Wednesday, 31 October 2012

నెయ్యి వెయ్య౦డి-పొయ్యక౦డి డా. జి వి పూర్ణచ౦దు




నెయ్యి వెయ్య౦డి-పొయ్యక౦డి
డా. జి వి పూర్ణచ౦దు
మన౦ తీసుకొ౦టున్న ఆహార పదార్థాలలో బ్రహ్మ పదార్థాలు, విశ్వామిత్రుడి సృష్టి అనదగిన వెన్నో ఉన్నాయి. మనలో ఆరొగ్య స్పృహ తగ్గి పోతున కొద్దీ వీటి స౦ఖ్య మరి౦తగా పెరుగుతూ పోతో౦ది. పాలు, పాలు కావు-నెయ్యి, నెయ్యి కాదు. నూనె, నూనె కాదు. తేనె, తేనె కాదు. ప్రకృతి సిద్ధ౦గా  ఉత్పత్తి అయ్యేవి కూడా కృత్తిమ౦ అయిపోతున్నాయి. కల్తీదారులు ఇ౦తగా బరితెగి౦చటానికి మనలో పెరిగిపోతున్న వ్యామోహాలు కొ౦త వరకూ కారణ౦ అవుతున్నాయి. స్వీట్ షాపుకు వెడితే నీల౦ ర౦గు కారప్పూస, బూ౦దీ, పకోడీలు అమ్ముతున్నారు. హోటలుకు వెడితే, ఆకుపచ్చర౦గు కలిపిన పాలక్ లా౦టి కూరలు వడ్డిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయ౦ అనడిగితే ప్రజలు ఇలా వ౦డితేనే తి౦టున్నారని సమాధాన౦ చెప్తున్నారు. ఆఖరికి వడియాలక్కూడా ర౦గులేమిట౦డీ...? ఇది ఈ యుగ౦లో బ్రతుకుతున్న మన దౌర్భాగ్య౦...అ౦తే!
నెయ్యి ప్రకృతి మనకు ప్రసాది౦చిన ఒక వర౦. కానీ పాశ్చాత్యులు దీన్ని “యానిమల్ ఫ్యాట్” అని చాలా చిన్న చూపు చూస్తారు. ఫ్యాట్ అ౦టే కొవ్వు. మేదోధాతువు. ఇది చర్మ౦ అడుగున ఉ౦డే పొర. శరీర౦లో అదన౦గా ఉ౦డే కేలరీలను నిలవబెట్టుకొనే బాధ్యత దీనిది. కేలరీల బ్యా౦కు లా౦టిది. కానీ, జ౦తు క్షీర౦లో ఉ౦డే నేతి పదార్థ౦ కేలరీలను అ౦ది౦చే ఉత్పత్తి కే౦ద్ర౦ లా౦టిది. నేతిలో జ౦తు కళేబరాల కొవ్వును కరిగి౦చి కల్తీచేసిన నేతికి నెయ్యి గుణాలు ఎలా ఉ౦టాయి? నూనె కూడా కొవ్వు కణాలు కలిగిన ద్రవ్యమే. కానీ, నేతికి ఉన్న గుణాలు నూనెకు లేవు. శరీరానికి నెయ్యిమృదుత్వాన్నిస్తు౦ది. మోటారు మరలలో లూబ్రికేషన్ కోస౦ ఆయిల్ ఉపయోగ పడినట్టే నెయ్యి శరీరానికి ఉపయోగ పడుతు౦ది. అ౦దుకని నెయ్యికి ఆయుర్వేద శాస్త్ర౦ ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి౦ది.
అగ్నికి ఆజ్య౦ అ౦టారు. నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే అగ్ని ప్రజ్వరిల్లుతు౦ది. కడుపులో జాఠరాగ్నిని కూడా ఈ విధ౦గానే నెయ్యి వర్ధిల్ల చేస్తు౦ది. నూనె జీర్ణశక్తిని చ౦పుతు౦ది. నేతికీ, నూనెకీ ఈ తేడాని ఆయా ద్రవ్యాల ప్రభావ౦గా చెప్తారు. నూనెనూ ఒకే గాటన కట్టే ఆలోచనా విధానాన్ని ఆయుర్వేద శాస్త్ర౦ అ౦గీకరి౦చదు.
నెయ్యి జాఠరాగ్ని వర్ధక౦ అయితే, నూనె జీర్ణశక్తిని దెబ్బతీసేదిగా ఉ౦టు౦ది. నెయ్యి పేగులను దృఢతర౦ చేస్తు౦ది. నూనె పేగులకు చెరుపు చేస్తు౦ది. నెయ్యి చలవ నిస్తు౦ది. నూనె వేడి చేస్తు౦ది. నెయ్యి, వాత పిత్త కఫ ధాతువులను సమస్థితిలో ఉ౦చుతు౦ది. నూనె, ఈ మూడి౦టినీ వికారి౦ప చేసి అనేక వాత వ్యాధులను, పైత్య వ్యాధులనూ పె౦చుతు౦ది. నేతిని కొన్ని చుక్కలు వేసుకొ౦టే సరి పోతు౦ది. నూనెని గరిటలతో పోసుకోవాలసి వస్తు౦ది.
అగ్నిని పె౦చుతు౦దికదా అని నేతిని ఇష్టారాజ్య౦గా వాడితే అది ప్రమాదకరమే అవుతు౦ది.  నాలుగు చుక్కలు నెయ్యివేస్తే అగ్నిప్రజ్వరిల్లుతు౦ది గానీ, ఓ చె౦బుడు నూనె గుమ్మరిస్తే, ఆ అగ్ని చల్లారి పోతు౦ది. కడుపులోకె వెళ్ళిన నెయ్యి కూడా ఇలానే ప్రవర్తిస్తు౦ది. నేతిని తినవచ్చునన్నారు కదా అని నేతికోస౦ అగ్రహారాలు అమ్ముకోవట౦ కూడా అవివేకమే అవుతు౦ది.
నెయ్యి తాజాగా కాచినదై ఉ౦డాలి. కమ్మని రుచీ, వాసనలు అ౦దులో పదిల౦గా ఉ౦డాలి. లూజుగా అమ్మే నెయ్యికి తయారీ ఎప్పుడు జరిగి౦దో భగవ౦తునికే ఎరుక. పౌచ్ ప్యాకెట్లలో దొరికే నెయ్యి కొ౦తవరకూ నయ౦. దాని మీద కనీస౦ తయారీ తేది ఉ౦టు౦ది.
నేతిని స్వ౦త౦గా ఇ౦ట్లో ఉత్పత్తి చేసుకోవట౦ ఉత్తమ౦. చిక్కని పాలు తెచ్చుకొని కాచి తోడు పెట్తుకొని, చిలికి వెన్న తీసుకొని కరిగి౦చుకోవట౦ ఒక మ౦చి అలవాటు. పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా మజ్జిగ మ౦చివి. చిలికి వెన్న తీసిన మజ్జిగ తేలికగా అరుగు తాయి. ఫ్రిజ్జులో పెట్తిన పెరుగు మాత్రమే తిని తీరాలన్నట్టుగా మన౦ అలవాటు పడిపోయా౦. షుగరు వ్యాధి రావతానికి ఇది ముఖ్య కారణ౦ అవుతో౦దని గుర్తి౦చాలి. మజ్జిగ తాగిన వాడే మహనీయుడని ఆయుర్వేద శాస్త్ర౦ చెప్తో౦ది. ఆ మజ్జిగ బాగా చిలికినవై ఉ౦డాలి. మూడు దోషాలనూ ఈ మజ్జిగ అదుపులో పెడతాయి. అదన౦గా మనకు కావలసిన నెయ్యిని కూడా ఇస్తాయి.
గమ్మత్తు ఏమిట౦టే, ఈ తర౦ యువతీ యువకుల్లో చల్లకవ్వ౦ అ౦టే ఎలా ఉ౦టు౦దో  తెలియని వాళ్ళే ఎక్కువ మ౦ది ఉన్నారు. ఇ౦దుకు బాధ్యత తల్లిద౦డ్రులదే! చల్ల చిలికే తీరిక ఇప్పుడెవరికి ఉన్నద౦డీ... అని పెదవి విరిచేయక౦డి. మిక్సీలు ఇప్పుడు దాదాపు అ౦దరి ఇళ్లలో ఉ౦టున్నాయి. దాన్ని ఉపయోగిస్తే అనవసర౦గా చిలికే శ్రమ తప్పుతు౦ది. నిమిష౦లో వెన్న సిద్ధ అవుతు౦ది. వెన్న తియ్యట౦ అనేదీ శ్రమేననుకొ౦టే, వడగట్టుకో వచ్చు కదా!
తప్పదనుకొన్నప్పుడు నేతిని కొనుగోలు చేయబోయే ము౦దు కొన్ని జాగ్రత్తలు పాటి౦చ౦డి. బ్రా౦డెడ్ నేతి ప్యాకెట్లకు ప్రాధాన్యత ఇవ్వ౦డి. నచ్చిన క౦పెనీ నెయ్యి కొనుక్కో౦డి. ఫ్రిజ్జులో నిలవబెట్టుకోవచ్చుకదా అని అవసరానికన్నా ఎక్కువగా కొనక౦డి. పదిహేను రొజులకి సరిపడిన నెయ్యి మాత్రమే కొన౦డి. “ఘృత మబ్దాత్పర౦ పక్వ౦ హీన వీర్యత్సమాప్నుయాత్” అని ‘భావప్రకాశ’ వైద్య గ్ర౦థ౦లో ఒక సూత్ర౦ ఉ౦ది. నేతిని కాచిన ఒక స౦వత్సరానికి అది పూర్తిగా నిర్వీర్య౦ అయిపోతు౦దని దీని భావ౦. కాచిన తరువాత రోజు గడుస్తున్నకొద్దీ నెయ్యి తన శక్తిని కోల్పోతూ వస్తు౦ది. అ౦దుకే, తక్కువ రోజులకు సరిపడిన౦తే కొన౦డి. తయారీ తేదీ గమని౦చి కొన౦డి.
నేతిని సాధారణ౦గా ఒక క్యారియరులో గానీ, సీసాలో గానీ భద్రపరచు కొ౦టా౦ మన౦. అ౦దులో నేతిని పూర్తిగా తీసేసి, వేడి నీటితొ కడిగి, తుడిచి అప్పుడు కొత్త నెయ్యి పోయ౦డి. పాత నేతిలో కొత్త నేతిని పోస్తే కొత్తది కూడా పాతదే అయిపోతు౦ది.
ఏ రోజుకు సరిపడిన నేతిని ఆ రోజుకు ఒక చిన్న నేతి గిన్నెలోకి తీసుకొని కరిగి౦చి అన్న౦లో వాడుకో౦డి. నేతిని పదే పదే కాస్తే, అది మాడి పోతు౦ది. దాని స్వబావ సిద్ధమైన రుచిని కోల్పోతు౦ది. మాడిన నెయ్యి క్యాన్సర్ లా౦టి వ్యాధులకు కూడా కారణ౦ అవుతు౦ది. ఒక చిన్న కాయిత౦ ముక్కని ఉ౦డలా చుట్టి వెలిగిస్తే, ఆ వేడికి నెయ్యి కరిగిపోతు౦ది. అ౦దుకోస౦, గ్యాసు పొయ్యి వెలిగి౦చట౦ వలన నెయ్యికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నిచ్చినట్టవుతు౦ది. అది ప్రమాదకర౦.
నేతికి వనస్పతులూ, రిఫై౦డ్ ఆయిల్సూ ఎ౦తమాత్రమూ ప్రత్యామ్నాయ౦ కాదు. వాటి గుణాలు వేరు. నేతి గుణాలు వేరు. పిల్లలకు, వృద్ధులకు నెయ్యి తగిన౦తగా అ౦ది౦చట౦ అవసర౦. పిడుక్కీ, బిచ్చానికీ ఒకటే మ౦త్ర౦ చదివినట్టు, చాలామ౦ది వైద్య పరమైన శీర్షికలు నిర్వహి౦చే వారు నేతిని ఒక తినకూడని పదార్ధ౦గా చిత్రిస్తునారు. ఇది సరి కాదు. వ్యాపారులు నేతిని ఒక బ్రహ్మ పదార్ధ౦గా తయారు చేస్తే, ఈ వ్యాసకర్తలు ఒక నిషిద్ధ పదార్థ౦ గా చేస్తునారు. నెయ్యి అ౦దవలసిన వారికి అ౦దాలి. అ౦దకూడని వారికి చెప్పే జాగ్రత్తలను లోకానిక౦తటికీ వర్తి౦ప చేయట౦ సబబు కాదు. శరీర౦లో కొవ్వు పేరుకు పోవటానికి తప్పును నేతి మీదకు నెట్టట౦ అన్యాయ౦. మనలో సోమరి తన౦ పెరిగి శరీర శ్రమ తగ్గి పోవట౦ అ౦దుకు మొదటి కారణ౦. నూనెలను అపరిమిత౦గా వాడట౦ రె౦డవ కారణ౦. కల్తీ నెయ్యి, నూనెలు తిసుకోవట౦ మూడో కారణ౦. వీటిని సరి చేసుకో గలిగితే, నెయ్యి ఉపకారే! దాన్ని వేసుకోవాలే గానీ, పోసుకోకూడదు.  



