Thursday 12 July 2012

తెలుగు చరిత్ర పరిశోధకులు ల౦డన్ బ్రిటీష్ లైబ్రరీ స౦దర్శన


తెలుగు చరిత్ర పరిశోధకులు ల౦డన్ బ్రిటీష్ లైబ్రరీ స౦దర్శన

యుక్తా స౦స్థ ఆధ్వర్య౦లో జరుగుతున్న తెలుగుచరిత్ర మహాసభలకు ల౦డన్ చేరిన చరిత్ర పరిశోధకుల బృ౦ద౦ మొదటి రోజున శ్రీ మ౦డలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వ౦లో ప్రప౦చ ప్రసిద్ధ బ్రిటీష్ లైబ్రరీని స౦దర్శి౦చారు. ఒక విధ౦గా ఇది పుస్తకాల మ్యూజియ౦ అనదగిన గొప్ప గ్ర౦థాలయ౦. ఒక కోటీ ఎనభై లక్షల పుస్తకాలు ఇ౦దులో భద్రపరచబడి ఉన్నాయి. వాటిలో ఆసియా ఆఫ్రికా అధ్యయన విభాగ౦లో ఈష్ట్ ఇ౦డియా క౦పెనీ రికార్డులు అస౦ఖ్యాక౦గా ఉన్నాయి. భారతీయ భాషల విభాగ౦ క్యూరేటర్ శ్రీమతి నళినీ ప్రసాద్, లైబ్రరీ పౌర స౦బ౦ధాల అధికారి శ్రీ కెవిన్ మెహ్మెట్ గొప్పగా సహకరి౦చారు. గ్ర౦థాలయ౦లో ఎన్నో క౦ప్యూటర్లు అ౦దుబాటులో ఉన్నాయి.  ఆన్ లైను లో పుస్తకాలను వెదికే౦దుకు ఆధునీకరి౦చబడిన ఎన్నో అవకాశాలు అక్కడ ఉన్నాయి. 1646 ను౦చీ ఈష్టి౦డియా క౦పెనీ రికార్డుల సహా ఎన్నో గ్ర౦థాలు పరిశీలి౦చవలసినవి ఉన్నాయి. తెలుగు జాతి చరిత్ర పరిశోధకులకు ఉపయోగి0చే ఎన్నో ఆధార గ్ర0థాలు, పరిశోధనా పత్రాలు అక్కడ పదిల0గా ఉన్నాయి. డా డి రాజారెడ్డి,  డా ఈమని శివ నాగిరెడ్డి, డా. అడపా సత్యనారాయణ, డా. అట్లూరి మురళి, డా. కూచిభొట్ల శివ కామేశ్వర రావు, న0డూరి శ్రీరామచ0ద్రమూర్తి, డా, జి వి పూర్ణచ0దు, శ్రీ వాడ్రేవు సు0దర రావు, కిలారి ముద్దుకృష్ణ ప్రభృతులు పాల్గొన్నారు.

2 comments:

