Sunday, 29 June 2014

బౌద్ధయుగంలో తెలుగు వారి వ్యవసాయం డా. జి వి పూర్ణచందు

బౌద్ధయుగంలో తెలుగు వారి వ్యవసాయం
డా. జి వి పూర్ణచందు
క్రీస్తు పూర్వం 4 శతాబ్ది నుంచీ, క్రీ. . 4 శతాబ్ది వరకూ తెలుగు నేల మీద నడచిన వ్యవసాయానికి పాళీ, ప్రాకృత, సంస్కృత భాషలలో వెలువడిన బౌద్ధ సాహిత్యమే ముఖ్య ఆధారం.
తెలుగు నేల మీద తెలుగు బౌద్ధ సిద్ధాంత కర్తలు పాళీ భాషలో రచించిన గ్రంథాలలో తెలుగు నేల ప్రసక్తి, ప్రస్తావన, ప్రశంసలు కనిపిస్తాయి. అవరశైలీయ, పూర్వశైలీయ రాజగిరిక, సిద్ధార్థక అనే నాలుగు బౌద్ధ సాంప్రదాయాలను అంధక బౌద్ధ సాంప్రదాయాలని పిలుస్తారు.
హ్వాన్త్సాంగ్ బెజవాడలోని ఒక బౌద్ధ స్తూపం దగ్గర అవర శైలీయ సిద్ధాంతాలను అధ్యయనం చేశాడని, ఇక్కడ కొన్నాళ్ళపాటు ఉన్నాడని చెప్తారు.
నాలుగు అంధక సాంప్రదాయాలతో పాటు ఆచార్య నాగార్జునుడు ప్రతిపాది౦చిన వైపుల్య వాదం కూడా ఇక్కడ బహుళ వ్యాప్తిలో ఉండేది.
పాళీ శబ్దానికి భాషలో ధర్మం అని అర్థం. తెలుగులో అధర్మానికి ఎవరైనా తలబడితే, “ఇది నీకు పాడియేనా...?” అని వారిస్తాం మనం. అంటే, ధర్మం కాదని చెప్పటం! పాళీ శబ్దానికి పడి వికృతి. పాళీ భాష తెలుగు సామాన్యులను ఎంతగా చేరిందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇ౦గ్లీషు చెలామణిలో ఉన్నట్టే, అప్పుడు పాళీ చెలామణి అయ్యింది.
మనం నాగలి అని తెలుగులో పిలుస్తున్నాం. దాన్ని వైదిక భాషలో లాంగల అంటారు. నాగలి అనేది ద్రావిడ మూలాలు కలిగిన పదమే గానీ, వైదిక లాంగలిని తెలుగులో నాగలి అంటున్నారని వ్యాఖ్యానించటం సరికాదని బి జె క్వీపర్, మైకేల్ విజ్జెల్ ప్రభృతులు పెర్కొన్నారు. ఆస్కో పర్పోలా అనే భాషా చారిత్రక వేత్త ఋగ్వేదంలో కనిపించే లాంగల శబ్దం ద్రావిడ భాషలోంచి స్వీకరించిందేనని పేర్కొన్నాడు.
వివిధ ద్రావిడ భాషలలో నాగలిని విధంగా పిలుస్తారు(DEDR 2907):
Ta. నాఙ్చిల్: plough.
Ma. నేణ్ణల్, నెణ్ణి: plough-shaft.
Ko. నె.ల్గ్ plough.
Ka. నేగల్, నేగిల్ plough.
Koḍ. నేఙ్గి
Te. నాగలి, nã̄gelu, nã̄gēlu id.
Kol. నాఙ్గలి (Kin.) nāŋeli id.
Nk. నాఙ్గర్ id. Nk. (Ch.) nāŋgar id.
