Wednesday, 4 July 2018

Facts On Salt and Chilli Powder | ఉప్పు కారం తగ్గించి తింటే వచ్చే నష్టాల...

Saturday, 30 June 2018

Forgot Veggies | Lost Vegetables | తెలుగు వాళ్ళు తినడం మరిచిపోయిన కాయకూర...

Wednesday, 27 June 2018

వంటింటి నుంచి దూరంగా తరిమికోట్టాల్సిన వస్తువు ! ప్రతి ఒక్కరు చూడాల్సిన వ...

Monday, 25 June 2018

కచ్చితమైన మార్పుని తెచ్చే అద్భుతమైన Breakfast | Must Watch Video | By Pu...

కచ్చితమైన మార్పుని తెచ్చే అద్భుతమైన Breakfast | Must Watch Video | By Pu...

Sunday, 24 June 2018

రాత్రి పూట రోగాలు రానివ్వని సరైన భోజన విధానం Best Way Of Eating Dinner |...

Thursday, 21 June 2018

40 ఏళ్ళ తరువాత ఎవరైతే ఇలా భోజనం చేస్తారో వారికి ఏ రోగాలు రానే రావు!!! By...

Wednesday, 20 June 2018

Refined నూనెలు ఎలా తయారై మార్కెట్ లోకి వస్తాయో తెలిస్తే వామ్మో అంటారు!!!...