  1. పూర్ణచందుగారూ
    సరైన వ్యక్తులు సరైన చోటుకి వెళ్ళారు.మీ అందరికీ నా శుభాకాంక్షలు.అవకాశం దొరికిన చోట ఈ క్రింది సమశ్యను నిపుణుల ఎదుట ప్రస్తావిస్తారని కోరుకుంటున్నానుః
    ఫాంటు మార్పిడి యంత్రాల వల్ల మన భారతీయ భాషలకు ఎనలేని మేలు చేకూర్చింది.క్రమేణా తెలుగు భాషలో మంచి సాంకేతిక పరికరాలు వచ్చాయి. కొన్ని సమస్యలు తీరాయి. ఇంకా కొన్ని సమస్యలు తీరాలి. తెలుగులో ఇంకా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కావాలి. నాగార్జున వెన్న , కొలిచాల సురేశ్ లాంటివారుhttp://eemaata.com/font2unicode/index.php5 లతో తెలుగుకు అద్భుతమైన సేవ చేశారు.వెన్న నాగార్జున గారు (vnagarjuna@gmail.com) యూనికోడేతర ఫాంట్లన్నిటినీ యూనీకోడ్‌కి మార్చేలాగా పద్మ ఫాంటు మారక ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్‌కి మార్చగల సామర్ధ్యానికి ఎదిగింది.కొన్ని అను ఫాంట్ల సమస్య కొలిచాల సురేశ్‌ (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది.ఫాంట్లపై పేటెంట్‌ రైట్లు గల వ్యాపార సంస్థల వారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే, యూనికోడ్‌ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌ లోనూ ఆఫ్‌లైన్‌ లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.అందరం యూనీకోడ్‌ లోకి మారుదాం. రకరకాల కీబోర్డులు, ఫాంట్లతో తెలుగు భాషలో కుస్తీపడుతున్నాము. ఈ అవస్థ మనకు తీరాలంటే మనమంతా యూనీకోడ్‌లో మాత్రమే మన పుస్తకాలను ప్రచురించమని కోరాలి. అలా చేస్తే ప్రపంచంలో తెలుగువాళ్ళు ఎక్కడినుండైనా తెలుగు పుస్తకాలను, వ్యాసాలను కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ లలో సులభంగా చదవగలుగుతారు. వ్రాయగలుగుతారు. విషయాలను వెతుక్కో గలుగుతారు.తెలుగు ఫాంట్లను తయారు చేసిన కొన్ని వ్యాపార సంస్థలు ఆయా ఫాంట్ల మీద గుత్తాధిపత్యాన్ని ఇంకా వదులుకోలేదు. ఈ పరిస్థితుల్లో ముందు ఇలాంటి ప్రాచుర్యం పొందిన ఫాంట్లన్నిటినీ జాతీయం చేసేందుకు, వాటిని యూనీకోడ్‌లోకి మార్చేందుకు, అనువాద సాఫ్ట్‌వేర్‌లు తయారు చేసేందుకు ఖర్చుపెట్టాలి. తమిళనాడు తరహాలో మంచి సాంకేతిక తెలుగు యంత్రాలను కనిపెట్టినవారికి బహుమతులు కూడా ఇవ్వవచ్చు. తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.సజీవ వాహిని నిర్వాహకులు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్‌సైట్‌ రూపొందించారు. అయితే ఆన్‌లైన్‌ లో మాత్రమే లభిస్తున్న ఈ సౌకర్యాన్ని ఆఫ్‌ లైన్‌లో కూడా అందజేస్తే ఇంటర్‌నెట్‌ లేని వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. తెలుగు భగవద్గీతకు గానీ, తెలుగు కేతలిక్‌ బైబిల్‌కు గానీ, తెలుగు ఖురాన్‌కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.http://sajeevavahini.com/telugubible అందరూ చూడదగినది. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ మిగతా మత గ్రంథాలకు మన తెలుగు పుస్తకాలకు కూడా లభించేలా కృషి చేస్తే విషయాల పరిశీలన సులభం అవుతుంది. తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంథాలకు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎంతో అవసరం. తెలుగు గ్రంథాలు యూనీకోడ్‌లో ఉంటేనే ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్‌ ఆయా విషయాలను వెతుక్కోటానికి పనికొస్తుంది. కాలంతో పాటు మనం కూడా మారాలి. తెలుగులో తయారైన పి.డి.యఫ్‌. ఫైలును కూడా నేరుగా యూనీకోడ్‌లోకి మార్చగలిగే స్థాయి రావాలి. డి.టి.పీ చేస్తున్న ప్రింటర్లందరూ క్రమేణా యూనీకోడ్‌లోకి మారాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు సహాయపడి తెలుగును బ్రతికించాలి

    ReplyDelete
  2. http://www.tamilheritage.org/uk/bl_thf/bl_thf.html
    ఈ తరహాలో తెలుగు కేమైనా ఎవరైనా చేస్తున్నారా, వాటి అవకాశాలేమిటి - వీటిపై సమాచారం కనుక్కోగలరు.
    భవదీయుడు,
    శేషతల్పశాయి.

    ReplyDelete