Pa. నాఙ్గిల్ id. Ga. (Oll.) nāŋgal,
(S.) నాఙ్గల్ id. Go. (W.) nāṅgēl, (A. SR.) nāngyal, (G. Mu. M. Ko.) nāŋgel, (Y.) nāŋgal,
 (Ma.) నాఙ్గిలి (pl. nāŋgisku) id. (Voc. 1956); (ASu.) nāynāl, (Koya Su.) nāṅēl, nāyṅēl id.
Konḍa nāŋgel id.
Pe. నాఙ్గేల్ id. Manḍ. nēŋgel id.
 Kui నాఙ్గేలి: id. Kuwi (F.) nangelli ploughshare; (Isr.) nāŋgeli plough. / Cf.
Skt. లాఙ్గల plough
Pali నాఙ్గల - plough;
Mar. నాగర్
H. నాఙ్గల్,
Beng. నాఙ్గల్ id., etc.; Turner, CDIAL, no. 11006. DED(S, N) 2368.
ద్రావిడ భాషలన్నింటిలోనూ కనిపించే నాగల్ శబ్దాన్ని ఋగ్వేదంలోకి చేరిన ద్రావిడ పదంగా గుర్తించటమే సబబుగా చరిత్ర వేత్తలు భావించారు. మరొక ఇ౦డో ఆర్యన్ భాషా కూటమీలో పదం కనిపించక పోవటం కూడా నిర్ణయానికి ఒక కారణం.ఒకరి నుంచి మరొకరు వ్యవసాయం నేర్చుకొన్నారు. విస్తృత స్థాయిలో వ్యవసాయం చేయటానికి ఇనుప కర్రు కలిగిన నాగలి అవసరం ఎంతయినా ఉంది. అది దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు నేల మీద లభ్యం అయ్యేది. ఇక్కడ రోజుల్లో నిస్సందేహంగా లోహ పరిశ్రమలు ఉండి ఉండాలి. ఇనుమును కరిగించగల పరిఙ్ఞానం ఆనాడే తెలుగు ప్రజలకున్నదని చరిత్రవేత్తలు అంగీకరిస్తున్నారు. రామాయణంలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను దండకారణ్యానికి తెచ్చి ఆయుధాలు ఇప్పి౦చిన కథని బట్టి, ఆయుధ తయారీ కేంద్రాలు ఇక్కడ ఉండేవనే అంశాన్ని గుర్తించాలి. ఇక్కడ అమ్మే వస్తువుకు ఇక్కడి పేరు పెట్టటమే సహజం. నాంగలి ఆనాటి పేరు లాంగలగా అది ఉత్తరాదికి చేరింది. సున్నా అరసున్నాగా మారి, నా(గలి మనకు మిగిలింది.
నామ్అంటే ఎద్దు.“కోలఅంటే ఎద్దు మెడమీద ఉంచే కాడి. రెండు పదాలను కలిపి నామ్+కోల అనేది నాగలి పదానికి మూలం అయ్యిందనే వాదన కూడా ఉంది.
అరక అనే శబ్దానికి A plough with bullocks complete. సర్వావయవములుగల నాగటికి ఎడ్లను పూనినది-అని!
అరకట్టరక a plough with a pair of bullocks. అరకలు కట్టటం అంటే, పనికి సిద్థం చేయటం అని
విడిచికట్టరక a plough with a change of bullocks. అరకలు విప్పటం అంటే, పని ముగిసిన తరువాత ఎడ్లకు విశ్రా౦తి నివ్వటం
అరకాడు ara-kāḍu. (from అరక+కాడు) n. వ్యవసాయ దారుడు, రైతు.
అరకసాగటం లేదంటే, వాతావరణం అనుకూలంగా లేక పోవటం, ఎడ్లు సహకరించకపోవటం లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పుకోవటం.
