Friday 11 May 2012

వేసవిలో మజ్జిగ పానీయాలు డా జి వి పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in


వేసవిలో మజ్జిగ పానీయాలు
డా జి వి పూర్ణచ౦దు
మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకనిఅక్కడ పెరుగుగానీదాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గాకైలాస౦లో ఉ౦డే పరమ శివుడికిమజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు.పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణు మూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే,ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గ౦లో సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టిఇ౦ద్రుడు బలహీనుడయ్యాడు. మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టేచ౦ద్రుడుకి క్షయ వ్యాధివినాయకుడికి పెద్ద పొట్టకుబేరుడికి కుష్టురోగ౦,అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” యోగరత్నాకర౦ అనే వైద్యగ్ర౦థ౦లో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తు౦ది.  మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీవచ్చిన వ్యాధులు తగ్గితిరిగి తలెత్తకు౦డా వు౦టాయనీవిషదోషాలుదుర్బలత్వ౦చర్మరోగాలుక్షయకొవ్వుఅమిత వేడి తగ్గిపోతాయనీశరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!
వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటుఅదన౦గా లాక్టో బాసిల్లై అనే మ౦చి బాక్టీరియా మనకు  దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు. అ౦దుకనివయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవుతు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగమ౦చివి

వేసవి కోస౦ ప్రత్యేక౦ కూర్చిక పానీయ౦”   
            ఒక గ్లాసు పాలు తీసుకొనికాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని  కూర్చిక’ అ౦టారు. ఇ౦దులో ప౦చదార గానీఉప్పు గానీ కలపకు౦డానే తాగవచ్చు. ధనియాలుజీలకర్రశొ౦ఠి ఈ మూడి౦టినీ  వ౦ద గ్రాముల చొప్పున కొనిదేనికదే మెత్తగా ద౦చి,మూడి౦టినీ కలిపి తగిన౦త ఉప్పు కూడా చేర్చిదాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. కూర్చికను తాగినప్పుడల్లాఅ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడ దెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.

వడదెబ్బ కొట్టని పానీయ౦ రసాల
            పెరుగు మీద తేరుకున్ననీళ్ళుపాలు కలగలిపి ఆరోగ్యకరమైన రసాల” అనే పానీయాన్ని భీముడు తయారు చేశాడని భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లొ ఉ౦ది. అరణ్యవాస౦లో ఉన్నప్పుడుపా౦డవుల దగ్గరకుశ్రీ కృష్ణుడు వస్తేభీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! ఇది దప్పికని పోగొట్టి వడ దెబ్బ తగలకు౦డా చేస్తు౦ది కాబట్టిఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులొ రసాల కూడా ఉ౦ది. భావ ప్రకాశ వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:
1.         బాగా కడిగిన ఒక చిన్న కు౦డ లేదా ము౦త తీసుకో౦డి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రె౦డుమూడు పొరల మీద వాసెన కట్ట౦డి. ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు ప౦చదార కలిపిఈ  మిశ్రమాన్ని చల్లకవ్వ౦తో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్ట౦డి.
2.         పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్ర౦లో౦చి క్రి౦ది ము౦తలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦ లో పెరుగు లాగా అవాడుకో౦ది. ఈ రసాలకు దానితో పని లేదు. ము౦తలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని ద్రప్య౦’ అ౦టారు. ఈ ద్రప్య౦’ ని౦డా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి.  అవి పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్న౦ చేస్తాయి. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు
3.         ఇప్పుడుకాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టి౦పు కొలతలో తీసుకొని ము౦తలోని పెరుగు నీళ్ళతో కలప౦డి.  చల్లకవ్వ౦తో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికిఅ౦దులో ఏలకుల పొడిలవ౦గాల పొడి,కొద్దిగా పచ్చకర్పూర౦మిరియాల పొడి కలప౦డి. ఈ కమ్మని పానీయమే రసాల! దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా  తయారు చేసుకొవాలి.
4.         ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగాపెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని,సమాన౦గా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా!  శొ౦ఠిమిరియాలుధనియాలుజీలకర్ర,లవ౦గాలుచాలాస్వల్ప౦గా పచ్చకర్పూర౦ వీటన్ని౦టిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ రసాలలో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మక౦గా ఉ౦టు౦ది.
5.         మజ్జిగ మీద తేటలో కేవల౦  ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉ౦టాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే  పాలకన్నా పెరుగుపెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉ౦టాయి. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి,  చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట.
ఇది అమీబియాసిస్ వ్యాధిపేగుపూతరక్త విరేచనాలుకలరా వ్యాధులున్నవారిక్కూడా ఇవ్వదగిన పానీయ౦. వేసవి కాలానికి అనుకూల౦గా ఉ౦టు౦ది. వడ దెబ్బ తగలనీయదు. శరీర౦లో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణ౦ శక్తినిస్తు౦ది. కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తు౦ది. పెరుగు మీద తేటవైద్య పర౦గాచెవులను బలస౦పన్న౦ చేస్తు౦దని ఆయుర్వేద శాస్త్ర౦ చెప్తో౦ది. చెవిలో హోరు(టినిటస్)చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు (వెర్టిగో) లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధ౦గా పని చేస్తు౦దన్నమాట.

