Thursday, 9 January 2020

భాషోద్యమ భవిష్య కార్యాచరణ




4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
లక్ష్యప్రస్తావన:
భాషోద్యమ భవిష్య కార్యాచరణ
డా. జి వి పూర్ణచందు,
కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం
మాతృభాషను కాపాడుకుందాం-స్వాభిమానం చాటుకుందాం” అని నినదిస్తూ4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన భాషాభిమానులైన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నాం.
దాదాపు 1600 మంది జీవిత సభ్యులుగానో లేక ప్రతినిధులుగానో తమ పేర్లు నమోదు చేసుకుని ఈ మహాసభలలో పాల్గొంటున్నారు. సభాస్థలిని మించి నమోదు జరగటం వలన కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగా నిర్దేశించిన గడువు తరువాత ప్రతినిధుల నమోదు నిలిపివేయక తప్పలేదు. ఇంతకు ఇంతమంది ఇంకా నమోదును కోరి ఉన్నారు. వారందరినీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అవకాశం ఉన్నంతమేర జీవిత సభ్యుల నమోదు మాత్రం కొనసాగించ గలిగాము.
గతంలో మూడు పర్యాయాలు జరిగిన మహాసభలూ నిర్దేశిత లక్ష్యసాధనతో విజయవంతం అయ్యాయి. 2007లో ప్రపంచ తెలుగు రచయితల తొలిమహాసభలు మాతృభాషోద్యమ నిర్మాణం లక్ష్యంగా జరిగాయి. మా పిల్లలకు తెలుగు చదవనూవ్రాయనూ నేర్పిస్తున్నాం’ అని తల్లిదండ్రులు ఘనంగా చెప్పగలుగుతున్నారంటే అది భాషోద్యమ విజయమే! 
2011లో సాంకేతిక తెలుగు అంశం పైన జరిగిన 2వ మహాసభల పాత్ర గణనీయమైంది కూడా! ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాసభల్లో యూనీకోడ్ కన్సార్టియంలో శాశ్వత సభ్యత్వం పొందే నిర్ణయాన్ని ప్రకటించింది.18 ఉచిత తెలుగు ఫాంటులుఒక కీబోర్డు’ విడుదల లాంటి భాష ఆధునీకరణకు ఉపయోగించే అనేక సాంకేతిక అంశాలను ప్రకటించింది. కృష్ణాజిల్లా రచయితల సంఘం పెద్దలు చేసిన కృషి ఫలితంగా సిలికాన్ వ్యాలీలో తెలుగు అంతర్జాల ప్రధమ సదస్సు జరిగింది. ఆనాడు సెల్ఫోన్ తయారీదార్లతో జరిపిన సంప్రదింపుల ఫలితమే సెల్ఫోన్లలోనూఅనేక కంప్యూటర్ యాపులలోనూ ఇంత విస్తారంగా తెలుగు వస్తోంది. ప్రపంచ స్థాయి మహాసభలు భాష ఆధునీకరణకు చేయగలిగిన కృషి ఇది.
రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో భాషపరంగా తెలుగు వారంతా ఒక్కటేననే అంశాన్ని చాటుతూ 2015లో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. అంతకు మునుపటి ఉద్విగ్నభరిత వాతావరణాన్ని కుదుట పరుస్తూ ఈ మహాసభలు తెలుగు రచయితల మధ్య అనురాగ బంధాలను ప్రోది చేయగలిగాయి. 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా యునిసెఫ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ 4వ మహాసభలు జరుగుతున్నాయి. తెలుగు భాషోద్యమాన్ని బలసంపన్నం చేసిభాషానురక్తి కలిగిస్తూ ప్రజల గుండెతలుపులు తట్టే కార్యాచరణ రూపొందించటం ఈ మహాసభల లక్ష్యం.