Sunday, 8 April 2018

వార్తకు వాత: డా. జి వి పూర్ణచందు

వార్తకు వాత: డా. జి వి పూర్ణచందు
వార్త యంద జగము వర్తిల్లుచున్నది/యదియు లేనినాఁడ యఖిల జనులు
నంధకార మగ్నులగుదురు గావున/వార్త నిర్వహింపవలయుఁ బతికి
లంచం పుచ్చుకునేవాణ్ణి చూస్తే మనకు ఒళ్లు మండిపోతుంది. లంచగొండి దొరికిపోయి, V ఆకారంలో వేళ్లు చూపిస్తూ చేతులూపుతూ అందరికీ బాయ్ చెప్తూ వెడ్తుంటే మనసు మరీ కుంగిపోతుంది...లోకం ఇలా అయిపోయిందేవిటా...ని!
ఇంత బాధపడ్తున్న మనకే ఒక్కో సారి విషమ పరిస్థితి వస్తుంది. ఆ దొరికిపోయిన లంచగొండి మనకు తెలిసినవాడో సన్నిహితుడో అనుకుందాం...అప్పుడు మన మనసుఎలా ఉంటుంది... ఈ మధ్య కొందరు బయటపడి మరీ నిస్సిగ్గుగా “దాడిచేసి పట్టుకోవటానికి మా కులంవాడే దొరికాడా?మా కులస్థులమీద ప్రభుత్వం ఉక్కు పాదాలు మోపి అణచి వేయాలని చూస్తోంది. ఫలానా కులం వారి అవినీతి కనబడదా...?” అంటూ మాట్లాడేవాళ్లు గణనీయంగానే ఉన్నారు. ఇంకనుండీ ఎవరైనా దొంగ లేదా హంతకుడు దొరికిపోతే వాడు మనకులం అవునో కాదో చూసుకుని స్పందించాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉన్నదని దీని సారాంశం.
అనుకూలత అనేది మితిమీరి ఆకాశానికి ఎత్తటం మొదలెడితే గాడ్సేలంతా గాంధీ లైపోతారా వర్ణనల్లో! ఒక సంఘటన జరిగిందని చెప్పేప్పుడు మనమే ఆ సంఘటనలో ఒక పక్షాన నిలబడి రెండోవాడికి వ్యతిరేకంగా ఆ వార్తని చిత్రించి చెప్తాము. అక్కడిదాకా ఎందుకు...మనం ఓటు వేసిన పార్టీ ఓడిపోతే అవతలివాడు బరితెగించాడని, మన పార్టీని తొక్కేశాడని, మనల్ని గెలవకుండా చేశాడనీ అంటాం. మనపార్టీ గెలిస్తే ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని ఘంట బజాయిస్తాం. వార్తాపత్రికలు కూడా అంతే! ప్రతీ పత్రికకీ ఒక నిబద్ధత ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ నిబద్ధత యూటర్న్ తీసుకుంటూ ఉంటుంది కూడా! నార్లవారు బతికున్న రోజుల్లో సంగతి...అప్పటిదాకా ఎమర్జెన్సీనీ, ఇందిరాగాంథీని తెగపొగిడిన ఒక దినపత్రిక ఇందిరాగాంథీ ఓడిపోగానే ఎమర్జెన్సీని తెగతిడుతూ సంపాదకీయం వ్రాసింది. పత్రికల్లో ఇలాంటివి సహజం. ప్రతీ ఎన్నికలోనూ ఒకే పార్టీకి ఎల్లకాలం మనుషులు ఓటేస్తే ఓడలూ బండ్లూగా రాజకీయ చక్రాలు గిర్రున ఎలా తిరుగుతాయి...? మనం మనసు మార్చుకున్నట్టే పత్రికలూ పంథాను మార్చుకుంటూ ఉంటాయి
పూర్వం రాజులకి వేయి వేశ్యల మదమణచిన రసిక కులశేఖరుడు లాంటి బిరుదులిస్తే చాలా ఘనంగా వందిమాగధులతో స్తుతిస్తోత్రాలు చేయించుకొనేవాళ్లు. “అంత ఛండాలంగా ఎలా ఆనందించబుద్ధి అయ్యిందా ఆ రాజుకి?” అని అనిపిస్తుంది మనకి! తంజావూరుని పాలించిన విజయరాఘవనాయకుడు ఓ వెయ్యి మంది నగ్నసుందరుల్తో ఒకే చోట ఒకేసారి కేళీకలాపాలు చేస్తుంటే ఆయన రాణి, పిల్లలు,మనుమలు అంతా గేలరీలో కూర్చుని చూసి వినోదించారని రంగాజమ్మ అనే కవయిత్రి వ్రాసింది. ఇదేం పిచ్చి రాతలే అని రాణిగారొచ్చి రంగాజమ్మని నిలదీస్తే నీమొగుణ్ణి నీపక్కలోంచి నేను లేపుకొచ్చానా ... నువ్వు ఆడదానివికాదా?,మొగుణ్ణి ఎలా కట్టుకోవాలో తెలీదా...? తలోదరీ!!..