చీమకుర్తి శేషగిరిరావు గారుపాళీ భాషలో తెలుగు పదాలుఅనే చిన్న గ్రంథాన్ని ప్రచురించారు. అమూల్యమైన సమాచారం ఉన్న గ్రంథం ఇది. గ్రంథం ఆధారంగా కొన్ని వ్యావసాయిక పదాలు తెలుగు పాళీ భాషలలో సమానార్థాలలో ఉన్నవాటిని ఇక్కడ పొందు పరుస్తున్నాను. ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు ఆధారంగా పదాలకు ద్రావిడ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అవి తెలుగులోంచే పాళీలోకి వెళ్ళినవి అయ్యే అవకాసం ఉంది.  
1) అంకె: పాళీ భాషలో అఙ్క తొడగటం అంటే, కాడిని పైకి లేపి పట్టి, దాని కిందకు ఎద్దును తెచ్చి నిలిపి. కాడిని ఎద్దు మెడ చుట్టూ ఒక తాడుతో సంధిస్తారు. దాన్ని అంకె తాడు అంటారు. కొక్కెం లేదా కుంకి లాంటిది ఇది. అంకె వేసుకొన్నది అంటే దున్నటానికి సిద్థంగా ఉన్నదని! అంకెకు వచ్చిందంటే వశ్యమయ్యింది, అదుపాఙ్ఞలలోకి వచ్చిందని!
DEDR 340లో āppu అనే తమిళ పదానికి అర్థాలను వివరించే సందర్భంలో పదం కనిపిస్తుంది. ఆపు, అదుపు, అనే అర్ధాలలో ఏర్పడిన పదం ఇది.
Ta. ఆప్పు:wedge used in splitting wood, peg, stake.
Ma. ఆప్పు: wedge, plug, what stops a crevice; āppu, āppam wad of gum.
Ko. .ప్: wedge, peg, stake.
Ka. ఆపు: restraint, stoppage; aṅke an order, command, control, restraint; (PBh.) āṅke opposition; (Hav.) āpu a peg.
Tu. ఆన్కె: force, compulsion, power, control, support.
Te. ఆక: order, command, prevention, custody;
     ఆకట్టు : to check, prevent 
     ఆగు :  to stop, stay, be suppressed or stopped, refrain; prevent, stop, prohibit
     ఆగించు : to check, hinder
     ఆచు : to check, hinder, prevent, subdue, keep under control
     ఆపు:  to hold back, restrain, stop, prevent; n. stoppage, cessation; aṅkili obstacle, impediment.
Ga. (S.3) అగుల్ప్- to obstruct.
Go. (Koya T., p. 79) ఆన్గ్:- to stop (intr.); āp- to make stop; (Koya Su.) āṅ- to stop (intr.); āp- id. (tr.); (ASu.) āg- to stop, stand.
Manḍ. ఏన్గ్: to intercept, hold back, hold up.
Kui అన్గా(ఆన్గి):  to intercept, hinder, prevent, ward off, defend, herd; n. interception, prevention, defence, herding; āngēni, āngēṛi a fence.
Kuwi (F.) ఆ౦గలి to check;
(S.) ఆన్గినాయ్, ఆన్గా తుహ్నాయ్: to prevent, defend; (Isr.) āṅg- (-it-) to stop one from going; (S.) āshinai to impede;
(Mah ఆన్గేని: lane, alley. DED(S, N) 286.
అదుపు చేయటం అనే అళంలో అంక పదాన్ని దానితో అనుబంథంగా ర్పడిన ఇతర తెలుగు పదాలను నిఘంటువు సహాయంతో గమనించవచ్చు.
2) కసవు : పనికి మాలినవి, తోసేయదగినవి అనే అర్థంలో పెంట, పేడ, గడ్డి, వీటినన్నింటినీ  కసవు అంటారు. కాశీలో కసవుగా పుట్టినా పుణ్యమేనని శ్రీనాథ మహాకవి కాశీఖండ౦లో అంటాడు. పశువుల కొట్టంలో కసవు ఏర్పడుతుంది. ఇది అనేక ద్రావిడ రూపాలలోనూ పాళీ భాషలోను, సంస్కృతంలోనూ యథాతథంగా అదే అర్థంలో కనిపించటాన్ని ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు 1088లో మనం గమనించవచ్చుపాళీ సంస్కృతాలను పరిపుష్టి చేయటానికి తెలుగు లేదా ఇతర ద్రావిడ భాషలు కూడా సహకరించాయనటానికి కసవు ఒక సాక్ష్యం
Ta. కచటు: uncleanness, dirtiness, dregs, blemish, fault, imperfection;
     కచ౦టు: dregs; kañcal sweepings, rubbish heap, refuse.
