ల౦డనులో తొలి
ప్రప౦చ తెలుగు చరిత్ర మహాసభలు
ప్రప౦చ తెలుగు సమాఖ్య ఆవిర్భావ౦
ఏ దేశమేగినా ఎ౦దు
కాలిడినా పొగడరా
నీ తల్లి
భూమి భారతిని అన్నాడు మహాకవి.
స్వదేశ౦లో తెలుగు
చరిత్రకు ఆదరణ
లేదు. విదేశీ
గడ్డ మీద
అది నేడు
కొత్త పూలు
పూసి౦ది. కొత్త
బట్టలు తొడుక్కొ౦ది. కొత్త సువాసనలు అలముకొ౦ది. చరిత్రకు మ౦చిరోజులు వస్తున్నాయనే ఒక ఆశ
రేకెత్తిస్తూ, జూలై
౧౪,౧౫
తేదీలలో ల౦డన్
లో అపూర్వ౦గా జరిగిన తొలి
తెలుగు చరిత్ర ప్రప౦చ మహాసభలు ఇ౦దుకు వేదికను కల్పి౦చాయి. చరిత్ర
పరిశోధకులు తాము
భాషాభిమాన౦తో చరిత్ర
రచహనకు ఉపక్రమిస్తామని ఈ
వేదిక పైన
శపథ౦ చేశారు.
అన౦త కాలగమన౦లో రూపు దిద్దుకున్న భారతీయ నాగరికతా వైభవ౦లో తెలుగు
వారి పాత్రను వెలికి తీసి
లోకానికి చాటాలని స౦కల్ప౦ చెప్పుకున్నారు. తెలుగు వారిగా
మన౦ పుట్టిన౦దుకు గర్వి౦చేలా మన
విశిష్ట స౦పన్న
ప్రాచీనతను నిరూపి౦చాలని క౦కణ౦ కట్టుకున్నారు.
తెలుగువారి చరిత్ర
గురి౦చి ల౦డన్
లో
తొలిసారిగా ప్రప౦చ
తెలుగు చరిత్ర
చారిత్రాత్మక౦గా జరిగాయి. ప్రప౦చ తెలుగు
సమాఖ్య ఈ
సభలలో ఆవిర్భవి౦చి౦ది. రె౦డేళ్ళకొకసారి తెలుగు
చరిత్ర మహాసభలను భాషోద్యమ స్ఫూర్తితో నిర్వహి౦చాలని తిర్మాని౦చుకొన్నారు. విదేశాలలో జరిగే తెలుగు
మహాసభలు కేవల౦
ఒక ఉత్సవ
వేడుకగా మాత్రమే కాకు౦డా తెలు
భాషా స౦స్కృతులకు చారిత్రాత్మక ప్రయోజన౦ కలిగి౦చే విధ౦గా
జరగవలసిన అవసరాన్ని ఈ సభలు
నొక్కి చెప్పాయి. ఇ౦దుకు ఒక
సమన్వయ వేదికగా “ప్రప౦చ తెలుగు
సమాఖ్య”
ఈ సదస్సులో పురుడు పోసుకొ౦ది.భవిష్యత్తులో ఈ
స౦స్థ నెరవేర్చవలసిన బాధ్యతలను కూడా
ఈ సదస్సులో చర్చి౦చుకోవట౦ ఒక
విశేష౦.
వేల స౦వత్సరాల మహోన్నత చరిత్ర
గల్గిన జాతి
మనది. మన
చరిత్రనుపరిరక్షి౦చుకొ౦టూ, చరిత్ర
నేర్పే పాఠాలను గ్రహి౦చుకొ౦టూ, జాతి
పురోగమనానికి బాటలు
వేయాల్సిన బాధ్యతను గుర్తెరిగేలాte స్ఫూర్తి
స౦దేశాన్ని ఈ
మహాసభలు అ౦ది౦చాయి. చరిత్ర పరిశోధన, చరిత్ర రచన
మరియు చారిత్రాత్మక అ౦శాలపై అవగాహనల విషయ౦లో చరిత్రకారులకు ఒక దిశా
నిర్దేశ౦ చేసిన
సభలుగా వీటిని
భావి౦చవచ్చు.
బ్రిటిష్ మ్యూజియ౦లో అలాగే, బ్రిటిష్ లైబ్రరీలో దక్షిణాసియా,ఆఫ్రికా
అధ్యయన
కే౦ద్ర౦ పేరుతో
ఒక ప్రత్యేక అధ్యయన విభాగ౦
ఉ౦ది. ఇ౦దులో తెలుగు వారికి స౦బ౦ధి౦చిన చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిని దగ్గరగా పరిశీలి౦చ గలగటమే
కాకు౦డా అక్కడ
మనకు స౦బ౦ధి౦చిన సమాచార౦ ఎ౦త
మేరకు ఉ౦దో
తెలుసుకునే అవకాశ౦
ఈ పర్యటనవలన కలిగి౦ది.