అనడిగినట్టుకూడా కమ్మని పద్యాలున్నాయి. మన పండితులు ఈ రంగాజమ్మ పక్షమే వహించారు. ఆమెకు ఎక్కడలేని రాణిహోదాలూ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ఏది నిజం వార్త...? ఏది అబద్ధం వార్త...? అంకఛండాలాన్ని అంకఛండాలంగా వ్రాసినా పండితులకు నచ్చింది. నచ్చి ఉండకపోతే రంగాజమ్మ ఎక్రెడిషన్ గుర్తింపు కార్డు రద్దు చేసి, మొదటి తప్పు, రెండో తప్పు, మూడో తప్పు శిక్షలన్నీ ఒకేసారి విధించేవాళ్లు. రాధికా స్వాంతనం వ్రాసిన ముద్దుపళనిలో కనిపించిన తప్పు రంగాజమ్మలో కనిపించిన ఒప్పు ఏమిటో తేల్చి చెప్పటం కష్టమే! సంస్కర్త వీరేశలింగంగారే తీర్పరి పాత్ర పోషించి ముద్దుపళనికి నిషేధ శిక్ష విధించాడు.
నిజమే! ఫేక్ వార్తల్ని సృష్టించేవాడికి శిక్షపడాలి. కానీ, ఒక వార్తలోని కట్టుకథని అన్ని సందర్భాలలోనూ నిష్పక్షపాతంగా నిర్థారించటం చాలా కష్టం. విజయరాఘవనాయకుడు చేసిన పని ఒకరికి ఘనమైనదిగా కనిపిస్తోంది. అలానే ఘనమైన విషయంగా వార్తని రికార్డ్ చేసిందామే! అది అధికారపక్షానికి అనుకూలంగా వ్రాసింది కాబట్టి దానిలో ఫేక్ అనే ఎలిమెంటు అణిగిపోయింది. దాన్ని వ్యతిరేక దృష్టితో చిత్రిస్తే కచ్చితంగా తప్పుడు వార్తల్ని తప్పుగా చిత్రించినందుకు నిన్న కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన శిక్షలన్నీ పడేవి. ఇవి రాజులకాలం నాటి ఆలోచనావిధానం. అధికార పక్షం అంతకన్నా భిన్నంగా అలోచించగలదని ఊహించలేం. మాకు అనుకూలమైనవే నిజాలు. మాకు వ్యతిరేకమైనవన్నీ అబద్ధాలే ననేది కొత్త చట్టంలో సారాంశం.
చివరికి ఎవరి అబద్ధాలను వాళ్లనే రాసుకోనివ్వటం శ్రేయస్కరం అని సర్కారు వారు పునరాలోచించటం  కథకు ముక్తాయింపు.
నిజం అనేది ఒక పచ్చి మాంసం ముద్ద లాంటిది. దాన్ని ఉడికించి, మషాలాలు కుమ్మితేగాని అది కూర అవదు. వార్త కూడా అంతే! ప్రజలు అలా ఉంటేనే చదువుతున్నారన్నది నిజం. మామూలు వార్తలిస్తే మొత్తం పేపరంతా తిరగేసి ఇవ్వాళ్ పేపర్లో వార్తలే లేవంటాడు పాఠకుడు. యథా ప్రజా...తథా పత్రికా! పాఠకులనుబట్టే పత్రికలు. నిజాలు వద్దనుకునే ప్రజలకు చేదు మందులాగా నిజాలే ఎక్కిస్తానంటే ఏలిన వారికి కోపం వచ్చింది. అయినా ప్రస్తుతానికి తమాయించుకుంది.
ఇప్పుడైనా నన్నయగారి పద్యం మనకు గుర్తుకురావాలి. “వార్తలోనే ఈ ప్రపంచం మొత్తం నడుస్తోంది. వార్త లేకపోతే మనుషులంతా అంధకార మయం అవుతారు” అన్నాడు నన్నయ. వార్తని సక్రమంగా ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత నాలుగో స్తంభానిదే! దాని నిజానిజాలు ఒక రాజకీయ పార్టీ నడిపే ప్రభుత్వం లేదా దానిచే నియమితులైన వ్యక్తులూ నిశ్చయం చేస్తారనటం విచిత్రమే! వార్తల్ని చేరనివ్వండి. వార్త ప్రభావితం చేస్తుంది. ఒకసారి ఈ పార్టీని చేస్తే ఇంకోసారి ఇంకో పార్టీని చేస్తుంది. ఎల్లకాలం ఒక్కరే జెండాకర్రలా పాతుకు పోగలిగే పరిస్థితి ఇప్పుడు లేదు. ఉంటాననుకునే వారి వెర్రికల నిన్న ఉపసంహరించుకోబడిన పత్రికా చట్టం.