ఈ మహాసభలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరూ తెలుగుతల్లి ప్రత్యేక దూతలుగా భాషోద్యమ లక్ష్యసాధకులుగా  మారాలని అభిలషిస్తున్నాం. గ్రామగ్రామాన శక్తిమంతమైన తెలుగు వేదికలు ఏర్పాటు చేసితెలుగు భాషానురక్తిని కలిగించే కార్యక్రమాలు ఇతోధికంగా జరిగేలా ఒక నిర్దిష్ట ప్రణాళికకు ఈ మహాసభలలో రూపకల్పన జరగాలని ఆశిస్తున్నాం. అమ్మభాషను కాపాడుకుందాం’ అనే సందేశాన్ని ఒకరు నలుగురికి చేర్చే సిద్ధాంతం ఇప్పుడు అమలు కావాలి.
ఈ మహాసభల ప్రాంగణాన్ని తెలుగు భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగారి పేరుతోనూప్రధాన వేదికను గిడుగు రామమూర్తి సాహితీ సాంస్కృతిక వేదికగానుసదస్సులు జరిగే వెబినార్ హాలును సురవరం ప్రతాపరెడ్డి భాషా సాంస్కృతిక వేదికగానూ వ్యవహరిస్తున్నాం. రెండు వేదికలమీద నిర్దేశిత కార్యక్రమాలు సమాంతరంగా జరుగుతాయి.
తెలుగు పట్ల అనురక్తితో  విదేశాలలోనూదేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ నివశిస్తున్న తెలుగు వారు భాషకోసం ఆయా ప్రభుత్వాలతో జరిపే పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఈ మహాసభలలో ప్రత్యేకంగా విదేశీ ప్రతినిధులకోసం అలాగేరాష్ట్రేతర ప్రతినిధుల కోసం చర్చావేదికలు ఏర్పాటు చేస్తున్నాం. భాషాభిమానంతో తెలుగులో పాలించినపాలిస్తున్న అధికారులతోనూరాజకీయ ప్రతినిధులతోనూ చర్చావేదికలున్నాయి. భాష మరియు చరిత్ర పరిశోధకులుబోధనారంగ నిపుణులుసాహితీ సాంస్కృతికరంగాల ప్రతినిధులుపత్రికా ప్రసార మాధ్యమాల ప్రతినిధులుప్రచురణరంగ ప్రతినిధులుసాహితీసంస్థల ప్రతినిధులతో  విస్తృత చర్చావేదికలు ఏర్పాటు చేశాము. సాంకేతికరంగ నిపుణులు తెలుగును ఆధునీకరించే విషయంలో అనుసరించగలిగిన అంశాల గురించిభాషోద్యమంలో చిరకాలంగా కృషిచేస్తున్న ప్రతినిధులు భవిష్య కార్యాచరణ గురించిమహిళా ప్రతినిధులు నిజమైన భాషాసంరక్షకులుగా మహిళలపాత్ర గురించి చర్చిస్తారు.
సదస్సులలో ప్రసంగాలు కాకుండా చర్చలకు ప్రాధాన్యం ఇస్తూతీర్మానాలు చేస్తేముగింపు సభలో వాటి ఆమోదానికి ప్రతిపాదన చేయటం జరుగుతుంది.
తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణఅభివృద్ధిఆధునీకరణ అంశాలపై ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యక్రమ ప్రణాళిక రూపకల్పనకు ఈ తీర్మానాలు ఆదర్శంగా ఉంటాయి. అటు ప్రభుత్వాలకుఇటు తెలుగు ప్రజలకు ఇవి మేథావి వర్గాలు చేసే మార్గదర్శనాలు కావాలని ఆశిస్తున్నాం.
ఈ బృహత్తర కార్యభారానికి సారధ్యం వహిస్తున్న ప్రపంచ తెలుగు రచయితల సంఘంలో జీవిత సభ్యత్వం స్వీకరించ వలసిందిగా భాషాభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం.


No comments:

Post a Comment