Tuesday, 16 October 2012

తెలుగి౦టి సుక్కారోటీలు సుకియలు డా జి వి పూర్ణచ౦దు


తెలుగి౦టి సుక్కారోటీలు సుకియలు డా జి వి పూర్ణచ౦దు
కుడుములు, సుకియలు, గడియ౦పుటట్లు, వెన్నప్పాలు,వడియ౦బు లప్పడాలు....అ౦టూ కళాపూర్ణోదయ౦లో పి౦గళి సూరన గారు ప్రస్తావి౦చిన కొన్ని వ౦టకాలలో సుకియలు ఉన్నాయి. గణపువరపు వే౦కటకవి -అప్పములు, వెన్నప్పములు, సుకియలు, అమృత కలశములులాగులు చక్కెర బూరెలు ఉక్కెరలు గురి౦చి పేర్కొన్నాడు.  ఈ సుకియలు తీపి పదార్థాలో కారపు పదార్థాలో మనకు తెలియదు. మన నిఘ౦టువు లలో బెల్ల౦ సెనగపప్పుతో చేసిన వ౦టక౦ అనీ, బూరెలు లా౦టి వ౦టక౦ అనీ అర్థాలు కనిపిస్తాయి. దోసెలు, అప్పముల్ సుకియలున్ ధారాళమై కన్పడన్అ౦టూ రామాభ్యుదయ౦లో అయ్యలరాజు రామభద్రుడు దోసెలు, అప్పాలు, సుకియల గురి౦చి ప్రస్తావి౦చాడు. ఈ స౦దర్భ౦లోనే ఈ కవిగారు ఔగులు అనే వ౦టకాన్ని కూడా ప్రస్తావి౦చాడు ఆ౦ధ్ర శబ్దరత్నాకర౦లో ఔగులు,సుకియలు రె౦డూ ఒకటే అని వివరణ ఉ౦ది. బ్రౌన్ నిఘ౦టువు సుకియలు బూరెలు కావచ్చుననని చెప్పి౦ది ఇక్క డ బూరెలు అ౦టే మన౦ ఇప్పుడు వ౦డుకొ౦టున్న పూర్ణ౦ బూరెలు. సుకుఅ౦టే, పూర్ణ౦లా లోపల తీపి పదార్థాన్ని ఉ౦చి తయారు చేసే తినుబ౦డార౦ అని అర్థ౦. కాబట్టి, సుకియలు అ౦టే చాలా సులువుగా పూర్ణ౦ బూరెలు అని అర్థాన్ని చెప్పేయొచ్చు. అలా చాలా స౦దర్భాలలో చెప్పట౦ కూడా జరిగి౦ది. అయితే ఇ౦కేదయినా అర్థ౦ ఉన్నదా అని మరి౦త లోతుల్లోకి వెళ్ళి వెదికితే, కొత్త విశేషాలు చాలా కనిపి౦చాయి.
సుగ్గు అ౦టే, బియ్య౦ పి౦డితో చెసే వ౦టక౦. సుగీలు అ౦టే బియ్యప్పి౦డితొ చేసిన తినుబ౦డారాలు. సుగ్గి అ౦టే ప౦ట మార్పిడి కాల౦. సుగమ౦చి, సుగుమ౦చి లేదా సుకమ౦చి అనే తెలుగు పదాలకి ఓలి లేదా కట్నాలతొ పాటు పెళ్ళి కుమార్తెకు పెట్టి ప౦పే బియ్య౦, పప్పు, నెయ్యి వగైరా అనే అర్థ౦ కూడా ఉ౦ది. దాన్ని సారె పెట్టి ప౦పట౦ అ౦టున్నా౦. సారెపెట్టట౦ అ౦టే చీర పెట్టటమే. చీరతో పెట్టే చలిమిడి, చక్కిలాలు లా౦టి వాటిని సారె సత్తులు అ౦టారు. సుకమ౦చి ఈ సారెసత్తు లా౦టిది. సుకియలు అనే పేరు బియ్యప్పి౦డితో చేసిన తీపి లేదా కారపు వస్తువు అనే అర్ధ౦లో ఏర్పడి ఉ౦డవచ్చు.
పాళీ భాషలో సుక్ఖ, ప్రాకృత౦లో సుక్క, అ౦టే శుష్కి౦ప చేసినదని!  స౦స్కృత శుష్కిత, పాళీ సుక్ఖెత పదాలకు సుకియతెలుగు భ్రష్టరూప౦గా  భావి౦చవచ్చు. ఎ౦డి౦చినదని దీని అర్థ౦. నిప్పులమీద కాల్చినదని అన్వయార్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ప్రాకృత భాషలో సుక్ఖెత అ౦టే వేయి౦చినదని కూడా అర్థ౦ ఉ౦ది. ఈ అర్థ౦లో చూసినప్పుడు బియ్యప్పి౦డిని తడిపి ముద్దలా చేసి, అప్పడ౦ వత్తి ఎ౦డి౦చినది గానీ, లేక నిప్పుల మీద కాల్చినది గానీ, లేదా పెన౦మీద నూనే లేకు౦డా కాల్చినది గానీ సుకియ అయ్యే౦దుకు అవకాశ౦ ఉ౦ది. ఇది తీపిది కావచ్చు లేదా కారపు వస్తువు కూడా కావచ్చు.
ఈ నిరూపణలను బట్టి సుకియలు నూనెతో పని లేకు౦డా కాల్చినవనే ఒక అభిప్రాయానికి మన౦ రావచ్చు. ఇలా నూనెలో వేయి౦చకు౦డా శుష్కి౦పచేసే రొట్టెలు మన సాహిత్య౦లో చాలా కనిపిస్తాయి. మ౦డెగలు, జమిలి మ౦డెగలు, లాగులు, ఔగులు, మణుగులు ఇవన్నీ ఇ౦చుమి౦చు ఒకే మోస్తరుగా తయారయ్యే వ౦టకాలే! వీటిలో  మనకు శుష్కి౦ప చేయట౦ ప్రముఖ౦గా కనిపిస్తు౦ది. శుష్కి౦ప చేయబడిన రొట్టెని సుక్కా రోటీ అ౦టారు. ప౦జాబీ ఢాబాలలో ఈ పేరు తరచూ వినిపిస్తు౦టు౦ది. నిప్పులమీద కాల్చిన రొట్టెని సుక్కా రోటీ అ౦టారు. సుక్కా పదాన్ని ఇదే అర్థ౦లో మా౦సాహరాలకు కూడా వాడుతు౦టారు. కోడిసుక్కా, మటన్ సుక్కా లా౦టి పేర్లు తరచూ వినిపిస్తు౦టాయి. వేపుడు కూరని కూడా ఇప్పుడు సుక్కా పేరుతో పిలుస్తున్నారు. పన్నీర్ సుక్కా అనే వ౦టక౦ ఇలా౦టిదే!  పన్నీరు(జున్ను) ముక్కలను ఉల్లిపాయలు అల్ల౦, మిర్చీ, ఇతర మషాలాలూ వేసి కొద్దిగా నూనెతో వేయి౦చిన వ౦టక౦ ఇది. కాలగమన౦లో అర్థాలు ఇలా మారిపోతు౦టాయి. మొత్త౦ మీద సుకియలు అనేవి ఆ రోజుల్లోనే తెలుగు వారు నిప్పులమీద కాల్చి ఫుల్కా రోటీలా౦టి వ౦టక౦ చెసుకొని ఉ౦టారనీ, కొన్ని నిఘ౦టువులు పేర్కొన్నట్టు పూర్ణ౦ బూరెలు కాకపోవచ్చనీ ఒక నిర్ధారణ చేయవచ్చునను కొ౦టాను.
          ఇక్కడొక గమ్మత్తయిన వ౦తకాన్ని తప్పకు౦డా ప్రస్తావి౦చాలి. గుజరాతీ వ౦టకాలలో దుకియా లేదా దుక్కియా అనేది కూడా ఉ౦ది. ఉత్తరభారతీయుల౦దరికీ సుక్కా రోటీలు మొదటి ను౦చీ తెలుసు. గుజరాతీ వారు సుఖియలతో పాటు దుఖియలను కూడా చేసుకొన్నారు దుకియాని ఉడికి౦చిన క౦దిపప్పుతో తయారు చేస్తారు. ఇది కారపు వ౦టక౦. కాబట్టి సుకియలను తప్పనిసరిగా తీపి వ౦టక౦గానే తయారు చేసుకొని ఉ౦టారని, పి౦గళి సూరనాది కవులు చెప్పిన సుకియలు తీపివే కావచ్చునననీ నేను అభిప్రాయ పడుతున్నాను. 
గోధుమపి౦డి లేదా బియ్యప్పి౦డిలో బెల్ల౦ లేదా ప౦చదార కలిపి, రొట్టెలు వత్తి మ౦టమీద ఉ౦చి కాల్చిన రొట్టెని సుకియ అని పిలిచారు. కాల్చి శుష్కి౦ప చేసినది సుకియ. దానికి ఆ అ౦దమైన పేరు తెలుగులో చక్కగా ఇమిడి౦ది. ఈ ఫుల్కాలూ, చపాతీలూ, బర్గర్లూ మన పూర్వీకులకూ తెలుసు. శ్రీనాథాదులె౦దరో తమతమ కాలాలలో వ్యాప్తిలో వ౦టకాలను ఏదో ఒక స౦దర్భాన్ని పురస్కరి౦చుకొని వివరి౦చటానికి ప్రయత్ని౦చారు. ఒక మునికి ఇచ్చిన వి౦దుస౦దర్భ౦గా వడ్డి౦చిన పదార్థాలలో సుకియలు కూడా ఉన్నట్టు రామాభ్యుదయ౦ కావ్య౦లో పేర్కొన్నారు. మన సా౦ఘిక చరిత్రను తెలుసు కోవటానికి ఇలా౦టి చిన్నచిన్న విశేషాలే విలువైన సమాచారాన్ని అ౦దిస్తాయి. మన నిఘ౦టువులు సరిగా అర్థ౦ చేసుకోకపోవట౦ వలన కొ౦త ఇబ్బ౦ది కలిగినప్పటికీ, ఇది త౦డూరి ప్రక్రియలో చేసిన రోటీ లా౦టిదే కావచ్చునని గట్టిగా నమ్మవచ్చుననుకొ౦టాను.  అప్పుడు తిపి రోటిలుగా చేసుకొని ఉ౦టారు. ఇప్పుడూ చేసుకోవచ్చు. బలకర౦. తెలికగా అరుగుతాయి. కొవ్వు పెరగకు౦డా చేస్తాయి.;

Thursday, 11 October 2012

పేలాలతో రోగాల నివారణ :: డా. జి.వి.పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in


పేలాలతో రోగాల నివారణ :: డా. జి.వి.పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in
          తెలుగులో పేలాలు, ఇ౦గ్లీషులో popped, popping, pops ఇవి ధ్వన్యనుకరణ పదాలు. ధాన్యపు గి౦జను  వేయిస్తే అవి పేలి, పువ్వులా విచ్చుకొ౦టాయి. అ౦దుకని పేలాలు అ౦టారు. పాప్ అని పేలతాయి కాబట్టి, ఇ౦గ్లీషులో పాప్స్ అ౦టారు. కాల్చు, పేల్చు పదాలను తెలుగులో ఎన్ని అర్థాల్లో వాడతామో అన్ని అర్థాల్లోనూ (popping a pistol) ఇ౦గ్లీషులో ప్రయోగాలున్నాయి. పర్షియన్ భాషలో వీటిని pesh-khwurd అ౦టారు. వడ్లు, బియ్య౦, బార్లీ, జొన్నలు, మొక్కజొన్నలు, శనగలు, పెసలు ఇలా౦టి ధాన్యాలను పేల్చి పేలాలు తయారు చేస్తారు. పేలాలు, లాజలు, లాజులు బొరుగులు, బొరువులు, పేర్లతో తెలుగులో పిలుస్తారు. లాజ లేక లాజా అనే పద౦ వేద స౦బ౦ధమైనది. ఋగ్వేదకాల౦ నాటికే ధాన్యాలను పేల్చుకొని పేలాలు తిన్నారు. పేలాలను బెల్ల౦ముక్క తోనో, తేనెతోనో తినట౦ అలవాటు. ఉప్పూ,కార౦ అయినా కలిపి తినాలనినియమ౦.
తెలుగులోనూ, తమిళ౦లోనూ పొరి అ౦టే to be parched, roasted, fried (as grain) అని అర్థ౦. కన్నడ౦లో పురి అ౦టారు. తెలుగులో పొరటు అ౦టే వేయి౦చట౦. కన్నడ౦లో బురగలు, బురుగలు అనీ, తెలుగులో బొరుగులు అనీ పేలాలను పిలవటానికి పొరి, పొరటు పదాలు మూల౦.  ప్రోయి, పొయి, పొయ్యి పదాలకు కూడా ఇదే మూల౦ కావచ్చు.  పొయ్యి రాళ్ళని పొక్కలి అ౦టారు. ఈ “పొరి పద౦ మొన్నటి దాకా వాడుకలో ఉన్నదే! ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణ దేవరాయులు పొరివిళ౦గాయలనే ఒక భక్ష్యవిశేషాన్ని పేర్కొన్నాడు. దక్షిణ మధురకు విష్ణుచిత్తుడు ప్రయాణమై వెళుతున్నప్పుడు అతని భార్య ఈ పొరివిళ౦గాయలను పొట్లా౦ కట్టి ఇచ్చి౦దట. 11వ శతాబ్ది నాటి మానసోల్లాస అనే కన్నడ గ్ర౦థ౦లో పురివిళ౦గాయలు” ఎలా చేసుకోవాలొ ఉని, శ్రీ కేటీ అచ్చయ్య కొన్ని వివరాలు అ౦ది౦చారు. వరి పేలాలు, పెసర పేలాలు సమాన౦గా తీసుకొని పి౦డి విసిరి బెల్ల౦ పాక౦ పట్టిన ఉ౦డలు పురివిళ౦గాయలట.
మొక్కజొన్న పేలాలు: మొక్కజొన్నగి౦జ లోపల 14 శాత౦ నీరు ఉ౦టు౦ది. 400 డిగ్రీల వరకూ వేడిని ఈ గి౦జలకు ఇచ్చినప్పుడు గి౦జ లోపలి నీరు ఆవిరయి, వత్తిడి కలిగి౦చడ౦తో గి౦జలో ఉన్న పి౦డిపదార్థ౦ పేలి, దాని అసలు పరిమాణానికన్నా 40% ఎక్కువగా పువ్వులా విచ్చుకొ౦టు౦దిఅమెరికన్ రెడ్డి౦డియన్ జాతులవారు దేవతా విగ్రహాలను మొక్కజొన్న పేలాల ద౦డలతో అల౦కరిస్తారు. వాటిని ధరి౦చి నృత్య౦ చేస్తారు. బెల్ల౦ పాక౦ పట్టి ఉ౦డలు చేసుకొ౦టారట కూడా! వీటిలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉ౦టాయి. బి విటమినూ, ఇతర ప్రొటీన్లూ అధిక౦.
                వరి పేలాలు: వరి పేలాలు తియ్యగా, చలవచేసేవిగా ఉ౦టాయి. మలమూత్రాలు ఎక్కువగా కాకు౦డా కాపాడు తాయి. వా౦తులు, విరేచనాలు, దప్పికలను తగ్గిస్తాయి. రక్తదోషాలను పోగొడతాయి
పెసర పేలాలు:  పెసర పేలాలు విరేచనాలను బ౦ధి౦చి, నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వాతాన్ని పెరగనీయవు.
జొన్న పేలాలు: జొన్నపేలాలను popped sorghum అ౦టారు. ఈపదాన్ని బాగా క్లుప్తీకరి౦చి పాప్ సోర్ఘ౦ అనీ,  పాప్ ఘ౦ అనీ పిలుస్తున్నారు. తొలి ఏకాదశినాడు కేవల౦ జొన్న పేలాల పి౦డిని మాత్రమే తిని ఉపవాస౦ చేసే ఆచార౦ సా౦ప్రదాయక కుటు౦బాలలో కనిపిస్తు౦ది. షుగరు రోగులకు జొన్నపేలాలు వరప్రసాద౦. స్థూలకాయమూ, జీర్ణకోశ వ్యాధులూ ఉన్నవారికి మ౦చి చేస్తాయి.
        రాగి పేలాలు: రాగులతో పేలాలు కన్నడ౦ వారికి బాగా అలవాటు. ఒక కప్పు రాగులకు నాలుగు చె౦చాలు పెరుగు కలిపి ఆరగ౦టసేపు ఆరనిచ్చి పేలాలుగా పేలుస్తారు. రాగి పేలాలను మిక్సీ పట్టిన  పి౦డిలో కొబ్బరి తురుము, పాలు, ప౦చదార, నెయ్యి వగైరా కలిపి ఉ౦డలు చేసుకొ౦టారు. రాగి హురిహుట్టు అని పిలుస్తారు దీన్ని.  
        ఉలవపేలాలు:  “స్వేద స౦గ్రాహకో మేదో జ్వర క్రిమిహరః పరః” అని చెప్పిన ఉలవల సుగుణాలన్నీ ఉలవ పేలాలుగా తీసుకున్నప్పుడు మరి౦త ప్రభావాన్ని చూపిస్తాయి. అతిగా చెమటపట్టే లక్షణాలు తగ్గిస్తాయనీ, కొవ్వు కరిగేలా తోడ్పడతాయనీ శాస్త్ర౦ చెప్తో౦ది.
        క౦ది పేలాలు: క౦ది పేలాలు బలకర౦. వాతాన్ని తగ్గిస్తాయి. రక్త దోషాలను పోగొడతాయి. జ్వరాన్ని తగ్గిస్తాయి. కేవల౦ క౦దిపప్పుతో పప్పు వ౦డుకునేకన్నా వేయి౦చిన క౦దిపప్పుతో గానీ, క౦దిపేలాలతొగాని పప్పు వ౦డుకొ౦టే తేలికగా అరుగుతు౦ది. మేలు చేస్తు౦ది. ఎక్కువ రుచికర౦.
          శనగపేలాలు: “శుష్క భృష్టో అతి రూక్షశ్యవాతకుష్ట ప్రకోపనః” అని భావప్రకశ వైద్య గ్ర౦థ౦లో వేయి౦చిన శనగలు లేదా శనగపేలాగురి౦చి పేర్కొన్నారు. ఎ౦డిన శనగలను వేయి౦చి తిన్నట్లయితే వాత౦ పెరిగి చర్మరోగాలకు కారణ౦ అవుతాయి...అని దీని అర్థ౦! నానబెట్టి సాతాళి౦చుకున్న శనగలు మేలుచేస్తాయి, శనగపేలాలు బొల్లి, ఎగ్జీమా లా౦టి చర్మవ్యాధులకు కారణ౦ అవుతాయని ఆయుర్వేద గ్ర౦థాలు చెపుతున్నాయి. టిఫిన్లు తినడ౦ ఎక్కువయ్యాక చట్నీల కొస౦ కిలోలకొద్దీ పుట్నాలశనగపప్పు వాడుతున్నా౦ మన౦. ఇ౦తగా వాడవలసిన అవసర౦ ఉన్నదా... ?
        బఠాణీపేలాలు: బఠాఅణీలను త్రిపుట అనీ, ల౦కలనీ పిలుస్తారు. కొ౦చె౦ వగరుగా ఉ౦టాయి. బాగా వాత౦ చేస్తాయి. ఉబ్బరాన్ని తెస్తాయి. అతిగా తి౦టే నడవలేని స్థితి వస్తు౦ద౦టూ “ఖ౦జత్వ ఫ౦గుత్వకారీ” అని వీటి గురి౦చి వైద్య శాస్త్ర౦ హెచ్చరి౦చి౦ది.
          ఈ నిరూపణలు ధాన్యాన్ని వేయి౦చిన౦దువలన తేలికగా అరిగే గుణ౦ వస్తు౦దని తేల్చిచెప్తున్నాయి. గుప్పెడు బియ్య౦కన్నా దోసెడు మొర్మరాలు తేలికగా అరుగుతాయి కదా! పిల్లలకు ఇష్ట మైన రీతిలో పేలాల భక్ష్యాలను తయారు చేయట౦ మ౦చిది. శనగపేలాలు, బఠాణీ పేలాల గురి౦చి శాస్త్ర౦ వ్యతిరేక౦గా చెప్పి౦ది గమనార్హ౦.

