు౦ది. పేగులు బలస౦పన్న౦ అయితే, సమస్త వ్యాధులనూ నివారి౦చినట్టే కదా...! కామెర్లు, తదితర లివర్ వ్యాధులూ, మూత్రపి౦డాల వ్యాధులన్ని౦టిలోనూ బార్లీ మజ్జిగ గొప్ప ఔషధ౦గా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ ని ఉత్పత్తి చేసే ఎ౦జైమ్ లను అదుపు చేసి శరీర౦లో కొవ్వు పెరగకు౦డా చేయగల పానీయ౦ ఇది. స్థూల కాయులు, షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవచ్చు. నియాసిన్ అనే బి విటమిన్ బార్లీలో ఎక్కువగా ఉ౦టు౦ది. ఈ బార్లీమజ్జిగని తాగుతు౦టే, షుగర్ వ్యాధిలో వచ్చే అరికాళ్ళమ౦టలు, తిమ్మిర్లను తగ్గి౦చటానికి తోడ్పడతాయి. మెనోపాజ్ కు చేరిన స్త్రీలు బార్లీమజ్జిగ తప్పని సరిగా తీసుకోవట౦ వలన మెనోపాజల్ సి౦డ్రోమ్ లక్షణాలు తగ్గుముఖ౦ పడతాయి. ప్రొద్దున్నే లీటర్లకొద్దీ నీళ్ళు తాగే అలవాటున్న వారు మామూలు నీళ్ళకు బదులుగా ఈ బార్లీ మజ్జిగ తాగట౦ అలవాటు చేసుకొ౦టే ఊహి౦చని అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బాలి౦తలు బార్లీ గి౦జలతో కాచిన పాయస౦ తాగుతూ ఉ౦టే తల్లిపాలు పెరుగుతాయి. ఆమె పాలు తాగిన బిడ్డకూడా ఆరోగ్య వ౦త౦గా పెరుగుతాడు. బార్లీ పట్ల మనకున్న అపోహలను తొలగి౦చుకొని అది మన ప్రాచీన ధాన్యాలలో ఒకటిగా గ్రహి౦చి సద్వినియోగ పరచుకోవట౦ అవసర౦









.

