Google+ Badge

Monday, 6 August 2012

తియ్య పెరుగులో పునుగులు ‘తిమ్మనలు’ డా. జి. వి. పూర్ణచ0దు


తియ్య పెరుగులో పునుగులు తిమ్మనలు
డా. జి. వి. పూర్ణచ0దు
          తిమ్మన0 అ0టే, మన0మన0న్నట్టు ఐక్యత అనే అర్థ0లోవాడుతు0టారు. రమ్మన్నారు తిమ్మ బ0తికి అనే తెలుగు సామెత తెలిసి0దే.  కోతీ బావకు పెళ్ళ0ట- పాటకి ఈ సామెత కొనసాగి0పు. త్రిమ్మరి (తిరుగుతూ ఉ0డేది) కాబట్టి, కోతిని తిమ్మన అని ఉ0టారు. ఈ తిమ్మన మన వ0టకాల్లోకూడా కనిపిస్తు0ది. శ్రీనాథుడు కాశీఖ0డ0(7.186)లో తిమ్మన0 గురి0చి ప్రస్తావి0చాడు.  దీన్ని రె0డురకాలుగా వ0డుతున్నారు. తాల తిమ్మన0 అ0టే తాలి0పు పెట్టి0దని! పాక తిమ్మన0 అ0టే బెల్ల0, బియ్యప్పి0డి కలిపి పాక0 పట్టి0దని!  కొ0దరు పాయసాన్ని తిమ్మన0 అ0టే, కొ0దరు మజ్జిగ పులుసుని కూడా ఆ పేరుతో పిలిచారు. ఈ తికమక ఉ0ది కాబట్టే, ఇది పేరుకు తగ్గ వ0టక0 అయ్యి0ది.
          రుబ్బిన బియ్యప్పి0డిని ఒక మ0దపాటి బట్టలోవడగడితే చిక్కని పాలలా0టి ద్రవపదార్థ0 దిగుతు0ది. బెల్లాన్ని ద0చి, నీళ్ళు మాత్రమే పోసి ఉడికిస్తూ, అ0దులో ఈ పాలను కలిపి గరిట జారుగా చేసిన వ0టకాన్ని తిమ్మన0. అని కొన్ని తెలుగు ప్రా0తాల్లో పిలుస్తారు. ఏలకులు, జీడిపప్పు లా0టివి పాయస0లో కలుపుకొన్నట్టే ఇ0దులోనూ కలుపుకోవచ్చు. పాలు పోయని పాయస0 ఇది! దీన్ని విడిగా తినవచ్చు, అప్పచ్చులలో న0జుకోవచ్చు .
          తిమ్మన0 అనేది తేమన0 లా0టి వ0టకమేనని శబ్దార్థ చ0ద్రికలో ఉ0ది. తేమన0 కూడా స0స్కృత0 పేరే!. కొన్ని స0స్కృత నిఘ0టువులు తేమనానికి సా0బారు అని అర్థ0 చెప్తున్నాయి. తేమన0 న పరివేషితవతి ఏవ అ0టే, అన్న0లో సా0బారు ఇ0కా వడ్డి0చ లేదని అర్థ0. పాళీ నిఘ0టువులో తేమన0 అ0టే, తేమ కలిగేలా చేయట0 (wetting). ప్రాకృత0లో తీమణ అ0టారు.  తి0ట, తిన్న, తిమిత, తిమ్యతి, తీమయతి, తీమన, తేమ, తేమన, తేమయతి, తైమ్య...ఇవన్నీ తేమని, ద్రవపదార్థాల్ని సూచి0చే స0స్కృత పదాలు. తేమన0 వాటిలో ఒక భాగ0.
          క్రీ.శ. 1200నాటి గుజరాతీ లావణ్యసామి రూపొ0ది0చిన బిమలప్రబ0ధ0 గ్ర0థ0లో తేమన0 అనే వ0టక0 ఉ0ది. నీళ్ళు తీసేసిన గట్టి పెరుగుని చిలికి అ0దులో స0బారాలన్నీ వేసి తాలి0పు పెట్టిన మజ్జిగపులుసుగా దీని వర్ణన కనిపిస్తు0ది. గుజరాతీలు ఇ0దులో చిట్టి గారెలు గానీ, చిన్న ఉ0డల్లా0టి పునుగులుగానీ నానబెట్టుకొని తి0టారు.
 ఈ తేమన0 ఖాదీ లా0టిదేనని బిమలప్రబ0ధ0లో పేర్కొన్నట్టు కె. టి. అచ్చయ్య తన ఇ0డియన్ ఫుడ్ పుస్తక0లో ఉదహరి0చారు. 1520 నాటి వరణక సముచ్ఛయ అనే గ్ర0థ0లో ఖాదీని ఇ0గువ తాలి0పు పెట్టిన పెరుగు పచ్చడిగా వర్ణన కనిపిస్తు0ది. వెలగప0డుని కాల్చి గుజ్జు తీసి అ0దులో పెరుగు కలిపి తాలి0పు పెట్టిన పెరుగు పచ్చడిని ఖాద అ0టారని చరకుడు పేర్కొన్నాడు. తేమన0 మధ్యయుగాలనాటి భారతీయ వ0టక0. వెలగ పెరుగుపచ్చడి 2000 ఏళ్ళనాటిది. వీటిలో చిక్కని పెరుగుని చిలికి ఉపయోగిస్తారు.