‘గే’ సెక్సు ఆగేనా?
డా. జి వి పూర్ణచందు
మనిషి తన లైంగికపరమైన విధానాల ద్వారా, కార్యకలాపాల
ద్వారా, ప్రవర్తన ద్వారా తనలో లైంగికతని బయట పెట్టుకుంటూ ఉంటాడు. యుగాలుగా సాగుతూ
వస్తున్న ఈ కాలగమనంలో మనిషి అనేక రకాలుగా తన లైంగికతని ప్రదర్శిస్తూ, సంతృప్తి
చెందుతూ, సంతృప్తి చెందిస్తూ జీవిస్తూ వస్తున్నాడు. లైంగికత (సెక్సువాలిటీ) లేనిదే
జీవితం లేదు. మోక్ష సన్యాసాలనేవి కొందరు ఎంపిక చేసుకున్న వ్యక్తులకు మాత్రమే
పరిమితమైన అంశాలు. లైంగికత విశ్వజనీనమైనది. లైంగికజీవితంలో ఆరోగ్యదాయకమైన అంశాలు
మాత్రమే ఉన్నప్పుడు దాంపత్య సుఖం ద్విగుణం బహుళం అవుతుంది.
ఆహారాన్ని ఆరోగ్యవంతంగా, సంతృప్తికరంగా ఎలా
స్వీకరిస్తామో లైంగికతని కూడా అంతే ఆరోగ్యవంతంగా, సంతృప్తికరంగా అనుభవించవలసి
ఉంటుంది. తినటం కోసమే మనిషి జీవించటం లేదన్నట్టే, సెక్సు కుతి తీరటం కోసమే
జీవించటం లేదు. జీవించటం కోసం తిండి కావాలి. జీవించటం కోసం మనిషికి సెక్సు కావాలి.
ఉప్పు చాల్లేదనో, కారం ఎక్కువైందనో ఆహారం గురించి ఎంత బహిరంగంగానైనా
చర్చించుకోగలం. సెక్సు విషయంలో ఇలా చర్చించుకోవటానికి తగిన భాష లేదు. సెక్సు
భావవ్యక్తీకరణకు కావల్సిన పదాలు మన భాషలో సరైనవి లేకపోవటానికి సెక్సు గురించి
బహిరంగంగా మాట్లాడక పోవటమే కారణం. ఆహార, నిద్రా, భయ, మైథునాలు (సెక్సు కార్యం) ఈ
నాలుగూ ఎవరికి వారే ఆరోగ్యవంతమైన రీతిలో నెరవేర్చు కోవాలికదా!
స్త్రీపురుషుల మధ్య లైంగిక కార్యం అనేది అవతలి
వ్యక్తిలో లైంగికావేశాన్ని ప్రేరేపించటంతో మొదలౌతుంది. నిజాయితీ కలిగిన కాముకుడు
నిస్వార్థంగా ఉంటాడు. తన తృప్తి కన్నా తన భాగస్వామి తృప్తి ప్రథానం అనుకుంటాడు.
స్త్రీ కూడా అలానే వ్యహరిస్తుంది. అందుకనే సెక్సుకార్యంలో ఇద్దరూ ఒకరినొకరు సుఖపెట్టటమే
ఉంటుంది! దీన్ని courtship and display behavior అంటారు. శారీరక బంధం కన్నా, సంసారబంధం
కన్నా, భావావేశ బంధాన్ని Human sexual activity ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
ఈ భావావేశ బంధం వక్రమార్గాన పడకూడదు. పడనివ్వకూడదు.
