Sunday, 22 June 2014

ఆహారోపనిషత్తు ఆంధ్రభూమి వారపత్రికలో కొత్తగా ప్రారంభం అయిన నా శీర్షిక


ఆహారోపనిషత్తు
ఆంధ్రభూమి వారపత్రికలో కొత్తగా ప్రారంభం అయిన నా శీర్షిక

ఆంధ్రభూమి వారపత్రిక జన్మదిన సంచిక (జూన్ 3వ తేదీ) నుండీ ఆహారోపనిషత్తు పేరుతో నేను నిర్వహిస్తున్న ప్రశ్నలూ-సమాధానాల శీర్షిక ప్రారంభం అయ్యింది. ఇప్పుడు మార్కెట్లో ఉంది. చూడగలరు.
        పక్కన కూచోబెట్టుకుని, చక్కగా బోధపరిచే వాటిని ఉపనిషత్తు లంటారు. ఇది ఆహారోపనిషత్తు. ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం గురించి మీరు మీ సందేహాలను ఈ బ్లాగు / ఫేస్బుక్ ద్వారాగాని, purnachandgv@gmail.com -మెయిల్ ద్వారాగానీ, 9440172642 సెల్ నెంబరుకు యస్సెమ్మెస్ చేయటం ద్వారాగానీ, లేదా ఇదే నెంబరుకు ఫోనుద్వారా గానీ, డా. జి వి పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి, బకింగ్హామ్ పేట పోష్టాఫీసు ఎదురు, గవర్నర్ పేట, విజయవాడ-520 002 చిరునామాకు ఉత్తరం ద్వారా గానీ, నాతో సంప్రదించవచ్చు. సులువుగా అర్థం అయ్యే భాషలో విడమరచి చెప్పటం జరుగుతుంది. మీ ప్రశ్నలకు నా సమాధానాలు ఆంధ్రభూమిలో కూడా అచ్చవుతాయి.
        ఆహారం విషయంలో మనం కనబరుస్తున్న అశ్రద్ధ రేపటి తరానికి చాలా అపకారం చేసేదిగా ఉంది. ఈ విషయమై గత నాలుగేళ్ళుగా అనేక కోణాలలోంచి విశ్లేషిస్తూ, దాదాపు 200 వ్యాసాలవరకూ వ్రాశాను. అవన్నీ నా బ్లాగులోనూ, ఫేసుబుక్లోనూ ఉన్నాయి. వాటిని పరిశీలించ గలరు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం మనం ఉద్యమించవలసిన సమయం ఇది. పాఠక మిత్రులు స్పందించ వలసిందిగా కోరుతున్నాను.
డా. జి వి పూర్ణచందు
ఆయుర్వేద వైద్యులు, సాహితీ వేత్త, ఆహార శాస్త్ర పరిశోధకుడు

      

No comments:

Post a Comment