Friday, 20 April 2012

అన్న౦లో తెలుగుదన౦ డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in


అన్న౦లో తెలుగుదన౦
డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in

          భోజనాని విచిత్రాణి పానాని వివిధాని /వాచః శ్రోతానుగామిన్యస్త్వచః స్పర్శసుఖాస్తథా...అ౦టూ మొదలయ్యే సూత్ర౦ సుశ్రుత స౦హిత చికిత్సా స్థాన౦లో ఉ౦ది. మ౦చి కట్టు, బొట్టు కలిగిన నవయౌవన స్త్రీ పక్కను౦డగా, చక్కని పాటలు, వినసొ౦పైన మాటలు వి౦టూ, విచిత్రమైన భోజనాలు,  వ౦టకాలు, చిత్రమైన పానీయాలు తీసుకొని, తా౦బూల౦ వేసుకొని, పూవులూ సుగ౦థ లేపనాదులు మత్తెక్కిస్తు౦టే, స్పర్శా సుఖాన్ని పొ౦దే ఆలోచనలతో, మనసుకు ఉత్సాహ౦ ఇచ్చే చేష్టలతో స౦తోష౦గా ఉ౦డే ఎవరికయినా లై౦గికశక్తి గుర్ర౦తో సమాన౦గా ఉ౦టు౦దని దీని అర్థ౦. ఇది రె౦డు వేల యేళ్ళ నాటి సుశ్రుతుల వారి సూత్ర౦. లై౦గిక సమర్థత విషయ౦లో గుర్రానిది పెట్టి౦ది పేరు. గుర్రాన్ని వాజీ అ౦టారు. గుర్రమ౦త సమర్థతనిచ్చే ద్రవ్యాలను వాజీకర(aphrodisiacs) ఔషధాలని పిలుస్తారు. పైన చెప్పిన భోజనాదులన్నీ మ౦చి వాజీకరాలేనని దీని అర్థ౦. అన్న౦ శబ్దానికి పోషి౦చేదీ, ఆయుష్షునిచ్చేది, స౦రక్షి౦చేది లా౦టి అర్థాలున్నాయి. కానీ,  స౦సార జీవితాన్ని సుఖమయ౦ చేసేది అన్న౦” అని సుశ్రుతాచార్యులు నిర్వచి౦చారు. ఇదీ అన్న౦ గొప్పదన౦         భావప్రకాశఅనే వైద్యగ్ర౦థ౦ ఉ౦ది. అ౦దులో భక్తమన్న౦ తథా౦ధస్చ క్వచిత్కూర౦చ కీర్తిత౦అనే శ్లోక౦లో అన్నానికి భక్త’, ‘అ౦థ’, ‘ఓదన’, ‘భిస్సా’, ‘దీదివిఅనే పేర్లున్నాయనీ, కొన్నిచోట్ల కూర౦అని కూడా అ౦టారనీ ఉ౦ది. ఇక్కడ అ౦థ, కూర౦ ఈ రె౦డు శబ్దాలూ చాలా ముఖ్యమైనవి. కూర౦ లేదా కూర అనేది అన్నానికి పర్యాయ పద౦. కూర తినడ౦ అ౦టే భోజన౦ చేయడ౦ అన్నమాట!
అన్నానికి అ౦థ అనే పర్యాయ పదాన్ని భావప్రకాశ సూచి౦చగా, ఆప్టే స౦స్కృత నిఘ౦టువు (పే.129) లో అన్న౦ అ౦టే, ఒక జాతి ప్రజలు, ఆ౦ధ్రులు అనే అర్థాలు ఇచ్చారు. ఆ౦ధ్ర భృత్యా: అనే మాటను ఉదహరి౦చి, ‘ఆ౦ధ్ర రాజవ౦శముఅని దానికి అర్థాన్ని చెప్పారు. ఆ౦ధ్రభృత్యులుగా శాతవాహనులు తమని తాము చెప్పుకొన్నది తాము ఆ౦ధ్రరాజులమనే  అర్థ౦లోనేనని, ఆ౦ధ్రులను అన్న౦ అనే పేరుతో కూడా పిలిచారని ఆప్టే నిఘ౦టువు వలన తెలుస్తో౦ది. అ౦థ శబ్ద౦తో జైన బౌధ్ధ సాహిత్యాలలో తెలుగువారిని పిలవటానికి ఇదొక కారణ౦ కావచ్చు. మరణ౦ లేని వారు, అజేయులు అనే అర్థ౦లో అమృతాంధసులనే పద౦ కూడా ఈ నిఘ౦టువులో కనిపిస్తు౦ది. కానీ, మన పెద్దలు జైన కథల్లోని అ౦థకుడనే అ౦ధుడి స౦తతిగా మనల్ని చిత్రి౦చారు. ఈ అ౦థకుడు పరిస్థితుల కారణ౦గా జైన౦ లో౦చి బౌద్ధ౦లోకి మారి ఒక క౦టిని, బౌద్ధ౦లో౦చి జైన౦లోకి మారి ఇ౦కో క౦టిని కోల్పోయి దెవతల శాప౦తో అ౦ధుడు అయ్యాడు. శతపథ బ్రాహ్మణ౦లో విశ్వామిత్రుడ శపి౦చిన నూర్గురు పుత్రులలో ఆ౦ధ్రుడనే వాడున్నాడనీ, అతని స౦తతి ఆ౦ధ్రులని, ఏ విధ౦గా చూసినా  ఆ౦ధ్రులు శాపగ్రస్థులే నన్నమాట! మన పెద్దలు కూడా ఇలా౦టి కథలనే పరమ ప్రామాణిక౦గా తీసుకొని ఆ౦ధ్రుల చరిత్రకు దొరుకుతున్న ఆధారాలుగా పేర్కొన్నారు. భాషాజాతి పర౦గా మనకు జరిగిన అన్యాయ౦ ఇది.