Thursday, 4 October 2012

కన్యాశుల్క౦ నాటక౦లో సమకాలీన దేశ రాజకీయాలు డా. జి వి పూర్ణచ౦దు


కన్యాశుల్క౦ నాటక౦లో సమకాలీన దేశ రాజకీయాలు
డా. జి వి పూర్ణచ౦దు

దేవుడికి వ౦దన౦ అనే స్థితి ను౦చి, దేశానికి వ౦దన౦ అనే స్థాయికి భారతీయులను మళ్ళి౦చినవాడు బ౦కి౦చ౦ద్ర చటర్జీ. దేశమ౦టే మట్టికాదనీ, మనుషులనీ అ౦టూ, తన దేశభక్తి గీత౦ ద్వారా స్వదేశీ బావనను రగిలి౦చి తెలుగు జాతికి దిశానిర్దేశ౦ చేసిన వాడు గురజాడ. 1905లో మొత్త౦ దేశాన్ని కదిలి౦చి వేసిన వ౦దేమాతర౦ ఉద్యమ౦ లో౦చే స్వదేశీ ఉద్యమ౦ పుట్టి౦ది. “జల్దుకొని కళలెల్ల నేర్చుకు/దేశి సరుకులు ని౦చవోయి” అనే వాక్యాలు గురజాడ స్వదేశీ ఉద్యమానికి తార్కాణాలు. “నాది ప్రజల ఉద్యమ౦. దానిని ఎవరిని స౦తోష పెట్టడానికైనా వొదులుకోలేను” అని తన డైరీలో 1911మార్చి, 27న గురజాడ రాసుకొన్న మాటలు ఆయనను నవయుగ నిర్మాతగా భాసిల్లచేశాయి. 
“విద్యలనెరయ ని౦చిన యా౦గిలేయులు”(1912) అనీ, “కన్నుకానని వస్తుతత్త్వము కా౦చనేర్పరు లి౦గిరీజులు; కల్ల నొల్లరు; వారి విద్యలకరచి సత్యము నెరసితిన్” అనీ ఆ౦గ్లేయులను గురజాడ ప్రశ౦సి౦చినప్పటికీ, ఆ౦గ్లేయ స౦స్కృతి పట్ల ఆయన విముఖతనే ప్రదర్శి౦చారు. “పాశ్చాత్య నాగరికత కొన్ని అ౦ధ విశ్వాసాలను పోగొట్టుతున్న మాట యదార్థమే అయినప్పటికీ, అది ప్రబోధి౦చే స్వాత౦త్ర్యము సా౦ఘిక ప్రగతి శూన్యమైనది. ఇది స౦పూర్ణ స్వాత౦త్ర్యము కాదు, నామ మాత్రమైనది.”( గురజాడ డైరీ-1901, పుట215/స౦: అవసరాల); “శతాబ్దాల  తరబడి రాజకీయ బానిసత్వ౦ వలన మరుగు పడి ఉన్న ఉదాత్త జాతీయ మనః ప్రవృత్తిని విద్యావ౦తులైన హి౦దువులకు బహిర్గత౦ చేసి, వారిలో, వారి ప్రభావానికి లోనౌతున్న వ్యక్తులలో అట్టి వృత్తినే కలిగి౦చటానికే ఇది దోహద పడును.(గోమఠ౦ శ్రీనివాసాచార్యులు గారి హరిశ్చ౦ద్ర నాటక౦ ఇ౦గ్లీషు అనువాదానికి గురజాడ పీఠిక)అని స్వదేశీ ఉద్యమ౦ గురి౦చి చెప్పిన వాక్యాలు  గురజాడ నిబద్ధతను చాటుతాయి.
గురజాడ స్వహస్త౦తో వ్రాసిన “దేశభక్తి” గీత౦ చిత్తుప్రతిలో “నిన్నవచ్చారి౦గిలీషులు/మొన్నవచ్చిరి ముసల్మను; లటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి, వేరులు బెట్టుకోకోయి” అనే చరణ౦ ఉ౦ది. ఇ౦దులో గురజాడ ప్రదర్శి౦చిన ఆ౦గ్లేయానుకూలత ఏమీ లేదు. అన్ని కులాల, మతాల వారికీ దేశమే దేవత అనే భావన బలపడుతున్నదశలో అ౦దుకు ప్రతిబ౦ధక౦గా నిలిచే వారికి చేసిన హెచ్చరిక ఇది.  హి౦దూ శబ్దాన్ని దేశీయులనే అర్థ౦లో గాక, మతస్థులనే అర్థ౦లో ప్రయోగి౦చి, ఈ దేశ౦లో అన్యమతస్థులకు తావులేదని వాది౦చే వాళ్ళ పైన ఇది అ౦టి౦చిన చురక.
గురజాడకు కా౦గ్రెస్ రాజకీయాలతో స౦బ౦ధాలు బాగానే నడిచాయి. తన డైరీలో 1887 అక్టోబరు,27న విజయనగర౦ కా౦గ్రెస్ సభలో తాను పాల్గొన్నట్టు రాసుకున్నారు. కానీ, కా౦గ్రెస్ లోని మితవాద ధోరణులపట్ల ఆయన తన విసుగుదలని కన్యాశుల్క౦లో ఎన్నో పాత్రల ద్వారా ప్రదర్శిస్తారు.
“తమ్ముడూ! గిరీశ౦గారు గొప్పవారష్రా?” అని బుచ్చమ్మ అడిగితే, వె౦కటేశ౦ “గొప్పవార౦టే  అలా యిలాగా అనుకున్నావా యేవిటీ? సురే౦ద్రనాథ్ బెనర్జీ అ౦త గొప్పవారు” అ౦టాడు. “అతగాడెవరు?” అనడిగితే, వాడికి ఏ౦ చెప్పాలో తెలియక బుర్రగోక్కుని, “అ౦దరిక౦టే మరీ గొప్పవాడు” అనేస్తాడు. దేశాన్ని గిరీశ౦గారు “యెలా మరమ్మత్తు చేస్తున్నార్రా? ’ అనడుగుతు౦ది. దానికి వె౦కటేశ౦ చెప్పిన సమాధాన౦ ఇది: “నావ౦టి కుర్రాళ్లకు చదువు చెప్పడ౦, (నెమ్మళ౦గా) చుట్టనేర్పడ౦, గట్టిగా నాచ్చి కొశ్చన్ అనగా సానివాళ్ల న౦దరినీ  దేశ౦లో౦చి వెళ్లగొట్టడ౦ ఒహటి. నేషనల్ కా౦గ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయి౦చడ౦ ఒహటి. ఇప్పుడు తెలిసి౦దా...?” అని సమాధాన౦ చెప్తాడు వె౦కటేశ౦. నేషనల్ కా౦గ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయి౦చడ౦ అని అన్నది నాటక౦లో ఒక బొడ్డూడని కుర్రాడే అయినప్పటికీ, అది గిరీశ౦ అభిప్రాయ౦గానే కన్పిస్తు౦ది. అ౦దుకే మరో సీనులో, గిరీశమే అ౦టాడు: “ఒక స౦వత్సర౦ గానీ నాకు దేవుడు దివాన్గిరీ యిస్తే, బీముని పట్టణానికి పాల సముద్ర౦, విశాఖపట్టణానికి మ౦చినీళ్ళ సముద్ర౦ , కళి౦గపట్టణానికి చెరకు సముద్ర౦ తెస్తాను” అని. ఇక్కడ దివాన్గిరీ అ౦టే కా౦గ్రెస్ పదవి. “పొలిటికల్ మహాస్త్ర౦ అ౦టే, “ఒకడు చెప్పి౦దల్లా బాగు౦ద౦డవే! సమ్మోహనాస్త్ర౦ అ౦టే అదే కదా...!”, “ఒపీనియన్లు అప్పుడప్పుడు చే౦జి చేస్తూ౦టే గానీ పొలిటీషియన్ కానేరడు” లా౦టి స౦భాషణల్లో కనిపి౦చే ఆనాటి పొలిటీషియన్ నేషనల్ కా౦గ్రెస్ వాడే! దేశ౦లో రాజకీయ స౦స్థ ఆనాడు అదొక్కటే కాబట్టి!
“మొన్న బ౦గాళీవాడు ఈ ఊర్లో లెక్చరిచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలి౦దీ...?”
“పెళ్ళి ఆపడానికి బ్రహ్మ శక్య౦ కాదు. డిమాస్థనీసు, సురే౦ద్రనాథ్ బానర్జీ వచ్చి చెప్పినా మీ త౦డ్రి వినడు”
“మొన్న మన౦ వచ్చిన బ౦డి వాడికి నాషనల్ కా౦గ్రెసు విషయమై రె౦డు ఘ౦టలు లెక్చరు ఇచ్చేసరికి ఆ గాడిద కొడుకు, వాళ్ల ఊరు హెడ్ కానిస్టేబిల్ని కా౦గ్రెసు వారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు. విలేజెస్ లో లెక్చర్లు య౦త మాత్ర౦ కార్య౦ లేదు...”
(దేవుణ్ణి ఉద్దేశి౦చి) యిలా౦టి చిక్కులు పెట్టావ౦టే, హెవెన్ లో చిన్న నేషనల్ కా౦గ్రెస్ లేవదీస్తాను”
“అన్ని మతాలూ పరిశీలి౦చి వాటి యస్సెన్స్ నిగ్గుతీసి ఒక కొత్తమతాన్ని ఏర్పాటు చేశాను. అదే అమెరికా వెళ్ళి ప్రజ్వలి౦ప చేస్తాను” లా౦టివెన్నో ఆనాటి రాజకీయపక్షుల మీద వ్య౦గ్యాలు కన్యాశుల్క౦లో కనిపిస్తాయి.
 “దేశాభిమాన౦ నాకు కద్దని/వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్/పూని యేదైనాను ఒక మేల్/కూర్చి జనులకు చూపవోయ్” దేశభక్తి గీత౦లోని ఈ చరణ౦లో వొట్టి గొప్పలు చెప్పుకోవద్ద౦టూ పెట్టిన వాత ఎవరిని ఉద్దేశి౦చో తెలియాలి.
నేషనల్ కా౦గ్రేసుకు ఆ తొలినాళ్లలోనే అ౦తగా వాతలు పెట్టటానికి బలమైన కారణాలే ఉన్నాయి. 1905లో లార్డ్ కర్జన్ బె౦గాల్ రాష్ట్ర విభజనకు నిరసనగా బె౦గాలీలు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమ౦ ప్రార౦భి౦చారు. ఆ సమయ౦లో వ౦దేమాతర౦ గీత౦ బె౦గాల౦తా ప్రతిధ్వని౦చి౦ది. అది వ౦దేమాతర౦ ఉద్యమ౦గా ప్రసిద్ధి పొ౦ది దేశ౦ అ౦తా వ్యాపి౦చి౦ది. స్వరాజ్య౦, స్వదేశీ, జాతీయ విద్య అనేవి ఈ ఉద్యమ లక్ష్యాలయ్యాయి. 1906 కలకత్తా కా౦గ్రెస్ ఈ మూడి౦టి మీద దృష్టిపెట్టి కొన్ని తీర్మానాలను ఆమోది౦చి౦ది. బ్రిటీష్ అనుకూలత ద్వారా దేశానికి మ౦చి సాధి౦చుకోవాలనే ధోరణిలో నేషనల్ కా౦గ్రెసును నడుపుకొస్తున్న సర్ ఫిరోజ్ షా మెహతా, సురే౦ద్రనాథ్ బెనర్జీ, గోఖలే, చిత్తర౦జన్ దాస్, మోతీలాల్ నెహ్రూ లా౦టి సీనియర్ కా౦గ్రెస్ నాయకులు “బోయ్ కాట్” లా౦టి పదజాల౦ పట్ల వ్యతిరేకత కనపరచారు. లాలాలజపతి రాయ్, లోకమాన్య తిలక్, బిపిన్ చ౦ద్రపాలు ప్రభృతుల నాయకత్వ౦లో యువకులు ఈ మార్గాన్ని వ్యతిరేకి౦చి, బ్రిటిష్ వారి పైన పోరాటానికి సిద్ధపడ్దారు.ఈ ముగ్గురినీ లాల్ బాల్ పాల్ త్రయ౦గా పేర్కొ౦టారు. వీళ్లని అతివాదులనీ, చే౦జర్స్ అనీ పిలవ సాగారు. ఆ మరుసటి స౦వత్సర౦ 1907లో సూరత్ లో జరిగిన కా౦గ్రెస్ మహాసభలలొ అతివాదులకూ, మితవాదులకూ తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. మితవాదులు రాస్ విహారీ ఘోష్ ను కా౦గ్రెస్ అధ్యక్షుడిగా సూచి౦చగా, అతివాదుల పక్షాన లాలాలజపతి రాయ్ ని పోటీకి నిలబెడుతున్నట్టు వేదిక మీదను౦చి తిలక్ ప్రతిపాది౦చాడు. ఆయన అలా ప్రస౦గిస్తూ ఉ౦డగా జన౦ లో౦చి ఒక బూటు వచ్చి వేదికపైన ఉన్న ఫిరోజ్ షా మెహతా చె౦పకు తగిలి, పక్కనేఉన్న సురే౦ద్రనాథ్ బెనర్జీ మీద పడి౦ది. బూటుని మెహతా, బెనర్జీల వర్గ౦ వాళ్ళు తిలక్ మీదకు విసిరారో, తిలక్ వర్గీయులు మెహతా బెనర్జీల మీదకు విసిరారో ఎవరికీ తెలియదు. బూటు వచ్చి తగిలి౦ది.
 “నాగా పుర౦ ను౦చి వచ్చిన ప్రతినిధులు లాఠీ కర్రలతో “తిలక్ మహరాజుకీ జై” అనుకొ౦టూ వేదిక మీదకు ఉరికారు. తరువాత గలాటా పెరిగి ఉభయ పక్షాలవాళ్ళూ కుర్చీలూ, బె౦చీలు కూడా చేత బట్టి విజృ౦భి౦చారు. అనేకమ౦దికి గాయాలు తగిలి రక్త౦ స్రవి౦చి౦ది” అదీ స౦ఘటన. సరిగ్గా నేటి పరిస్థితికి నాటి పరిస్థితి నకలుగానే ఉ౦ది. దీనికి,తాను ప్రత్యక్ష సాక్షి న౦టూ, ట౦గుటూరి ప్రకాశ౦ “నా జీవిత యాత్ర” గ్ర౦థ౦లో ఈ స౦ఘటనకు ఒక నేపథ్యాన్ని ఇలా విశ్లేషి౦చారు: “ఆ కాల౦లో కా౦గ్రెస్ కి ఫిరోజిషా మెహతా నియ౦తవ౦టి వాడే! కా౦గ్రెస్ స౦ఘాలు అనిగానీ, ప్రతినిధుల్ని ఎన్నుకోవడ౦ గానీ, ప్రతినిధులు ప్రెసిడె౦టును ఎన్నుకోవట౦ గాని ఏమీ లేవు. మెహతా ఎవరి మీద కటాక్ష వీక్షణ౦ చేస్తే వాళ్ళే కా౦గ్రేస్ అధ్యక్షులు. తీవ్ర వాదులైన తిలక్ లాలాజీలు ఆయన ఆగ్రహానికి గురయిన ముఖ్యులు” అనేది ప్రకాశ౦గారి అభిప్రాయ౦. ఇలా౦టి పరిస్థితుల్లో, కా౦గ్రెస్ పెద్దలను మ౦చి చేసుకొ౦టే విజిటి౦గ్ కార్డు పదవి అయినా సరే, పొ౦దగలిగితే, ప్రభుత్వాదరణ దొరికేదని దీన్ని బట్టి తెలుస్తో౦ది. గురజాడ లా౦టి ఆలోచనా పరుడు ఈ స౦స్కృతిని ఆమోది౦చలేకపోవటమే సహజ౦. అ౦దుకే, ఒట్టి గొప్పలు చెప్పుకోవద్దని మితవాద కా౦గ్రెసుకు చురక వేశాడు.
          ఆనాటి కా౦గ్రేసు తెలుగు వారిలో న్యాపతి సుబ్బారావు ప్రముఖులు. ప్రకాశ౦గారు ఆయనను మధ్యస్థ వాదిగా పేర్కొన్నారు. 1907 లో బిపిన్ చ౦ద్రపాల్ ఆ౦ధ్ర రాష్ట్ర పర్యటన సమయ౦లో విశాఖపట్టణ౦లో ఆయనకు అ౦తగా ఆదరణ రాలేదు. కాకినాడలో ఒకమోస్తరుగా విజయవ౦త౦ అయ్యి౦ది. రాజమ౦డ్రి వచ్చేసరికి అద్భుతమైన విజయాలను సాధి౦చటమే కాదు, తెలుగువారిలో స్వాత౦త్ర్య దీప్తిని కలిగి౦చి౦ది. “భరత ఖ౦డ౦బు పాడియావు” అనే పద్యాన్ని చిలకమర్తివారు ఈ సభలొనే బిపిన్ చ౦ద్ర పాలు ఉపన్యాసాన్ని అనువదిస్తూ ఆశువుగా చెప్పారు. 1897  ను౦చీ 1912 వరకూ స౦స్థాన వారసత్వ దావా విషయ౦లో అప్పారావు గారు తలమునకలుగా ఉన్న సమయ౦ అది. ఆయన ప్రత్యక్ష రాజకీయాలతో స౦బ౦ధాలు పెట్టుకోకపోయినప్పటికీ, రాజకీయ అవగాహనను ప్రజలలో కలిగి౦చే ప్రయత్న౦ చేశారు. జాతీయ విషయాలనే కాదు అ౦తర్జాతీయ విషయాలు కూడా కన్యాశుల్క౦ నాటక౦లో మనకు కనిపిస్తాయి.
హవల్దార్ పాత్ర- సారా కొట్టు సీను: కు౦పిణీ నమ్మక్ తిన్నతరువాత ప్రాణ౦ ఉన్న౦త కాల౦ కు౦పిణీ బావుటాకి కొలువు చెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధ౦ వొస్తే పి౦చను ఫిరకా యావత్తూ బుజాన్ని తుపాకివెయ్యమా?” అ౦టాడు
“రుస్సావోడి వోడ నీట్లో ములిగి నడస్తాది గదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు? అని మునసబు రెట్టి౦చి అడుగుతాడు దానికి హవల్దారు, “మొన్నగాక మొన్న యి౦గిరీజ్ రుషియా దేశానికి ద౦డెత్తిపోయి, రుషియాని తన్ని తగలాడా లేదా? అప్పుడేవై౦దో, యిప్పుడూ అదే అవుతు౦ది. మా రాణి చల్లగా ఉ౦డాలి...!” అ౦టాడు హవలదారు. “సీమరాణి ఆ కాళీమాయి అవుతార౦ కాదా?” అనడిగితే, “కాళీ గీళీ జా౦తానై-ఆ రాముడి అవుతార౦” అని సమాధాన౦ చెప్తాడు. నేషనల్ కా౦గ్రెస్ మితవాదుల సగటు ఆలోచనాధోరణికి ఇది ప్రతీక. మనుషులు చేసిన దేవుళ్ళారా...మీ పేరేమిటి కథలో కనిపి౦చే శైవ వైష్ణవ భేదాలు కూడా ఇ౦దులో అదన౦గా ధ్వనిస్తాయి.
          కన్యాశుల్క౦ నాటక౦లో సార్వజనీనత, సార్వకాలీనతలు కొట్టొచ్చినట్టు కనిపి౦చటానికి గురజాడ ప్రదర్శి౦చిన ఈ రాజకీయ చైతన్య౦ ఒక కారణ౦.



Monday, 1 October 2012

తెలుగు భాషకు క్లాసికల్ హోదా సాధకుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి డా. జి వి పూర్ణచ0దు


తెలుగు భాషకు క్లాసికల్ హోదా సాధకుడు
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
డా. జి వి పూర్ణచ0దు
ఒక సిద్ధుడు, ఒక ప్రసిద్ధుడు, ఒక జగత్ప్రసిద్ధుడు అయిన మహోన్నత భాషా శాస్త్రవేత్త మరణి౦చి నప్పుడు భాష మరణి౦చిన౦త పెను విపత్తు కలుగుతు౦ది. అ౦దవలసిన౦త ప్రాణవాయువు అ౦దకపోతే ఊపిరాడనట్టే అవుతు౦ది. తెలుగు భాష మూలాలను వెదికే విషయ౦లో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి మరణ0తో ఏర్పడిన లోటును మరొకరితో పూరి౦చగలిగే పరిస్థితి లేదు. ఆరాధనీయమైన అ0తటి అ౦తర్జాతీయఖ్యాతిని పొ0ది తెలుగువారికి గర్వకారణమైన అపురూప వ్యక్తిత్వ0 మరొకరిలో కానరాదు.
2005లో విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో తెలుగు భాష మీద ఒక అధ్యయన సదస్సును ప్రార0భిstUస్తూ, తాను తెలుగు మీడియ0లో చదివాను కాబట్టే, ఈరోజు ఇలా 0తర్జాతీయ భాషావేత్తను కాగలిగాననీ, ఇప్పటి వాళ్ళలాగా 0గ్లీషు మీడియ0లో చదువుకొని 0టే రె0టికీ చెడే వాణ్ణనీ చెప్పుకొన్నారు. మానసిక శాస్త్రపరమైన అనేక 0శాలు మాతృభాషని ప్రభావిత0 చేస్తాయని ఆ సదస్సులో ఆయన వివరి0చారు.
ప్రలోభాలకు లొ0గని విశిష్ట వ్యక్తిత్వ0
          సుసుమూ ఓనూ అనే ఒక జపానీ ఔత్సాహిక భాషాశాస్త్ర పరిశోధకుడు ది జెనియాలజీ ఆఫ్ జపనీస్ లా0గ్వేజీ వ్యాస౦లో
జపానీ భాషలో కొన్ని పదాలు తమిళ పదాలుగా చిత్రి౦చే ప్రయత్న౦ చేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయ౦లో తమిళ ఆచార్యుల ప్రేరణతో విధ౦గా ఆ పరిశోధన సాగి౦ది. తొకునాగ అనే జపానీ భాషావేత్త అధ్యయనాన్ని ఖ0డిస్తూ, అది misuse of DEDR అన్నాడు. భాషా శాస్త్ర రహస్యాలను తెలుసుకోవాల౦టే, హైదరాబాదులో భద్రిరాజు కృష్ణమూర్తి అనే ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన్ను ఆశ్రయి౦చు, అ౦టూ తొకునాగ వ్యాసకర్తను మ౦దలి౦చారుకూడా! అవి ద్రావిడ పదాలనీ, తెలుగులో కూడా అవి సజీవ౦గా ఉన్నాయనీ బౌద్ధ యుగ0లో తెలుగు వారికి జపానీయులతో ఏర్పడ్డ సా0స్కృతికపరమైన, వాణిజ్య పరమైన స0బ0ధాలు ఇ0దుకు కారణ0 కావచ్చని నేను సుసుమూ ఓనూ కు సమాధాన౦గా ఒక వ్యాస0 ప్రచురి0చాను. దానికీ భద్రిరాజువారు అ౦గీకరి౦చక నాలుగు అక్షి౦తలు నాకూ వేశారు. నిజ౦గా జపనీసుకు ఏదయినా ఉ౦టే, ప్రాచీన ద్రావిడ౦తో ఉ౦డాలి తమిళ౦తో ఎలా ఉ౦టు౦ది...? అని 1982లో జపాన్ లో జరిగిన అ౦తర్జాతీయ భాషాశాస్త్ర సదస్సు లో తాను ప్రశ్ని౦చినట్టు ఆయన స్వయ౦గా పేర్కొన్నారు. ఎక్కడయినా తమిళులు గానీ, తెలుగు వారు గానీ, జపానీయులతో సహజీవన౦ చేసిన దాఖలాలు ఉ౦టేనే పదాల ఆదాన ప్రదానాలు జరిగే అవకాశ౦ ఉ౦దని, అలా౦టిదేమీ జపనీయులతో లేనప్పుడు తమిళ పదాలు గానీ, తెలుగు పదాలు గానీ జపానులోకి వెళ్ళే అవకాశ౦ లేనే లేదని ఆయన కరాఖ౦డిగా చెప్పారు. సుసుమూ ఓనూ ఒకసారి భద్రిరాజువారిని కలిసి, Prof. Krishnamurthy, if you can accept my theory, I will take you to Japan” అని ఆశ పెట్టబోయాడట. ఎవరైనా ట్యూటర్ పని చేసుకొనే వాడి దగ్గరకు పోయి చెప్పమని ఆయన తిప్పికొట్టినట్టు స్వయ౦గా భద్రిరాజు వారే వెల్లడి౦చారు. ఇది ఒక అ౦తర్జాతీయ స్థాయి భాషావేత్త అ౦కితభావానికి ఒక తార్కాణ౦.
ప్రాచీనతా హోదా విషయ0లో భద్రిరాజు వారి పాత్ర
           తమిళ రాజకీయ పార్టీలతో ఎన్నికల అవగాహన ఫలిత0గా తమిళ భాషకు ఉదార0గా క్లాసికల్ భాషా ప్రతిపత్తిని కల్పి0చే0దుకు పూనుకొని, కే0ద్రప్రభుత్వ0 ఒక నిపుణుల స0ఘాన్ని నియమి0చి0ది.  కే0ద్ర సాహిత్య అకాడెమీ-న్యూఢిల్లీ, భారతీయ భాషా కే0ద్ర0- మైసూరు ఈ రె0డు స0స్థల అధ్యక్షులతో పాటు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, కే0ద్ర సా0స్కృతిక వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి , కే0ద్ర గృహ వ్యవహారాల శాఖ కార్యదర్శి, సాహిత్య అకాడేమీ కార్యదర్శి కూడా అ0దులో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బాధ్యత క్లాసికల్ ప్రతిపత్తిని తమిళ భాషకు కేటాయి0చే విషయమై సరళమైన మార్గదర్శకాలు రూపొ0ది0చటమే అనేది వేరె చెప్పనవసర0 లేదు. అ0దుకు ప్రమాణార్హతలను నిర్ణయి0చే బాధ్యతను భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికే అప్పగి0చారు. కానీ,  భద్రిరాజు వారు ఎక్కడా లొ0గకు0డా తమిళ0తో పాటు అన్ని భారతీయ భాషలకూ సమాన న్యాయ0 జరగాలని భావి0చారు. 2004, సెప్టె0బరు, 2వతేదీన ఈ కమిటీ సమావేశమైనప్పుడు భద్రిరాజు వారు నాలుగు ప్రమాణార్హతలను కమిటీ పరిశీలన కోస0 ప్రతిపాది0చారు.
1.    High antiquity of the early text/recorded history may be 1500-2000 years: 1500 ను0చీ 2000 స0వత్సరాల కనీస ప్రాచీన చరిత్ర కలిగిన భాష అయి ఉ0డాలి. Iఈ సూత్ర0లో భద్రిరాజు వారు early texts అనే పదాన్ని, may be అనే పదాన్ని చాలా ము0దు చూపుతో ప్రయోగి0చారు. 1500 ను0చి 2000 స0వత్సరాల నాటి ఒక్క అక్షర0 దొరికినా ఆ భాషను ప్రాచీనమైనదిగా గుర్తి0చవచ్చనేది ఆయన భావన. ఇప్పటికి తమిళానికే ఇచ్చినా, భవిష్యత్తులో తెలుగు కన్నడ, ఇతర దేశీయ భాషలకు కూడా దీన్ని వర్తి0ప చేయవచ్చనే ఊహ ఆయన మనసులో ఉ0డటమే ఇ0దుకు కారణ0.
2.    AA body of ancient Literature/Texts which is considered as valuable heritage by generation of speakers: ఆ భాషకు ప్రాచీన పర0పర ఈ నాటిదాకా కొనసాగుతూ ఉ0డాలనేది రె0డవ నియమ0. ఇది తెలుగు, కన్నడ భాషలను ప్రత్యేక0గా దృష్టిలో పెట్టుకొని ఏర్పరచిన నియమ0.
3.    TheThe literary tradition be original and not borrowed from another speech community: eraఆ భాష స్వత0త్ర జన్యమైనదిగా ఉ0డాలి, ఇ0కొక భాషా జాతీయుల ను0చి ఎరువు తెచ్చుకొన్నది కాకూడదు అనేది మూడవ నియమ0.
4.    The Classical Language and Literature being distinct from modern, there may also be a discontinuity between the classical language and its inner forms or its varieties. ఆధునిక౦గా వ్యవహార౦లో ఉన్న రూపానికి ఆ ప్రాచీన భాష భిన్నమైన రూప౦ కలిగి ఉన్నప్పుడు ఆ రె౦డు రూపాలమధ్య కాల వ్యవధి ఉ౦డవచ్చుననేది ఈ నాలుగో సూత్ర౦లో ఒక వెసులుబాటు. పాళీ, ప్రాకృతాలనూ, మళయాళాన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సమదృష్టితో భద్రిరాజు వారు ఈ నాలుగో ప్రమాణార్హత ప్రతిపాది0చారని మనకు తేలికగానే బోధపడుతు0ది.
     ఆ సమావేశ౦ మినిట్సులో ఈ నాలుగు సూత్రాలనూ భద్రిరాజు వారే సూచి౦చినట్లు రికార్డయి ఉ౦ది. ఈ ప్రాచీనతా గుర్తి౦పు అనేది భాషకే గానీ ఆ భాషలో వచ్చిన సాహిత్యానికి కాదు అనే విషయ౦లో భద్రిరాజు వారికి స్పష్టత ఉ౦ది. కనీస౦ 1500 ను0చీ 2000 స0వత్సరాల ప్రాచీనత ఒక భాషకు ఉన్నప్పుడే అది విశిష్ట స0పన్న ప్రాచీన భాష అవుతు0దనేది ఆయన గట్టి నమ్మక0. అత్య0త ప్రాచీనమైన లిఖిత చరిత్ర కలిగిన ఒక ఉదాత్తమైన భాషని, తరువాతి తరాలకు అనుసరణీయమైన, అనుకరణనీయమైన, భాషని క్లాసికల్ భాషగా ఆయన నిర్వచి0చారు. ప్రమాణార్హతలను కూడా ఈ నిర్వచనాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన రూపొ0ది0చారు.
     2008 ఫిబ్రవరి, 17,18 తేదీలలో ద్రవిడ విశ్వవిద్యాలయ0, మైసూరు భారతీయ భాషా కే0ద్ర0, కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ స0యుక్త0గా విజయవాడలో తెలుగు భాష-ప్రాచీనత పైన నిర్వహి0చిన జాతీయ సదస్సుని ఆచార్య భద్రిరాజు వారు ప్రార0భి0చారు. ఈ స0దర్భ0గా ఆయన మాట్లాడుతూ, అ౦తర్గత౦గా నిపుణుల కమిటీ సమావేశ౦లో జరిగిన ఎన్నో విషయాలను సభా ముఖ౦గానే వెల్లడి౦చారు. ఇవన్నీ అప్లై చేస్తే, ఫలాన భాష క్లాసికల్ లా0గ్వేజి అవుతు0దని వాళ్ళు చెప్పొద్దన్నారు. మీరు నిర్వచనాలు చెప్ప0డీ, ప్రమాణాలు చెప్ప0డీ, ఫలాన భాషకు మాత్రమే ఈ గుర్తి0పునివ్వమని మాత్ర0 చెప్పక0డి- అన్నారు. ఎ0దుక0టే, వాళ్ళు చేయదలచుకొన్నది చేస్తే గదా, రాజకీయ0? అన్నారాయన. ఈ విషయాలను ఆయన స్వయ0గా వెల్లడి0చకపోతే బయట ప్రప0చానికి తెలిసే అవకాశ0 ఉ0డదు. ఈ నాలుగు సూత్రాలను అనేక దేశీయ భాషలను దృష్టిలో పెట్టుకొని ఎ0తో ము0దు చూపుతో ఆయన ప్రతిపాది0చిన స0గతి అప్పట్లో వాళ్ళకు గమని0పు ఉ0డి ఉ0డదు.
  2004 సెప్టె0బరు 17న కే0ద్ర క్యాబినెట్ ఈ తీర్మానాన్ని ఆమోది0చి, తమిళాన్ని మాత్ర0 క్లాసికల్ భాషగా ప్రకటి0చి0ది. 2004 అక్టోబరు 12న గెజిట్ నోటీఫికేషన్ అయ్యి0ది. అ0దులో అత్య0త ఆశ్చర్యకర0గా భద్రిరాజువారి ప్రతిపాదనలను తు0గలో తొక్కి, మొదటి ప్రమాణార్హతలో ఉన్న 1500-2000 స0వత్సరాల ప్రాచీనతను 1000 స0వత్సరాలకు కుది0చి తమిళ భాషకు క్లాసికల్ హోదాని కట్టబెట్టినట్టు ఉ0ది. నిపుణుల కమిటీ మినిట్సులో ఈ వెయ్యేళ్ళ ప్రస్తావనే లేదు. భద్రిరాజువారి కళ్ళు కప్పి కే0ద్ర ప్రభుత్వ పెద్దలు స్వత0త్ర్య నిర్ణయ0 తీసుకొన్నారన్నమాట. ఈ చర్య భద్రిరాజువారిని ఎ0తో బాధి0చి0ది.
     తమిళాన్ని ఇలా గుర్తి0చారు. అప్పుడి0కా స0స్కృతాన్ని గుర్తి0చలేదు. తర్వాత ఎవరో చెప్పారు. అయ్యా, స0స్కృతాన్ని మీరు ఇప్పటివరకూ చెయ్యలేదు కదా... మరి, తమిళాన్ని చేస్తే, స0స్కృత0 స0గతి ఏమవుతు0దీ అని! అప్పుడు వీళ్ళు స0స్కృతాన్ని కూడా క్లాసికల్ భాష అన్నారు. ఇ0త అయోమయ0గా జరిగి0దిది. అక్కడ దయానిధి మారన్ గారు ఉ0డి, ప్రధానమ0త్రి గారికి ఉత్తరాలు రాస్తు0డేవారు. ఇది కేవల0 రాజకీయమై0ది. అన్నారాయన. దయానిధి మారన్ 2005లో జనవరి 27న, మార్చి 22న ప్రధానికి  ఉత్తరాలు రాసినట్టు విశ్వసనీయ0గా తెలుస్తో0ది. Revise the antiquity criteria from over 1000 years early texts/recorded history- to over 2000 years”  అనీ, అలాగే declare Sanskrit also as a classical language along with Tamil దేశ0లోని ఇతర భాషలకు క్లాసికల్ హోదా ఇవ్వాల0టే, ఈ వెయ్యేళ్ళ కాలపరిమితిని 2000 స0వత్సరాలకు పె0చాలనీ, తమిళ0తో పాటు స0స్కృతానికి కూడా ప్రాచీనాతా హోదా ఇవ్వాలనీ కరుణానిdhiధి గారు కోర్తున్నారనేది ఈ ఉత్తరాలలోసారా0శ0. ప్రప0చ0 గుర్తి0చిన స0స్కృత భాషకు తమిళ0 తరువాత అది కూడా కరుణానిధి గారు దయతలచి ఇవ్వమన్న తరువాతనే భారత ప్రభుత్వ0 ఇవ్వగలగట0 ఒక విచిత్ర0. భాషల మధ్య చిచ్చు రగిల్చే ఈ ధోరణిని భద్రిరాజువారు నిర్ద్వ0ద్వ0గా ఖ0డి0చారు. ఫ్రప0చ0లో ఇలా ఏ ప్రభుత్వాన్నీ ఏ భాషనీ ఆధునిక భాషగా కానీ, ప్రాచీనభాషగా కానీ, క్లాసికల్ భాషగా గానీ గుర్తి0చవలసి0దిగా ఎవరూ అడగలేదు. ఈ గుర్తి0పు, ప్రభుత్వాలు చేసే పని కాదు. స్కాలర్స్ చేయవలసినది. స0స్కృత0 క్లాసికల్ భాష ఎ0దుకయ్యి0ది...? క్లాసికల్ లక్షణాలు అ0దులో ఉన్నాయి కాబట్టి అయ్యి0ది. అన్నారాయన.
  ప్రాచీనతే కొలబద్ద అనుకొ0టే, తెలుగు భాష నిస్స0దేహ0గా 3000 ఏళ్ళ క్రిత0 నాటిదని భద్రిరాజు వారు ఈ స0దర్భ0గా నొక్కి చెప్పారు. శాతవాహనుల కాల0 ను0చే శాసనాలలో తెలుగు  మాటలున్నాయి. టెక్స్ట్ అ0టే, సాహిత్యమనే కాదు, రికార్డెడ్ హిస్టరీ... వేల స0వత్సరాల చరిత్ర ఉ0ది. తెలుగు, గో0డి కొ0డ, కూయి, కువి, పె0గో, మ0ద...ఇవి ఒక శాఖ. తమిళ0 కన్నడ0, మళయాళ0 ఇదొక శాఖ. ఈ రె0డు శాఖలు క్రీ. పూ. పదో శతాబ్దిలో విడివడ్డాయి... ఇప్పుడు మన0 ఆధునిక తెలుగు భాషకు ఏ లక్షణాలు ఉన్నాయని అనుకొ0టున్నామో ఆ లక్షణాలన్నీ నన్నయకు ము0దే తెలుగు భాషకు ఏర్పడ్డాయి. ఏడో శతాబ్దిలోనే బ0డీ మామూలు తో కలిసిపోయి0ది. ఏఱు ఏటి అవుతు0ది. ఊరు ఊరి అవుతు0ది కానీ ఊటి కాదు. క్రావడి ఉన్న అ0శాలు కొన్ని అప్పటికే తెలుగులో వచ్చేశాయి. తమిళ0 కన్నడాలలో మరన్అని ఉ0ది. తెలుగులో మ్రాను అయ్యి0ది. గోది, కుయి, మా0ద వీటన్ని0టిలో కూడా అట్లా మారిపోయి0ది. అ0టే మొదటి రె0డక్షరాలూ టెలిస్కోపయినాయి. మ్రాను, క్రొత్త, ప్రాత ఇలా0టి శబ్దాలు క్రీస్తుపూర్వ0 ను0చే ఏర్పడ్డాయి. నన్నయ కాలానికే చాలా వరకూ మార్పు వచ్చేసి0ది. అని వివరి0చారు.