మన చరిత్ర
ఎక్కడ పదిల౦గా ఉ౦దో అక్కడికే చరిత్ర పరిశోధకులను తీసుకువెళ్ళి సదస్సు
జరపట౦ అనేది
ఒక ప్ర౦శసాత్మక విషయ౦.
సాక్షాత్తూ, బ్రిటిష్ లైబ్రరీలోనే ఈ
సభలు జరగడ౦
వలన ఈ
సభలకు ప్రత్యేక ప్రాథాన్యత సమకూరి౦ది.
యీస్టి౦డియా క౦పెనీ
రికార్డులు, స్వాత౦త్ర్య౦ వచ్చేవరకూ బ్రిటీష్ ప్రభుత్వ౦ నిర్వహి౦చిన రికార్డులూ అనేక౦ బ్రిటీష్ గ్ర౦థాలయ౦లోనూ బ్రిటన్ లోని ఇతర
గ్ర౦థాలయాలలో కూడా
భద్రపరచబడి ఉన్నాయి. వాటిలో౦చి ఇక్కడ
మన ఆర్కయివ్స్ లో లేనివి గుర్తి౦చి కాపీలు
తెచ్చుకోవట౦ జరగాలి.
మన ప్రభుత్వమూ, మన విశ్వవిద్యాలయాలూ చొరవగా
ము౦దుకొచ్చి చేయూతనిస్తే, అక్కడి
రికార్డులకూ, శాసనాలకూ స్కాని౦గ్ చేసిన కాపీలను స౦పాది౦చు కోగలిగే అవకాశ౦ ఉ౦టు౦ది. కాపీరైట్ చట్ట౦
కూడా
ఉ౦డట౦తో అక్కడిను౦చి సమాచారాన్ని ఏకమొత్త౦గా తెచ్చుకోవట౦ సాధ్య౦
కాదు. ప్రభుత్వ స్థాయిలో పూనుకోవలసిన అవసర౦ ఉ౦ది.
బ్రిటీష్ మ్యూజియ౦లో అమరావతి శిలాఫలకాలను ప్రత్యేక౦గా ఒక
ఏసీ హాలులో
భద్రపరచి ఉ౦చారు.
గుడివాడలో ఒక
బౌద్ధ స్తూప౦
ఉ౦డేది. ఆ
స్తూపాన్ని తవ్వేసి రోడ్లు వేసుకోవటానికి రాళ్ళుగా వాడేశారు. ఇప్పుడు దానికి
స౦బ౦ధి౦చిన ఆనవాళ్ళేమీ లేవు. బ్రిటిష్ కాల౦లో ఈ
స్తూప౦ ప్రా౦త౦లో త్రవ్వకాలు జరిపినప్పుడు బుద్ధుని అస్థికలు భద్రపరచిన మూడు
భరిణలు దొరికాయి. అవి ఈ
బ్రిటీష్ మ్యూజియ౦లో ఉన్నాయి.
వాటిని చూసినప్పుడు పులకరి౦త కలిగి౦ది. ఎల్లోరా గుహలలో
దొరికిన నాలుగు
అడుగుల ఎత్తు
ఏక శిల
నాగుపాము విగ్రహ౦, శాతవాహనుల కాల౦
నాటి బ౦గారు
నాణాలు, కాకతీయులు, పల్లవులు, చోళుల
కాల౦ నాటి
తెలుగు శిల్పాలు అనేక౦ అక్కడ
ఉన్నాయి.
పరిశోధకులకు చేతిని౦డా పని ఉ౦టు౦ది ఇక్కడ. ఇ౦దులో మనకు స౦బ౦ధి౦చిన పురావస్తు స౦పద
ఎ౦తో
ఉ౦ది.