Ma. కచ్చి: straw, stubble, rubbish; kañcal sweepings, refuse, dirt.
To. కొస్ఫ్: rubbish. Ka. kasa, kasavu rubbish, sweepings, weed, useless plant, afterbirth, placenta;
      కసరు dust and other impurities;
      కసకీలు: kasakilu a broom;
      కసబరలు: a kind of broom;
      కసబరిగె, కసబొరిగె, కసపొరిగె: id. (for parige, etc);
      కసమర, కసవరిగె: broom;
      గసి, గస్తు: gasi, gaṣṭu sediment or dregs of oil or melted butter, or of pickles.
Tu. కజవు, కజావు:  rubbish, sweepings, afterbirth;
      కజనె: rubbish floating on stagnant water;
      కజె: an acid substance accumulated on the teeth by chewing betel leaves  
      కస: sweepings, rubbish;
Te. కసటు: impurity, dirt, foulness, sin;
     కసవు: sweepings;
     గసి: gasi sediment of ghee or oil.
Pe. కన్జ్:  to be dirty, become dirty.
Kur. కస్సా: layer of dirt on the body.
Malt కసె:  dirt on the body. / Cf. Turner, CDIAL, no. 2615,
Skt. కచ్చర- dirty, foul; wicked, etc.; no. 2980,
Pali కసట: nasty.
3) గరిసె: పాళీ భాషలో కరీస అంటే కొలపాత్ర. కరీస నిండా తీసుకొన్న ధాన్యపు గింజల్ని ఎంత విస్తీర్ణంలో ఉన్న భూమిలో చల్లుతామో అంత భూమిని కూడా కరీస అనే అంటారు. మధ్య యుగాల నాటి తెలుగు కవి ఆడిదము సూరకవిగరిసెల వ్రాతెగానీ, యొక గంటెడెఱుంగముఅని ఒక ప్రయోగం చేశాడు. పేరుకు మాత్రం గరిసెడు భూమి ఉంది గానీ పండుతోంది గరిటెడేనన్న బాధ ప్రయోగంలో వ్యక్తమౌతోంది. ఇది గ్రామీణ ప్రాతాలలో నాటికీ వ్యాప్తిలో ఉన్న వ్యావసాయిక పదం. తెలుగు తమిళ, కన్నడ భాషల్లో ఇది వ్యాప్తిలో ఉన్నట్టు ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు 1261 పేర్కొంది. పాళీ తెలుగు భాషా బంధానికి పదం మరొక ఉదాహరణ.
Ta. కరచయ్, కరిచయ్: a measure of capacity = 400
     మరక్కాల్: ఒక కొలత. తెలుగులో మరకం అంటారు
Ka. గరస, గరిసె: ఒక కొలత
Te. గరిసె: ఒక కొలత Cf. 1966
Ko. కెర్చ్
Pali : కరీస:  a square measure of land, being that space on which a karīsa of seed can be sown.
4) కంచె: కంచె చేను మేస్తే కలదె దిక్కు? అని తెలుగు సామెత. ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువులో కంప, గరడి, తెట్టు, అనే పదాలు ఉన్నాయి గానీ కంచె పదం కనిపించలేదు. కాబట్టి ఇది ద్రావిడ పదం కాకపోవచ్చు. తమిళంలో కంచి అంటే కాంజికం లేదా గంజి. తమిళనాడులో ఉన్న కంచి పుణ్య క్షేత్రానికి తమిళ అర్థం వర్తించదు.
కంచె: A hedge, pasture land బడుగునేల.
కంచెకోట:  The outer hedge or fence round a fort.
కంచెనాటుట. To plant a hedge అని తెలుగు నిఘంటువులలో అర్థాలు కనిపిస్తాయి. కంచి అంటే హద్దుని నిర్దేశించటం. తెలుగు నేల మీద కంచి అనే పదం ఉన్న గ్రామ నామాలు చాలా ఉన్నాయికొనకంచి, కంచిక చెర్ల, పెనుకంచి ప్రోలు లాంటి పేర్లు గల ఊళ్ళు కృష్ణాజిల్లాలో ఉన్నాయి. పాళీ భాషలో హద్దు అనే అర్థంలో కంచె కనిపిస్తుంది.
5) గొడ్డలిఋగ్వేదంలో గొడ్డలిని కుద్దల అన్నారు. విస్తృతమైన వ్యవసాయానికి ఇనుప కర్రు వున్న నాగలిని ఉపయోగించినా ఆహార యోగ్యమైన దుంపలనుమూలికలను, పవిత్రమైన మొక్కలనూ త్రవ్వేందుకు చెక్క గునపాన్నే వాడేవారు.
ఇనుము వారిది కాకపోవటం వలన అది పవిత్రత లేని లోహం అయ్యింది.
Ta. kuṭāri, kōṭāri, kōṭāli
Ta. కుటారి, కోటారి, కోటాలి axe.
Ma.కోటాలి, కోటాలి, కోటాళి  axe.
Ka.కొడాలి: axe.
Tu. కొడారి, కుడారి: axe.
Te. గొడ్డలి, గొడ్డేలి, గొడ్డేలి, గొడ్డేలు, గొడలి: axe.
Kol. గొల్లి, గోలి: axe.
Konḍa గోరెల్() axe.
Pe కూరెల్ axe (large variety).
Kui క్రాడి axe.
Kuwi (Su.) క్రాలి axe.
చెట్లను, కట్టెలను నరికేందుకూ, కోసే౦దుకూ ఇనుపసాధనం బాగా ఉపయోగ పడింది. గండ్ర గొడ్డలి (పరశువు) అనేది ఆయుధ విశేషం. గొడ్డలి తెలుగు వ్యావసాయిక పదం.
6)కొట్టము: కొట్టు: ధాన్యాదులను దాచుకొనే గది. ‘కొట్ఠఅనేది పాళీ భాషా పదం. కొట్టు అనే పదం చిల్లర కొట్టు, బట్టలకొట్టు, ఎరువుల కొట్టు ఇలా వాణిజ్య పరమైన అంశాలకు సంబంధించిన పదంగా కూడా కనిపిస్తుంది.
7)కళ్ళము: పంట పండిన తరువాత, వరి మొక్కలను మొదలంటా కోసి, ఒక చోట కుప్పగా పోస్తారు. కుప్పగా పోసిన నేలను కళ్ళము అంటారు. ‘ఖలఅని పాళీ, వైదిక, సంస్కృత భాషలలో వ్యవహరిస్తారు. కళ్ళము పాళీ లోంచి తెలుగు లోకి వచ్చిన పదం కాకపోవచ్చు. ఎందుకంటే, ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు ప్రకారం వివిధ ద్రావిడ భాషలలో కల్మ్, కలమార్, కలరి, కక్మ లాంటి పదాలు ఉన్నాయి. అయితే, రాజస్థాన్ రాజ వంశాలలో కలమార్ రాజవంశం ఒకటి. భోజ మహరాజు తమ వంశంలోనే జన్మించాడని వంశీకులు చెప్పుకుంటారు. ఖల లేదా కళ్ళం దేశ వ్యాప్తంగా ఉన్న మూల ద్రావిడ పదమే అయి ఉంటుంది. కళ్ళములో మొక్కలను కుప్పగా పోసిన తరువాత నూరి, మొక్కనుంచి గింజను రాలుస్తారు. దీనిని నూర్పిడి అంటారు.