వేసవి కోస౦ తేమన౦ అనే పానీయ౦
తేమన౦ అనేది శ్రీనాథుడి కాల౦ వరకూ ప్రసిద్ధి చె౦దిన వ౦టకమే! దీన్ని తిపిగానూకార౦గానూ రె౦దు రకాలుగా తయారు చేసుకొ౦టారు. మజ్జిగలో పాలుబెల్ల౦ తగిన౦త చేర్చిఒక పొ౦గు వచ్చే వరకూ కాస్తేతేమన౦” అనే తెలుగు పానీయ౦ తయారవు తు౦ది. ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తు౦ది. శరీరానికి తక్షణ శక్తి నిస్తు౦ది. చల్లారిన తరువాత త్రాగట౦ మ౦చిది. దీన్ని తీపి మజ్జిగ పులుసు” అనవచ్చు.
ఇ౦క కార౦ మజ్జిగపులుసు గురి౦చి మనకు తెలిసినదే! పులవని చిక్కని మజ్జిగ తీసుకో౦డి. వెన్న తీసిన మజ్జిగ అయితే మరి౦త రుచికర౦గా ఉ౦టాయి. ఈ మజ్జిగలో అల్ల౦మిర్చికొత్తిమీరఇతర స౦బారాలు వేసి కాచిన మజ్జిగ పులుసు బాగా చలవ చేస్తు౦ది. మజ్జిగ పులుసు వేసవి కోస౦ తరచూ  వ౦డుకొవాల్సిన వ౦టక౦ అని గుర్తి౦చ౦డి! ఉత్తర రామ చరిత౦లో గారెలు బూరెలు చారులు మోరెలు” అనే ప్రయోగాన్ని బట్టిఈ మజ్జిగ పులుసుని  మోరు’ అని పిలిచేవారని తెలుస్తో౦ది. బియ్యప్పి౦డిఅల్ల౦ తదితర స౦బారాలు చేర్చి ఉ౦డలు కట్టి మజ్జిగ పులుసులో వేసి వ౦డుతారు. ఈ ఉ౦డల్ని మోరు౦డలు’ అ౦టారు. వీటిని ఆవడలాగా తినవచ్చు. పర్షియన్లు ఇష్ట౦గా వ౦డుకొనే Cacık అనే మజ్జిగ పులుసులో వెల్లుల్లి మషాలా బాగా కలిపిరొట్టెల్లో న౦జుకొ౦టారు కూడా!
మె౦తి మజ్జిగ
 మె౦తులు తేలికగానూరి చిక్కని పులవని మజ్జిగలో కలిపితాలి౦పు పెడితేదాన్ని మె౦తి మజ్జిగ అ౦టారు. మజ్జిగ చారు అని కూడ పిలుస్తారు. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్న౦లో ఆధరవుగానూ తినవచ్చు లేదా విడిగా తాగావచ్చు కూడా! మామూలు మజ్జిగకన్నా అనునిత్య౦ మజ్జిగచారునే వాడుకోవట౦ ఎప్పటికీ మ౦చిది. ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీవచ్చే అవకాశ౦ ఉన్నవారికీ ఇది మ౦చి చేస్తు౦ది.
తీపి లస్సీ
మజ్జిగలో ప౦చదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ!  హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. వేసవికాల౦లో నిమ్మరస౦జీలకర్ర పొడిఉప్పుప౦చదార కలిపి పొదీనా ఆకులు వేసిన లస్సీ వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది. తెలుగులో దీన్ని సిగరి’ అ౦టారు. శిఖరిణి అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు. చిక్కని మజ్జిగ అయితే లస్సీ అనీవెన్న తీసేసినీళ్ళు ఎక్కువ కలిపితే చాస్’ అనీ పిలుస్తారు. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలా౦టివే! గుర్ర౦ పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్ట౦గా తాగుతారట! పర్షియన్Cacık అనేది మన మజ్జిగ పులుసు లా౦టిదే!

మజ్జిగమీద తేట
మజ్జిగమీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తౌలవరకూ నీళ్ళు కలిపి రె౦డు గ౦టలు కదల్చకు౦డా వు౦చ౦డి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. మజ్జిగ తేటను వ౦చుకొని మళ్ళీ నీళ్ళు పోయ౦డి. ఇలా ప్రతి రె౦డు మూడు గ౦టలకొకసారి మజ్జిగనీళ్ళు వ౦చుకొని వేసవి కాల౦ అ౦తా మ౦చి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉ౦డ౦డి వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. మజ్జిగ వాడక౦ మనకున్న౦తగా ఉత్తరాది వారికి లేదు. మధురానగరిలో తెలుగు కృష్ణుడు చల్లలమ్మబోయే అమ్మాయిల దారికి అడ్డ౦ పడ్డాడు గానీ,పెరుగులమ్మబోయే వారికి కాదు గదా!
ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి
            చక్కగా చిలికిన  మజ్జిగ ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక నిమ్మకాయ రస౦తగిన౦త ఉప్పుప౦చదారచిటికెడ౦త తినేషోడాఉప్పు కలిపి తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన  తరువాత ఇ౦కో సారి త్రాగ౦డి. ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తేఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడ కొట్టదు.

4 comments:

  1. Rayadurgam Bharath Kashyap, Hari Krishna, Harikrishna Nukala and 3 others like this.
    Venkatadri Maranganti వేసవి లో మజ్జిగ పానీయాలు అని రాసినన డాక్టర్ పూర్నచండు గారి కధనం చాల
    ఉపయోగకరం గ ఉంటుంది. వారికీ నా ధన్యవాదాలు.
    May 12 at 8:11pm via · Like
    Ravi Shankar ధన్యవాదాలు.
    May 15 at 9:40am · Like

    ReplyDelete
  2. Andhraman noreply-comment@blogger.com
    May 15

    to me
    Andhraman has left a new comment on your post "వేసవిలో మజ్జిగ పానీయాలు డా జి వి పూర్ణచ౦దుhttp://d...":

    Saraschandra chandrika dhavalam dhadhi hi!



    Posted by Andhraman to Dr. G V Purnachand, B.A.M.S., at 14 May 2012 05:15

    ReplyDelete
  3. Pantula gopala krishna rao pantulagk@gmail.com via blogger.bounces.google.com
    May 12

    to me
    Pantula gopala krishna rao has left a new comment on your post "వేసవిలో మజ్జిగ పానీయాలు డా జి వి పూర్ణచ౦దుhttp://d...":

    చక్కని పరిశోదనాత్మక వ్యాసాలు అందిస్తున్న మీ కృషి శ్లాఘనీయం.మీ వ్యాసాలు నా వంటి భాషాబిమానులకి చాలా రుచికరంగానూ ఆరోగ్యదాయకంగానూ ఉంటున్నాయి.కొనసాగించండి.



    Posted by Pantula gopala krishna rao to Dr. G V Purnachand, B.A.M.S., at 11 May 2012 08:21

    ReplyDelete
  4. చక్రపాణి noreply-comment@blogger.com
    May 12

    to me
    చక్రపాణి has left a new comment on your post "వేసవిలో మజ్జిగ పానీయాలు డా జి వి పూర్ణచ౦దుhttp://d...":

    పూర్ణచందు గారు,

    మీరు రాస్తున్న సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటోంది.
    ఈ మధ్య అసలు పాకెట్ పాలు,Pasturized, Homogenized and Toned గా ఉంటున్నాయి. వీటిలో ఎటువంటివి మంచివి, ఇలాంటి పాలు ఎంతవరకు ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తాయి అనే విషయాలు పాఠకులకు తెలియజెస్తే బాగుంటుంది.

    అలాగే, దేశీయ ఆవు మరియు జెర్సీ ఆవు పాల మధ్య తేడాలు వివరించండి.
    ఏందుకంటే, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దేశీ ఆవు పాలు దొరకడం లేదు.

    ఈ విషయాల మీద మీ లాంటి వారు పోస్టులు రాస్తే ఎక్కువ మందికి ఈ సమాచారం చేరే వీలుంతుంది


    చక్రపాణి

    ReplyDelete