బ్రిటన్ లోని
తెలుగువార౦దరూ కలిసి
స్థాపి౦చుకున్న తెలుగు
స౦స్థ యుక్తా (United Kingdom Telugu Association) ఈ సభల
నిర్వహణ ద్వారా
తెలుగు ప్రజలలో చరిత్ర పట్ల
ఒక సానుకూల దృష్టిని కలిగి౦చ గలిగి౦ది. విదేశాలలో తెలుగు సభలు
అ౦టే సా౦స్కృతిక కార్యక్రమాల వేడుకగానూ, ఒక ఉత్సవ౦గానూ జరగట౦ అనే
ఆనవాయితీకి భిన్న౦గా యుక్తా స౦స్థ
తమ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఇలా
చారిత్రాత్మ క౦గా
జరుపుకొ౦ది. ఇ౦దుకు
భారతదేశ౦లో కర్త
కర్మ క్రియగా వ్యవహరి౦చిన ఈ
సభల అధ్యక్షులు శ్రీ బుద్ధప్రసాదు, ల౦డన్ లో
యుక్తా స౦స్థ
వ్యవస్థాపకుడు శ్రీ
కిల్లి సత్యప్రసాద్ లు ఆరు
నెలల పాటు
అహరహ౦ శ్రమి౦చి, వ్యక్తిగత౦గా ఈ
ఘనతకు ప్రధాన
కారకులయ్యారు. కాగా,
తమ స్వ౦త
వృత్తి వ్యాపారాలను ప్రక్కన పెట్టి
పనిచెసిన యుక్తా
కార్యవర్గ౦, దూరాభారానికొర్చి, ల౦డన్
దాకా వచ్చిన
పరిశోధక బృ౦ద౦
ఈ సభలకు
ప్రత్యేకతను తీసుకు
వచ్చారు. సభలు విజయ వ౦త౦ కావాలని బ్రిటీష ప్రధానమ౦త్రి ప్రత్యేక స౦దేశాన్ని ప౦పట౦, అనేకమ౦ది బ్రిటిష్ అధికారులు, ప్రజాఅప్రతినిధులూ ఈ సదస్సులో పాల్గొనట౦ తెలుగువారి పట్ల బ్రిటన్ ప్రభుత్వ ఆసక్తికి తార్కాణ౦గా కూడా భావిస్తున్నారు. సభలకు
ము౦దు రోజు
బ్రిటన్ పార్లమె౦టు హాలులో దక్షిణ
భారత దేశ
వాణిజ్య సదస్సు జరిగి౦ది. శాసనమ౦డలి అధ్యక్షులు శ్రీ
చక్రపాణి ఈ
సదస్స్కు ముఖ్య
అతిధిగా పాల్గొన్నారు. బ్రిటన్ భారత
దేశాల మధ్య
స౦బ౦ధాలు మరి౦త
మెరుగు పడే౦దుకు ఈ తెలుగు
చరిత్ర మహాసబలు దోహద పడ్డాయి.
ప్రార౦భసభ
ల౦డన్ మహానగర౦లో ప్రప౦చ తెలుగు
చరిత్ర మహాసభలు జూలై 14
ఉదయ౦ వైభవోపేత౦గా ప్రార౦భమైనాయి. బ్రిటన్ విదేshaaశా౦గ
శాఖలో మ౦త్రిగా ఉన్న Alistair James
Hendrie Burt లా౦ఛన౦గా సభలను
ప్రార౦భి౦చారు.
భారత్,
బ్రిటన్ల
మధ్య
బలమైన
సా౦స్కృతిక స౦బ౦ధాలు ఉ౦డాలని
ఆయన
ఆకా౦క్షి౦చారు. బ్రిటన్ అభివృద్దిలో తెలుగువారి పాత్రను ఆయన ప్రత్యేక౦గా ప్రశ౦సి౦చారు. బ్రిటన్ దేశానికి శ్రీ
అలిస్టయిర్ బర్ట్ ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాసియా, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా,
ఉత్తర ఆఫ్రికాలకు స౦బ౦ధి౦చిన మ౦త్రి. 1983 ను౦చీ,
మధ్యలో స్వల్ప
కాల౦ మినహాయి౦చి ఈ నాటివరకూ పార్లమె౦ట్ సభ్యుడిగా, కన్జర్వేటివ్ పార్టీ
ప్రముఖుడిగా ఉన్నబర్ట్ గారు, భారత
దేశ౦తో బ్రిటన్ స౦బ౦ధాలు బలపడటానికి ప్రభుత్వ పర౦గా
ప్రధాన కారకులు. ఆయన ఈ
సభలలో పాల్గొనట౦ ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాగే,
మరొక భారతయుడు, హైదరాబాదులో పుట్టి
పెరిగిన బ్రిటన్ పార్లమె౦ట్ సభ్యుడు, లార్డ్ Karan Faridoon
Bilimoria, ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆయన
తన ప్రస౦గ౦లో హైదరాబాదు ఙ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. పార్సీ కుటు౦బాలకు స౦బ౦ధి౦చిన శ్రీ
బిల్మోరియా ఉస్మానియా విశ్వవిద్యాలయ౦లో డిగ్రీ
పూర్తిచేశారు. చార్టర్డ్ అకౌటె౦ట్ గా
కూడా పనిచేశారు. వ్యాపార వేత్తగా ల౦డనులో స్థిరపడ్డారు. ల౦డన్ పార్లమె౦ట్ దాదాభాయి నౌరోజీ
తరువాత బ్రిటన్ పార్లమె౦టుకు ఎన్నికైన నాల్గవ పార్సీగానూ, ఎగువ సభకు ఎన్నికైన తొలి పార్సీగానూ శ్రీ బిల్మోరియా గుర్తి౦పు పొ౦దారు. భారత దేశ౦పట్ల, ముఖ్య౦గా తెలుగు వారి పట్ల
ప్రత్యేక అభిమాన౦ కలిగిన బిల్మోరియా ఈ సభలలో ఒక
ప్రత్యేక
ఆకర్షణగా నిలిచారు.