Saturday, 13 January 2018

Dr. G. V. Purnachand, B.A.M.S.,: ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం

Dr. G. V. Purnachand, B.A.M.S.,: ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం

తెగువ యోచన: డా. జి వి పూర్ణచందు

తెగువ యోచన: డా. జి వి పూర్ణచందు
“సీ. వుండ్డుండ్డి యేమేమొ వూరకె చింత్తింత్తు
చింత్తించ్చి నాలోనె చింన్నబోదు
చింన్నబోయి యొకింత్తశేపు తెలివిగ నుంద్దు
తెలివి వ్యాళను మింమ్ము తలపువచ్చు
తలచినంత్తనె వచ్చి నిలచినట్లనె తోచు
తోచిననే దిగ్గున లేచి జూతు
జూచి వేగమె బార జాచి కౌంగిట గృత్తు
గృచ్చి కౌంగిట లేక వెచ్చనూర్తు
వెచ్చనూర్చియు తపియింత్తు వెతల నింత్తు
సఖుల గద్దింత్తు తెగువ యోచన తలంత్తు
నీదు మనసెంత్తు అంత్త నంన్నియు శమింత్తు
భవ్యగుణహారి వేణుగోపాల శౌరీ.”
పద్యం రాయటం వంట చేసినంత సులభం. ఆ మాటకొస్తే, వంట చేయటం అంత సులభమైన విషయమేమీ కాదు. ఫలానా కూర లేదా పప్పు ఎలా వండాలో తెలిసినంత మాత్రాన సరిపోదు. ప్రాక్టీసు మీద సాధించి, ఎప్పటికైనా గొప్ప వంట శాస్త్రవేత్తగా ఎదగటానికి జీవితం అంతా కష్టపడాలి!
పూర్వం రోజుల్లో పెద్దబాల శిక్షతోపాటే పద్యం వ్రాయటం ఎలాగో కూడా నేర్పేసేవాళ్లు. ఆ నేర్చుకున్న వాళ్ల పరిణతి కొద్దీ భాషాలంకారాల చేర్పులతో పద్య రచనావైభవం సిద్ధించేది. భాష బాగా రానంత మాత్రాన పద్యం వ్రాయటాన్ని మానేయ వలసిన అవసరం లేదనటానికి ఈ పద్యం ఒక తార్కాణం.
ఒక మహారాజుగారి వెంకటరాఘవు అనే వేశ్య రాసిన అపూర్వమైన ప్రేమలేఖ ఇది. దీన్ని కూడా చాటుపద్యాల జాబితాలో చేర్చవచ్చు. 'ఆంధ్రపత్రిక ' 1964-65 నాటి సంవత్సరాది ‘స్వర్ణోత్సవ సంచికలో వేమూరి విశ్వనాథశర్మ దీన్ని సేకరించి ప్రకటించారు.
పద్యం అనగానే ఇది మనకు అర్ధం కానిదనీ, మనం చదవాల్సినది కాదనీ చాలామందిలో ఒక అపోహ ఉంది. దీన్ని నేటికాలపు వచనకవితలా వాక్యాన్ని నాలుగు ముక్కలుగా విడగొట్టి నాలుగు లైన్లలో ఇప్పటి చాలామంది కవులు వ్రాస్తున్న వచన కవ్త లాగానే, వెంకట రాఘవు కూడా చక్కని వచనాన్ని పద్యంలా వండేసింది.
ఉండుండి ఏమేమో ఊరకే ఆలోచన్లు వస్తున్నాయట. ఆలోచిస్తూ తనలోనే చిన్నబోతోందట. కాసేపు మూర్ఛ పోవటం కాసేపు తెలివిలో ఉండటం జరుగుతోందట. తెలివిలో ఉన్న సమయంలో ఆయన తలపే వస్తోందట. మనసులో అనుకోగానే ఆయన వచ్చి ఎదురు నిలిచినట్టే అనిపిస్తోందట. అలా అనిపించగానే దిగ్గున లేచి చూస్తోందట. చూడగానే, చేతులు బార జాచి కౌగిట చేర్చుకోవాలని పించినట్టు, అనిపించగానే వెచ్చని కౌగిట్లో బిగించినట్టుఅనిపిస్తోందట. ఆ కౌగిలి వేడికి ఆమె ఒంట్లో తాపం పెరిగి పోయి, ఆ తాపంతో పరిచారికల్ని గద్దిస్తోందిట. రోజురోజుకూ తెగువ యోచనలు తెగ కలుగుతున్నాయట. నువ్వు వస్తేనే అన్నీ శమిస్తాయి...