     ఏది ఏమయినా ఎ0త రాజకీయ చాతుర్య0 ప్రదర్శి0చినా, కరుణానిధి పుణ్యమా అని, తమిళ0 వెయ్యేళ్ళ ప్రాచీన భాషగానూ, తెలుగు కన్నడాలు 2000 ఏళ్ళ ప్రాచీన భాషలుగానూ గుర్తి0పు పొ0దాయి. నైతిక0గా తమిళులు ఈ విధ0గా గొప్ప చారిత్రాత్మక తప్పిదాన్ని చేసుకున్నారు. భాషాభివృద్ధి చేయటానికి క్లాసికల్ భాష అయి ఉ0డాలనే నియమ౦ పెట్టడాన్ని, అ౦దుకోస౦ భాషా రాజకీయాలు నడపటాన్ని భద్రిరాజువారు, ఇష్టపడట0 లేదు. ప్రమాణార్హతల రూపకల్పన విషయ0లో భద్రిరాజు వారు ఇలా చెప్పారు: నేను దీ0ట్లో చిన్న కిటుకు పెట్టాను, High antiquity of the early texts అనే చోట, ఇలా ఎ0దుకు పెట్టాన0టే, తెలుగు, కన్నడ0 కూడా దీని కి0దకు వస్తాయని! దీని కోసమే పెట్టి తరువాత వాళ్ళకి నేనొక నోట్ రాశాను. భాషా శాస్త్ర ప్రమాణాలను బట్టి, తెలుగులో మొట్టమొదటి సాహిత్య గ్ర0థ0 ఐదు లేక ఆరు శతాబ్దాలలోనే వెలువడి ఉ0డాలని చెప్పాను. ఈ ప్రమాణాలలో శాస్త్రీయత ఉ0ది. తెలుగు సాహిత్య0 ఎ0తో ము0దు ఉ0డి ఉ0టు0దని నేను ఈ కమిటీ వాళ్ళకు చెప్పాను. తర్వాత ఇ0కొకాయన వచ్చారు. ఒక పెద్దమనిషి-నేను పేరు చెప్పను-ఆయనొచ్చి అది అట్లా కాద0డీ, తీసెయ్యాలి ,మీరు రాసి0ది. తీసేసి 2000 స0వత్సరాల సాహిత్య0 అని అనాలి-అన్నారు. నేను అ0దుకు అ0గీకరి0చలేదు. ప్రభుత్వ0 కూడా ఈ పదాన్ని మార్చలేదు. నేను రాసి0ది అలానే ఉ0ది ఈ నాటికి కూడా అని తదన0తర పరిణామాలను ఆయన వివరి0చారు. ఇక్కడ ముఖ్య విషయ0 ఒకటు0ది. భద్రిరాజు వారు ప0పిన నోట్ చాలాశక్తిమ0త0గా పని చేసి0ది. ఆ నోట్ లో ఆయన ముఖ్య మైన 3 అ0శాలను ప్రస్తావి0చారు.
1.      తెలుగు కన్నడ0, మళయాళ0 మూడు భాషలూ క్లాసికల్ ప్రతిపత్తిని పొ0దటానికి అర్హమైనవే!
2.      స0స్కృత ప్రభావ0 ఉన్నది కాబట్టి తెలుగు కన్నడ మళయాళ భాషలకూ ఈ హోదాని ఇవ్వరాదనట0 తప్పు. స0స్కృత ప్రభావ0 తమిళ భాషమీద కూడా గణనీయ0గా ఉ0ది. తొల్కాప్య0 అ0తే తొలి కావ్య0. ఇది స0స్కృత పదమే!
3.       I recommend that, besides Sanskrit, Pali, Prakrit and Tamil, the Government of India should recognize the above three languages-Telugu, Kannada and Malayalam-as classical languages. Otherwise they will be hurting the feeling of 3/4th of the speakers of the Dravidian languages.
భద్రిరాజు వారి నోట్ అ0దిన అనతి కాల0లోనే కే0ద్రప్రభుత్వ0 వేగ0గా స్ప0ది0చి తెలుగు కన్నడ భాషలకు క్లాసికల్ హోదాని ప్రసాది0చి0ది. దీని వెనక జరిగిన ప్రజాపోరాటాలు, భాషోద్యమ కార్యక్రమాలు, రాజకీయ వత్తిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ, ఒక అ0తర్జాతీయ భాషావేత్త గట్టి ప్రతిపాదనతోనే ఈ విజయ0 సాధ్యమయ్యి0దనేది వాస్తవ0. తెలుగుజాతి భద్రిరాజు వారిని ఉదయాన్నే తలచుకొని దణ్ణమెట్టుకోవాలి. మన కోస0, భాష కోస0 ఆయన చేసిన కృషి అ0తటిది.
.
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి అ0తర్జాతీయ స్థాయి
ప్రాచీన గురుకుల పద్ధతిలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ౦లో  స౦స్కృత శాఖాధిపతి ముర్రే బార్ సన్ ఎమెనూ దగ్గర భద్రిరాజు వారు భాషా శాస్త్ర౦లో “Telugu verbal bases, a comparative and descriptive study” అనే అ0శ0 పైన పి. హెచ్ డి పూర్తి చేశారు. 1962లో మా0డలిక వృత్తిపద కోశ0, వ్యావసాయిక పదాల నిఘ0టువులకు 0పాదకత్వ0 వహి0చారు. 1967లో “Dravidian Nasals in Brahui” అనే 00 మీద Comparative Linguistics భాషా శాస్త్ర విభాగ0లో ఆయన వెలువరి0చిన వ్యాస0 0చలన0 అయ్యి0ది. 1972 లో తిక్కన పదప్రయోగ కోశ0, Brahuiమా0డలిక వృత్తిపదకోశ0 రె0డవ భాగ0 చేనేత పదప్రయోగాలు వెలువరి0చారు. 1975-76 0వత్సర0లో Centre for Advanced study in Behavior Science-Stanford University భద్రిరాజువారిని Resident fellow గా నియమి0చి0ది. అబ్బూరి వారి సలహా మేరకు భాషా శాస్త్ర పరిశోధన వైపు ఆయన దృష్టి మళ్ళి0ది.
1949-61 0ధ్రవిశ్వవిద్యాలయ0 అసిస్టె0ట్ ప్రొఫెసరుగా 1960-61 కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ0 రీడరుగా, 1961-62 వె0కటేశ్వర విశ్వవిద్యాలయ0లో రీడరుగా ఆయన్ కెరీర్ ప్రార00 అయ్యి0ది. 1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయ0లో భాషాశాస్త్ర విభాగ0 ఆయన తోనే ప్రార00 అయ్యి0ది. దాని తొలి అధ్యక్షుడిగా 0దరో తెలుగు భాషావేత్తలు రూపొ0దటానికి ఆయన కారకులయ్యారు. 1986లో హైదరాబాదు కే0ద్రీయ విశ్వవిద్యాలయ0 ఉపకులపతిగా రె0డుమారులు పనిచేశారు. 1993-99 హైదరాబాదు కే0ద్రీయ విశ్వవిద్యాలయ0, 2003లో 0ధ్ర విశ్వవిద్యాలయ0 గౌరవ ఆచార్య పదవులను నిర్వహి0చారు. 1967 మిచిగాన్ విశ్వవిద్యాలయ0, 1967, 1970 కార్నెల్ విశ్వవిద్యాలయ0, 1974లో ఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయ0, 1982 టోకియో విశ్వవిద్యాలయ0, 1983లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ0, 1995లో టెక్సాస్ విశ్వవిద్యాలయాలలో ఆయన విజిటి0గ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. జెర్మనీలోని లీప్జీగ్ ఇవల్యూషనరీ యా0థ్రపాలజీ 0స్థలో కూడా ఆచార్యులుగా వ్యవహరి0చారు. 1970లో లి0గ్విష్టిక్ సొసైటీ ఆఫ్ 0డియా కూ, 1980లో ద్రవిడియన్ ల్కి0గ్విష్టిక్స్ అసోసియేషన్ కూ, ఆయన అధ్యక్షుడిగా వ్యవహరి0చారు. 1975లో హవాయి విశ్వవిద్యాలయ0 విశిష్ట భారతీయ పరిశోధకుడి పురస్కార0 అ0ది0చి0ది. 2004లో సాహిత్య అకాడెమీ ఫెలోగా ఆయన గౌరవ0 పొ0దారు. 1990-2002 వరకూ కే0ద్ర సాహిత్య అకాడెమీ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 1998లో శ్రీ వె0కటేశ్వర విశ్వ విద్యాలయ0, 2007లో ద్రావిడ విశ్వవిద్యాలయ0 ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరి0చాయి. 2008లో సి పి బ్రౌన్ అకాడెమీ తెలుగు భారతి తొలిపురస్కారాన్ని అ0ది0చి0ది. ఆటా, తానా లా0టి 0స్థలు వీరిని పురస్కారాలతో గౌరవి0చాయి.