జంతువులకూ సెక్సు కార్యాలు ఉంటాయి. అయితే
సంతానోత్పత్తి మాత్రమే వాటి లైంగికతకు ప్రధాన లక్ష్యం. స్త్రీ పశువుల్లో ఋతు
క్రమాన్ననుసరించి లైంగికత ఉంటుంది. మళ్ళీ ఈత కొచ్చినప్పుడే ఆడపశువు మగ పశువుని
దగ్గరకు రానిస్తుంది. మనుషుల కథ వేరు. సాధారణంగా మనుషులు తమ సెక్సు విషయాలలో
నిజాయితీ (candid)గా ఉండరంటాడు ఫ్రాయిడ్. మానవ జాతికి ‘సెక్సు సీజ’నంటూ ఉండదు. సెక్సుపరంగా
మనిషి నిత్య ‘కార్య’ శీలి. అందుకని సామాజిక
కట్టుబాట్లు, తార్కికత, భావావేశాలు ఇవన్నీ మనిషి లైంగికతను అదుపులో పెట్టటానికి అవసరం
అవుతున్నాయి. వాటిని ఛేదించుకుని మనిషి తన నిజాయితీ రాహిత్యాన్ని చెల్లించుకోవాలని
చూస్తాడు. సామాజిక సెక్సు నీతిని పాటించే వాణ్ణి పురుషపుంగం అనీ, అది లేని వాణ్ణి పురుషపుంగవం
అనీ అంటారు. పుంగవం అంటే ఎద్దు. మన మగ సమాజంలో ఇటీవలి కాలంలో ఈ పుంగవాల ప్రాబల్యం
పెరిగిపోయింది. వాటి గురించైనా మనం నిజాయితీగానూ, బహిరంగంగానూ చర్చించుకోక పోతే
ఏది ఒప్పో నిర్ణయించుకోలేని ఒక సందిగ్థ స్థితి నెలకొంటుంది.
‘స్వలింగ కాముకత –homo sexuality- అంటే స్త్రీ పురుషులు
మరో స్త్రీ పురుషులతో నిమిత్తం లేకుండా తమలో తామే లైంగిక సుఖాన్ని పొందేందుకు
ప్రయత్నించటం. దీన్ని
మనో విశ్లేష శాస్త్ర ప్రకారం auto-eroticism అంటారు. లేదా ఇద్దరు
స్త్రీలు ఇద్దరు పురుషుల మధ్య అలాంటిది జరిగినా అది స్వలింగ కాముకతే అవుతుంది.
ఇందుకోసం dildos, vibrators, anal beads, ఇతర sex toys మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. వ్యభిచారం కన్నా ఈ ‘మలిన శృంగారం’ నయం అని భావించుకునే వాళ్ళూ
గణనీయంగానే ఉన్నారు.
గేసెక్సు పేరుతో ఒక మనో వికార దుశ్చర్య పాశ్చాత్య
దేశాల్లో చట్టబద్ధమైన సెక్సు కార్యంగా ప్రస్తుతం చెలామణిలో ఉంది. మన సుప్రీం
కోర్టు, పార్లమెంటు అడ్డుపడకపోతే ఆ దర్భాగ్యం మన దేశానికీ త్వరలోనే సోకుతుంది
కూడా!
‘గై (guy)’ అంటే యువకుడు. ‘గే(gay)’ అంటే ఇద్దరు యువకులని! లైంగిక
వికారాలుమగాళ్ళలోనే ఎక్కువ. అందుకని ముళ్ళపూడి బాపూగారు ఒక సినిమాలో ‘`మగాడిదలు’’ అంటారు. అలాంటి మగాడిదలు
తెచ్చిన ఒక తాజా వికార విప్లవం ఈ ‘గేసెక్సు’. ఒకమగాడు ఇంకో మగాడితో లైంగిక సంతృప్తిని పొందటాన్ని
గేసెక్సు అంటారు. కొందరు స్త్రీలలో కూడా ఈ లక్షణం ఉండవచ్చు. కానీ అది ప్రస్తుతానికి
పెద్ద స్థాయిలో లేదు. ఒకప్పుడు ఇలాంటి స్వలింగ కాముకత్వాన్ని లెస్బియానిజం
అనేవాళ్ళు. ఇటీవలి కాలంలో మగాళ్లలో ఈ లక్షణం పెచ్చుపెరిగిపోయి, అది తమ ప్రాథమిక
హక్కుగా భావించే దాకా వెళ్ళింది. అంతేకాదు, తమ ‘‘గేహక్కు’’ కోసం న్యాయపోరాటం చేసే దాకా వెళ్ళింది. బోయ్‘ఫ్రెండ్ అనే
మాటకు అర్థాలు మారిపోయాయి.
సంతానోత్పత్తి ప్రధాన లక్ష్యంగా లైంగిక కార్యం సమస్త
జీవరాసుల్లో జరుగుతోంది. గేసెక్సులో కాముకత్వం తప్ప సంతానం ప్రస్తావన ఉండదు.
స్త్రీ జననాంగంతో నిమిత్తంలేకుండా ఒక పురుషుడు లైంగిక సంతృప్తిని పొందాలనుకోవటం అసహజ కామమే అవుతుంది. మరో
పురుషుడి విరేచన మార్గంలో సెక్సుని చేసి ఈ అసహజ మానవులు సంతృప్తి చెందుతుంటారు.
స్త్రీలను గిల్లి, కొరికి, హింసించి సెక్సుని
అమానుషంగా అనుభవించే కామరాక్షసులకన్నా మేము మానవతా వాదులం అని తమ వికారాన్ని సమర్థించుకుంటారు.
స్త్రీ పురుషుల మధ్య సెక్సు వలన పురుషాధిక్యత, స్త్రీ బానిసత్వం పెరుగుతున్నాయనీ,
సంసార బంధాలు ఆటంకాలుగా నిలుస్తాయనీ, గేసెక్సులో ఇలాంటి జంజాటాలు ఉండవని వాళ్ళు
చెప్పుకుంటారు. తమదే నిజమైన సమాజ సేవగా భావిస్తారు. ఇష్టం ఉన్నా లేకపోయినా స్త్రీ
పురుషులు చచ్చినట్టు సెక్సులో పాల్గొనాల్సి ఉంటుందని, గే సెక్సు పూర్తి
ప్రజాస్వామ్య యుతంగా సాగుతుందనీ గొప్పలు చెప్పుకుంటారు. తమ కామం తీర్చుకోవటానికి
దేశ జనాభాలో సంఖ్యనొక్కటి పెంచి స్త్రీపురుషులు అధిక జనాభా సమస్యలకు కారణం
అవుతున్నారు. అందుకని గే సెక్సు కన్నా దేశభక్తి మరొకటి లేదని వాదిస్తారు. మగాళ్ళ
బతుకంతా ఆడవాళ్లని ఆకర్షీంచటంలోనే గడిచిపోతోంది. గేసెక్సులో ఇలా కృత్రిమంగా
ఆలోచించటం ఉండదనీ, సెక్సు సెక్సు కోసమే ననే ఏకైక సిద్ధాంతం మీద ఆధారపడి గేసెక్సు
ఏర్పడిందనీ వీళ్ళు న్యాయస్థానాలలో వాదిస్తున్నారు.
లైంగిక వికార విప్లవంగా సాగుతున్న ఈ మహమ్మారి
పాలిటకుండా మన యువకులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెల్సి తెలియని
వయసులో కాలేజీ హాష్టళ్లలోనూ, రెసిడేన్సియల్ స్కూళ్ళూ కాలేజీలలోనూ గేసెక్సు
కార్యకలాపాలు ప్రారంభమై, అదే ఒక ప్రపంచంగా జీవించే పరిస్థితి వస్తోంది. ఇటీవల చాలా
వివాహాలు విఫలం కావటానికి ఈ గేసెక్సు భావావేశం కూడా ఒక కారణం అవుతోన్నట్టు
గమనించటం జరిగింది. గేసెక్సు కుతికి అలవాటు పడ్డవాడు దాంపత్య పరమైన లైంగికత (straight sex)ను ఆనందించ లేకపోవటం,
స్త్రీ ద్వేషం విడాకులకు ముఖ్య కారణాలౌతున్నాయి.
వివాహ సంబంధాలు కుదుర్చుకోబోయే ముందు, ప్రేమలో
పడబోయే ముందు ఆడపిల్ల ఆ అబ్బాయిలో ‘గే’లక్షణాలు ఉన్నాయేమో గమనించవలసిన
అవసరం ఉంది. ఇలాంటి విషయాలను నిర్భయంగానూ, నిర్మొహమాటంగానూ చర్చించకపోతే ‘గే’గాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆడపిల్లల బతుకులు బుగ్గి
అయిపోతాయి.
No comments:
Post a Comment