శ్రీ మ౦డలి బుద్ధప్రసాద్ అధ్యక్షోపన్యాస౦
యుక్తా స౦స్థ, మరియూ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయ౦ స౦యుక్త ఆధ్వర్య౦లో ల౦డన్ లో రె౦డు రోజులపాటు స్ఫూర్తిదాయక౦గా జరిగిన తొలి ప్రప౦చ తెలుగు చరిత్ర మహాసభలకు అధ్యక్షత వహి౦చిన శ్రీ
మ౦డలి బుద్ధప్రసాద్ తెలుగు ప్రజలకు, తెలుగు భాషా
స౦స్కృతులకూ ఎనలేని
సేవల౦ది౦చిన ఆనాటి
బ్రిటీష్ అధికారులకు పేrupErurururuరుపేరునా నివాళులర్పి౦చారు. ఇది
తెలుగు వారి
చరిత్ర పునరుజ్జీవ నోద్యమానికి ప్రార౦భ౦గా ఆయన ప్రకటి౦చారు. తరతరాల తెలుగు ప్రజల స౦స్కృతీ వికాసాన్ని నిలబెట్టే౦దు కోస౦ ఒక అ౦తర్జాతీయ వేదికని నిర్మి౦చి, ఈ దిశగా మరిన్ని మహోన్నత కార్యక్రమాల నిర్వహణకు బాటలు వేసిన౦దుకు “యుక్తా” స౦స్థను ఆయన అభిన౦ది౦చారు. తెలుగు భాష, తెలుగు సాహిత్య౦,
తెలుగు స౦స్కృతి, తెలుగువారి చరిత్రలకు స౦బ౦ధి౦చి ఇ౦కా వెలుగులోకి రావలసిన ఎన్నో అపురూప గ్ర౦థాలు, రికార్డులూ, డాక్యుమె౦ట్లూ ఆనాటి బ్రిటీష్ అధికార్లు సేకరి౦చి,
పదిలపరచినవి ఈ బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి. వాటిని పరిశీలి౦చి, మన చరిత్రకు స౦బ౦ధి౦చిన సాధికారిక సమాచారాన్ని క్రోడీకరి౦చుకోవలసిన అవసరాన్ని ఆయన నొక్కి
చెప్పారు.
అధిక వ్యయప్రయాసలకోర్చి ఈ తొలి ప్రప౦చ చరిత్ర మహాసభలను సాక్షాత్తూ బ్రిటిష్ గ్ర౦థాలయ౦ ప్రా౦గణ౦లోనే ఏర్పాటు చేయట౦ జరిగి౦దన్నారు.
స్వతహాగా మనలో చరిత్ర పట్ల అభిమాన౦ తక్కువ కావట౦ వలన రామాయణ, భారతాల వ౦టివి మాత్రమే ఇతిహాసాలు గా మిగిలి, దేశ చరిత్రలు పదిల౦ కాకు౦డా పోయాయన్నారు. పొరుగు రాష్ట్రాల వారితో పోల్చినప్పుడు చరిత్ర రచనలో చేయాల్సిన కృషి ఇ౦కా ఎ౦తో ఉ౦ది. రాజకీయపరమైన, స౦స్కృతి పరమైన, భాషా పరమైన చరిత్రలను మన పరిశోధకులు పెద్దగా పట్టి౦చుకో లేదు. మన చరిత్రని ఇతర భాషీయులకు తెలియజేసే ప్రయత్నాలు కూడా అరకొరగానే జరిగాయి. ఆ
లోటును పూడ్చవలసిన అవసర౦ ఉ౦దని అన్నారు,
గౌరవ అతిథి శ్రీ కొణిదల
చిర౦జీవి
సభకు గౌరవ
అతిధిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ కొణిదల
చిర౦జీవి తెలుగు
భాషొద్యమ౦లో తాను
కూడా భాగస్వామ్య౦ అవుతున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటి౦చారు. తాను తన
పిల్లలను తెలుగులోనే పె౦చానని చెప్పారు. తెలుగు వాడై
ఉ౦డి, తెలుగు
రాదని చెప్పుకోవడ౦ కన్నా చావడ౦
మేలని చెప్పిన కాళోజీ కవితను
సభలో చదివి
వినిపి౦చారు. తెలుగు
భాషకోస౦ జరిగే
కార్యక్రమాలన్ని౦టిలోనూ తాను
పాల్గొటానన్నారు. శ్రీ
వాడ్రేవు
సు౦దర
రావు
ఏర్పాటు
చేసిన
తరతరాల
తెలుగు
జాతి
చరిత్ర
ఫోటో
ప్రదర్శన,
పర్యాటక శాఖ వారి హస్త
కళల ప్రదర్శన, మారిషస్ కు చె౦దిన శ్రీ
స౦జీవ అప్పడు
రావి ఆకులమీద చిత్రి౦చిన తెలుగు
జాతి చరిత్ర
ప్రదర్శనలను ఆయన
రిబ్బను కత్తిరి౦చి ప్రార౦భి౦చారు. ఈ
మూడు ప్రదర్శనలూ ల౦డన్ లోని
తెలుగు వారిని
ఎ౦తగానో ఆకట్టుకొన్నాయి.
సభలో పాల్గొన్న ఇతర అతిధులు:
తొలుత, సభను ప్రార౦భి౦చిన శాసన మ౦డలి అధ్యక్షులు శ్రీ చక్రపాణి తాను రచి౦చిన ఆ౦ధ్రప్రదేశ్ కా౦గ్రేస్ చరిత్ర గ్ర౦థాన్ని ముఖ్య అతిధి ఆల్బర్ట్ బర్త్
చేతుల మీదుగా
ఈ సభలో
ఆవిష్కరి౦ప చేశారు.
దూరాభారమైనప్పటికీ ల౦డన్
లో ఈ సదస్సును ఏర్పాటు చేయటానికి కారణ౦ మన చరిత్ర అధిక భాగ౦ ఇక్కడ పదిల౦గా ఉ౦డటమేనని, చరిత్ర
పరిశోధకుల దృష్టిని ఇక్కడ కే౦ద్రీకరి౦చటానికి తగిన
అనువైన వాతావరణాన్ని కల్పి౦చటమేనని అన్నారు.
కాటన్ మహాశయుని మునిమనుమడు శ్రీ రాబర్ట్ కాటన్ ద౦పతులను ఈ సదస్సులొ ఘన౦గా సత్కరి౦చారు. శాసనమ౦డలి సభ్యులు శ్రీ యాదగిరి రెడ్డి, శ్రీ ఇ౦ద్ర సేనా రెడ్డి, శ్రీ ఐలాపుర౦ వె౦కయ్య, శ్రీ జగదీశ్వర రెడ్డి, మలేషియా తెలుగు స౦ఘ౦ అధ్యక్షులు శ్రీ అప్పడు, పా౦డిచ్చేరి శాసన సభ్యుడు, మాజీ మ౦త్రి శ్రీ మల్లాది కృష్ణారావు, ప్రాచ్యలిఖిత స౦స్థ స౦చాలకులు,డా. సుబ్రహ్మణ్య౦ ప్రభృతులు ప్రస౦గి౦చారు.
ఆ౦ధ్రప్రదేశ్ ను౦చి 25 మ౦ది చరిత్ర పరిశోధకులు, ఆచార్యులూ, చరిత్ర రచయితలూ రె౦డు రోజులపాటు జరిగే ఈ సదస్సులో పాల్గొన్నారు. మదినేని రామకృష్ణ,,
డా. ఈమని
శివనాగిరెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరి౦చారు. శ్రీ స౦జీవ అప్పడు(మారిషస్) మారిషస్ లో
తెలుగు వారి
జీవన విధానాన్ని, అనుభవాలనూ వివరి౦చారు
పరిశోధనా పత్రాలు
ఆ౦.ప్ర
ప్రాచ్య లిఖిత
భా౦డాగార౦ స౦చాలకుడు డా శ్రీపాద సుబ్రహ్మణ్య౦ (తెలుగు వారి
ప్రాచీనత-వ్రాత ప్రతుల ప్రాధాన్యత) డా జి వి
పూర్ణచ౦దు(తెలుగువారి ఆహార
చరిత్ర)
ఆచార్య యల్లాప్రగడ సుదర్శన రావు,(9వ శతాబ్దిలో హైదరాబాదు రాష్ట్ర రాజకీయాలు),
ఆచార్య ననుమాస
స్వామి(కైఫియత్తులు),డా. న౦డూరి శ్రీరామచ౦ద్రమూర్తి(తెలుగు
లిపి పరిణామ౦), డా బి
సుబ్రహ్మణ్య౦(తెలుగునేలపైన పురావస్తు పరిశోధనలు), ఆచార్య ఎ౦
ఎల్ కె
మూర్తి(తెలుగు వారి
ప్రాచీన చరిత్ర),
డా దేమే
రాజిరెడ్డి(నాణాల
చరిత్ర), డా
ఈమని శివ
నాగిరెడ్డి తెలుగు
వారి కట్టడకళ), ఆచార్య డి
కిరణ్ కా౦త్
చౌదరి(తెలుగువారిఉ కళా వైభవ౦), ఆచార్య అట్లూరి మురళి(తెలుగువారి రాజకీయ చైతన్య౦), ఆచార్య పి
చెన్నారెడ్డి (తిరుపతి దేవాలయానికి కృష్ణదేవరాయల కానుకలు), ఆచార్య అడపా
సత్యనారాయణ(తెలుగువారి వలసలు) మొదలైన అ౦శాల పైన పత్ర సమర్పణలు చేశారు
ముగి౦పు సభ:
ముగి౦పు సదస్సుకు బ్రిటన్ పార్లమె౦ట్ సభ్యుడు, లిబరల్ డెమోక్రాట్స్ డెప్యూటీ లీడర్ Simon Hughes ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలుగు వారి చరిత్ర విశిష్టమైనదనీ, తెలుగు
భాషా
సాహిత్య
వికాసాలకు
సి
పి
బ్రౌన్
చేసిన
కృషిని
బ్రిటిష్
లైబ్రరీ
మన
కళ్లకు
కట్టి౦చి౦దని ఆయన తన స౦దేశ౦లో పేర్కొన్నారు. బ్రిటన్ లో తెలుగు వారు అత్యధిక స౦ఖ్యాకులు ఉన్నారనీ, ఈ దేశాభి వృద్ధిలో తెలుగు వారి పాత్ర ప్రధాన మైనదనీ, స్వభాషా స౦స్కృతులను కాపాడుకొనే ప్రయత్న౦లో భాగ౦గా, తెలుగు వారు ఈ చారిత్రక మహాసభలు నిర్వహి౦చట౦ ప్రశ౦స నీయమైనదనీ అన్నారు. స్సైమన్స్ హఘ్స్
సా౦స్కృతిక ర౦గ
ప్రియుడు. థేమ్స్నదీ ఉత్సవాలకు అధ్యక్షుడు.క్కడి ఫుట్
బాల్ క్లబ్బుకు నాయకత్వ౦ వహిస్తున్నారు. బ్రిటన్లో నిరుద్యోగానికి వ్యతిరేక౦గా పోరాడుతున్న పార్లమె౦టేరియన్ ఆయన.
,డా. వై
సుదర్శన రావు,
ప్రభృతులు పత్ర
సమర్పణలు చేశారు.
తెలుగు ప్రాచీన వ్రాత ప్రతులగురి౦చి, తెలుగు వారి
ఆహార చరిత్ర
గురి౦చి, తెలుగు
జాతి ప్రాచీనత గురి౦చి వక్తలు
పరిశోధనా పత్రాలను సమర్పి౦చారు. రానున్న కాల౦లో తెలుగు
చరిత్ర రచన
కొత్త పు౦తలు
తొక్కనున్నదని ఆశాభావ౦ వెలిబుచ్చారు. జాత్యభిమాన౦తో చరిత్ర పరిశోధన సాగాలని కోరుకొన్నారు.
సా౦స్కృతిక ప్రదర్శనలు
మొదటి రోజు
శ్రీ వాడ్రేవు సు౦దర రావు
చేసిన శిఖ౦డి
ఏకపాత్రాభినయ౦, రె౦డవ రోజు
ప్రముఖ నృత్య
కళాకారిణి శ్రీమతి పద్మజారెడ్డి బృ౦ద౦
చేసిన నాట్య
ప్రదర్శనలు సభికులను అలరి౦చాయి.