8)చెత్త: పాళీ భాషలో కూడా చెత్త అనే పదం- తోసివేయ బడినది అనే అర్థంలో కనిపిస్తుంది.
9)పలుగుపాళీ భాషలో పలిఘ అంటారు. త్రవ్వటానికి ఉపయోగించే ఒక లోహ సాధనం.
10) మానిక: ధాన్య కొలిచే పాత్ర. పాళీ భాషలో కూడామానికఅనే అంటారు.
11) కూర: వండిన కూర అనీ, కూరగాయల్లో కూర అనీ కూ పదం రెండర్థాలలో కనిపిస్తుంది. పాళీ భాషలో కూడా ఇలానే రెండర్థాలలోనూ కనిపిస్తుంది. సంస్కృత భాషలో కూరం అంటే అన్నం
12) అచ్చుకట్టు: పాళీ భాషలో అచ్చిబంధ అంటారు. నాలుగు పలకలుగా వరి మళ్ళను కట్టటాన్ని అచ్చుకట్టటం అంటారు. పంట చేనును వైదిక భాషలో క్షేత్రం అంటారు. ఒక నిర్ణీత కొలతలో ఎత్తుగా గట్లు పోసి మడి కడతారు. ఇది తెలుగు వారి వ్యవసాయ విధానంలో ప్రత్యేకంగా కనిపించే అంశం. అచ్చు కట్టటం లోంచే అచ్చి రావటం( కలిసి రావటం) అనే పదం కూడా ఏర్పడి ఉండవచ్చు.
పాళీ భాషలో కనిపించే పదాలు తెలుగు నేల మీద చారిత్రకంగా  పాళీ భాష రాజ్యం ఏలిన కాలం నాటి పదాలుగా మనం గుర్తించ వచ్చు. తెలుగు భాష ప్రాచీనతకు వారి వ్యావసాయిక పదాలే సాక్ష్యం ఇస్తాయని కూడా అర్థం చేసుకోవచ్చు.
మహాకవి కాళిదాసు బౌద్ధ యుగానికి చెందిన వాడు. ఆయన రఘువంశం కావ్యంలో ఆనాటి తెలుగు ప్రజల వ్యావసాయిక జీవనాన్నీ ప్రస్తావించిన శ్లోకం మన ప్రాచీనతకు ఒక ప్రత్యక్ష సాక్షి.
రఘు మహరాజు కళింగను జయించాడు. నాటి శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రగిరి ఉంది.అది ప్రాచీనాంధ్ర భూగోళానికి ఉత్తర హద్దు. ఉత్తరాంధ్రను రఘుమహారాజు జయించటాన్ని ఆనాటి తెలుగు ప్రజలు స్వాగతించారట,మహేంద్రగిరిని తమలపాకు తోరణాలతో అలంకరించి, దాని నొక పానశాలగా మార్చి, కళింగ రాజు కీర్తిని తాగినట్టు కొబ్బరి కల్లు తాగారని రఘువంశం నాల్గవ సర్గ ఒక వర్ణన కనిపిస్తుంది. అక్కడి నుంచీ రఘు మహారాజు కోస్తా తీరం వె౦బడి దిగువకు బయల్దేరితే, అడుగడుగునా ప్రజల నీరాజనాలు దొరికాయట.
చెరుకు తోటల నీడలో కూర్చుని రైతుమహిళలు వరిచేలను కాపలా కాస్తూ, రఘుమహారాజు జీవిత గాథని పాటలుగా పాడుకొన్నారంటూ,  “ఇక్షుచ్చాయా నిషాదిన్యస్తస్య గోప్తుర్గుణోదయమ్” (రఘు వంశం, 4 సర్గ, 20 శ్లో)అనే శ్లోకంలో వర్ణిస్తాడు.

ఇది నేటికి రెండు వేల ఏళ్ళ నాటి తెలుగు ప్రజల వ్యవసాయ గాథ!

No comments:

Post a Comment