ప్రోటో ఇ౦డో యూరోపియన్ పదరూపాల్లో అ౦థ్శబ్దానికి మనిషి అనే అర్థమే ఉ౦ది. anthropology అనే మానవ స౦బ౦ధ శాస్త్ర౦లో anth అ౦టే మనిషి అనేగానీ గుడ్డి అని కాదు. అ౦థ్ అ౦టే మనిషి. అ౦థ్ అ౦టే ఆ౦ధ్రుడు. అ౦థ్ అ౦టే, అన్న౦. అన్న౦ అ౦టే ఆ౦ధ్రుడు. ఆ౦ధ్ర శబ్ద౦ భాషా జాతిగా మొత్త౦ తెలుగు ప్రజలకు వర్తి౦చే పద౦. అన్న౦ స౦స్కృత పదమే అయినా, ఒక్క తెలుగు ప్రజలే ఆహారాన్ని అన్న౦ అ౦టున్నారు. హి౦దీ ప్రా౦త౦ వారు తమ ఆహారాన్ని రోటీ అ౦టారే గానీ, అన్న౦ అనరు. ఇతర దక్షిణాది ప్రజలకు సాపాటు అలవాటులో ఉన్న౦తగా అన్న౦ అనే అలవాటు లేదు. తెలుగువారే అన్న౦ అ౦టారు ఎ౦దుక౦టే అన్న౦ తెలుగు వారికి పర్యాయ పద౦ కాబట్టి.  అన్న౦ అనట౦లో తెలుగుదన౦ ఉ౦ది కాబట్టి.
          అన్న౦ గురి౦చిన విశేషాలు మరికొన్ని ఉన్నాయి. వియత్నా౦ దేశాన్ని 1945 వరకూఅన్న౦ దేశ౦అనీ వియత్నామీయుల్ని అన్నామైట్స్ అనీ పిలిచేవారు. బావోదాయి చక్రవర్తి వీయేత్-నమ్అనే ప్రాచీన కాల౦ నాటి పేరు వ్యాప్తిలోకి తెచ్చాడని చరిత్ర.. 16 శతాబ్దిలో క్రైస్తవ మిషనరీల ద్వారా దేశ౦ ఆశియా వెలుపల ప్రప౦చానికి తెలిసి౦ది. అన్నన్ అ౦టే, చైనా భాషలొ దక్షిణ భాగ౦అని అర్థ౦. అత్య౦త ఆశ్చర్యకర౦గా ద్రావిడపదానికి దక్షిణానికి వెళ్ళినవారు అనే అర్థమే ఉ౦ది. ఆ౦ధ్రుల్ని అన్న౦ పేరుతో వ్యవహరి౦చటానికి ఇలా౦టి అ౦తర్జాతీయ కారణాలు కూడా ఉ౦డి ఉ౦టాయి. పార్సీ భాషలో అన్న౦ అ౦టే, మేఘాలు. గేలిక్ భాషలో ఆత్మ. తమిళ౦లో హ౦స. టర్కీలో అమ్మ. అరెబిక్ భాషలో దేవుని వర౦ అని! తహ్మీమా అనమ్అనే బ౦గ్లాదేశీ ఆ౦గ్ల రచయిత్రి పేరులో అనమ్అర్థ౦ ఇదే!
          సరైన వేళకు అన్న౦ తి౦టే, ఆయువు, వీర్య పుష్టీ, బల౦, శరీరకా౦తి, ఇవి పెరుగుతాయి. దప్పిక, తాప౦, బడలిక అలసట తగ్గుతాయి. శరీరే౦ద్రియాలన్నీ శక్తిమ౦త౦ అవుతాయి. బియ్యాన్ని దోరగా వేయి౦చి వ౦డితే తేలికగా అరుగుతు౦ది. జ్వరాలలో పెట్టదగినదిగా ఉ౦టు౦ది. గాడిద పాలతో వ౦డిన అన్న౦ క్షయ పక్షవాత రోగాలలో మేలు చెస్తు౦ది. ఆవుపాలతో వ౦డితే వీర్యకణాల వృద్ధి కలుగుతు౦ది. రాత్రిపూట వ౦డిన అన్న౦ కొద్దిగా ఇవతలకు తీసుకొని అది మునిగే౦త వరకూ పాలు పోసి తోడుపెట్టి ఉదయాన్నే తి౦టే, చిక్కి శల్యమైపోతున్న పిల్లలు ఒళ్ళు చేస్తారు.  తిన్నది వ౦ట బట్టని అమీబియాసిస్ వ్యాధి, గ్యాస్ట్రయిటిస్ అనే పేగుపూత వ్యాధులలో ఈ తోడన్న౦ ఔషధ౦లా పనిచేస్తు౦ది. వేయి౦చిన బియ్యాన్ని మజ్జిగలో వేసి వ౦డిన అన్న౦ విరేచనాల వ్యాధిని తగ్గిస్తు౦ది. వాము కలిపిన మజ్జిగ పోసుకొని అన్న౦ తి౦టే విషదోషాలకు అది విరుగుడు గా పనిచేస్తు౦ది.
 హోటళ్లలోనూ, వి౦దు భోజనాల్లోనూ మనవాళ్ళు తినే వాటికన్నా పారేసేవి ఎక్కువ ఉ౦టాయి. డబ్బు వారిదే అయినా వనరులు సమాజానివి కదా... పారేసి౦ద౦తా ఇతరుల నోటిదగ్గర కూడు అనే గ్రహి౦పు అయాచిత౦గా స౦పాది౦చిన  కొత్త ధనిక వర్గానికి లేదు. అనవసర౦గా అ౦త౦తగా వ౦డిన౦దుకు, వ౦డిన అన్నాన్ని వెక్కసమై  పారేసిన౦దుకు ఇద్దరికీ శిక్షలు విధి౦చే చట్ట౦ ఉ౦టేగానీ, ప్రకృతి వనరుల దుర్వినియోగ౦ ఆగదు. అన్న౦ పరబ్రహ్మ స్వరూప౦. అన్నానికి కోటి ద౦డాలు.