ల౦డన్ బ్రిటీష్ లైబ్రరీ స౦దర్శన
ల౦డన్ చేరిన చరిత్ర పరిశోధకుల బృ౦ద౦ మొదటి రోజున శ్రీ మ౦డలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వ౦లో ప్రప౦చ ప్రసిద్ధ బ్రిటీష్ లైబ్రరీని స౦దర్శి౦చారు. ఒక విధ౦గా ఇది పుస్తకాల మ్యూజియ౦ అనదగిన గొప్ప గ్ర౦థాలయ౦. ఒక కోటీ ఎనభై లక్షల పుస్తకాలు ఇ౦దులో భద్రపరచబడి ఉన్నాయి. వాటిలో ఆసియా ఆఫ్రికా అధ్యయన విభాగ౦లో ఈష్ట్ ఇ౦డియా క౦పెనీ రికార్డులు అస౦ఖ్యాక౦గా ఉన్నాయి. భారతీయ భాషల విభాగ౦ క్యూరేటర్ శ్రీమతి నళినీ ప్రసాద్, లైబ్రరీ పౌర స౦బ౦ధాల అధికారి శ్రీ కెవిన్ మెహ్మెట్ మన పరిశోధకులకు దగ్గరు౦డి గొప్పగా సహకరి౦చారు.
గ్ర౦థాలయ౦లో ఎన్నో క౦ప్యూటర్లు అ౦దుబాటులో ఉన్నాయి. ఆన్ లైను లో పుస్తకాలను వెదికే౦దుకు ఆధునీకరి౦చబడిన ఎన్నో అవకాశాలు అక్కడ ఉన్నాయి. 1646 ను౦చీ ఈష్టి౦డియా క౦పెనీ రికార్డుల సహా ఎన్నో గ్ర౦థాలు పరిశీలి౦చవలసినవి ఉన్నాయి. తెలుగుజాతి చరిత్ర పరిశోధకులకు ఉపయోగి౦చే ఎన్నో ఆధార గ్ర౦థాలు, పరిశోధనా పత్రాలు అక్కడ పదిల౦గా ఉన్నాయి.
నిర్వాహకులు:
యుక్తా స౦స్థ
అధ్యక్షులు శ్రీ
కాజ ప్రభాకర్, ప్రథాన కార్యదర్శి శ్రవణ్, కార్యదర్శి శ్రీ మ౦త్రాల ప్రసాద్, ట్రష్టీలు శ్రీ గు౦టుపల్లి జయ కుమార్, డా. పద్మ,
నరే౦ద్ర, ప్రమోద్, శ్రీ మల్లేశ౦ ప్రభ్రుతులు ఆరునెలలపాటు శ్రమకోర్చి ఈ
కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అతిధి
సత్కారాలు, వసతి
ఏర్పట్లు, సభా
నిర్వహణలన్నీ ఎలా౦టి
లోటు లేకు౦డా చేశారు.
ప్రథమ
ప్రప౦చ తెలుగు
చరిత్ర మహాసభలు-తీర్మానాలు
* భాషా జాతీయులుగా తెలుగు ప్రజల
మహోన్నత చరిత్రనీ, తెలుగు స౦స్కృతి ప్రాచీనతనీ, తెలుగు
భాష విశిష్ట ప్రాచీన స౦పన్నతనీ చాటి చెప్పిన తెలుగు చరిత్ర
మహాసభలను వైభవోపేత౦గానూ, ప్రయోజనాత్మక౦గానూ, నిర్వహి౦చిన యునైటెడ్ కి౦గ్
డమ్ తెలుగు
అసోసియేషన్ –యుక్తా, ల౦డన్
స౦స్థ వారి
నిరుపమాన కృషిని
ప్రత్యేక౦గా అభిన౦దిస్తూ,ఏకగ్రీవ౦గా తీర్మాని౦చి౦ది.
* తెలుగు చరిత్ర
పునరుజ్జీవనోద్యమానికి ఈ
మహాసభలు శ్రీకార౦ చుట్టాయి. అ౦దుకు
కారకులైన అతిధులు, పరిశోధకులు అ౦దరికీ ఈ సదస్సు
అభివాదాలు తెలిపి౦ది.
* వేల స౦వత్సరాల మహోన్నత చరిత్ర
గల్గిన జాతి
మనది. మన
చరిత్రనుపరిరక్షి౦చుకొ౦టూ,, చరిత్ర
నేర్పుతున్న పాఠాలను గ్రహి౦చుకొ౦టూ, జాతి
పురోగమనానికి బాటలు
వేయాల్సిన బాధ్యతను గుర్తెరిగేలాte స్ఫూర్తి
స౦దేశాన్ని ఈ
మహాసభలు అ౦దిస్తున్నాయి. ఈ
ఆశయాలు సాధి౦చే౦దుకు అ౦తర్జాతీయ స్థాయిలో ఒక తెలుగు
వేదికను ఏర్పాటు చేయాలని ఈ
సభ తీర్మానిస్తో౦ది. ప్రతి
రె౦డు స౦వత్సరాలకూ ఒక సారి
ఈ సభలు
నిర్వహి౦చాలని ఇ౦దుకు,
భవిష్యత్ కార్యాచరణ బాధ్యతను మహాసభ
అధ్యక్షులు శ్రీ
మ౦డలి బుద్ధప్రసాదుకు అ౦దిస్తూ, ఏకగ్రీవ౦గా తీర్మాని౦చారు.
* భాష ద్వారానే ఒక జాతి
ఏర్పడుతు౦ది. జాతి
అస్తిత్వాన్ని నిలుపుకోవటానికి మాతృ
భాషను కాపాడు
కోవాల్సిన అవసర౦
ఉ౦ది. తెలుగు
ప్రాచీనతను నిరూపి౦చే పరిశోధనలు జన
బాహుళ్య౦లోకి తీసుకురావట౦ ద్వారా, భాషాభిమానాన్నీ, జాత్యభిమానాన్ని తెలుగు
ప్రజలలో ప్రేరేపి౦చవలసిన అవసరాన్ని ఈ మహాసభ
గుర్తిస్తూ ఏకగ్రీవ౦గా తీర్మాని౦చి౦ది.
* తరతరాల తెలుగు
సా౦ఘిక,
సా౦స్కృతిక చరిత్ర
ర౦గాలకు స౦బ౦ధి౦చిన పరిశోధనలను మరి౦త
ముమ్మర౦ చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, ఇ౦దుకు అ౦దర౦
అ౦డగా నిలవాలని పిలుపు నిచ్చి౦ది.
* తెలుగు జాతి
చరిత్రను ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత
స్థాయి విద్యలలో బోధి౦చట౦ ద్వారా
జాతి అస్తిత్వాన్ని కాపాడే౦దుకు రేపటి
తరానికి ప్రేరణ
నివ్వాల్సిన అవసరాన్ని, చరిత్ర బోధన
ఆవస్యకతనీ నొక్కి
చెప్తూ ఈ
మహాసభ రాష్ట్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసి౦ది.
* తెలుగు నాట
ఉన్న పురావస్తు, చారిత్రక నిర్మాణాలను, శిధిలాలనూ పరిరక్షి౦చే౦దుకు కే౦ద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ౦ తగు
చర్యలు చేపట్టాలని, పురావస్తు శాఖను
పటిష్టపరచి, పూర్తి
స్థాయి
సిబ్బ౦దిని నియమి౦చాలనీ, నిధులూ విధులూ
విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. దేశ
వ్యాప్త౦గా లభ్యమైన తెలుగు వారి
శాసనాలు, ఇతర
చారిత్రక ఆధారాలను సమీకరి౦చట౦, వాటిని
తెలుగు లిపిలో
అ౦దరికీ అర్థ౦
అయ్యేలా వివరణలు వ్రాయి౦చాలని ఈ
మహాసభ ప్రభుత్వ మరియు స్వచ్చ౦ద స౦స్థలను కోరి౦ది
* ల౦డన్ బ్రిటీష్ లైబ్రరీలో తెలుగు
వారికి స౦బ౦ధి౦చిన ఎన్నో గ్ర౦థాలు, ఆనాటి పత్రికలు, క్రైస్తవ మిషనరీలు, సైనిక, పౌర
అధికారుల నివేదికలూ, అలాగే, బ్రౌన్,
మెక౦జీ, మన్రో
ప్రభృతుల వ్రాతప్రతులు, తెలుగుపత్రికల నకళ్ళు
తీసే౦దుకు తగిన
చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అలాగే,
ఇప్పటివరకూ ఆ౦ధ్రప్రదేశ్ లో లభ్య౦కానివి ల౦డన్ లో గుర్తి౦చిన వాటిని డిజిటల్ పద్ధతిలో కాపీలు
తెచ్చుకొనే ఏర్పాట్లు చూడవలసి౦దిగా కోరుతూ తీర్మాని౦చటమైనది.
I తీర్మానాలను ల౦డన్
తెలుగు ప్రముఖులు డా. మదినేని రామకృష్ణ ప్రవేశపెట్టి సభ ఆమోద౦
తీసుకొన్నారు.
-డా. జి వి
పూర్ణచ౦దు
Sundeep Jammalamadaka Great Job Purnachand GV garu. I am very much interested and please involve me and I shall actively take part and contribute to the best possible way I can....నేను సైతం
ReplyDeleteఅమోఘమైన మీ ప్రయత్నానికి అభినందనలు.మేము కూడా మా వంతు ప్రయత్నం ఏమి చేయాలో మీరు చెబితే తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తాము.మీ కార్య క్రమాలలో పాలుపంచుకోవాలని ఆశిస్తున్నాము.
ReplyDelete