భవ్యగుణహారీ వేణుగోపాల శౌరీ...” అని ప్రేమలేఖ పంపింది రాజు గారికి. రాజుగారు ఐసైపోవటానికి ఇంతకన్నా భాషా పాండిత్యం అక్కర లేదు. భాషాపటిమతో వ్రాసి ఉంటే అది రాజుగారికి అర్థం కాక, బాంబు మిస్‘ఫైర్ అయ్యేది. ఏమైనా, వెంకట రాఘవు “తెగువ యోచన తలంత్తు” అన్నదే...అదే ప్రమాదకరమైనది! రాజు రాకపోతే ఈమె తెగిస్తానన్నదే ఇందులో హెచ్చరిక. అది రాజుకు అర్థం కావాలి!
పద్యంలో ఉంటే అది ఛండశాసనంలా నిఖార్సయిన సత్యం అని ఆ రోజుల్లో ఓ నమ్మకం ఉండేది. కన్యాశుల్కంలో గిరిశం మేష్టారు బుచ్చమ్మని లైన్లోకి తేవటం కోసం “ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగానున్నది. వెధవలు పెండ్లాడవలసినదని పరాశరస్మృతిలో స్పష్టంగానున్నది. వేదంలోకూడా నున్నది. రాజమహేంద్రవరములో యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో వెధవలు పెండ్లాడేవారు, వెంకటేశం! నలచరిత్రలో దమయంతి రెండోపెండ్లి సాటించిన పద్యం చదువు” అంటాడు. వెంకటేశం తనకు ఆ పద్యం రాదని చెప్తాడు. “ఇంత ముఖ్యమయిన పద్యం మరచి పోవడం యంతతప్పూ! నోటుబుక్కు తీసిరాసుకో- "దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజులెల్ల దడదడవచ్చిరీ" అని పద్యంలా పాడి, “చూశావా(వెంకటేశంతో) లోకంలోవుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారట.(బుచ్చమ్మవైపు జూచి) చూశారా? శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా మీదిమిక్కిలి వెధవలు పెళ్లాడకుండా వుండిపోతే దోషమని కూడా చెప్పుతూ వున్నాయి. యిందు విషయమై శంకరాచార్యులవారు పత్రికకూడా యిచ్చియున్నారు”అన్నాడు.
పద్యంలో చెప్పడం, పత్రికలో పడటం అనేవి సర్వ ప్రామాణికాలని ఆయాన్ ఉద్బోధిస్తాడు. నేటి వార్తాపత్రికల్లో దమయంతి రెండో పెళ్లి లాంటి వార్తలే ఎక్కువగా ఉండవచ్చు గాక, పద్యంలో ఉంటే, అది పత్రికలో పడ్డంత నిజం.
వెంకట రాఘవు కథ చివరికి సుఖాంతమే! సందేహం లేదు. గిరీశం కథని మాత్రం గురజాడ అడ్డంగా తిప్పాడు. చరిత్రలో పద్యాన్ని సొమ్ము చేసుకున్న వాళ్లలో మొన్నటి వెంకటరాఘవు అనే వేశ్య, నిన్నటి గిరీశం అనే జారుడు మనిషి... వీళ్లని మించినాళ్లు లేరు. పద్యం చదివినందువలన కోరిన లాభం చేకూరితే అది ఆస్తికం. ఉత్త కంఠశోషే మిగిలితే అది నాస్తికం అని కవుల్లో ఒక వ్యవహారం ఉంది. తెలుగు సాహిత్యం నాస్తికంగానే ఉండిపోతోందంటే వెంకట రాఘవుకు దొరికిన రాజు లాంటివాడు దొరక్కపోవటమే కారణం!
అయినా సరే, ప్రభువులకు అర్జీల్ని ఇలా పద్యాల్లో వ్రాస్తే త్వరగా పనులౌతాయని వెంకట రాఘవుని ఆదర్శంగా తీసుకోవాలని చూస్తున్నారా? “అంతా కవులము గామా
అంతింతో కంద పద్య మల్లగ లేమా” అనుకుంటూన్నారా? మీ ఇష్టం. “తెగువ యోచన” చేయాలి కదా!

ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం